Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు! Good News for Gold Buyers: Gold Prices Drop Sharply! FEATURE NEWS
  • ఐటీ షేర్లను క్షణాల్లో కూల్చేసిన ఏఐ.. AI Shock Rocks IT Stocks FEATURE NEWS
  • ఎన్ఆర్ఐలూ ఇండియాకు వ‌చ్చేట‌ప్పుడు ఇలా చేయండి.. లక్షల్లో జరిమానాలు తప్పించుకోండి! Avoid Paying Lakhs of Fines | Telugu NRI’s Fix this in your next Visit FEATURE NEWS
  • Why are People spending less ప్రజలు ఎందుకు తక్కువ ఖర్చు చేస్తున్నారు FEATURE NEWS
  • త్వరలో ఏకంగా 42 శాతం వరకు లాభం! 5 బెస్ట్ హోసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ ఇవే.. ! Up to 42% Returns Ahead! Here Are the 5 Best Housing Finance Stocks FEATURE NEWS
  • గత బడ్జెట్ నుంచి ఇప్పటివరకు 363% పెరిగిన మల్టీబ్యాగర్ స్టాక్ Multi-Bagger Stock Surges 363% Since Last Budget FEATURE NEWS
  • పీఎస్‌బీలు నాలుగే ఉంటాయా? బ్యాంకులను ప్ర‌భుత్వం విలీనం చేస్తుందా? Will PSBs Shrink to Just Four? Is the Government Planning Another Big Bank Merger? FEATURE NEWS
  • అమ్మో.. అన్ని బ్యాంకు అకౌంట్లా how many bank accounts can a person have FEATURE NEWS
  • వేచి చూసే వారిదే `స్టాక్ మార్కెట్‌` FEATURE NEWS
  • ఏటీఎం, యూపీఐ ద్వారా PF విత్‌ డ్రాకు కొత్త డెడ్‌లైన్‌..New Deadline for PF Withdrawal via ATM and UPI FEATURE NEWS

భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందం .. జోష్‌లో మార్కెట్లు .. India–US Trade Deal Boosts Market Sentiment

Posted on 10/02/2026 By admin No Comments on భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందం .. జోష్‌లో మార్కెట్లు .. India–US Trade Deal Boosts Market Sentiment

భారత్‌–అమెరికా మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ( India–US Trade Deal ) దేశీయ స్టాక్‌ మార్కెట్లకు కొత్త ఉత్సాహం నింపింది. టారిఫ్‌లపై నెలకొన్న అనిశ్చితులు తొలగిపోవడంతో పెట్టుబడిదారుల విశ్వాసం బలపడింది. దీనికి తోడు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) మళ్లీ కొనుగోళ్లకు దిగడంతో మార్కెట్లు జోరుగా ముందుకుసాగాయి. ఈ ప్రభావంతో వరుసగా రెండో రోజూ దేశీయ సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈలో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ ఒక్కరోజులోనే రూ.6.03 లక్షల కోట్లు పెరగడం గమనార్హం. మొత్తంగా వాణిజ్య ఒప్పందం, ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు, బ్యాంకింగ్‌ రంగ బలం కలిసి దేశీయ మార్కెట్లను మళ్లీ లాభాల బాట పట్టించాయని విశ్లేషకులు చెబుతున్నారు.

ఎఫ్‌ఐఐల కొనుగోళ్లు బలం..FII Buying Lends Strength to Markets
( India–US Trade Deal ) ఈ రోజు ట్రేడింగ్‌లో ఎఫ్‌ఐఐలు రూ.2,254.64 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐలు) కూడా రూ.4.15 కోట్ల కొనుగోళ్లతో మార్కెట్‌కు మద్దతు ఇచ్చారు.

పీఎస్‌యూ బ్యాంకుల రాణింపు..PSU Banks Shine
( India–US Trade Deal ) ప్రభుత్వ రంగ బ్యాంకులు అంచనాల కంటే మెరుగైన పనితీరు చూపుతున్నాయన్న అంచనాలతో పీఎస్‌యూ బ్యాంక్‌ సూచీ భారీగా రాణించింది. బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్ల ఊపు పెరగడంతో మొత్తం మార్కెట్‌కు బలం చేకూరింది.

రూపాయి స్వల్ప బలహీనత.. Rupee Slips Marginally
అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో డాలరుతో పోలిస్తే రూపాయి ఒక పైసా బలహీనపడి 90.66 వద్ద ముగిసింది.

