Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

ఈపీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే ట్యాక్స్ ప‌డుతుందా? Is EPF Withdrawal Taxable?

Posted on 15/11/2025 By admin No Comments on ఈపీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే ట్యాక్స్ ప‌డుతుందా? Is EPF Withdrawal Taxable?

ఉద్యోగులు అత్యవసర సమయాల్లో EPF నుంచి డబ్బు తీసుకోవడం చాలా సాధారణం. కానీ ఎప్పుడు విత్‌డ్రా చేస్తే ట్యాక్స్‌ పడుతుందో చాలా మందికి స్పష్టంగా తెలియదు. చిన్న పొరపాటే పెద్ద నష్టానికి దారితీయొచ్చు అంటున్నారు నిపుణులు. మీ కష్టార్జిత EPF సొమ్ముపై పన్ను పడకుండా ఉండాలంటే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి.

5 ఏళ్లకు ముందు విత్‌డ్రా చేస్తే… Withdrawing Before 5 Years…

మీరు ఒకే సంస్థలోనా… లేక వేరే సంస్థల్లోనా మొత్తం కలిపి 5 సంవత్సరాల కంటిన్యూయస్‌ సర్వీస్‌ లేకుండా EPF‌ని విత్‌డ్రా చేస్తే ఆ మొత్తం ట్యాక్సబుల్‌ ఇన్‌కమ్‌గా పరిగణిస్తారు. మీ కాంట్రిబ్యూషన్‌పై వచ్చిన వడ్డీ, కంపెనీ కాంట్రిబ్యూషన్‌, దానిపై వచ్చిన వడ్డీ.. అన్నీ పన్నుకు లోబడతాయి.

₹50,000 పైగా విత్‌డ్రా చేస్తే TDS.. TDS on Withdrawals Above ₹50,000

5 ఏళ్లలోపే EPF విత్‌డ్రా చేసి, మొత్తం ₹50,000 కంటే ఎక్కువ అయితే EPFO 10% TDS కట్‌ చేస్తుంది.
PAN ఇవ్వకపోతే ఈ TDS మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

ఫారం 15G/15H ఇస్తే TDS మినహాయింపు..Submit Form 15G/15H to Avoid TDS

మీ ఆదాయం ట్యాక్స్‌ లిమిట్‌ లోపే ఉంటే, మీరు ఫారం 15G/15H సమర్పిస్తే TDS కట్‌ చేయరు.
అయితే ఫారం ఇచ్చినందుకు పన్ను పూర్తిగా మాఫీ అయిందనే కాదు. మీకు వర్తించే ట్యాక్స్‌ స్లాబ్‌ ప్రకారం రిటర్న్ ఫైల్‌ చేసే సమయంలో పన్ను లెక్కిస్తారు.

జాబ్‌ మార్చినా… Even If You Change Jobs…

చాలామంది జాబ్‌ మార్చిన వెంటనే పాత EPF విత్‌డ్రా చేస్తారు. ఇది పెద్ద తప్పు. పాత అకౌంట్‌ నుంచి కొత్త అకౌంట్‌కి PF ట్రాన్స్‌ఫర్ చేస్తే సర్వీస్ కంటిన్యూవిటీ కొనసాగుతుంది. 5 ఏళ్ల రూల్‌ బ్రేక్‌ కాకపోవడంతో పన్ను పడదు

ఇంట్రెస్ట్‌పై కూడా ట్యాక్స్ పడుతుందా? Is Interest Also Taxable?

5 ఏళ్లలోపు విత్‌డ్రా చేస్తే ఇంట్రెస్ట్‌పై కూడా ట్యాక్స్ పడుతుంది. మీ EPF బ్యాలెన్స్‌లోని ఇంట్రెస్ట్‌ కూడా ఇతర ఆదాయం (Income from Other Sources)గా పరిగణించి పన్ను వేస్తారు. 5 ఏళ్లు పూర్తయ్యాక విత్‌డ్రా చేసిన EPF మొత్తం ట్యాక్స్‌ ఫ్రీ. EPF దేశంలో అత్యుత్తమ రిస్క్‌–ఫ్రీ ఇన్వెస్ట్‌మెంట్‌గా నిలుస్తుంది.

EPF‌లో 4 రకాలుగా డబ్బు జ‌మ‌.. 4 Ways Money Is Deposited in EPF

ఉద్యోగి కాంట్రిబ్యూషన్‌

యజమాని/సంస్థ కాంట్రిబ్యూషన్‌

సంస్థ చేసిన డిపాజిట్లపై వచ్చే వడ్డీ

ఉద్యోగి డిపాజిట్లపై వచ్చే వడ్డీ… ఈ నాలుగే EPF మొత్తాన్ని రూపొందిస్తాయి.

