
ప్రస్తుతం మనం చేసుకోవాల్సిన ఆర్థిక ప్రణాళికల్లో అతి ముఖ్యమైనవి ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్. మనం ఎంత డబ్బులు దాచుకున్నా.. దానిని కాపాడుకోవడానికి ఇన్సూరెన్స్ చేసుకోవాల్సిందే. అయితే ఇన్వెస్ట్‌మెంట్..? ఏది ఇన్సూరెన్స్ ..? అనేది గుర్తించడంలో మనలో చాలా మంది విఫలమవుతుంటారు. కొన్ని సార్లు ఇన్సూరెన్స్ చేసి దానినే ఇన్వెస్ట్మెంట్ గా |భావిస్తుంటారు. దీని వల్ల జీవితంలో చాలా కోల్పోవాల్సి వస్తుంది.
ఇన్సూరెన్స్‌కి, ఇన్వెస్ట్‌మెంట్ ప్రత్యేకంగా చాలా స్పష్టమైన తేడా ఉంది. దీనిని అర్థం చేసుకున్నప్పడు మన ఆర్థిక ప్రణాళిక చాలా పక్కాగా రచించుకోవచ్చు. ఈ విషయంలో మనం కొన్ని పొరపాట్లు చేస్తుంటాం.
కొన్ని సార్లు చాలా అధిక మొత్తంలో డబ్బులను దాచుకుని, ఆ పెట్టుబడులపై మనం మంచి మొత్తంలో లాభాలను ఆర్జిస్తుంటాం. కానీ ఏదైనా అనుకోని ఆపద, అనారోగ్యం వస్తే మనం దాచుకున్న డబ్బు, వచ్చిన ప్రాఫిట్ మొత్తాన్ని తిరిగి ఖర్చు చేయాల్సి వస్తుంది. దీంతో మన ఇన్వెస్ట్‌మెంట్ జీరో అయిపోయినట్టే. అంటే మన కష్టం అంతా వృథా. ఇలాంటి పరిస్థితుల నుంచి మనల్ని, ఆదా చేసుకున్న డబ్బును కాపాడుకోవడానికి ఇన్సూరెన్స్ తప్పనిసరి.
మనలో చాలా మంది ఇన్సూరెన్స్ చేస్తూ దాన్నే సేవింగ్స్‌లా భావిస్తారు. ఈ రెండూ వేరువేరు విషయాలని గుర్తించరు. ఎల్ ఐ సీలో ఏదో ఒక పాలసీ చేసి జీవితానికి ఇక ఇది చాలు అనుకుంటారు. దీంతో వాళ్లు చాలా నష్టపోవాల్సి వస్తుంది. దేనికది విడిగా పెట్టుకుంటేనే మనకు లాభం చేకూరుతుంది.
మన భవిష్యత్తు అవసరాల కోసం, జీవితంలో మరింత ఉన్నతంగా బతకడం కోసం, మనం చేసుకునే ప్లానింగ్ ను వంద శాతం సాధించడం కోసం డబ్బులను దాచుకోవడం అవసరం. అయితే ఇలా దాచుకున్న డబ్బును సరైన పొదుపు సాధనంలో పెట్టుబడిగా పెట్టి వీలైనంత అధిక మొత్తంలో రిటర్న్ పొందగలగాలి. దీనినే ఇన్వెస్ట్‌మెంట్ అంటాం.
ఇన్సూరెన్స్ అంటే మన జీవితానికి, ఆరోగ్యానికి లేదా మన ప్రాణానికి మనం ఏర్పాటు చేసుకునే రక్షణ. ఒక వేళ మనకు ఏదైనా జరిగితే మనం తీసుకునే ఇన్సూరెన్స్ అనేది రోడ్డున పడిపోకుండా, మన కుటుంబం ఇబ్బందుల పాలు కాకుండా కాపాడుతుంది.
how to select insurance
ఎల్ ఐ సీలో మంచి పాలసీని అధికమొత్తంలో బీమా కవరేజీ వచ్చేలా ఎంపిక చేసుకోవాలి. దీని ద్వారా మనకు బీమా ముఖ్యం. దీనికి మనం చెల్లించాల్సిన ప్రీమియంను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇందులో మెచ్యూరిటీ కాలానికి వచ్చే డబ్బు చాలా తక్కువే.. అంత దీర్ఘకాలం వేచాక వచ్చే మొత్తం మనకు దేనికీ సరిపోదు. కాబట్టి ఇది కేవలం బీమా కోసమే అని ఫిక్స్ అయిపోవాలి.
ఎల్ఐసీతో పాటు ప్రస్తుతం చాలా ప్రైవేటు బీమా కంపెనీలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఉన్న బెస్ట్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఎంచుకుని ప్రీమియం చెల్లిస్తే బీమా కవరేజీ మొదలైనట్టే. లైఫ్ టర్మ్ పాలసీ లాంటివి తక్కువ ప్రీమియంతో సుమారు కోటి, ఆ పై కూడా కవరేజీ పొందే అవకాశం ఉంది. ఇలానే మనీబ్యాక్ పాలసీలు, హెల్త్ పాలసీలు ఇలా ఇన్సూరెన్స్ లో మన అవసరాలకు తగ్గ ప్లాన్ ను విడిగా తీసుకుంటే జీవితంలో మనకు ఎదురుండదు.
what is investment and where to invest money
ఇక సేవింగ్స్ విషయానికి వస్తే అధిక లాభాలనిచ్చే పథకాలను ఎంపిక చేసుకోవాలి. సమీప అవసరాలు, దీర్ఘకాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మనం పొదుపు ప్రారంభించాలి. ఫిక్సిడ్ డిపాజిట్లు, బాండ్లు, బంగారం ఇలా చాలా రకాలుగా పొదుపును ప్రారంభించవచ్చు. కానీ అధిక రాబడులకు తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్‌ని ఆశ్రయించాల్సిందే. మార్కెట్ ఆధారంగా నడిచే మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే అనుకున్న విధంగా లాభాలను ఇవ్వగలవు. మనం పోర్ట్‌ఫోలియోలో మ్యూచువల్ ఫండ్స్‌కి సుమారు 25 శాతం వరకూ ప్రాధాన్యం ఇవ్వాలి. సరైన ఫండ్‌ని ఎంచుకోవడం, టార్గెట్‌ను ముందుగానే నిర్ణయించుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం.