Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • GST అంటే ఏమిటి what is GST FEATURE NEWS
  • పిల్లల చదువు కోసం NPS వాత్సల్య సరైన ఎంపికేనా? Is NPS Vatsalya the Right Choice for Children’s Education? FEATURE NEWS
  • భార్యకు భారీగా న‌గదు గిఫ్ట్‌గా ఇస్తున్నారా? అయితే ఐటీఆర్ ఫైలింగ్‌లో ఈ నిబంధనలు తప్పనిసరి! Are You Gifting a Large Amount of Cash to Your Wife? These ITR Filing Rules Are Mandatory! FEATURE NEWS
  • కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం ఎలా వ‌స్తుంది..? FEATURE NEWS
  • ఈ వెబ్‌సైట్లను మిస్ అవ్వొద్దు what are the important websites for stock market news FEATURE NEWS
  • 2025లో మల్టీ-అసెట్ ఫండ్స్ అద్భుత రాబడులు.. 2026లో అనుసరించాల్సిన వ్యూహాలు! Multi-Asset Funds Deliver Excellent Returns in 2025: Strategies to Follow in 2026! FEATURE NEWS
  • కార్పొరేట్ ఎఫ్‌డీల్లో వ‌డ్డీలు ఎంత‌..? FEATURE NEWS
  • విమానం రద్దయిందా? టికెట్ డబ్బులు వెనక్కి వస్తాయా? ప్రయాణికుడిగా మీకు ఉన్న హక్కులివే! Flight Cancelled? Will You Get a Refund? Here Are Your Rights as a Passenger! FEATURE NEWS
  • స్మాల్ క్యాప్ మ్యూచువ‌ల్ ఫండ్స్ లో లాభాలే FEATURE NEWS
  • రూ.100 లక్షల కోట్ల మైలురాయికి చేరిన ఎస్‌బీఐ .. SBI Reaches ₹100 Lakh Crore Milestone FEATURE NEWS

పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే… కుటుంబ సభ్యులు చెల్లించాలా? Personal Loan After Death – Who Is Legally Responsible?

Posted on 06/01/2026 By admin No Comments on పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి చనిపోతే… కుటుంబ సభ్యులు చెల్లించాలా? Personal Loan After Death – Who Is Legally Responsible?

నేటి కాలంలో అప్పు అనేది మధ్యతరగతి కుటుంబాల జీవితంలో ఒక సాధారణ అంశంగా మారిపోయింది. స్థిరమైన ఉద్యోగం ఉన్నా, మంచి జీతం వస్తున్నా కూడా కొన్ని సందర్భాల్లో రుణం తీసుకోవాల్సిన పరిస్థితులు తప్పవు. పెళ్లిళ్లు, వైద్య ఖర్చులు, పిల్లల చదువు, అత్యవసర అవసరాలు, ఇంటి మరమ్మతులు వంటి కారణాలతో పర్సనల్ లోన్లు (Personal Loans) విస్తృతంగా వినియోగంలోకి వచ్చాయి. అయితే, ఒక కీలక ప్రశ్న చాలామంది మనసుల్లో మెదులుతూనే ఉంటుంది. పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే… ఆ లోన్ భారం ఎవరి మీద పడుతుంది? కుటుంబ సభ్యులు చెల్లించాల్సిందేనా? బ్యాంకులు ఏం చేస్తాయి? ఈ అంశంపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల చాలా కుటుంబాలు అనవసర భయాందోళనలకు గురవుతుంటాయి. ఈ నేపథ్యంలో నిపుణుల సూచనలతో పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పర్సనల్ లోన్ అంటే ఏమిటి? What Is a Personal Loan
పర్సనల్ లోన్ (Personal Loan) అనేది సాధారణంగా ఎలాంటి ఆస్తి పూచీకత్తు (Collateral) లేకుండా బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు ఇచ్చే రుణం. దీనిని అన్‌సెక్యూర్డ్ లోన్ (Unsecured Loan) అని కూడా అంటారు. పర్సనల్ లోన్ పొంద‌డానికి భూమి, ఇల్లు, బంగారం వంటి పూచీకత్తు అవసరం లేదు. ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం ఆధారంగా రుణం మంజూరు చేస్తారు. అయితే వడ్డీ రేట్లు కొంచెం ఎక్కువగా ఉంటాయి. తిరిగి చెల్లింపు కాలం సాధారణంగా 1–5 సంవత్సరాల వ‌ర‌కూ ఉంటుంది. ఈ స్వభావం కారణంగానే, రుణగ్రహీత మరణించినప్పుడు చెల్లింపు బాధ్యత విషయంలో సందేహాలు తలెత్తుతాయి.

లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఏం జరుగుతుంది? What Happens to a Personal Loan After the Borrower’s Death
లోన్ తీసుకున్న వ్యక్తి (Personal Loan)మరణించిన వెంటనే బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ ఆ లోన్‌ను ఆటోమేటిక్‌గా మాఫీ చేయదు. అయితే, అదే సమయంలో కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా లోన్ చెల్లించాల్సిందే అన్న నిబంధన కూడా లేదు. ఈ పరిస్థితి పూర్తిగా ప‌లు అంశాలపై ఆధారపడి ఉంటుంది. లోన్‌కు ఇన్సూరెన్స్ ఉందా లేదా? కో-అప్లికెంట్ ఉన్నాడా? గ్యారెంటర్ ఉన్నాడా రుణగ్రహీత పేరిట ఆస్తులు ఉన్నాయా?.. ఇలా ఒక్కో అంశాన్ని విడివిడిగా అర్థం చేసుకోవాలి.

లోన్ ఇన్సూరెన్స్ ఉంటే భయం అవసరం లేదు Role of Loan Insurance or Credit Life Insurance
చాలా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు పర్సనల్ లోన్(Personal Loan) ఇచ్చే సమయంలో లోన్ ఇన్సూరెన్స్ లేదా క్రెడిట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తాయి. కొందరు తీసుకుంటారు, మరికొందరు ఖర్చు పెరుగుతుందనే కారణంతో తీసుకోరు. లోన్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే రుణగ్రహీత మరణించిన తర్వాత మిగిలిన లోన్ మొత్తాన్నిఇన్సూరెన్స్ కంపెనీ బ్యాంక్‌కు చెల్లిస్తుంది. ఈ సందర్భంలో కుటుంబ సభ్యులపై ఎలాంటి ఆర్థిక భారం ప‌డ‌దు. బ్యాంక్ కూడా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టదు అందుకే నిపుణుల సూచన ఏమిటంటే .. “పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు లోన్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి.”

లోన్ ఇన్సూరెన్స్ లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? If There Is No Loan Insurance
లోన్‌(Personal Loan)కు ఎలాంటి ఇన్సూరెన్స్ లేకపోతే పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంటుంది. అయినప్పటికీ, కుటుంబ సభ్యులు తప్పనిసరిగా తమ జేబు నుంచి డబ్బు కట్టి లోన్ తీర్చాల్సిందే అన్న నియమం లేదు. ఈ సందర్భంలో బ్యాంక్ చేసే పని ఏమిటంటే.. రుణగ్రహీత పేరిట ఆస్తులు ఉన్నాయా లేదా అని పరిశీలిస్తుంది. ఆస్తులు ఉంటే, వాటిపై చట్టబద్ధంగా క్లెయిమ్ చేస్తుంది.

రుణగ్రహీత పేరిట ఆస్తులు ఉంటే… If the Deceased Borrower Has Assets
లోన్(Personal Loan) తీసుకున్న వ్యక్తి పేరిట ఇల్లు, భూమి, స్థిరాస్తులు, బ్యాంక్ డిపాజిట్లు వంటి ఆస్తులు ఉంటే, బ్యాంక్ లేదా ఫైనాన్స్ సంస్థ వాటిపై క్లెయిమ్ చేయవచ్చు. ఈ ప్రక్రియ ఎలా ఉంటుందంటే.. తొలుత ఆస్తులను విక్రయిస్తారు. వచ్చిన మొత్తంలో నుంచి లోన్ బాకీని కట్ చేస్తారు.. మిగిలిన మొత్తం ఉంటే, అది చట్టబద్ధ వారసులకు అందజేస్తారు .

కో-అప్లికెంట్ ఉంటే పూర్తి బాధ్యత ఎవరిది? Liability of Co-Applicant in Personal Loan
పర్సనల్ లోన్(Personal Loan) తీసుకునేటప్పుడు కొన్నిసార్లు బ్యాంకులు కో-అప్లికెంట్ (Co-Applicant)ను అడుగుతాయి. సాధారణంగా భార్య, భర్త లేదా దగ్గరి కుటుంబ సభ్యుడిని కో-అప్లికెంట్‌గా చేర్చుతారు. కో-అప్లికెంట్ అంటే.. లోన్‌కు సంయుక్తంగా బాధ్యత వహించే వ్యక్తి అని అర్థం. ఈ పరిస్థితిలో ప్రధాన రుణగ్రహీత మరణిస్తే.. కో-అప్లికెంట్‌పై పూర్తి లోన్ చెల్లింపు బాధ్యత ఉంటుంది బ్యాంక్‌కు చట్టపరంగా కో-అప్లికెంట్ నుంచి మొత్తం రికవరీ చేసే హక్కు ఉంటుంది.

గ్యారెంటర్ ఉన్నట్లయితే ఏమవుతుంది? Role of a Guarantor
కొన్ని లోన్లకు (Personal Loan) బ్యాంకులు గ్యారెంటర్ను కూడా అడుగుతాయి. గ్యారెంటర్ అనేది లోన్ తిరిగి చెల్లించకపోతే బాధ్యత వహిస్తానని ఒప్పుకున్న వ్యక్తి. రుణగ్రహీత మరణించినప్పుడు.. బ్యాంక్ గ్యారెంటర్‌ను సంప్రదిస్తుంది. మిగిలిన లోన్ మొత్తాన్ని గ్యారెంటర్ నుంచి రికవరీ చేయవచ్చు అందుకే గ్యారెంటర్‌గా మారే ముందు పూర్తిగా ఆలోచించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆస్తులు లేవు… కో-అప్లికెంట్ లేదు… గ్యారెంటర్ కూడా లేరు అంటే? No Assets, No Co-Applicant, No Guarantor
ఇది చాలామందికి అత్యంత ముఖ్యమైన అంశం. ఈ పరిస్థితిలో కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా లోన్ (Personal Loan) చెల్లించాల్సిన అవసరం లేదు. వారి ఆదాయం, సేవింగ్స్‌పై బ్యాంక్ క్లెయిమ్ చేయలేదు. బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు లీగల్ నోటీసులు పంపించవచ్చు. కానీ చట్టపరంగా కుటుంబ సభ్యులను బలవంతం చేయలేవు. అందువల్ల భయపడాల్సిన అవసరం ఉండదు.

బ్యాంకులు లోన్ మాఫీ చేస్తాయా? Can Banks Waive Off Personal Loans
కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రుణగ్రహీత మరణాన్ని పరిగణలోకి తీసుకుని బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థలు లోన్ (Personal Loan) మొత్తాన్ని పూర్తిగా లేదా కొంతవరకు మాఫీ చేయవచ్చు. కానీ ఇది బ్యాంక్ విధానాలు, లోన్ మొత్తం, కుటుంబ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఇది హక్కు కాదు, పూర్తిగా బ్యాంక్ నిర్ణయం.

కుటుంబ సభ్యులు చేయాల్సిన పనులు.. What Family Members Should Do Immediately
రుణగ్రహీత మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు చేయాల్సిన ముఖ్యమైన పనులేమిటంటే.. బ్యాంక్‌కు అధికారికంగా సమాచారం ఇవ్వాలి. మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. లోన్ (Personal Loan)వివరాలు తెలుసుకోవాలి. ఇన్సూరెన్స్ ఉందా లేదా పరిశీలించాలి. న్యాయ సలహా అవసరమైతే తీసుకోవాలి.

లోన్ తీసుకునే ముందు జాగ్రత్తలు.. Precautions While Taking a Personal Loan
ప‌ర్స‌నల్ లోన్ (Personal Loan)తీసుకునే ముందు ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. కో-అప్లికెంట్ బాధ్యతలను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. లోన్ అగ్రిమెంట్‌ను పూర్తిగా చదవాలి. కుటుంబ సభ్యులకు లోన్ వివరాలు తెలియజేయాలి. కాగా పర్సనల్ లోన్ తీసుకున్న వ్యక్తి మరణించిన తర్వాత ప్రతి సందర్భంలో కుటుంబ సభ్యులు లోన్ చెల్లించాల్సిందే అన్న నియమం లేదు. లోన్ ఇన్సూరెన్స్, కో-అప్లికెంట్, గ్యారెంటర్, ఆస్తులు వంటి అంశాల ఆధారంగా బాధ్యత నిర్ణయించబడుతుంది. సరైన అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటే… అనుకోని పరిస్థితుల్లో కూడా కుటుంబ సభ్యులు ఆర్థిక ఒత్తిడికి గురికాకుండా ఉండగలరు.

103
FEATURE NEWS Tags:Can Banks Waive Off Personal Loans, If the Deceased Borrower Has Assets, If There Is No Loan Insurance, Liability of Co-Applicant in Personal Loan, No Assets, No Co-Applicant, No Guarantor, Precautions While Taking a Personal Loan, Role of a Guarantor, Role of Loan Insurance or Credit Life Insurance, What Family Members Should Do Immediately, What Happens to a Personal Loan After the Borrower’s Death, What Is a Personal Loan

Post navigation

Previous Post: పీఎఫ్‌ ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లించొచ్చు! LIC Premium from PF Account – A Financial Safety Option
Next Post: శాలరీ రాగానే మాయమవుతోందా? అయితే ఈ రూల్ ఫాలో అవ్వండి! Salary Vanishing Every Month? The 70/10/10/10 Rule Can Change Your Life

