Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS
  • రూ.1000తో ప్రారంభం… ఐదేళ్లలో లక్షల సంపద సాధ్యమేనా? Start with ₹1,000… Can You Build Lakhs in 5 Years? FEATURE NEWS
  • రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.61 వేల ఆదాయం… పీపీఎఫ్‌తో సాధ్యమేనా? ₹61,000 Monthly Income After Retirement.. Can PPF Make It Possible? FEATURE NEWS
  • పోస్ట్ ఆఫీస్ NSC vs బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ FD… లాభాల్లో ఏది బెస్ట్? Post Office NSC vs Bank Tax Saving FD.. Which Wins on Returns? FEATURE NEWS
  • నెలకు రూ.5,000తో లక్షల సొమ్ము… PPF, ELSS, NPSలలో ఏది బెస్ట్ అంటే? ₹5,000 Monthly Investment: Which Is Best—PPF, ELSS, or NPS to Build Wealth? FEATURE NEWS
  • అక్షయ తృతీయ ప్రత్యేకం..పసిడి–వెండి పెట్టుబడులు… సంపదకు కొత్త దారి .. Akshaya Tritiya Special.. Gold & Silver Investments – A Path to Wealth Creation FEATURE NEWS
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS

ఇన్కమ్ టాక్స్‌ రీఫండ్ ఎందుకు ఆలస్యమవుతుంది..? స్టేటస్ తెలుసుకోవ‌డం ఎలా..? Why Is the Income Tax Refund Getting Delayed? How to Check Your Refund Status?

Posted on 27/11/2025 By admin No Comments on ఇన్కమ్ టాక్స్‌ రీఫండ్ ఎందుకు ఆలస్యమవుతుంది..? స్టేటస్ తెలుసుకోవ‌డం ఎలా..? Why Is the Income Tax Refund Getting Delayed? How to Check Your Refund Status?

వేతన జీవులు, చిన్న వ్యాపారులు, ఫ్రీలాన్సర్లు… ఇలా లక్షలాది మంది ఆదాయపన్ను చెల్లింపుదారులకు రీఫండ్‌ ఎంతో కీలకం. ఏటా ఫైలింగ్‌ పూర్తయ్యాక వారి చూపులు రీఫండ్‌పై పడతాయి. గతంలో కంటే రీఫండ్‌ ప్రక్రియ వేగవంతమైనా… ఈ ఏడాది చాలామందికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొందరికి రెండు నెలలు గడిచినా రాకపోవడం, మరికొందరికి ప్రాసెసింగ్‌ పక్కాగా పూర్తయినా ‘రీఫండ్ ఇనిషియేటెడ్ కాదు’ అని స్టేటస్ కనిపించడం ఆవేదనకు గురిచేస్తోంది. నిజంగా రీఫండ్ ఎందుకు ఆలస్యమవుతోంది? సాధారణంగా ఎప్పుడు వస్తుంది? ఏ సమస్యలు ఎక్కువగా అవరోధంగా మారుతున్నాయి? ఎలా చెక్ చేసుకోవాలి? అన్న వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.

డేటా లోపాల వల్లే.. Due to Data Gaps…

ఆదాయపన్ను రీఫండ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న వారికి ఈసారి నిరాశ తప్పడంలేదు. సాధారణంగా ITR ఫైల్ చేసి e-Verify చేసిన తర్వాత 4–5 వారాల్లో రీఫండ్ ఖాతాలో పడిపోతుంది. కానీ ఈ ఏడాది పెద్ద ఎత్తున రిఫండ్‌లు 2–3 నెలల వరకు ఆలస్యమవుతున్నాయి. ఉద్యోగుల జీతాల్లో TDS కత్తిరించినా, అడ్వాన్స్ టాక్స్ చెల్లించినా… చివరి లెక్కలో ఎక్కువ పన్ను కట్టిన వారికి రీఫండ్ అందుతుంది. ఈసారి రీఫండ్ ఆలస్యం ఎక్కువగా కనిపిస్తున్నా… సమస్య ఎక్కువగా పన్ను చెల్లింపుదారుల డేటా లోపాల వల్లే వస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రీ-వాలిడేషన్, PAN–ఆధార్ లింక్, AIS–26AS మ్యాచ్ సరిగ్గా ఉంటే రీఫండ్ సాధారణంగా ఆలస్యం కాదు.

ITR ప్రాసెసింగ్‌ వేగం పెరిగినా… Even Though ITR Processing Has Become Faster…

ఆదాయపన్ను శాఖ ప్రస్తుతం CPC బెంగళూరు ద్వారా రిటర్నులను ఆటోమేటెడ్‌ సిస్టమ్‌తో ప్రాసెస్ చేస్తోంది. 24–48 గంటల్లోనే చాలాసార్లు ప్రాసెసింగ్ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నా… రీఫండ్ మాత్రం అంత వేగంగా జరగడం లేదు.