ముడిచమురు ధరలు తగ్గుదల.. Crude Oil Prices Ease
అంతర్జాతీయ మార్కెట్లో ( India–US Trade Deal ) బ్రెంట్‌ ముడి చమురు ధర బ్యారెల్‌కు 0.81 శాతం తగ్గి 67.52 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది దేశీయ ద్రవ్యోల్బణంపై కొంత ఊరట కలిగించే అంశంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు.. Support from Global Markets
ఆసియా మార్కెట్లలో( India–US Trade Deal ) జపాన్‌, దక్షిణ కొరియా, షాంఘై, హాంకాంగ్‌ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లు కూడా ఇదే సానుకూల ధోరణిలో ట్రేడవుతున్నాయి.

సూచీల రాణింపు.. Benchmark Indices Rally
సెన్సెక్స్‌ ఉదయం 84,177.51 పాయింట్ల వద్ద సానుకూలంగా ప్రారంభమైంది (క్రితం ముగింపు 83,580.40). ట్రేడింగ్‌ సమయంలో ఒక దశలో 83,860.42 పాయింట్ల కనిష్ఠాన్ని, మరోవైపు 84,314.68 పాయింట్ల గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 485.35 పాయింట్ల లాభంతో 84,065.75 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 50 కూడా 173.60 పాయింట్లు పెరిగి 25,867.30 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఈ సూచీ 25,780.90 – 25,922.25 పాయింట్ల మధ్య కదలాడింది.

సెన్సెక్స్‌లో షేర్ల ప్రదర్శన.. Stock Performance on the Sensex
సెన్సెక్స్‌లోని 30 షేర్లలో 22 లాభాల్లో ముగిశాయి. ఎస్‌బీఐ షేరు 7.46 శాతం లాభపడగా, టైటన్‌ 2.78%, టాటా స్టీల్‌ 2.56%, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 2.52%, ఎటర్నల్‌ 1.91%, బీఈఎల్‌ 1.85%, కోటక్‌ బ్యాంక్‌ 1.52%, ట్రెంట్‌ 1.30% చొప్పున పెరిగాయి. అయితే పవర్‌గ్రిడ్‌ 1.11%, ఐటీసీ 1.07%, ఎన్‌టీపీసీ 0.89%, ఐసీఐసీఐ బ్యాంక్‌ 0.68%, ఇన్ఫోసిస్‌ 0.65% మేర నష్టపోయాయి.

ఫలితాలతో షేర్ల ఊపు.. Earnings Boost Stock Momentum
త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో జేకే టైర్‌ షేరు 2.42% లాభపడి రూ.555.50 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఒక దశలో ఈ షేరు 6.91% పెరిగి రూ.579.90 స్థాయిని తాకడం విశేషం. డిసెంబరు త్రైమాసికంలో లాభం 90.36 శాతం పెరిగి రూ.416.29 కోట్లకు చేరడంతో కల్యాణ్‌ జువెలర్స్‌ షేరు 15.26% ఎగసి రూ.437.75 వద్ద ముగిసింది.

కార్పొరేట్‌ అప్‌డేట్స్‌.. Corporate Updates
– దేశవ్యాప్తంగా లాజిస్టిక్స్‌ హబ్‌లలో విద్యుత్‌ వాహనాల (ఈవీ) ఛార్జింగ్‌ మౌలిక సదుపాయాలను విస్తరించేందుకు జియో-బీపీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూలర్‌ మోటార్స్‌ వెల్లడించింది.
– యూనికార్న్‌ సంస్థ జెట్వెర్క్‌ ఎలక్ట్రానిక్స్‌ వ్యాపార అధిపతి జోష్‌ ఫౌల్గర్‌ రాజీనామా చేసి, పోటీ సంస్థ డిక్సన్‌ టెక్నాలజీస్‌ అనుబంధ కంపెనీ పాడ్జెట్‌ ఎలక్ట్రానిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో చేరినట్లు నియంత్రణ సంస్థలకు సమాచారం అందింది.
– ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ బిజినెస్‌ ఫైనాన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా విపిన్‌ కపూరియా, మానవ వనరుల వైస్‌ ప్రెసిడెంట్‌గా యోగితా షాన్‌బాగ్‌లను నియమించింది. ఈ నియామకాలు వెంటనే అమల్లోకి వచ్చాయి.

ఐపీఓల స్పందన ఇలా.. IPO Response at a Glance
ఆయ్‌ ఫైనాన్స్‌ ఐపీఓకు మొదటి రోజు 12 శాతం మాత్రమే స్పందన లభించింది. ఫ్రాక్టల్‌ అనాలిటిక్స్‌ ఐపీఓకు తొలి రోజే 9 శాతం స్పందన నమోదు అయింది.

ఎస్‌బీఐ అదుర్స్‌.. SBI Steals the Show
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మరోసారి తన సత్తాను చాటింది. గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక త్రైమాసిక లాభాన్ని నమోదు చేయడంతో బ్యాంక్‌ షేరు మార్కెట్లో జోరుగా దూసుకెళ్లింది. ఈ సానుకూల ఫలితాల ప్రభావంతో బీఎస్‌ఈలో ఎస్‌బీఐ షేరు 7.46 శాతం లాభపడి రూ.1,145.95 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ సమయంలో ఒక దశలో రూ.1,148 స్థాయిని కూడా తాకింది. ఇది షేరుకు 52 వారాల గరిష్ఠ స్థాయి కావడం విశేషం. బ్యాంక్‌ ఆస్తుల నాణ్యత మెరుగుపడటం, ఎన్‌పీఏలు నియంత్రణలో ఉండటం, వడ్డీ ఆదాయం పెరగడం వంటి అంశాలు లాభాలు పెరగడానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. అంతేకాదు, రిటైల్‌ రుణాలు, కార్పొరేట్‌ లోన్లలో స్థిరమైన వృద్ధి కనిపించడం కూడా బ్యాంక్‌ పనితీరుకు బలాన్నిచ్చింది. ఎస్‌బీఐ ఫలితాలు అంచనాలకన్నా మెరుగ్గా ఉండటంతో పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది. దీని ప్రభావంతో బ్యాంకింగ్‌ రంగంలోని ఇతర ప్రభుత్వ రంగ బ్యాంక్‌ షేర్లలోనూ కొనుగోళ్ల ఊపు కనిపించింది. మొత్తంగా రికార్డు లాభాలు, బలమైన ఆర్థిక ప్రదర్శన కారణంగా ఎస్‌బీఐ షేరు మరోసారి మార్కెట్‌కు నాయకత్వం వహించిందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఇండియాకు ఎంత లాభం? భవిష్యత్తులో ముప్పులేంటి? How Much Does India Gain? What Are the Future Risks?
భారత్‌–అమెరికా మధ్య తాజాగా కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం దేశ ఆర్థిక రంగంలో కీలక చర్చకు దారి తీసింది. టారిఫ్‌లపై నెలకొన్న అనిశ్చితులకు కొంతవరకు చెక్‌ పడటంతో మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. అయితే ఇది దీర్ఘకాలంలో భారత్‌కు పూర్తిస్థాయి లాభాన్ని ఇస్తుందా? లేక కొన్ని రంగాల్లో సవాళ్లను తెచ్చిపెడుతుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ముందుకు వస్తున్నాయి.

ఒప్పందంతో తక్షణ లాభాలు.. Immediate Gains from the Deal
ఈ మధ్యంతర ఒప్పందం వల్ల భారత్‌–అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు స్థిరపడే అవకాశాలు పెరిగాయి. ముఖ్యంగా స్టీల్‌, టెక్స్టైల్స్‌, ఆటో విడిభాగాలు, ఫార్మా వంటి రంగాలపై అమెరికా విధించిన లేదా విధించబోయే టారిఫ్‌లపై స్పష్టత రావడం పెట్టుబడిదారులకు ఊరటనిచ్చింది. దీంతో ఎగుమతిదారుల్లో నమ్మకం పెరిగింది విదేశీ పెట్టుబడులు (ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ) మళ్లీ భారత్‌వైపు మొగ్గు చూపే పరిస్థితి ఏర్పడింది. దేశీయ మార్కెట్లు ఉత్సాహంగా స్పందించాయి

తయారీ, ఉపాధికి దోహదం.. Boost to Manufacturing and Jobs
అమెరికా కంపెనీలు చైనా ప్రత్యామ్నాయంగా భారత్‌ను చూస్తున్న నేపథ్యంలో, ఈ ఒప్పందం ‘మేక్‌ ఇన్‌ ఇండియా’కి బలం చేకూర్చే అవకాశం ఉంది. ఎలక్ట్రానిక్స్‌, సెమీకండక్టర్లు, డిఫెన్స్‌, గ్రీన్‌ ఎనర్జీ వంటి రంగాల్లో పెట్టుబడులు పెరిగితే ఉపాధి అవకాశాలు కూడా విస్తరించనున్నాయి.