Related Posts

  • ఇంటి ఓనర్లకు షాక్..! మారిన రెంటల్ అగ్రిమెంట్ రూల్స్! Shock to Homeowners..! Changed Rental Agreement Rules! FEATURE NEWS
  • గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు! Good News for Gold Buyers: Gold Prices Drop Sharply! FEATURE NEWS
  • ఇలాంటి ఇళ్ల‌కు ప్రాధాన్యం.. FEATURE NEWS
  • పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్‌ సుంకం.. సిగ‌రెట్ల ధ‌రలు మ‌రింత ప్రియం .. Additional Excise Duty on Tobacco Products… Cigarette Prices to Rise Further FEATURE NEWS
  • డిస్కౌంట్ బ్రోక‌ర్‌తో ఇవీ న‌ష్టాలు what are the disadvantages of discount brokers FEATURE NEWS
  • జోరుగా వెండి విక్రయాలు.. ! వారంలోనే 100 టన్నుల అమ్మ‌కం! Massive Silver Sell-Off: 100 Tonnes Sold in Just One Week! FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • రూపాయి నాణెం వెనుక ఉన్న ఆసక్తికర ఆర్థిక లెక్క ..! నష్టం వస్తున్నా ప్రభుత్వం ఎందుకు ముద్రిస్తోంది? The Interesting Economics Behind the One-Rupee Coin: Why Is the Government Minting Despite Losses?
  • భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందం .. జోష్‌లో మార్కెట్లు .. India–US Trade Deal Boosts Market Sentiment
  • మళ్లీ పెరిగిన‌ బంగారం, వెండి ధరలు.. Gold and Silver Prices Rise Again
  • క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారా? అయితే ఈ చార్జీల గురించి తెలుసుకోండి! Are You Using a Credit Card? Then Be Aware of These Hidden Charges!
  • కీలక రేట్లు యథాతథం… డిజిటల్‌ మోసాల బాధితులకు ఊరట, ఎంఎస్‌ఎమ్‌ఈలకు భారీ భరోసా.. ప్ర‌క‌టించిన ఆర్‌బీఐ Key Rates Unchanged… RBI Announces Relief for Digital Fraud Victims, Big Boost for MSMEs
  • రాగిలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చా? Can You Invest in Copper Too?
  • దిగొచ్చిన వెండి, ప‌సిడి ధ‌ర‌లు.. ! ఇది ఒక తాత్కాలిక ‘హెల్తీ కరెక్షన్’ మాత్రమేనా? Falling Silver and Gold Prices: Is This Just a Temporary ‘Healthy Correction’?
  • ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఆంథ్రోపిక్‌ ప్రకంపనలు..! ఇక కంపెనీల‌కు మానవ వనరుల అవసరం ఉంటుందా? Anthropic Shockwaves Rock the Global Tech Industry: Will Companies Still Need Human Resources?
  • ఐటీ షేర్లను క్షణాల్లో కూల్చేసిన ఏఐ.. AI Shock Rocks IT Stocks
  • అమల్లోకి వచ్చిన బ్యాగేజీ నిబంధనలు–2026 … New Baggage Rules 2026 Implemented
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Caution is Essential Compared to Other Countries… Convenience Current Situation Direct Equity Drawbacks Expert Advice Future Outlook Geopolitical Tensions how To get financial freedom Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Key Recommendations Market Expansion Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Recommendations for Investors Right Decisions Are the Key Security square off Stock Market Systematic Investment Plans (SIP) Tips for Investors what are the best financial rules What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

February 2026
S M T W T F S
1234567
891011121314
15161718192021
22232425262728
« Jan    
  • how to achieve early retirement and financial freedom ముందస్తు పదవీ విరమణ మరియు ఆర్థిక స్వేచ్ఛను ఎలా పొందాలి FINICAL PLANNING
  • కీల‌క‌ పన్ను ఆదా ఎంపికలేమిటో తెలుసుకోండి..! మిన‌హాయింపు పొందండి! Know the Key Tax-Saving Options… Get Your Deductions! FINICAL PLANNING
  • ఇక‌పై బ్యాంకు ఖాతాకు న‌లుగురు నామినీలు! న‌వంబ‌ర్ 1 నుంచి అమ‌లులోకి.. Now Four Nominees Allowed per Bank Account! Effective from November 1 FEATURE NEWS
  • చిత్ర రామ‌కృష్ణ @ అదృశ్య యోగి-అవినీతి క‌థ‌ The Story of the Chitra Ramakrishna MARKET
  • సిప్ తో పాటు ఇన్సూరెన్స్‌ how to get insurance with mutual funds MUTUAL FUNDS
  • ఈపీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే ట్యాక్స్ ప‌డుతుందా? Is EPF Withdrawal Taxable? FEATURE NEWS
  • How to Check EPF balance..? పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలి..? FEATURE NEWS
  • Multi bagger stocks ను ఎలా కనుగొనాలి HOW TO FINDOUT MULTI BAGGER STOCKS INVESTMENTS

Copyright © 2026 .

Powered by PressBook News Dark theme