రీఫండ్ ఆలస్యానికి ప్రధాన కారణాలు.. Major Reasons for Refund Delays

– బ్యాంక్ అకౌంట్ ప్రీ-వాలిడేట్ చేయకపోవడం

– PAN–Bank Account పేర్లు మ్యాచ్ కాకపోవడం

– IFSC కోడ్ తప్పుగా ఉండటం / పాత బ్రాంచ్ కోడ్

– బ్యాంక్ ఖాతా క్లోజ్ అయి ఉండటం / ఇన్‌యాక్టివ్‌గా ఉండటం

– PAN–ఆధార్ లింక్ కాకపోవడం

– ఫారం-16, 26AS, AIS డేటాలో తేడాలు

– TDS వివరాలు తప్పుగా ఉండటం

– డిడక్షన్‌లు రైటుగా చూపకపోవడం

– బ్యాంక్ ఇంటరెస్ట్ / స్టాక్ ట్రాన్సాక్షన్స్ AISలో ఉండి ITRలో లేకపోవడం

– ఈ కారణాల్లో ఏ ఒక్కటి ఉన్నా రీఫండ్ హోల్డ్‌లో పడిపోతుంది.

రీఫండ్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోవాలంటే.. How to Check Your Refund Status…

ఇన్కమ్ టాక్స్ అధికారిక వెబ్‌సైట్ incometax.gov.in లోకి వెళ్లి రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవ‌చ్చు. మొద‌ట వెబ్‌సైట్‌లో మీ PAN, పాస్‌వర్డ్, OTPతో లాగిన్ అవ్వాలి. ఈ సంవత్సరానికి సంబంధించిన ITR పై క్లిక్ చేస్తే స్టేటస్ కనిపిస్తుంది. NSDL (Refund Banker) వెబ్‌సైట్ ద్వారా కూడా రీఫండ్ స్టేటస్ చెక్ చేసుకోవ‌చ్చు.

సాధారణంగా రీఫండ్ రావడానికి ఎంత టైమ్ పడుతుంది? How Long Does It Usually Take to Get a Refund?

సాధారణంగా 4–5 వారాలు ప‌డుతుంది. ప్రస్తుత ఆలస్య పరిస్థితులలో 30–45 రోజులు ప‌డుతుంది. కొందరికి 60–75 రోజులు కూడా పడుతోంది. రిటర్న్ ప్రాసెస్ అయి ఉండి రీఫండ్ ఇనిషియేట్ కాకపోతే దీనికి కారణం 90% శాతం బ్యాంక్ ఖాతా / డేటా మిస్మ్యాచ్ అని చెప్పొచ్చు.

రీఫండ్ ఆలస్యం అయితే ఏమి చేయాలి? What to Do If Your Refund Is Delayed?

– PAN–ఆధార్ వెంటనే లింక్ చేయాలి. బ్యాంక్ అకౌంట్ ప్రీ-వాలిడేట్ చేయాలి. బ్యాంక్ వివరాలు చెక్ చేయాలి.
IFSC కోడ్‌ సరైందా? లేదా అని చూడాలి. ఖాతా యాక్టివ్‌లో ఉందా? లేదా చెక్ చేయాలి. పేర్లు మ్యాచ్ అయ్యాయా? అనేది చూడాలి. ఏదైనా నోటీసు (143(1), 139(9)) వస్తే వెంటనే స్పందించాలి. నోటీసు ఉన్నంతవరకు రీఫండ్ ఆగిపోతుంది.

ఆదాయపన్ను శాఖ అధికారుల సూచ‌న‌లు.. Suggestions from Income Tax Department Officials

ITR వేసే ముందు డేటా మెచ్చింగ్ సరిగా చేయాలి. బ్యాంక్‌ ఖాతా ప్రీ-వెరిఫికేషన్ అత్యవసరం. AISలో ఏవైనా తేడాలు ఉంటే ఫీడ్‌బ్యాక్ ఆప్షన్ ద్వారా సరిచేయాలి. రీఫండ్ ఆలస్యం అయితే “e-Nivaran” లో కంప్లైంట్ ఇవ్వచ్చు. “రిఫండ్ ఆలస్యం అవుతున్న ప్రతి కేసు వెనుక కారణం ఉంటుంది. సరైన డాక్యుమెంటేషన్, సరైన ITR ఫారం వాడితే పెద్దగా ఇబ్బంది ఉండదు” అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఇన్కమ్ టాక్స్ రీఫండ్ అంటే ఏమిటి..? ఇది ఎవ‌రికి వ‌ర్తిస్తుంది? What Is an Income Tax Refund, and Who Is Eligible for It?