అయితే.. సవాళ్లు లేకపోలేవు.. However, Challenges Remain
మధ్యంతర ఒప్పందం కావడంతో ఇది పూర్తిస్థాయి ఫ్రీ ట్రేడ్‌ అగ్రిమెంట్‌ కాదు. భవిష్యత్తులో చర్చలు క్లిష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగావ్యవసాయ రంగంలో భారత్‌ తన మార్కెట్‌ను మరింతగా తెరవాల్సిన ఒత్తిడి, డెయిరీ, జీఎంఓ ఉత్పత్తులపై అమెరికా డిమాండ్లు, డిజిటల్‌ ట్యాక్స్‌, డేటా లోకలైజేషన్‌ వంటి అంశాల్లో విభేదాలు.. ఇవన్నీ భారత్‌కు సున్నితమైన విషయాలే. వీటిలో తగిన సమతౌల్యం పాటించకపోతే దేశీయ రైతులు, చిన్న పరిశ్రమలకు నష్టం కలిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

దీర్ఘకాలంలో భారత్‌కు ఏం అవసరం? What Does India Need in the Long Term?
వాణిజ్య ఒప్పందాలను కేవలం మార్కెట్‌ లాభాల కోణంలో కాకుండా దేశీయ ఆర్థిక ప్రయోజనాలు, ఉపాధి, స్వదేశీ పరిశ్రమల రక్షణ కోణంలో చూడాల్సిన అవసరం ఉంది. అమెరికాతో సంబంధాలు బలపడటం మంచిదే అయినా, జాతీయ ప్రయోజనాలకు భంగం కలగకుండా ఒప్పందాలను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది.

మార్కెట్ల దృష్టిలో మాత్రం సానుకూలమే.. Markets Remain Optimistic
ప్రస్తుతానికి ఈ ఒప్పందాన్ని మార్కెట్లు సానుకూల సంకేతంగా చూస్తున్నాయి. టారిఫ్‌ భయాలు తగ్గడం, విదేశీ పెట్టుబడులు పెరిగే సూచనలు కనిపించడం వల్ల తక్షణ లాభాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తంగా మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారత్‌కు తక్షణ ఊరటను, అవకాశాలను ఇచ్చింది. కానీ దీర్ఘకాల లాభం మాత్రం భవిష్యత్తు చర్చల తీరు, ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటుంది.

3
FEATURE NEWS Tags:Benchmark Indices Rally, Boost to Manufacturing and Jobs, Challenges Remain, Corporate Updates, Crude Oil Prices Ease, Earnings Boost Stock Momentum, FII Buying Lends Strength to Markets, How Much Does India Gain? What Are the Future Risks?, However, Immediate Gains from the Deal, IPO Response at a Glance, Markets Remain Optimistic, PSU Banks Shine, Rupee Slips Marginally, SBI Steals the Show, Stock Performance on the Sensex, Support from Global Markets, What Does India Need in the Long Term?

Post navigation

Previous Post: మళ్లీ పెరిగిన‌ బంగారం, వెండి ధరలు.. Gold and Silver Prices Rise Again
Next Post: రూపాయి నాణెం వెనుక ఉన్న ఆసక్తికర ఆర్థిక లెక్క ..! నష్టం వస్తున్నా ప్రభుత్వం ఎందుకు ముద్రిస్తోంది? The Interesting Economics Behind the One-Rupee Coin: Why Is the Government Minting Despite Losses?

Related Posts

  • 10 ఏళ్లలో రూ. కోటి కావాలంటే ఎంత SIP చేయాలి? How Much SIP Do You Need to Make ₹1 Crore in 10 Years? FEATURE NEWS
  • మళ్లీ పెరిగిన‌ బంగారం ధర …Gold Prices Rise Again FEATURE NEWS
  • బడ్జెట్లో రూ. 12.21 లక్షల కోట్లు కేటాయింపు.. పరుగులు పెట్టనున్న భారత ఆర్థిక వ్యవస్థ ..₹12.21 Trillion Allocation in Budget: Indian Economy Set to Accelerate FEATURE NEWS
  • స్టాక్ ట్రేడింగ్ లో చార్జీలు ఎంతో తెలుసా..? FEATURE NEWS
  • వెనిజులాపై అమెరికా దాడి…భారత స్టాక్ మార్కెట్‌పై ప్రభావం ఎంత? US Strikes on Venezuela… How Will the Indian Stock Market Be Affected? FEATURE NEWS
  • ట్రేడ‌ర్లూ.. ఇవి త‌ప్ప‌నిస‌రి FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • రూపాయి నాణెం వెనుక ఉన్న ఆసక్తికర ఆర్థిక లెక్క ..! నష్టం వస్తున్నా ప్రభుత్వం ఎందుకు ముద్రిస్తోంది? The Interesting Economics Behind the One-Rupee Coin: Why Is the Government Minting Despite Losses?
  • భారత్‌–అమెరికా వాణిజ్య ఒప్పందం .. జోష్‌లో మార్కెట్లు .. India–US Trade Deal Boosts Market Sentiment
  • మళ్లీ పెరిగిన‌ బంగారం, వెండి ధరలు.. Gold and Silver Prices Rise Again
  • క్రెడిట్ కార్డ్ వినియోగిస్తున్నారా? అయితే ఈ చార్జీల గురించి తెలుసుకోండి! Are You Using a Credit Card? Then Be Aware of These Hidden Charges!
  • కీలక రేట్లు యథాతథం… డిజిటల్‌ మోసాల బాధితులకు ఊరట, ఎంఎస్‌ఎమ్‌ఈలకు భారీ భరోసా.. ప్ర‌క‌టించిన ఆర్‌బీఐ Key Rates Unchanged… RBI Announces Relief for Digital Fraud Victims, Big Boost for MSMEs
  • రాగిలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చా? Can You Invest in Copper Too?
  • దిగొచ్చిన వెండి, ప‌సిడి ధ‌ర‌లు.. ! ఇది ఒక తాత్కాలిక ‘హెల్తీ కరెక్షన్’ మాత్రమేనా? Falling Silver and Gold Prices: Is This Just a Temporary ‘Healthy Correction’?
  • ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఆంథ్రోపిక్‌ ప్రకంపనలు..! ఇక కంపెనీల‌కు మానవ వనరుల అవసరం ఉంటుందా? Anthropic Shockwaves Rock the Global Tech Industry: Will Companies Still Need Human Resources?
  • ఐటీ షేర్లను క్షణాల్లో కూల్చేసిన ఏఐ.. AI Shock Rocks IT Stocks
  • అమల్లోకి వచ్చిన బ్యాగేజీ నిబంధనలు–2026 … New Baggage Rules 2026 Implemented
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Caution is Essential Compared to Other Countries… Convenience Current Situation Direct Equity Drawbacks Expert Advice Future Outlook Geopolitical Tensions how To get financial freedom Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Key Recommendations Market Expansion Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Recommendations for Investors Right Decisions Are the Key Security square off Stock Market Systematic Investment Plans (SIP) Tips for Investors what are the best financial rules What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

February 2026
S M T W T F S
1234567
891011121314
15161718192021
22232425262728
« Jan    
  • హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో చేయకూడని ముఖ్యమైన పొరపాట్లు | హెల్త్ ఇన్స్యూరెన్స్ కొనడానికి ఉత్తమ సమయం Top Health Insurance Mistakes to Avoid | Best Time to Buy Health Insurance INSURANCE
  • IPO అంటే ??? MARKET
  • ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఆంథ్రోపిక్‌ ప్రకంపనలు..! ఇక కంపెనీల‌కు మానవ వనరుల అవసరం ఉంటుందా? Anthropic Shockwaves Rock the Global Tech Industry: Will Companies Still Need Human Resources? FEATURE NEWS
  • ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ బుక్ స‌మ‌రీ The science of getting rich book summery telugu BOOKS
  • ఎల్ఐసీ కొత్త పాల‌సీ.. ఒకసారి కడితే జీవితాంతం ఆదాయం LIC New Policy: Pay Once, Get Lifetime Income INSURANCE
  • కార్పొరేట్ ఎఫ్ డీ లాభమేనా..? corporate FDs are profitable or not FINICAL PLANNING
  • పీఎస్‌బీలు నాలుగే ఉంటాయా? బ్యాంకులను ప్ర‌భుత్వం విలీనం చేస్తుందా? Will PSBs Shrink to Just Four? Is the Government Planning Another Big Bank Merger? FEATURE NEWS
  • స్టాక్ మార్కెట్ లాభాల‌పై ఇన్కం ట్యాక్స్ ఉంటుందా..? FEATURE NEWS

Copyright © 2026 .

Powered by PressBook News Dark theme