మార్కెట్లో చాలా మంది ట్రేడర్స్, ఇన్వెస్టర్స్ ఎదుర్కొనే ఒక ప్రధాన సమస్య “ఎందుకు నా స్టాప్ లాస్ మాత్రమే హిట్ (Stoploss Hit) అవుతుంది?” అనే సందేహం. చాలాసార్లు మనం సరైన అనాలిసిస్ చేసినా కూడా మార్కెట్ మనకు విరుద్ధంగా కదిలి, మన పొజిషన్‌ను స్టాప్ అవుట్ చేసి తర్వాత మన ఊహించిన దిశలోనే వెళ్లిపోతుంది. దీనికి ముఖ్య కారణం “లిక్విడిటీ” , “లిక్విడిటీ స్వీప్” అనే కాన్సెప్ట్స్. అసలు లిక్విడిటీ అంటే ఏమిటి? మార్కెట్లో పెద్ద ప్లేయర్స్ ఎలా పని చేస్తారు? రీటైల్ ట్రేడర్స్ ఎలా ట్రాప్ అవుతారు? ఈ ట్రాప్స్ నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
లిక్విడిటీ అంటే అసలు ఏమిటి? What Exactly is Liquidity?
లిక్విడిటీ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్. ఒక ఆస్తిని (షేర్, ఇండెక్స్, క్రిప్టో) కొనడానికి లేదా అమ్మడానికి మార్కెట్లో ఎదురుగా సరిపడా బయ్యర్స్, సెల్లర్స్ ఉండటం. ఉదాహరణకి, మీ దగ్గర 10,000 షేర్స్ ఉన్నాయని అనుకుందాం. మీరు వాటిని అమ్మాలంటే, మార్కెట్లో 10,000 షేర్స్ కొనడానికి సిద్ధంగా ఉన్న బయ్యర్స్ ఉండాలి. ఈ మ్యాచ్ జరిగితే దాన్ని లిక్విడిటీ అంటారు. కానీ రియల్ మార్కెట్లో ఇంత సింపుల్‌గా ఉండదు. చాలా సార్లు బయ్యర్స్ లేదా సెల్లర్స్ సరిపడా ఉండరు. అప్పుడు పెద్ద ప్లేయర్స్ (Institutional Traders, Hedge Funds, Market Makers) లిక్విడిటీని “క్రియేట్” చేస్తారు.
లిక్విడిటీ లేయర్స్ ఎలా ఉంటాయి? Layers of Liquidity in the Market
మార్కెట్లో లిక్విడిటీ ఒక్క లెవెల్లో ఉండదు. ఇది చాలా లేయర్స్‌లో ఉంటుంది.
స్టాప్ లాస్ లిక్విడిటీ (Stoploss Hit)– ఎక్కువగా రీటైలర్స్ పెట్టే స్టాప్ లాస్‌లు
బ్రేక్ అవుట్ లిక్విడిటీ – రెసిస్టెన్స్ పై కొనుగోలు చేసే ట్రేడర్స్
బ్రేక్ డౌన్ లిక్విడిటీ – సపోర్ట్ కింద సెల్ చేసే ట్రేడర్స్
రౌండ్ నంబర్ లిక్విడిటీ – 23000, 24000 లాంటి లెవెల్స్
ఓపెన్ ఇంటరెస్ట్ (OI) లెవెల్స్ – ఆప్షన్స్ డేటా ఆధారంగా ఉన్న జోన్స్. ఈ అన్ని చోట్ల పెద్ద మొత్తంలో ఆర్డర్స్ ఉంటాయి. ఇవే మార్కెట్ మూవర్స్‌కు టార్గెట్.
మార్కెట్ మూవర్స్ ఎలా పని చేస్తారు? How Market Movers Operate?
పెద్ద ప్లేయర్స్ ఒక పెద్ద పొజిషన్ తీసుకోవాలంటే వారికి భారీ లిక్విడిటీ అవసరం. అంటే చాలా మంది ట్రేడర్స్ ఎదురుగా ఉండాలి. అందుకే వారు ఇలా చేస్తారు. ఫేక్ బ్రేక్ అవుట్స్ క్రియేట్ చేస్తారు. ఫేక్ బ్రేక్ డౌన్స్ చేస్తారు. మార్కెట్లో ఫోమో (FOMO) లేదా భయం సృష్టిస్తారు. ఉదాహరణకు, ఒక స్టాక్ రెసిస్టెన్స్ దగ్గర ఉందనుకోండి. వారు కొంచెం పైకి నెట్టేస్తారు. రీటైలర్స్ బ్రేక్ అవుట్ అనుకుని కొనుగోలు చేస్తారు . వెంటనే ప్రైస్ కిందకి తీసుకువస్తారు . స్టాప్ లాస్ హిట్ (Stoploss Hit)అవుతుంది. ఇదే లిక్విడిటీ స్వీప్.
రీటైలర్స్ ఎలా ట్రాప్ అవుతారు? How Retail Traders Get Trapped?
