Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఈ కంపెనీల్లో భారీగా డివిడెంట్లు ! FEATURE NEWS
  • సుర‌క్షితంగా మ‌నీ ట్రాన్స‌ఫ‌ర్ చేయండి how to transfer money securely FEATURE NEWS
  • అద్దె ఇల్లా.. సొంతిల్లా..? ఏది మంచిది? Which is Better – Renting or Owning a Home? FEATURE NEWS
  • స్టాక్ మార్కెట్ లాభాల‌పై ట్యాక్స్ ఉంటుందా..? FEATURE NEWS
  • కీ పేడ్ ఫోన్‌లోనూ మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్‌ money transactions are possible in keypad mobile FEATURE NEWS
  • డిసెంబర్ 31 లోపు ఈ 5 పనులు పూర్తి చేయకపోతే భారీ పెనాల్టీలు తప్పవు.. Miss These 5 Tasks Before December 31? Be Ready for Hefty Penalties! FEATURE NEWS
  • సూక్ష్మ రుణాలు తగ్గుముఖం..!16.8 శాతం క్షీణత‌! Micro Loans Decline…! A Sharp 16.8% Drop FEATURE NEWS
  • CAN NRIS INVEST IN PPF ఎన్ఆర్ఐలు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయ‌వ‌చ్చా FEATURE NEWS
  • పెన్నీ స్టాక్స్ కొనవచ్చా..? FEATURE NEWS
  • బంగారం ధరలపై ఆర్‌బీఐ ఆందోళన..! గోల్డ్ లోన్ల‌పై జాగ్రత్తగా ఉండాలని బ్యాంకులకు సూచన..! RBI Concern Over Gold Prices..! Banks Advised to Be Cautious on Gold Loans..! FEATURE NEWS

బడ్జెట్‌లో ట్యాక్స్ పేయర్లకు షాక్.. Budget Shock for Taxpayers

Posted on 01/02/202601/02/2026 By admin No Comments on బడ్జెట్‌లో ట్యాక్స్ పేయర్లకు షాక్.. Budget Shock for Taxpayers

బడ్జెట్‌లో ట్యాక్స్ పేయర్లకు షాక్.. Budget Shock for Taxpayers

ఆదాయపు పన్ను తగ్గింపుపై ఆశగా ఎదురు చూసిన వేతన జీవులకు కేంద్ర బడ్జెట్‌ 2026 ( Budget) నిరాశనే మిగిల్చింది. యూనియన్‌ బడ్జెట్‌ 2026లో కొత్తగా పన్ను మినహాయింపులు లేదా స్లాబ్‌ల మార్పులపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదు. దీంతో ఈసారి కూడా మధ్యతరగతి ట్యాక్స్‌ పేయర్లకు ఊరట దక్కలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే పన్ను విధానాలకు సంబంధించిన కొన్ని నిబంధనల్లో మాత్రం సడలింపులు కల్పించడం గమనార్హం.

ఐటీఆర్‌ గడువుల్లో ఊరట.. Extended Deadlines for ITR Filing
( Budget) పన్ను రిటర్నుల దాఖలుకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీఆర్‌–1, ఐటీఆర్‌–2 ఫైలింగ్‌కు జులై 31 వరకు గడువు కల్పించింది. నాన్‌ ఆడిట్‌ బిజినెస్‌లు, ట్రస్ట్‌లకు ఆగస్టు 31 వరకు అవకాశం ఇచ్చింది. ముఖ్యంగా సవరించిన పన్ను రిటర్నుల దాఖలుకు గడువును డిసెంబర్‌ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగించడం వల్ల పన్ను చెల్లింపుదారులకు కొంత వెసులుబాటు లభించనుంది.