EPF నుంచి విత్‌డ్రా చేసేట‌ప్పుడు పన్ను ఎలా పడుతుందంటే..? How Is EPF Withdrawal Taxed?

ఉదాహరణకు A అనే వ్యక్తి 3 ఏళ్ల సేవ పూర్తి చేశాడు. కొన్ని అత్యవసర కారణాలతో తన EPF నుంచి ₹60,000 విత్‌డ్రా చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం అతడి PF ఖాతాలో మొత్తం రూ.3 లక్షలు (ఉద్యోగి + సంస్థ భాగాలు, వాటిపై వడ్డీ కలిపి) ఉన్నట్లు భావిద్దాం. అయితే A వ్యక్తి 5 ఏళ్ల సర్వీస్‌ పూర్తి చేయలేదు. అందువల్ల ఉపసంహరణ చేసిన మొత్తం పూర్తిగా పన్నుకు లోబడి ఉంటుంది. కొత్త పన్ను విధానం ప్రకారం చూస్తే A వ్యక్తి 10% ట్యాక్స్‌ స్లాబ్‌‌లోకి వస్తాడు. అందువల్ల ₹60,000పై 10% TDS ప‌డుతుంది. అంటే ₹6,000 నేరుగా కట్‌ అవుతుంది. ఉపసంహరణ చేసిన మొత్తం తక్కువైనా… పన్ను మాత్రం సర్వీస్‌ పీరియడ్‌ ఆధారంగా లెక్కిస్తారు. ఇదే A అనే వ్యక్తి ఐదు సంవత్సరాల తర్వాత విత్‌డ్రా చేసి ఉంటే ఒక్క రూపాయి కూడా TDS లేదా ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ పడదు.

ఈపీఎఫ్‌ – పూర్తిగా పన్ను రహితం! EPF — Completely Tax-Free!

ఉద్యోగుల భవిష్యత్తును భద్రపరిచే EPF ఖాతా పన్నుల పరంగా అత్యంత లాభదాయకమైన సేవింగ్స్‌ స్కీమ్‌గా నిలుస్తోంది. ఎందుకంటే ఇది EEE కేటగిరీకి చెందినది. సాధారణ సేవర్లకు, కొత్తగా ఉద్యోగాలు ప్రారంభించిన వారికి ఈ కేటగిరీ గురించి స్పష్టత ఉండటం ఎంతో అవసరం.

EEE కేటగిరీ అంటే ఏమిటి? What Is the EEE Category?

EEE అంటే Exempt (డిపాజిట్‌పై మినహాయింపు). Exempt (వడ్డీపై మినహాయింపు). Exempt (మెచ్యూరిటీపై మినహాయింపు). అంటే EPF‌లో ఉద్యోగి, సంస్థ చేసే కాంట్రిబ్యూషన్స్‌, వాటిపై వచ్చే వడ్డీ, చివరకు రిటైర్మెంట్‌ సమయాన పొందే మెచ్యూరిటీ మొత్తం పూర్తిగా పన్ను రహితం.

పాత పన్ను విధానం .. Old Tax Regime

పాత పన్ను విధానంలో EPF‌లో చేసే ఉద్యోగి డిపాజిట్లపై రూ.1.5 లక్షల వరకు 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. విద్యా ఫీజులు, ఇన్సూరెన్స్‌, హౌస్‌ లోన్ ప్రిన్సిపల్‌తో పాటు EPF కూడా ఈ శ్రేణిలోకి వస్తుంది.

కొత్త పన్ను విధానం .. New Tax Regime

కొత్త పన్ను విధానంలో 80C మినహాయింపు లేకపోవడంతో ఉద్యోగులు తమ EPF కాంట్రిబ్యూషన్‌పై ట్యాక్స్‌ బెనిఫిట్‌ పొందరు. కేవలం యజమాని కాంట్రిబ్యూషన్‌పై మాత్రమే పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

EPF బ్యాలెన్స్‌, వడ్డీ, మెచ్యూరిటీ – పూర్తిగా ట్యాక్స్‌ ఫ్రీ.. EPF Balance, Interest & Maturity — Completely Tax-Free