ప్రతి సంవత్సరం ఆదాయపన్ను రిటర్నులు ఫైల్ చేసే వారికి “రీఫండ్” అనే పదం బాగా వినిపిస్తూనే ఉంటుంది. జీతం, వ్యాపారం, వడ్డీలు… ఇలా వివిధ వనరుల ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభుత్వం నియమాల ప్రకారం పన్ను వసూల్ చేస్తుంది. అయితే కొన్నిసార్లు పన్ను శాఖ లెక్కలు, వ్యక్తి చెల్లించిన పన్ను మధ్య తేడా రావచ్చు. అప్పుడు అదనంగా వసూలైన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. దీనినే ఇన్కమ్ టాక్స్ రీఫండ్ అంటారు.

ఇన్కమ్ టాక్స్ రీఫండ్ అంటే ఏమిటి? What Is an Income Tax Refund?

ఒక వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో సంపాదించిన ఆదాయానికి తగిన పన్ను ఎంత ఉండాలో ఆదాయపన్ను చట్టం నిర్ణయిస్తుంది. కానీ జీతాలపై TDS ఎక్కువగా కత్తిరించినా, బ్యాంకులు వడ్డీలపై అధిక TDS కట్ చేసినా, వ్యక్తి అడ్వాన్స్ టాక్స్ / సెల్ఫ్–అసెస్మెంట్ టాక్స్ ఎక్కువ చెల్లించినా , చివరకు లెక్క వేసినప్పుడు కట్టాల్సింది కంటే ఎక్కువ టాక్స్ చెల్లించినట్లు తేలితే, ఆ అదనపు మొత్తాన్ని పన్ను శాఖ తిరిగి పంపుతుంది. ఇది రీఫండ్. ఇది పూర్తిగా సిస్టమ్ ద్వారా జరిగే ఆటోమేటెడ్ ప్రక్రియ.

రీఫండ్ ఎవరికీ వర్తిస్తుంది? Who Is Eligible for a Refund?

– ఉద్యోగులకు (సెలరీడ్ ఎమ్ప్లాయీస్): TDS ఎక్కువ కట్ చేసిన ఉద్యోగులకు రీఫండ్ రావడం చాలా సాధారణం.
ఉదాహరణకు HRA, 80C, 80D వంటి డిడక్షన్‌లు ఉద్యోగి చివర్లో చూపితే TDS లెక్కలు తప్పి ఉండవచ్చు.

– బ్యాంక్ FD / RD వడ్డీలపై మరీ ఎక్కువ TDS కట్ అయినవారికి, సీనియర్ సిటిజన్లకు ఇది ఎక్కువగా వర్తిస్తుంది.

– సెల్ఫ్-ఎంప్లాయిడ్ / బిజినెస్ వ్యక్తులు అడ్వాన్స్ టాక్స్ అధికంగా చెల్లించినప్పుడు రీఫండ్ వస్తుంది.

– స్టాక్ మార్కెట్ / ప్రాపర్టీ ట్రాన్సాక్షన్లలో TDS కట్ అయినవారికి ప్రాపర్టీ అమ్మినప్పుడు 1% TDS కట్ అవుతుంది. చివరి లెక్కల్లో పన్ను అంత రాకపోతే మిగిలిన మొత్తాన్ని రీఫండ్‌గా ఇస్తారు.

– కంపెనీలు, స్టార్టప్‌లు అడ్వాన్స్ టాక్స్, TDS, మ్యాచింగ్ లోపాలు ఉంటే రీఫండ్ పొందవచ్చు.

– తప్పుగా చెల్లించిన టాక్స్ ఉన్న వారికీ ఒక్కసారి తప్పుగా అధికంగా పన్ను చెల్లించినా… రీఫండ్ తీసుకోవచ్చు.

రీఫండ్ రావడానికి ముఖ్యమైన అర్హతలు…Key Eligibility Requirements for Getting a Refund

ITR ఫైల్ చేయాలి, ITR e-Verification పూర్తవ్వాలి. బ్యాంక్ అకౌంట్ ప్రీ–వాలిడేట్ చేయాలి. PAN–ఆధార్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. ఇన్కమ్ టాక్స్ రీఫండ్ అనేది పన్ను శాఖ ఇచ్చే ప్రత్యేక సదుపాయం కాదు…పౌరుడు అధికంగా చెల్లించిన టాక్స్‌ని తిరిగి పొందే హక్కు. సరైన వివరాలతో ITR ఫైల్ చేస్తే రీఫండ్ సమస్యలు రాకుండా త్వరగా ఖాతాలో జమ అవుతుంది. 26AS, AIS, ఫారం-16, బ్యాంక్ వివరాలు సమగ్రంగా చెక్ చేసి రిటర్నులు ఫైల్ చేయడం తప్పనిసరి.