ఏప్రిల్‌ నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం.. New Income Tax Law from April 1
2025లో ప్రతిపాదించిన కొత్త ఆదాయపు పన్ను చట్టం 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి రానుందని ఆర్థిక మంత్రి బడ్జెట్‌ ( Budget) ప్రసంగంలో వెల్లడించారు. రికార్డు సమయంలో ఈ ప్రత్యక్ష పన్నుల కోడ్‌ను రూపొందించినట్లు ఆమె తెలిపారు. ఆదాయపు పన్ను నిబంధనలను మరింత సరళంగా మార్చినట్లు పేర్కొన్న మంత్రి, కొత్త చట్టాన్ని త్వరలో నోటిఫై చేస్తామని చెప్పారు. పన్ను చెల్లింపుదారులు కొత్త చట్టాన్ని అర్థం చేసుకునేందుకు తగినంత సమయం ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే కొత్త, పాత పన్ను విధానాల్లోని స్లాబ్‌లలో ఎలాంటి మార్పులు లేవని స్పష్టం చేశారు.

స్టాక్ మార్కెట్‌కు బడ్జెట్ దెబ్బ.. Budget Jitters in Stock Market
బడ్జెట్‌( Budget) ప్రకటనలతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (STT)ను పెంచడం, షేర్ల బైబ్యాక్‌లపై పన్ను విధించడం మదుపర్ల సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. ఫ్యూచర్స్‌పై STTను 0.02 శాతం నుంచి 0.05 శాతానికి, ఆప్షన్స్‌ ప్రీమియంపై 0.15 శాతానికి పెంచినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

భారీ నష్టాల్లో సూచీలు.. Sensex, Nifty Crash Sharply
( Budget) ఈ ప్రకటనల వెంటనే మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. మధ్యాహ్నం 1.10 గంటల సమయంలో సెన్సెక్స్‌ 580 పాయింట్లు నష్టపోయి 81,681 వద్ద, నిఫ్టీ 201 పాయింట్లు పడిపోయి 25,119 వద్ద ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్‌ 2000 పాయింట్లు, నిఫ్టీ 700 పాయింట్లకు పైగా క్షీణించాయి. ఆదివారం అయినప్పటికీ బడ్జెట్‌ సందర్భంగా మార్కెట్లు ప్రత్యేకంగా పనిచేయడం గమనార్హం.

బైబ్యాక్‌లపై పన్ను నిర్ణయం.. Tax on Share Buybacks
కంపెనీల షేర్ల బైబ్యాక్‌లను ఇకపై క్యాపిటల్‌ గెయిన్స్‌గా పరిగణించి పన్ను విధిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అక్రమ వినియోగానికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. కార్పొరేట్‌ ప్రమోటర్ల బైబ్యాక్‌లపై 22 శాతం, నాన్‌ కార్పొరేట్‌ ప్రమోటర్లపై 30 శాతం పన్ను విధించనున్నారు. ఈ నిర్ణయం మదుపర్లలో ఆందోళన కలిగించింది.

చిన్న పన్ను చెల్లింపుదారులకు వెసులుబాటు.. Relief Measures for Small Taxpayers
( Budget) విద్యార్థులు, టెక్‌ ప్రొఫెషనల్స్‌, రీలొకేటెడ్‌ ఎన్నారైల వంటి చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం ఆరు నెలల పాటు ఫారిన్‌ అసెట్స్‌ డిస్‌క్లోజర్‌ పథకాన్ని తీసుకొస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అలాగే ఎన్నారైల ఆస్తుల విక్రయాలపై టీడీఎస్‌కు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. స్థిరాస్తి విక్రయాల్లో స్థానిక కొనుగోలుదారుల నుంచే టీడీఎస్‌ వసూలు చేయనున్నారు.

విదేశీ టూర్లు, ప్రమాద పరిహారంపై ఊరట.. TCS Cut on Foreign Tours
( Budget) విదేశీ టూర్‌ ప్యాకేజీలపై టీసీఎస్‌ను 5%, 20% నుంచి 2 శాతానికి తగ్గించారు. రహదారి ప్రమాదాల్లో లభించే పరిహార వడ్డీపై ఆదాయపు పన్నును పూర్తిగా తొలగించారు. చదువు, వైద్య ఖర్చులపై టీడీఎస్‌ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించడం కూడా సామాన్యులకు కొంత ఉపశమనంగా మారనుంది.

