ఈ రోజుల్లో క్రెడిట్ కార్డ్ (Credit Card) వాడకం ఒక విలాసం కాదు… ఒక అవసరంగా మారిపోయింది. జీతం వచ్చేలోపే అవసరాలు తీరాలంటే, ఆన్‌లైన్ షాపింగ్ చేయాలంటే, హోటల్ బుకింగ్‌లు, ఫ్లైట్ టికెట్లు, ఆసుపత్రి ఖర్చులు, పిల్లల ఫీజులు… ఇలా ఏ అవసరం వచ్చినా ముందుగా గుర్తుకు వచ్చేది క్రెడిట్ కార్డే. బ్యాంకులు కూడా ఈ అలవాటును మరింత ప్రోత్సహిస్తున్నాయి. రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, ప్రత్యేక డిస్కౌంట్లు అంటూ ఆకర్షణీయమైన ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి.
సరైన పద్ధతిలో వాడితే… If Used the Right Way…
సరైన పద్ధతిలో వాడితే క్రెడిట్ కార్డ్ (Credit Card) నిజంగానే ఒక మంచి ఆర్థిక సాధనం. క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తే క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది. భవిష్యత్తులో గృహ రుణం, వాహన రుణం లాంటి వాటిని సులభంగా పొందే అవకాశముంటుంది. కానీ అదే క్రెడిట్ కార్డ్‌ను కాస్త అజాగ్రత్తగా వాడితే మాత్రం… అది మీ జేబుకు పెద్ద శత్రువుగా మారిపోతుంది. చిన్న తప్పు చేసినా, అది అత్యంత ఖరీదైన అప్పుగా మారి కుటుంబ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే స్థాయికి చేరుతుంది.
చార్జీల కోసం అవగాహన లేక.. Lack of Awareness About Charges Can Prove Costly
అసలు సమస్య ఏంటంటే… చాలామందికి క్రెడిట్ కార్డ్ (Credit Card) స్టేట్‌మెంట్‌లో కనిపించే కొన్ని ఛార్జీల గురించి సరైన అవగాహన ఉండదు. స్టేట్‌మెంట్‌లో ఉన్న సంఖ్యలను చూసి భయపడిపోతారు కానీ, ఆ సంఖ్యలు ఎలా పెరుగుతున్నాయో మాత్రం అర్థం చేసుకోరు. ఆ అజ్ఞానమే బ్యాంకులకు లాభం… వినియోగదారులకు నష్టం.
మినిమం అమౌంట్ డ్యూ.. Minimum Amount Due: The Biggest Trap
– క్రెడిట్ కార్డ్ (Credit Card) వినియోగంలో అతిపెద్ద ఉచ్చు ఏదంటే… అది ‘మినిమం అమౌంట్ డ్యూ’. ప్రతి నెల స్టేట్‌మెంట్ వచ్చినప్పుడు అందులో రెండు మొత్తాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒకటి ‘టోటల్ అమౌంట్ డ్యూ’, మరొకటి ‘మినిమం అమౌంట్ డ్యూ’. ఇందులో చాలా మంది చేసే పొరపాటు ఏమిటంటే… తక్కువగా కనిపించే మినిమం అమౌంట్ కడితే సరిపోతుందని భావించడం. నిజానికి ఇదే అతిపెద్ద ట్రాప్.
– మినిమం అమౌంట్ డ్యూ కడితే మీరు ఆ నెలలో డిఫాల్టర్‌గా పరిగణించబడరు. లేట్ ఫీజు పడదు. కానీ దాంతో సమస్య ముగిసినట్టుకాదు. మీరు చెల్లించని మిగిలిన మొత్తంపై బ్యాంకులు భారీ వడ్డీని లెక్కించడం మొదలుపెడతాయి. ఈ వడ్డీ సాధారణంగా ఏటా 30 శాతం నుంచి 40 శాతం వరకు ఉంటుంది. పైగా ఇది నెలనెలా చక్రవడ్డీలా పెరుగుతూ పోతుంది. ఒకసారి ఈ వడ్డీ చక్రంలో పడితే, అసలు ఖర్చు చేసిన మొత్తానికి రెట్టింపు, మూడింతలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది.