ట్యాక్స్‌ విధానం ఏది ఎంచుకున్నా… EPF ఖాతాలోని నగదు నిల్వలు, వడ్డీ, మెచ్యూరిటీ అన్నీ 100% పన్ను రహితం. కానీ ఒకే షరతు ఏమిటంటే ఖాతా 5 ఏళ్ల పాటు కొనసాగాలి. ఐదేళ్ల సర్వీస్‌ కి ముందు EPF విత్‌డ్రా చేస్తే EEE ప్రయోజనం ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. ఉద్యోగి, యజమాని కాంట్రిబ్యూషన్లపై వచ్చిన వడ్డీ మొత్తమంతా పన్ను పరిధిలోకి వస్తుంది. 5 సంవత్సరాల నిరంతర సర్వీస్‌ పూర్తి చేస్తే EPF భారతదేశంలో అత్యంత భద్రమైన, పన్ను రహిత పెట్టుబడిల్లో అగ్రస్థానంలో నిలుస్తుంది. అందుకే నిపుణులు “EPF‌ను రిటైర్మెంట్‌ వరకు అలాగే ఉంచడం ఉత్తమం” అంటున్నారు. EPF అనేది ఉద్యోగులకు దక్కే అత్యుత్తమ పన్ను ప్రయోజనం కలిగిన సేవింగ్‌ పథకం.అదే సమయం లో చిన్న తప్పు చేస్తే కొన్నేళ్లుగా కూడ‌క‌ట్టుకున్న‌ వడ్డీపై కూడా పన్ను పడే పరిస్థితి ఉంది.

నిపుణులు ఏమంటున్నారంటే.. Experts Say…

అనేక మంది చిన్న చిన్న‌ అవసరాలకు EPF నుంచి విత్‌డ్రా చేస్తున్నారు. ఇది రిటైర్మెంట్‌ సేఫ్టీని దెబ్బతీస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. “EPF‌ను చివరి ఆప్షన్‌గా మాత్రమే వాడాలి. అవకాశం ఉంటే లోన్‌ తీసుకున్నా సరే EPF‌ను విత్‌డ్రా చేయకూడ‌దు” అని సూచిస్తున్నారు. EPF సొమ్ము మీ రిటైర్మెంట్‌ భద్రత. ఆపదకాలంలో విత్‌డ్రా చేయొచ్చు. కానీ 5 ఏళ్ల రూల్‌, TDS, ట్యాక్స్‌ లెక్కలు తప్పక తెలుసుకోవాలి. లేకపోతే మీ సొంత సేవింగ్స్‌కే పన్ను చెల్లించాల్సి వ‌స్తుంది.

ఉద్యోగ విర‌మ‌ణ‌కు ముందే EPF విత్‌డ్రా చేస్తే ఏమవుతుంది? పెన్షన్‌కు అర్హత ఉంటుందా?
What Happens If You Withdraw EPF Before Retirement? Will You Be Eligible for Pension?

ఉద్యోగస్తుల భవిష్యత్‌ భద్రతకు EPF, EPS పథకాలు ఎంత ముఖ్యమనేది తెలిసిందే. అయితే రిటైర్మెంట్‌కు ముందే అత్యవసర అవసరాల కోసం చాలామంది EPF నుంచి నగదు ఉపసంహరించుకుంటుంటారు. కానీ ఇక్కడే అసలు ప్రశ్న. EPF‌ను ముందే విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం ఉంటుందా? EPS‌కు అర్హత కోల్పోతారా? లేదా అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.. వాస్త‌వంగా ఉద్యోగి జీతం నుంచి 12% EPFలో చేరుతుంది. యజమాని వాటా 12%లో 8.33% EPS (పెన్షన్ ఖాతా)లోకి, మిగతా 3.67% EPFలోకి వెళుతుంది. అంటే మీరు EPF విత్‌డ్రా చేసినా… EPS బ్యాలెన్స్‌ను నేరుగా ఉపసంహరించలేరు .

సర్వీసు 10 ఏళ్లు దాటితే పెన్షన్ తప్పనిసరి! Pension Is Mandatory After 10 Years of Service!

ఉద్యోగి 10 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసి EPS‌లో కంట్రిబ్యూషన్ ఉంటే పెన్షన్ అర్హత ఆటోమేటిక్‌గా వస్తుంది. EPF మొత్తం విత్‌డ్రా చేసుకున్నా కూడా EPS మెంబర్‌షిప్ కొనసాగుతుంది. 58 ఏళ్లు పూర్తయ్యాక మాత్రమే పెన్షన్ (Form 10D) క్లెయిమ్ చేసుకోవచ్చు 10 ఏళ్లు పూర్తి కాకముందే ఉద్యోగం మానేస్తే? ఇక్కడే చాలామంది గందరగోళానికి గుర‌వుతుంటారు. సర్వీస్ 10 ఏళ్లు దాటకపోతే EPF, EPS రెండూ విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. EPS సొమ్ము ‘Withdrawal Benefit’ రూపంలో Form 10C ద్వారా తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే పెన్షన్‌కు అర్హత ఉండదు.

EPF ముందే విత్‌డ్రా చేస్తే పెన్షన్‌కు నష్టమా? Does Early EPF Withdrawal Affect Pension?

EPF ముందే విత్‌డ్రా చేస్తే పెన్షన్‌కు నష్టం కాదు. సర్వీస్ 10 ఏళ్లు దాటిందా లేదా? అనేది ప్రధాన ప్రమాణం.
EPF పూర్తిగా తీసుకున్నా కూడా 10 ఏళ్లు సర్వీస్ ఉంటే పెన్షన్ హక్కు కోల్పోరు. 10 ఏళ్లు పూర్తి కాకపోతే పెన్షన్ అర్హత ఉండదు. అయితే చాలామంది రిటైర్మెంట్‌కి ముందే Form-10C వేసి EPS కూడా విత్‌డ్రా చేసుకుంటారు. 10 ఏళ్లు పూర్తి కాకపోతే ఇది సరే. 10 ఏళ్లు దాటితే EPS విత్‌డ్రా చేయరాదు. అలా చేస్తే పెన్షన్‌ మినహాయింపవుతుంది. ఏదేమైనా పదవీ విరమణకు ముందే EPF విత్‌డ్రా చేయొచ్చు. కానీ పెన్షన్‌పై ప్రభావం మీ సర్వీస్ కాలంపైనే ఆధారపడుతుంది. 10 ఏళ్లు దాటితే పెన్షన్ హక్కు గ్యారంటీ. 10 ఏళ్లు దాటకపోతే EPF + EPS రెండు తీసుకున్నా పెన్షన్ ఉండదు. ఉద్యోగ జీవితంలో చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తు భద్రతను ప్రభావితం చేస్తుందన్న విషయాన్ని మాత్రం గుర్తుంచుకోవాలి.

 

 

 

310
FEATURE NEWS Tags:000, 4 Ways Money Is Deposited in EPF, Does Early EPF Withdrawal Affect Pension?, EPF — Completely Tax-Free!, EPF Balance, Even If You Change Jobs…, Experts Say…, How Is EPF Withdrawal Taxed?, Interest & Maturity — Completely Tax-Free, Is Interest Also Taxable?, New Tax Regime, Old Tax Regime, Pension Is Mandatory After 10 Years of Service!, Submit Form 15G/15H to Avoid TDS, TDS.. TDS on Withdrawals Above ₹50, What Happens If You Withdraw EPF Before Retirement? Will You Be Eligible for Pension?, What Is the EEE Category?, Withdrawing Before 5 Years…

Post navigation

Previous Post: ఎంత సంపాదిస్తున్నా.. డబ్బులు మిగ‌ల‌ట్లేదా..? అయితే ఈ తప్పులే కారణం! Earning More but Saving Nothing? Here’s What You’re Doing Wrong!
Next Post: కొత్త ఐటీఆర్‌ ఫారాలు.. జ‌న‌వ‌రి నుంచి అమ‌లు! New ITR Forms to Be Implemented from January!

Related Posts

  • డిజిటల్ గోల్డ్ కొనొద్దు.. సెబీ హెచ్చరిక.. ! Don’t Buy Digital Gold… SEBI Issues Warning! FEATURE NEWS
  • భారతీయులు స్టాక్ మార్కెట్లో ఎందుకు పెట్టుబడి పెట్టడం లేదు? Why Indians Are Not Investing in the Stock Market FEATURE NEWS
  • క్రిప్టోపై పెట్టుబ‌డుల‌తో జాగ్ర‌త్త is crypto investments are safe FEATURE NEWS
  • ఏటీఎం వినియోగంపై కొత్త నియమాలు.. బ్యాంకు ఖాతాదారుల‌పై అద‌న‌పు భారం? New Rules on ATM Usage | Extra Burden on Bank Customers? FEATURE NEWS
  • ఇలాంటి ఇళ్ల‌కు ప్రాధాన్యం.. FEATURE NEWS
  • ఏఐ సూచ‌న‌ .. జీతానికి ర‌క్ష‌! AI Guidance… A Shield for Your Salary! FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • మినిమమ్‌ బ్యాలెన్స్ క‌ష్టాల‌కు చెక్‌… జీరో బ్యాలెన్స్‌ ఖాతాతో ఉపశమనం Relief From Minimum Balance Penalties: Zero Balance Account Option FEATURE NEWS
  • ఐ విల్ టీచ్ యూ టు బీ రిచ్‌ పుస్త‌క స‌మ‌రీ I will teach you to be rich book summery BOOKS
  • మార‌నున్న పాన్‌ నిబంధనలు… Relief for Taxpayers under New PAN Rules FEATURE NEWS
  • టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఈ విష‌యాలు తెలుసుకోండి Taking Term Insurance? Know These Important Things.. FEATURE NEWS
  • గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ అంటే..? MARKET
  • ₹10 లక్షల పెట్టుబడితో ₹4.85 కోట్లు .. ఎలా సాధ్యం అనుకుంటున్నారా! How ₹10 Lakh Investment Grew to ₹4.85 Crore! FEATURE NEWS
  • యూట్యూబ్‌లో మిలియన్ వ్యూస్.. నిజంగా లక్షల ఆదాయమా? One Million Views on YouTube… Can It Really Earn Lakhs? FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme