రిఫండ్లపై భయం అక్కర్లేదు… కొత్త పన్ను చట్టంలో స్పష్టత ఇచ్చిన సీబీడీటీ.. No Worries on Refunds… CBDT Clarifies Amid New Tax Law Transition
దేశంలో పన్ను వ్యవస్థలో ఒక పెద్ద మార్పుకు రంగం సిద్ధమవుతోంది. దాదాపు ఆరు దశాబ్దాలుగా అమలులో ఉన్న ఆదాయపు పన్ను చట్టం-1961 స్థానంలో, కొత్తగా ఆదాయపు పన్ను చట్టం-2025 అమల్లోకి రానుంది. 2026 ఏప్రిల్ 1 నుంచి ఈ చట్టం అమల్లోకి రానున్న నేపథ్యంలో, పన్ను చెల్లింపుదారుల్లో ఒక విధమైన ఆందోళన నెలకొంది. ముఖ్యంగా పాత చట్టం కింద దాఖలు చేసిన రిటర్నులు, ఇంకా అందని రిఫండ్లు (No Worries on Refunds) ఏమవుతాయో అన్న సందేహాలు…