ముఖ్యంగా (Stoploss Hit)ఈ పరిస్థితుల్లో ట్రాప్స్ ఎక్కువగా జరుగుతాయి. బ్రేక్ అవుట్ దగ్గర వెంటనే ఎంట్రీ తీసుకోవడం. రీటెస్ట్ కోసం వెయిట్ చేయకపోవడం. రౌండ్ లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ పెట్టడం. కన్సాలిడేషన్ జోన్స్‌లో ట్రేడ్ చేయడం ఉదాహరణకు.. మార్కెట్ ఒక రెసిస్టెన్స్ బ్రేక్ చేసిందనకుందాం . ఆ సమయంలో మీరు వెంటనే కొనుగోలు చేస్తే ప్రైస్ కిందకి వచ్చిందనుకుందాం. మీ స్టాప్ లాస్ హిట్ (Stoploss Hit) తర్వాత మార్కెట్ పైకి వెళ్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు . ఇది ప్లాన్ చేసిన లిక్విడిటీ గ్రాబ్.
లిక్విడిటీ స్వీప్ అంటే ఏమిటి? What is a Liquidity Sweep?
లిక్విడిటీ స్వీప్ అంటే మార్కెట్లో ఉన్న స్టాప్ లాస్‌లు (Stoploss Hit), పెండింగ్ ఆర్డర్స్ అన్నీ ఒకేసారి హిట్ చేసి, పెద్ద ప్లేయర్స్ తమ పొజిషన్‌ను బిల్డ్ చేసుకుంటారు. ఇది సాధారణంగా ఇలా జరుగుతుంది. మార్కెట్ ఒక రేంజ్లో ఉండగా.. అకస్మాత్తుగా బ్రేక్ అవుట్ లేదా బ్రేక్ డౌన్ అవుతుంది. రిటైలర్స్ ఎంట్రీ తో ప్రైస్ రివర్స్ అవుతుంది. స్టాప్ లాస్‌లు హిట్ (Stoploss Hit) అవుతాయి. అప్పుడు పెద్ద మూవ్ ప్రారంభమవుతుంది.
చార్ట్‌లో లిక్విడిటీ ఎలా గుర్తించాలి? How to Identify Liquidity on Charts ?
మీరు చార్ట్‌లో ఈ సిగ్నల్స్ గమనించాలి. విక్లు ఎక్కువగా ఉండే క్యాండిల్స్. ఫేక్ బ్రేక్ అవుట్స్. రేంజ్ బౌండ్స్ దగ్గర ఎక్కువ మూవ్మెంట్. హామర్ / షూటింగ్ స్టార్ ట్రాప్స్. కన్సాలిడేషన్ తర్వాత సడన్ మూవ్. ప్రత్యేకంగా “Wick Hunting” అంటే స్టాప్ లాస్ హిట్స్ చాలా క్లియర్ సిగ్నల్.
మనల్ని మనం ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి? How to Protect Yourself as a Trader
సేఫ్ గార్డ్ ఎలా చేసుకోవాలనేది చాలా ముఖ్యమైన భాగం. తొలుత రీటెస్ట్ కోసం వెయిట్ చేయాలి. బ్రేక్ అవుట్ వెంటనే ఎంట్రీ తీసుకోకూడదు. రీటెస్ట్ వచ్చిన తర్వాతే ట్రేడ్ చేయాలి. ఆ తర్వాత జూమ్ అవుట్ చేసి చార్ట్ చూడాలి. కేవలం చిన్న టైమ్ ఫ్రేమ్ కాదు. పెద్ద టైమ్ ఫ్రేమ్ సపోర్ట్, రెసిస్టెన్స్ కూడా చూడాలి. రౌండ్ లెవెల్స్ వద్ద జాగ్రత్త పడాలి. 23000, 24000 లాంటి లెవెల్స్ దగ్గర స్టాప్ లాస్ (Stoploss Hit) పెట్టడం తప్పు. కన్సాలిడేషన్ జోన్స్‌లో ట్రేడ్ చేయకూడదు. ఇక్కడే ఎక్కువ ట్రాప్స్ జరుగుతాయి. స్టాప్ లాస్‌ను (Stoploss Hit) లాజికల్‌గా పెట్టాలి. అందరూ పెట్టే చోట కాకుండా.. కొంచెం డీప్ లెవెల్లో పెట్టాలి.
పెద్ద ప్లేయర్స్ సైకాలజీ ఏమిటి? Psychology of Market Movers
“ఎక్కడ ఎక్కువ మంది ట్రేడర్స్ ఉన్నారు?”, “ఎక్కడ స్టాప్ లాస్ (Stoploss Hit)లు ఉన్నాయి?” “ఎక్కడ ఫోమో క్రియేట్ చేయొచ్చు?” అని పెద్ద ప్లేయర్స్ ఆలోచిస్తారు.. వాళ్లు మార్కెట్‌ని కదిలించేది ప్రైస్ కోసం కాదు .. లిక్విడిటీ కోసం. లిక్విడిటీ అనేది మార్కెట్లో అత్యంత ముఖ్యమైన కాన్సెప్ట్. ఇది అర్థమైతే మీరు ట్రాప్స్‌లో పడరు. మీ స్టాప్ లాస్‌లు పెద్ద ప్లేయర్స్ అయితే ఇలా ఆలోచిస్తారు.. సేఫ్‌గా ఉంటాయి. మీరు మార్కెట్ మూవ్‌ను ముందే అంచనా వేయగలుగుతారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే .. మార్కెట్ మీకు వ్యతిరేకంగా కదలడం కాదు, అది లిక్విడిటీ కోసం కదులుతుంది. మీరు కూడా అదే గేమ్ అర్థం చేసుకుని ట్రేడ్ చేస్తే, మీరు ట్రాప్ అయ్యే రీటైలర్ కాదు… స్మార్ట్ ట్రేడర్ అవుతారని నిపుణులు సూచిస్తు న్నారు.