– ఉదాహరణకు మీరు రూ.50 వేల ఖర్చు చేసి, అందులో కేవలం మినిమం అమౌంట్ మాత్రమే చెల్లిస్తే, మిగిలిన మొత్తంపై పడే వడ్డీ మీకు తెలియకుండానే పెరుగుతూ ఉంటుంది. కొన్ని నెలల్లోనే మీరు అసలు ఖర్చు చేసిన దానికంటే ఎక్కువ మొత్తాన్ని కేవలం వడ్డీగానే చెల్లించాల్సి రావచ్చు. కానీ స్టేట్‌మెంట్‌లో కనిపించే సంఖ్యలు చాలా సాంకేతికంగా ఉండటం వల్ల, చాలామందికి ఈ నిజం అర్థం కాదు.
లేట్ పేమెంట్.. Late Payment: A Costly Mistake
– ఇక (Credit Card) మరో పెద్ద సమస్య లేట్ పేమెంట్. ఉద్యోగం, ప్రయాణాలు, ఇతర పనుల ఒత్తిడిలో చాలామంది బిల్ గడువు తేదీని మర్చిపోతుంటారు. ఒక్క రోజు ఆలస్యమైనా సరే బ్యాంకులు లేట్ ఫీజును విధిస్తాయి. ఇది రూ.500 నుంచి రూ.1,500 వరకు ఉండొచ్చు. కానీ అసలు నష్టం అక్కడితో ఆగదు. మీరు బిల్లు ఆలస్యంగా చెల్లించారని సమాచారం క్రెడిట్ బ్యూరోలకి వెళ్తుంది. దాంతో మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది.
– క్రెడిట్ స్కోర్ (Credit Card) ఒకసారి పడిపోయిందంటే, దాన్ని తిరిగి మెరుగుపరచడం అంత సులభం కాదు. భవిష్యత్తులో మీరు హోమ్ లోన్ తీసుకోవాలన్నా, కార్ లోన్ తీసుకోవాలన్నా, లేదా కొత్త క్రెడిట్ కార్డ్ కావాలన్నా బ్యాంకులు మీ స్కోర్‌ను ముందుగా పరిశీలిస్తాయి. స్కోర్ తక్కువగా ఉంటే రుణం తిరస్కరించే అవకాశముంది. లేదా ఎక్కువ వడ్డీకి మాత్రమే రుణం ఇస్తారు. అంటే ఒక్కసారి చేసిన చిన్న ఆలస్యం, మీ భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికలపై పెద్ద ప్రభావం చూపుతుంది.
క్రెడిట్ కార్డుతో నగదు తీసుకోవడం.. Withdrawing Cash Using a Credit Card: A Costly Choice
ఇంకొక ప్రమాదకరమైన అలవాటు క్రెడిట్ కార్డు (Credit Card) తో నగదు తీసుకోవడం. చాలా మంది డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు రెండూ ఒకటేనని భావించి ఏటీఎంలో క్రెడిట్ కార్డు పెట్టి డబ్బులు తీస్తుంటారు. ఇది అత్యంత ఖరీదైన పొరపాటు. క్రెడిట్ కార్డుతో నగదు తీసిన క్షణం నుంచే వడ్డీ లెక్కించడం మొదలవుతుంది. ఇందులో ఎలాంటి వడ్డీ లేని కాలపరిమితి ఉండదు. షాపింగ్ చేసినప్పుడు లభించే 30–45 రోజుల గ్రేస్ పీరియడ్ ఇక్కడ వర్తించదు. దీనికి తోడు క్యాష్ అడ్వాన్స్ ఫీజు అనే మరో ఛార్జీ కూడా పడుతుంది. సాధారణంగా తీసుకున్న మొత్తంపై 2.5 నుంచి 3 శాతం వరకు ఈ ఫీజు ఉంటుంది. అంటే మీరు తీసుకున్న డబ్బు మీకు తక్షణ అవసరాన్ని తీరుస్తుందేమో కానీ, దానికి చెల్లించాల్సిన ధర చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇతర చార్జీలు.. Other Hidden Charges to Watch Out For
ఇవి కాకుండా క్రెడిట్ కార్డు (Credit Card) లపై మనం గమనించని మరికొన్ని దాగి ఉన్న ఛార్జీలు కూడా ఉన్నాయి. విదేశాల్లో కార్డు వాడినా, లేదా ఆన్‌లైన్‌లో విదేశీ కరెన్సీలో చెల్లింపులు చేసినా ఫారిన్ ట్రాన్సాక్షన్ ఫీజు పడుతుంది. ఇది సాధారణంగా 2 శాతం నుంచి 4 శాతం వరకు ఉంటుంది. చిన్న మొత్తం లాగానే అనిపించినా, పెద్ద ట్రాన్సాక్షన్లలో ఇది గణనీయమైన భారంగా మారుతుంది. చాలా కార్డులకు మొదటి ఏడాది ఉచితంగా ఇస్తారు. కానీ రెండో ఏడాది నుంచి వార్షిక రుసుము విధిస్తారు. నిర్దేశించినంత ఖర్చు చేయకపోతే ఈ ఛార్జీ తప్పదు. కొందరు కార్డు వాడకపోయినా కూడా ఈ ఫీజు కట్టాల్సి వస్తుంది. అంతేకాదు… వడ్డీలు, లేట్ ఫీజులు, ఇతర అన్ని ఛార్జీలపై 18 శాతం జీఎస్టీ అదనంగా పడుతుంది. అంటే మీరు చెల్లించే మొత్తం ఇంకా పెరుగుతుంది.