బడ్జెట్‌ పరిమాణం, రంగాల కేటాయింపులు.. Sector-wise Allocations
2026–27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌( Budget) ను రూ.53.47 లక్షల కోట్లతో ప్రవేశపెట్టారు. రవాణాకు రూ.5.98 లక్షల కోట్లు, రక్షణకు రూ.5.94 లక్షల కోట్లు కేటాయించారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, ఐటీ–టెలికాం రంగాలకు కూడా భారీ నిధులు కేటాయించారు. ఈ కేటాయింపులు అభివృద్ధికి దోహదపడతాయని ప్రభుత్వం చెబుతోంది.

రూపాయి వచ్చేది–పోయేది ఇలా.. Rupee Comes & Goes
బడ్జెట్‌( Budget) లో ప్రభుత్వ ఆదాయం ప్రధానంగా రుణాలు, ఆదాయపు పన్ను, కార్పొరేట్‌ పన్ను, జీఎస్టీ ద్వారా వస్తుండగా, వ్యయాల్లో రాష్ట్రాల వాటా, వడ్డీలు, రక్షణ, కేంద్ర పథకాలకు పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారు. ఇది ప్రభుత్వ ఆర్థిక ప్రణాళికకు దిశానిర్దేశం చేస్తోంది.

బడ్జెట్‌లో ఎన్నారైలకు గుడ్‌న్యూస్‌.. Union Budget Brings Relief for NRIs

కేంద్ర బడ్జెట్‌ ( Budget) 2026లో ఎన్నారైలకు ఊరటనిచ్చే పలు కీలక నిర్ణయాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న భారతీయులు ఎదుర్కొంటున్న పన్ను సంబంధిత సమస్యలను తగ్గించడమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకొచ్చినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యంగా విదేశీ ఆస్తుల వెల్లడి, స్థిరాస్తి విక్రయాలు, విదేశీ ప్రయాణాలపై పన్నుల విషయంలో సానుకూల మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్నారైలు, రీలోకేటెడ్‌ భారతీయులు, విదేశాల్లో పని చేసిన టెక్‌ ప్రొఫెషనల్స్‌ కోసం ప్రభుత్వం కొత్తగా ఫారిన్‌ అసెట్స్‌ డిస్‌క్లోజర్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా గతంలో తెలియజేయని విదేశీ ఆస్తులను ఆరు నెలల వ్యవధిలో స్వచ్ఛందంగా వెల్లడించుకునే అవకాశం కల్పించారు. ముఖ్యంగా చిన్న పన్ను చెల్లింపుదారులకు ఇబ్బందులు లేకుండా ఈ అవకాశాన్ని ఇచ్చినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఇది ఎన్నారైల్లో విశ్వాసాన్ని పెంచే చర్యగా భావిస్తున్నారు. ఎన్నారైల ఆస్తుల విక్రయాలపై అమలులో ఉన్న టీడీఎస్‌ నిబంధనల్లో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇకపై స్థిరాస్తి విక్రయాల సమయంలో టీడీఎస్‌ను స్థానిక కొనుగోలుదారుల నుంచే వసూలు చేస్తారు. దీంతో ఎన్నారై విక్రేతలపై ఉన్న అదనపు భారం తగ్గనుంది. ఈ నిర్ణయం రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలను మరింత సులభతరం చేస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో లభించే పరిహార వడ్డీపై ఆదాయపు పన్నును ప్రభుత్వం పూర్తిగా తొలగించింది. భారత్‌లో ఆస్తులు, కుటుంబ సంబంధాలు ఉన్న ఎన్నారైలకూ ఈ నిర్ణయం ఉపయోగపడనుంది. బాధిత కుటుంబాలకు ఇది పెద్ద ఊరటగా మారుతుందని పేర్కొంటున్నారు.

