
అధిక ఆదాయం పొందాలనే దురాశతో కొంతమంది యువత భారీగా నష్టపోతున్నారు. అవగాహన లేక.. ఏదో వ్యాపారంలో పెట్టుబడి పెట్టి అప్పుల పాలవుతున్నారు. సరైన మార్గం ఎంచుకోక దాచుకున్న డబ్బులను పోగొట్టుకుంటున్నారు. స్టాక్ మార్కెట్ లోనూ సరైన విధానంలో డబ్బులు మదుపు చేయకుండా నష్టాల పాలవుతున్నారు. స్టాక్ మార్కెట్ ను కూడా ఒక వ్యాపారంగా భావించి ముందుకు వెళ్తే కొంత వరకు నష్టాలను తగ్గించుకోవచ్చు. మరి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
అవగాహన తప్పనిసరి
Awareness is Essential
స్టాక్ మార్కెట్ అనేది ఒక ఆదాయ మార్గం. ఇందులో మదుపు చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. నిమిషాల్లో లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఏమాత్రం అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్ లో మదుపు చేస్తున్న యువత భారీగా నష్టపోతున్నారు. స్టాక్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు అత్యాశకు పోకూడదు. కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయాలి. ఎటువంటి ఎమోషన్స్‌కు గురికాకూడదు. అటు అత్యాశ కానీ అతి భయం కానీ లేకుండా మధ్యలో ఎవరైతే బ్యాలెన్స్ చేస్తారో వాళ్లు స్టాక్ మార్కెట్‌లో సంపద సృష్టించగలరని నిపుణులు చెబుతున్నారు.
డిసిప్లిన్, నాలెడ్జ్ ముఖ్యం
Discipline and Knowledge are Important
మనకి మంచి రిటర్న్స్ ని జనరేట్ చేయగలిగే వాటిల్లో ఒకటి రియల్ ఎస్టేట్.. రెండోది స్టాక్ మార్కెట్. రియల్ ఎస్టేట్ విషయంలోకి వచ్చేసరికి సమస్య ఏమిటంటే ఇక్కడ అధిక మొత్తంలో డబ్బులు కావాలి. కొన్ని లక్షల రూపాయలు ఉంటేనే ఒక భూమిని కొనగలుగుతాం. దాంతో కొంత వెల్త్ ని క్రియేట్ చేయగలుగుతాం. కానీ స్టాక్ మార్కెట్ విషయంలోకి వచ్చేసరికి ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే మీ దగ్గర ₹10 ఉన్నా గాని పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగని చెప్పి దాన్ని దుర్వినియోగం చేస్తే పనిష్మెంట్ తప్పదు. ఎక్కడైతే డిసిప్లిన్ ఉండదో.. ఎక్కడైతే నాలెడ్జ్ ఉండదో.. అక్కడ కచ్చితంగా డబ్బులు పోవటం ఖాయం.
According to SEBI Data..
గత సంవత్సరం సెబీ విడుదల చేసిన ఒక డేటా ప్రకారం దాదాపుగా 80 నుంచి 90 లక్షల మంది ఎఫ్ అండ్ వో ట్రేడింగ్ లో పార్టిసిపేట్ చేశారు. అందులో దాదాపుగా 93% మంది ట్రేడర్స్ డబ్బుల్ని కోల్పోయారు. వారు కోల్పోయిన డబ్బుల విలువ ఎంతంటే దాదాపుగా రూ. లక్షా 80వేల కోట్లు. రిటైలర్స్ అంటే మిగతా 7% మంది ఉన్నారు కదా వాళ్ళు ఏమైనా సంపాదించారా? అంటే అది కూడా లేదు. ఆ 7% మంది మొత్తం సంపాదించి ఉంటే గట్టిగా 20, 30 వేల కోట్ల రూపాయలు మాత్రమే. మిగతా డబ్బులన్నీ ఎక్కడికి పోయాయటే ప్రభుత్వానికి టాక్స్ ల రూపంలో ఒక పాతిక వేల కోట్లు వెళ్లిపోయింది. మిగతాదంతా ఎవరు తీసుకొని వెళ్ళిపోయారంటే బిగ్ ప్లేయర్స్. పెద్ద పెద్ద కంపెనీలు, ఫారెన్ ఇన్వెస్టర్స్ వాళ్ళు మన డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. ఇక్కడ ఇంకా దయనీయమైన పరిస్థితి ఏమిటంటే.. అత్యధికంగా డబ్బులు పోగొట్టుకున్న రాష్ట్రా ల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి. అసలు సౌత్ ఇండియా లోనే స్టాక్ మార్కెట్ కల్చర్ తక్కువ. ఇక్కడ తక్కువ మంది ట్రేడర్స్ ఉంటారు, నార్త్ ఇండియాలో ఎక్కువ మంది ఉంటారు. కానీ అధిక మొత్తంలో కోల్పోయింది ఎవరంటే సౌత్ ఇండియా వాళ్లే.. అయితే ఇక్కడ మనం ఒక చిన్న ఒక విషయం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. స్టాక్ మార్కెట్‌లో అత్యాశకు పోకూడదు.