ఓవర్ లిమిట్ ఫీజు.. Over-Limit Fee: Crossing the Line Can Be Expensive
మరో సమస్య ఓవర్ లిమిట్ ఫీజు. మీ క్రెడిట్ (Credit Card) లిమిట్‌కు మించి ఖర్చు చేస్తే బ్యాంకులు ప్రత్యేకంగా జరిమానా విధిస్తాయి. చాలామందికి ఈ విషయం కూడా తెలియదు. బ్యాంక్ అనుమతిస్తే లిమిట్ దాటి ఖర్చు చేయొచ్చని అనుకుంటారు. కానీ దానికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇన్ని ప్రమాదాల మధ్య కూడా క్రెడిట్ కార్డ్‌ను పూర్తిగా తప్పించుకోవాల్సిన అవసరం లేదు. సురక్షితంగా వాడాలంటే కొన్ని అలవాట్లు తప్పనిసరిగా అలవర్చుకోవాలి. ప్రతి నెలా బిల్ మొత్తాన్ని పూర్తిగా, గడువు తేదీకి ముందే చెల్లించడం అత్యంత ముఖ్యమైన నియమం. కేవలం మినిమం అమౌంట్ కడితే సరిపోతుందన్న ఆలోచనను పూర్తిగా వదిలేయాలి. స్టేట్‌మెంట్ వచ్చిన వెంటనే దాన్ని శ్రద్ధగా చదవాలి. ఎలాంటి అనవసర ఛార్జీలు ఉన్నాయో పరిశీలించాలి.
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. As Per RBI Guidelines…
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాంకులు అన్ని ఛార్జీలను ముందుగానే వినియోగదారులకు తెలియ జేయాలి. కాబట్టి కార్డు (Credit Card) తీసుకునే ముందు నియమ నిబంధనలను ఒకసారి క్షుణ్ణంగా చదవడం అవసరం. అవసరం లేని అదనపు కార్డులను మూసివేయడం కూడా మంచిదే. మొత్తానికి క్రెడిట్ కార్డ్ ఒక కత్తిలాంటిది. దాన్ని జాగ్రత్తగా వాడితే అవసరానికి ఉపయోగపడుతుంది. అదే నిర్లక్ష్యంగా వాడితే చేతినే గాయపరుస్తుంది. క్రమశిక్షణ ఉంటే క్రెడిట్ కార్డులు వరాలు… అవగాహన లేకపోతే అవే భారాలు. మీ జేబుకు చిల్లు పడకుండా ఉండాలంటే, ఈ రహస్య ఛార్జీలను ముందే తెలుసుకుని జాగ్రత్త పడాల్సిందే.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. Precautions You Should Take
– (Credit Card) ప్రతి నెలా బిల్ మొత్తాన్ని పూర్తిగా చెల్లించాలి
– అవసరం లేని కార్డుల (Credit Card) ను మూసేయాలి
– కార్డ్ స్టేట్‌మెంట్‌ను క్రమం తప్పకుండా పరిశీలించాలి
– క్యాష్ విత్‌డ్రా చేయడాన్ని నివారించాలి