బడ్జెట్‌ ఎఫెక్ట్‌: పెరిగేవి.. తగ్గేవి ఇవే.. Budget Impact on Prices
కేంద్ర బడ్జెట్‌ ( Budget) 2026 సామాన్యుల జేబుపై మిశ్రమ ప్రభావాన్ని చూపనుంది. కొన్ని వస్తువుల ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తుండగా, మరికొన్ని ఉత్పత్తులు, సేవలపై ధరల భారం పెరిగే సూచనలు ఉన్నాయి. పన్నులు, కస్టమ్స్‌ డ్యూటీల్లో చేసిన మార్పులే దీనికి ప్రధాన కారణం. బడ్జెట్‌ తర్వాత మార్కెట్లో ఏవి చౌక అవుతాయి, ఏవి ఖరీదవుతాయన్న అంశంపై ఆసక్తి నెలకొంది.

విదేశీ ప్రయాణాలు, విద్యకు ఊరట.. Relief for Foreign Travel and Education
( Budget) విదేశీ పర్యాటక ప్యాకేజీలపై వసూలు చేసే ట్యాక్స్‌ కలెక్ట్‌ ఎట్‌ సోర్స్‌ (TCS)ను ప్రభుత్వం 2 శాతానికి తగ్గించింది. దీంతో విదేశీ టూర్లు చేసే వారి ఖర్చు కొంత మేర తగ్గనుంది. అలాగే విదేశీ విద్య కోసం లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీం (LRS) కింద చెల్లించే మొత్తాలపై టీడీఎస్‌ను సడలించారు. దీని వల్ల విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, వారి కుటుంబాలకు ఆర్థికంగా ఊరట లభించనుంది.

దిగుమతులపై డ్యూటీ తగ్గింపు.. Customs Duty Cuts
( Budget) ఆల్కహాలిక్‌ లిక్కర్‌ తుక్కు, కొన్ని రకాల ఖనిజాలపై కస్టమ్స్‌ డ్యూటీని 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. షూ అప్పర్‌ ఎగుమతులకు అవసరమైన ముడిసరుకుల దిగుమతిని పూర్తిగా డ్యూటీ రహితంగా ప్రకటించారు. సోలార్‌ గ్లాస్‌ల తయారీలో కీలకమైన మెటీరియల్‌పై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని తొలగించడంతో పునరుత్పాదక ఇంధన రంగానికి ఊతం లభించనుంది.

ఎనర్జీ, పరిశ్రమలకు బూస్ట్.. Boost to Energy and Manufacturing
( Budget) ఎనర్జీ ట్రాన్సిషన్‌కు అవసరమైన పరికరాలు, క్యాపిటల్‌ గూడ్స్‌, క్రిటికల్‌ మినరల్స్‌పై బీసీడీ మినహాయింపు ఇచ్చారు. వ్యక్తిగత వినియోగానికి వాడే కొన్ని పరికరాలపై బీసీడీని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. దీని వల్ల వినియోగదారులకు కొంత ధరల ఊరట లభించే అవకాశం ఉంది.

ఆరోగ్య రంగానికి మేలు.. Relief for Healthcare
( Budget) క్యాన్సర్‌, అరుదైన వ్యాధులు, డయాబెటిక్‌ చికిత్సకు ఉపయోగించే 17 రకాల ఔషధాలపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని పూర్తిగా తొలగించారు. దీని వల్ల కీలక ఔషధాల ధరలు తగ్గి రోగులకు ఉపశమనం కలగనుంది.

దేశీయ తయారీకి ప్రోత్సాహం.. Push for Make in India
( Budget) భారత తీరప్రాంతాల నుంచి ప్రత్యేక ఆర్థిక మండలుల పరిధిలో జాలర్లు పట్టే చేపలకు సడలింపులు ఇచ్చారు. అణు విద్యుత్తు ప్రాజెక్టులకు వాడే పరికరాలు, విద్యుత్తు వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీలు, భారత్‌లో తయారయ్యే స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లెట్లు, విమానాల విడిభాగాలపై డ్యూటీ తగ్గింపులు లేదా మినహాయింపులు కల్పించారు. ఇవన్నీ దేశీయ తయారీని ప్రోత్సహించే చర్యలుగా ప్రభుత్వం చెబుతోంది.

ఇవి మాత్రం ఖరీదవుతాయి..Items Likely to Get Costlier
ఆదాయపు వివరాలు సరిగ్గా వెల్లడించని వారిపై విధించే జరిమానాను ప్రభుత్వం 100 శాతం వరకు పెంచింది. బహిర్గతం చేయని చరాస్థులపై కూడా ఇకపై జరిమానా తప్పదని స్పష్టం చేసింది. ఫ్యూచర్స్‌, ఆప్షన్స్‌ ట్రేడింగ్‌పై పన్నుల భారంతో ట్రేడింగ్‌ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

విలాస వస్తువులపై భారమే.. Higher Cost for Luxury Items
విలాసవంతమైన వాచ్‌లు, ఆల్కహాల్‌, సిగరెట్లు, బీడీలు, పాన్‌ మసాలా, గుట్కా వంటి ఉత్పత్తులపై ధరలు పెరిగే సూచనలు ఉన్నాయి. అలాగే కాఫీ రోస్టింగ్‌, బ్రూవింగ్‌, వెండింగ్‌ యంత్రాలు, చిత్రీకరణకు వాడే పరికరాలు, కెమెరాలపై కూడా ధరల భారం పడనుంది.

ఎరువుల ధరలపై అనిశ్చితి.. Fertiliser Price Concerns
కొన్ని రకాల ఎరువులపై దిగుమతి ఫీజులను తొలగించినప్పటికీ, అమోనియం ఫాస్ఫేట్‌, అమోనియం నైట్రో ఫాస్ఫేట్‌ వంటి ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది రైతులపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉంది.

 

 

 

7
FEATURE NEWS Tags:Boost to Energy and Manufacturing, Budget Impact on Prices, Budget Jitters in Stock Market, Customs Duty Cuts, Extended Deadlines for ITR Filing, Fertiliser Price Concerns, Higher Cost for Luxury Items, Items Likely to Get Costlier, New Income Tax Law from April 1, Nifty Crash Sharply, Push for Make in India, Relief for Foreign Travel and Education, Relief for Healthcare, Relief Measures for Small Taxpayers, Rupee Comes & Goes, Sector-wise Allocations, Sensex, Tax on Share Buybacks, TCS Cut on Foreign Tours, Union Budget Brings Relief for NRIs

Post navigation

Previous Post: పేద విద్యార్థులకు పెద్ద అవకాశం..! పీఎం విద్యాలక్ష్మి పథకం ! A Big Opportunity for Economically Disadvantaged Students… PM Vidyalakshmi Scheme!
Next Post: బడ్జెట్లో రూ. 12.21 లక్షల కోట్లు కేటాయింపు.. పరుగులు పెట్టనున్న భారత ఆర్థిక వ్యవస్థ ..₹12.21 Trillion Allocation in Budget: Indian Economy Set to Accelerate

Related Posts

  • మీ ఆలోచ‌నే మీ ఆస్తి Your thoughts are your property FEATURE NEWS
  • ఎంత సంపాదించినా ఈ దేశాల్లో పన్ను లేదు..! అవేమిటో తెలుసా? No Matter How Much You Earn, There’s No Tax in These Countries — Do You Know Which Ones? FEATURE NEWS
  • ‘ఐటీఆర్‌ హోల్డ్‌’ అంటే రిజెక్ష‌న్ కాదు..! స్పష్టత ఇచ్చిన ఐటీ విభాగం! ITR on Hold’ Is Not a Rejection..! IT Department Clarifies FEATURE NEWS
  • విద్యా రుణం తీసుకోవాలనుకుంటున్నారా Want to Take an Education Loan FEATURE NEWS
  • డిసెంబర్‌లో EMIల భారం త‌గ్గనుందా? ప్రజల్లో కొత్త ఆశలు! Will EMI Burdens Ease This December? New Hopes Among People! FEATURE NEWS
  • స్వయంకృషితో ఎదిగారు.. పారిశ్రామికవేత్తల్లో అగ్రస్థానంలో నిలిచారు Self-Made Industrialists Reach the Top FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు షాక్‌.. ఏప్రిల్‌ నుంచి రూల్స్‌ మార్పు.. New Rules to Impact Gold Bond Investors from April
  • బడ్జెట్లో రూ. 12.21 లక్షల కోట్లు కేటాయింపు.. పరుగులు పెట్టనున్న భారత ఆర్థిక వ్యవస్థ ..₹12.21 Trillion Allocation in Budget: Indian Economy Set to Accelerate
  • బడ్జెట్‌లో ట్యాక్స్ పేయర్లకు షాక్.. Budget Shock for Taxpayers
  • పేద విద్యార్థులకు పెద్ద అవకాశం..! పీఎం విద్యాలక్ష్మి పథకం ! A Big Opportunity for Economically Disadvantaged Students… PM Vidyalakshmi Scheme!
  • ఇక్కడ డబ్బు డిపాజిట్ చేస్తే … మీరు వడ్డీ కట్టాలి! If You Deposit Money Here… You Have to Pay Interest!
  • గత బడ్జెట్ నుంచి ఇప్పటివరకు 363% పెరిగిన మల్టీబ్యాగర్ స్టాక్ Multi-Bagger Stock Surges 363% Since Last Budget
  • భారత్ ఫారెక్స్ నిల్వల్లో రికార్డు పెరుగుదల.. రూపాయికి మరింత బలం! Record Surge in India’s Forex Reserves… Rupee Gains Further Strength!
  • ఒక్కరోజే రూ.30 వేల పతనం! వెండి ధర షాక్‌… బంగారం ఎంత తగ్గిందంటే? Silver crashes ₹30,000 in a single day! How much did gold prices fall?
  • విమానం రద్దయిందా? టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా? ప్రయాణికుడిగా మీకు ఉన్న హక్కులివే! Flight Cancelled? Will You Get a Refund? Here Are Your Rights as a Passenger!
  • ఆరోగ్య బీమా తీసుకునే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి! Things You Must Know Before Buying Health Insurance!
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Caution is Essential Compared to Other Countries… Convenience Current Situation Direct Equity Drawbacks Expert Advice Future Outlook Geopolitical Tensions how To get financial freedom How to improve CIBIL Score Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Key Recommendations Market Expansion Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Recommendations for Investors Right Decisions Are the Key Security square off Stock Market Systematic Investment Plans (SIP) Tips for Investors what are the best financial rules What Are the Interest Rates? what is scuttlebutt investing in stock market What Lies Ahead? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

February 2026
S M T W T F S
1234567
891011121314
15161718192021
22232425262728
« Jan    
  • what are position opening, square off, short selling? పొజిష‌న్ ఓపెనింగ్‌, స్కేర్ ఆఫ్‌, షార్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి..? MARKET
  • ఇన్వెస్టర్‌కి ఇవి త‌ప్ప‌నిస‌రి: వారెన్ బ‌ఫెట్‌ FINICAL PLANNING
  • అక్టోబర్ సెంటిమెంట్ బ్రేక్.. 2018 తర్వాత తొలిసారి బిట్‌కాయిన్ నష్టాలు.. October Sentiment Break: Bitcoin Records First Losses Since 2018 MARKET
  • ధనవంతుల్ని చేయగల ఇన్వెస్ట్ మెంట్ సాధ‌నాలు ఏమిటి Are there any investments that can make you rich INVESTMENTS
  • కొత్త ఐటీఆర్‌ ఫారాలు.. జ‌న‌వ‌రి నుంచి అమ‌లు! New ITR Forms to Be Implemented from January! FEATURE NEWS
  • బ‌ఫెట్ లాభాల‌కు ఇవీ చిట్కాలు MARKET
  • బంగారంపై పెట్టుబ‌డి.. దండ‌గే! FINICAL PLANNING
  • జూన్ నుంచి `ఆకాశ్ ఎయిర్స్` * 66 వేల కోట్ల‌తో ప్రారంభిస్తున్న రాకేష్ ఝున్ ఝున్ వాలా NEWS

Copyright © 2026 .

Powered by PressBook News Dark theme