మార్కెట్‌ను అర్థం చేసుకోవాలి
Understand the Market
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే సంపద సృష్టించొచ్చు అనే ఆలోచన తో చాలా మంది దానిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే కొంత టైం ట్రావెల్ చేసిన తర్వాత ఈ youtubeలు, వీటిల్లో చాలా వీడియోలు చూసి ట్రేడింగ్లో పెద్ద మొత్తంలో డబ్బులు పెడుతుంటారు. ఆప్షన్స్ ట్రేడింగ్, ఆప్షన్ బయింగ్ , ఆప్షన్ సెల్లింగ్ లోకి అడుగు పెడతారు. మొత్తం డబ్బులు పోయిన తర్వాత అప్పుడు తప్పు చేశామని బాధపడుతుంటారు. మార్కెట్ వెనకాల చాలా సైన్స్, మ్యాథ్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. దాన్ని మనం ప్రిడిక్ట్ చేయడానికి మనలో ఒక ఆర్ట్ ఉండాలి. దానికి చాలా ప్రాక్టీస్ ఉండాలి. మార్కెట్ లో ఉండే టెన్షన్ ను ఎవరు దాటుతారో వారు మాత్రమే డబ్బులు సంపాదించగలరు. అది అందరి వల్ల సాధ్యం కాదు. ఇన్వెస్ట్మెంట్ ని మేనేజ్ చేయడం తెలియకపోతే ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది. లేకుంటే తీవ్రంగా నష్టపోక తప్పదు. పీఎంఎస్ సర్వీసెస్, పోర్ట్ ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్, రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అని మనల్ని గైడ్ చేయడానికి ఆర్ఐఎస్ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైసర్స్ ఎన్నో ఉన్నాయి. ఎటువంటి నాలెడ్జ్ లేకుండా స్టాక్ మార్కెట్‌లోకి దిగకూడదు. ఎప్పుడైనా సరే వ్యక్తి కంటే సంస్థ గొప్పది. సంస్థ కంటే వ్యవస్థ గొప్పది. అయితే వ్యక్తి తప్పు చేస్తాడు కానీ సంస్థ. వ్యవస్థ తప్పు చేయదు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అవగాహన లోపం వల్ల మిస్ హ్యాండిల్ చేసి లక్షల రూపాయలను పోగొట్టుకోవద్దు. అప్పులు చేసి ట్రేడింగ్ లో పెట్టబడులు పెట్టడం అస్సలు మంచిది కాదు.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి
Take These Precautions in stock markets
స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం రిస్క్‌తో కూడుకున్నప్పటికీ, సరైన వ్యూహాలతో ముందుకెళ్తే దీర్ఘకాలికంగా మంచి లాభాలను అందించగలదు. మార్కెట్లో పెట్టుబడులకు ముందు సమగ్ర పరిశోధన, మదుపరుల అవగాహన, సరైన వ్యూహాలు అనుసరించడం చాలా ముఖ్యం. మార్కెట్‌లో స్థిరమైన .. (ఉత్తమ ప్రదర్శన కలిగిన) కంపెనీల స్టాక్స్ కొనుగోలు చేయడం ఉత్తమం. వాటివల్ల రిస్క్ తక్కువగా ఉంటుంది. దీర్ఘకాలంలో మంచి రాబడులు వస్తాయి. స్టాక్ మార్కెట్ ను నేరుగా అర్థం చేసుకోలేని వారికి మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపిక. SIP ద్వారా ప్రతి నెలా చిన్న మొత్తాల్లో పెట్టుబడి పెట్టి రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. మార్కెట్ పతనమైనా, మళ్లీ పెరగ గల అవకాశాలు ఉంటాయి. దీర్ఘకాలంలో మంచి లాభాలు సాధించవచ్చు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు, అన్ని పెట్టుబడులను ఒకే రంగానికి పరిమితం చేయకూడదు. IT, బ్యాంకింగ్, ఆరోగ్యరంగం, FMCG, ఎనర్జీ తదితర రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి. తద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. ఒక్క రంగం నష్టపోతే, మరొక రంగం లాభాల్లో ఉండే అవకాశం ఉంటుంది. మార్కెట్‌లో స్టాక్స్ ఎప్పుడైనా పెరుగుతాయి.. ఎప్పుడైనా తగ్గుతాయి. వీటిని అర్థం చేసుకోవడం ముఖ్యం. ఫండమెంటల్ & టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం స్టాక్స్ ఎంపిక చేయడం ఉత్తమం. మార్కెట్ ట్రెండ్స్, కంపెనీ పెర్ఫార్మెన్స్ విశ్లేషణ చేసుకుని పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలను తగ్గించుకోవచ్చు. కొంతమంది మదుపర్లు తక్కువ రిస్క్‌తో నియమితంగా డివిడెండ్స్ ఇచ్చే కంపెనీల్లో పెట్టుబడి పెడతారు. ఇవి స్థిరమైన ఆదాయాన్ని అందించడమే కాకుండా, మార్కెట్ మార్పులను అధిగమించేందుకు సహాయపడతాయి. స్టాక్ మార్కెట్‌లో అతిగా ఆశపడి పెట్టుబడి పెట్టడం ప్రమాదకరం. స్టాప్ లాస్ (Stop Loss) సెట్ చేసుకోవడం ద్వారా నష్టాలను నివారించుకోవచ్చు. పెట్టుబడి పెట్టే ముందు రిస్క్‌కు అనుగుణంగా వ్యూహం సిద్ధం చేసుకోవాలి. స్టాక్ మార్కెట్‌లో కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునేవారు.. పెట్టుబడి లక్ష్యాలను బట్టి సరైన మార్గాలను ఎంచుకోవాలి.