 

 

390
FEATURE NEWS Tags:and Who Is Eligible for It?, Due to Data Gaps…, Even Though ITR Processing Has Become Faster…, How Long Does It Usually Take to Get a Refund?, How to Check Your Refund Status…, Key Eligibility Requirements for Getting a Refund, Major Reasons for Refund Delays, Suggestions from Income Tax Department Officials, What Is an Income Tax Refund, What to Do If Your Refund Is Delayed?, Who Is Eligible for a Refund?

Post navigation

Previous Post: పన్ను కోతలతో త‌గ్గిన ఆదాయ వృద్ధి .. Income Growth Slows Due to Tax Cuts
Next Post: త్వరలో ఏకంగా 42 శాతం వరకు లాభం! 5 బెస్ట్ హోసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ఇవే.. ! Up to 42% Returns Ahead! Here Are the 5 Best Housing Finance Stocks

Related Posts

  • సీబీడీసీ అంటే ఏమిటి what is cbdc FEATURE NEWS
  • సుర‌క్షిత‌మైన‌వి పోస్టాఫీస్ సేవింగ్స్‌ post office saving schemes are safe FEATURE NEWS
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • Why are People spending less ప్రజలు ఎందుకు తక్కువ ఖర్చు చేస్తున్నారు FEATURE NEWS
  • ఉద్యోగ అస్థిరతలో ఇల్లు కాపాడుకోవడం ఎలా? బ్యాంకుల అరాచ‌కం నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం ఎలా? How to Protect Your Home Amid Job Uncertainty? How to Safeguard Yourself from Bank Actions? FEATURE NEWS
  • పాన్–ఆధార్ లింక్ కావడం లేదా? PAN–Aadhaar Link Not Working? Here’s the Real Solution FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit?
  • రూ.1000తో ప్రారంభం… ఐదేళ్లలో లక్షల సంపద సాధ్యమేనా? Start with ₹1,000… Can You Build Lakhs in 5 Years?
  • రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.61 వేల ఆదాయం… పీపీఎఫ్‌తో సాధ్యమేనా? ₹61,000 Monthly Income After Retirement.. Can PPF Make It Possible?
  • పోస్ట్ ఆఫీస్ NSC vs బ్యాంక్ ట్యాక్స్ సేవింగ్ FD… లాభాల్లో ఏది బెస్ట్? Post Office NSC vs Bank Tax Saving FD.. Which Wins on Returns?
  • నెలకు రూ.5,000తో లక్షల సొమ్ము… PPF, ELSS, NPSలలో ఏది బెస్ట్ అంటే? ₹5,000 Monthly Investment: Which Is Best—PPF, ELSS, or NPS to Build Wealth?
  • అక్షయ తృతీయ ప్రత్యేకం..పసిడి–వెండి పెట్టుబడులు… సంపదకు కొత్త దారి .. Akshaya Tritiya Special.. Gold & Silver Investments – A Path to Wealth Creation
  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Drawbacks Eligibility Criteria Equity Mutual Funds Expert Advice Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • బహుళ రుణాలను ఎలా ఎదుర్కోవాలి? How to Manage Multiple Loans? FEATURE NEWS
  • మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు హెచ్చరిక: కేవైసీ పేరుతో కొత్త మోసాల ముప్పు .. Alert for Mutual Fund Investors: New KYC Scams on the Rise FEATURE NEWS
  • లాభాలొచ్చాయ‌ని తొంద‌ర ప‌డొద్దు Don’t be in a hurry to make a profit MARKET
  • డ‌బ్బు ఎక్క‌డ ఇన్వెస్ట్ చేయాలి which is the best investment option FINICAL PLANNING
  • ₹10 లక్షల పెట్టుబడితో ₹4.85 కోట్లు .. ఎలా సాధ్యం అనుకుంటున్నారా! How ₹10 Lakh Investment Grew to ₹4.85 Crore! FEATURE NEWS
  • 2026లో క్రిప్టో మార్కెట్ ఎలా ఉండబోతుందంటే..? What to Expect from the Crypto Market in 2026? MARKET
  • కీల‌క‌ పన్ను ఆదా ఎంపికలేమిటో తెలుసుకోండి..! మిన‌హాయింపు పొందండి! Know the Key Tax-Saving Options… Get Your Deductions! FINICAL PLANNING
  • ట్రంప్‌ వ్యాఖ్యలతో మార్కెట్లలో కలకలం… లాభాల జోరు ఒక్క రోజుకే పరిమితం.. Trump Remarks Rattle Markets… Rally Short-Lived FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme