మనం ప్రతినిత్యం వాడుతున్న రూపాయి నాణెల (One-Rupee Coin) వెనుక ఒక ఆసక్తికరమైన ఆర్థిక లెక్క దాగి ఉంది. ఒక్క రూపాయి విలువ ఉన్నా, దానిని తయారు చేయడానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఆ రూపాయి విలువ కంటే ఎక్కువ. వినడానికి వింతగా ఉన్నప్పటికీ, దీని వెనుక దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కీలక కారణాలు ఉన్నాయి. ఒక రూపాయి విలువైన నాణెం తయారీకి రూ.1.11 ఖర్చవుతుందన్న విషయం తాజాగా బయటపడింది. అంటే ఒక్క నాణెం మీదనే ప్రభుత్వానికి నష్టం వస్తోంది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం రూపాయి నాణేలను ముద్రించడాన్ని ఎందుకు కొనసాగిస్తోంది? అన్న ప్రశ్న ప్రజల్లో ఆసక్తిని రేపుతోంది. నాణేలు తయారు చేయడానికి ఉపయోగించే లోహాల ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. స్టీల్, నికెల్, కాపర్ వంటి లోహాల ధరలు అంతర్జాతీయంగా పెరగడం ప్రధాన కారణం. అంతేకాదు, తయారీ కూలీ ఖర్చులు విద్యుత్, రవాణా వ్యయాలు, భద్రత, నిల్వ ఖర్చులు వంటి అంశాలు కలవడంతో నాణెం తయారీ వ్యయం పెరిగింది. దీంతో రూపాయి నాణెం విలువ కంటే ఖర్చు ఎక్కువగా మారింది.
నష్టం వచ్చినా ముద్రించాల్సిన అవసరం ఏంటి? Why Is Minting Necessary Despite Losses?
ప్రభుత్వం నాణేలను (One-Rupee Coin) లాభనష్టాల కోసం కాకుండా దేశీయ లావాదేవీల సౌలభ్యం కోసం ముద్రిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో , చిన్న వ్యాపారాల్లో, బస్సు ఛార్జీలు, టోల్ రుసుములు రోజువారీ చిల్లర లావాదేవీల్లో రూపాయి నాణెం ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తోంది. కాగిత నోట్లతో పోలిస్తే నాణేలు ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి.
కాగిత నోట్లతో పోలిస్తే నాణేలే మేలు.. Coins Are Better Than Paper Notes
రూపాయి నోట్ల ఆయుష్షు సాధారణంగా ఒకటి నుంచి రెండు సంవత్సరాలే ఉంటే, నాణేలు 10–15 సంవత్సరాల వరకు ఉపయోగంలో ఉంటాయి. దీర్ఘకాలంలో చూసుకుంటే నాణేలే ప్రభుత్వానికి ఖర్చు తగ్గించే మార్గమని అధికారులు చెబుతున్నారు.
చిల్లర కొరత రాకుండా చూడటం కీలకం.. Ensuring No Shortage of Small Change Is Crucial
దేశంలో చిల్లర నాణేల(One-Rupee Coin) కొరత ఏర్పడితే రోజువారీ వాణిజ్యం స్తంభించే ప్రమాదం ఉంది. అందుకే నష్టం వస్తున్నా సరే రూపాయి నాణేలను ముద్రించడం అనివార్యం అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భవిష్యత్తులో పరిష్కారం ఏంటి? What Is the Solution for the Future?
నాణేలు(One-Rupee Coin) తయారీ ఖర్చును తగ్గించేందుకు ప్రభుత్వం .. తక్కువ ఖర్చుతో లభించే లోహాల వినియోగం, డిజైన్, బరువులో మార్పులు, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడం వంటి మార్గాలను పరిశీలిస్తోంది. డిజిటల్ లావాదేవీలు పెరిగితే నాణేల అవసరం క్రమంగా తగ్గే అవకాశముంది. మొత్తంగా రూపాయి నాణెంపై నష్టం ఉన్నా, ప్రజల రోజువారీ అవసరాలు, చిల్లర లావాదేవీల నిరంతరత కోసం ప్రభుత్వం నాణేల ముద్రణను కొనసాగిస్తోంది. ఇది లాభాల కోసం కాకుండా వ్యవస్థ సజావుగా నడవాలన్న ఆలోచనతో తీసుకున్న నిర్ణయం అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
నాణేలు vs కాగితం నోట్ల ఆయుష్షు.. Lifespan: Coins vs. Paper Notes
(One-Rupee Coin) ఇది వింతగా వింటున్నా నిజం. అయితే ప్రభుత్వం నాణేలను ముద్రించడం కొనసాగిస్తోంది, ఎందుకంటే నాణేల మన్నిక చాలా ఎక్కువ. ఒక సాధారణ కాగితం నోటు సగటున 2–5 ఏళ్లే బాగుంటుంది. అదే సమయంలో, నాణేలు సుమారు 100 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా, మన్నికతో ఉంటాయి. నాణేలు పాడైనా, లోహాన్ని తిరిగి కరిగించి కొత్త నాణేలను తయారు చేయవచ్చు. కాగితం నోట్ల విషయంలో ఇది సాధ్యం కాదు. అందుకే, చిల్లర లావాదేవీల కోసం రూపాయి నాణేల లభ్యత అత్యవసరం. గ్రామీణ ప్రాంతాల రోడ్లు, బస్సులు, చిన్న మార్కెట్లు, లొకల్ షాపులు.. ఇలా ప్రతి చోటా చిల్లర అవసరాలు ఉంటాయి. ప్రభుత్వానికి ఒక్క రూపాయి నాణెం పైన కొంత నష్టం వచ్చినా కూడా చిన్న నాణేల లావాదేవీలతో ఆర్థిక వ్యవస్థ సజావుగా కొనసాగుతుంది.
రూపాయి నాణేల తయారీ ఖర్చు .. Cost of Minting One-Rupee Coins
ప్రభుత్వం వివిధ నాణేల తయారీకి ఖర్చు ఇలా ఉంది.
₹1 నాణెం – ₹1.11 ఖర్చు (11 పైసల నష్టం)
₹5 నాణెం – ₹3.69 ఖర్చు
₹10 నాణెం – ₹5.54 ఖర్చు
ఇదే విధంగా, కాగితం నోట్ల తయారీ ఖర్చు.. Similarly, the Cost of Printing Paper Notes
₹10 నోటు – 96 పైసలు
₹50 నోటు – ₹1.11
₹100 నోటు – ₹1.77
₹500 నోటు – ₹2.29
రూపాయి నాణేల తయారీ ప్రాసెస్.. Process of Minting One-Rupee Coins
రూపాయి నాణేలను(One-Rupee Coin) భారత ప్రభుత్వ మెంట్‌లలో (IGM) తయారు చేస్తారు. మన దేశంలో ముంబయి, హైదరాబాద్, కోల్‌కతా, నోయిడాలో నాణేలు మింట్లు ఉన్నాయి. ప్రస్తుతానికి రూపాయి నాణేలను ఫెర్రిటిక్ స్టెయిన్‌లెస్ స్టీల్ తో తయారు చేస్తున్నారు. ప్రతి నాణెం బరువు 3.76 గ్రాములు, మందం 1.45 మిల్లీమీటర్లు. స్టెయిన్‌లెస్ స్టీల్ వలన నాణేలు మరింత మన్నిక కలిగి, ఎక్కువ కాలం వాడుకోవచ్చు.
డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్నా… నాణేల ప్రాధాన్యం తగ్గలేదు ..
Despite the Rise of Digital Payments… Coins Remain Important
ఇప్పటి కాలంలో యూపీఐ, ఆన్‌లైన్, మొబైల్ చెల్లింపులు విపరీతంగా పెరిగాయి. అయితే, ఆర్థిక వ్యవస్థలో చిల్లర లావాదేవీలను నాణేల (One-Rupee Coin) వల్లే సజావుగా నిర్వహించవచ్చు. చిన్న మార్కెట్లు, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, మళ్లీ వాడే చిల్లర అవసరాల కోసం నాణేల లభ్యత అనివార్యం. రూపాయి నాణెంపై ప్రభుత్వం నష్టపోయినా, ₹5, ₹10 నాణేల తయారీలో నష్టాన్ని భర్తీ చేస్తుంది, మొత్తం వ్యవస్థలో నాణేలు అందుబాటులో ఉంటాయి.
భవిష్యత్తులో మార్పులు.. Future Changes
నాణేల(One-Rupee Coin) తయారీ ఖర్చును తగ్గించడానికి ప్రభుత్వం కొన్ని మార్గాలను పరిశీలిస్తోంది. తక్కువ ఖర్చుతో లభించే లోహాల వినియోగం, నాణేల డిజైన్ , బరువులో మార్పులతో పాటు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే వీలుంది. భవిష్యత్తులో చిల్లర లావాదేవీలు డిజిటల్ చెల్లింపుల ద్వారా విస్తరిస్తే, రూపాయి నాణేల అవసరం కొంత తగ్గే అవకాశం ఉంది. కాగితం నోట్లతో పోలిస్తే, నాణేలు 100 సంవత్సరాలపాటు మన్నికతో ఉంటాయి. చిల్లర లావాదేవీల కోసం రూపాయి నాణేల లభ్యత చాలా అవసరం. అందువల్ల నష్టం వచ్చినా, రూపాయి నాణేలను ముద్రించడం అనేది భవిష్యత్తు ఆర్థిక ప్రయోజనాలకు ఎంతో కీలకం అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

