పెట్టుబడులు అంటే కేవలం డబ్బు పెట్టడం మాత్రమే కాదు.. మన ఆలోచనా విధానం, నిర్ణయశక్తి, ఓర్పు అన్నీ కలిసి పనిచేయాల్సిందే. చాలా మంది మార్కెట్‌లో రిస్క్ భయంతో దూరంగా ఉంటే, కొందరు అదృష్టాన్ని నమ్మి పెట్టుబడులు పెడతారు. కొందరు మార్కెట్ కాస్త పెరిగిందంటే ఉత్సాహంతో కొనుగోలు చేస్తారు.. పడిపోయిందంటే భయంతో అమ్మేస్తారు. గెయిన్–లాస్ భావోద్వేగాలే వారి నిర్ణయాలకు ఆధారం. దీర్ఘకాలిక లాభాలు కన్నా తక్షణ స్పందనలతోనే వ్యవహరిస్తారు. ఈ తరహా ఇన్వెస్టర్లు మార్కెట్ గ్రాఫులు, కంపెనీ ఫండమెంటల్స్, గత పనితీరు అన్నీ పరిశీలిస్తారు. ఎప్పుడు ఎక్కడ పెట్టుబడి పెట్టాలో గణాంకాల ఆధారంగా నిర్ణయిస్తారు. భావోద్వేగాలకంటే లాజిక్‌కి ప్రాధాన్యం ఇస్తారు. ఒక స్టాక్ పెరిగిందంటే కొంతమంది వెంటనే దానిపై పెట్టుబడి పెడతారు. ఫలితంగా కొన్నిసార్లు లాభాలు, ఎక్కువసార్లు నష్టాలు చవి చూస్తారు. స్పష్టమైన లక్ష్యాలతో, స్థిరమైన ప్రణాళికతో ముందుకు వెళ్లే వారికి మార్కెట్ హెచ్చుతగ్గులు వీరిని ప్రభావితం చేయవు. “నేడు కాదు.. రేపు లాభం వస్తుంది” అనే నమ్మకంతో పట్టు వదలరు. కొన్నిసార్లు లాజిక్‌తో, కొన్నిసార్లు భావోద్వేగంతో పెట్టుబడులు పెడతారు. దీర్ఘకాల ప్రణాళిక ఉండి కూడా చిన్నకాల ప్రభావాలకు లోనవుతారు.పెట్టుబడుల్లో విజయం సాధించాలంటే ముందు మన మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి. రిస్క్‌ను అంచనా వేసి, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్ణయించి, మార్కెట్ మార్పులకు ఓర్పుగా ఎదుర్కోవడమే నిజమైన ఇన్వెస్టర్ మైండ్‌సెట్ అని నిపుణులు చెబుతున్నారు.
90 శాతం మంది ఎందుకు సంపాదించలేకపోతున్నారు? Why Are 90% of People Unable to Build Wealth?
స్టాక్‌మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ అంటే పెద్ద లాభాలు, రిటర్న్స్ అంటూ చాలా మంది పెట్టుబడులు పెడతారు. కానీ వాస్తవం ఏమిటంటే ఫండ్స్, స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టిన వారిలో 90 శాతం మంది ఆశించిన లాభాలు పొందలేకపోతున్నారు. ఎందుకంటే వారికి భావోద్వేగాలే అడ్డంకి. మార్కెట్ కాస్త పెరిగిందంటే ఆనందంతో కొనుగోలు చేస్తారు.. పడిపోతే భయంతో అమ్మేస్తారు. ఈ ‘గ్రీడ్–ఫియర్’ చక్రంలో చాలా మంది ఇరుక్కుంటారు. ఓర్పు లేకపోవడం వల్ల మార్కెట్ తిరిగి లాభాల్లోకి వచ్చే సమయానికి బయటకెళ్తారు. “ఈ స్టాక్ పెరుగుతుందంట.. వెంటనే కొనాలి!” అనే ఆతురం చాలామందిలో ఉంటుంది. తక్షణ లాభాల ఆశతో పెట్టుబడులు పెడతారు. కానీ ఫండ్స్, షేర్లు ఫలితం ఇవ్వాలంటే సమయం, ఓర్పు, నిరంతర పెట్టుబడి అవసరం. రిటైర్మెంట్, పిల్లల విద్య, హౌస్ వంటి లక్ష్యాల కోసం ప్లాన్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే, ఫలితాలు కూడా అస్తవ్యస్తంగా ఉంటాయి. ఎవరైనా సూచిస్తే పలానా ఫండ్ లేదా స్టాక్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. కానీ తమ రిస్క్ టాలరెన్స్ ఏమిటో, మార్కెట్ ఎప్పుడెలా మారుతుందో తెలుసుకోరు. ఫలితంగా నష్టాలు చవిచూస్తారు. మార్కెట్‌లో సంపాదించాలంటే మన ఆలోచన, మన సైకాలజీ మీద కట్టుదిట్టమైన నియంత్రణ ఉండాలి. లాభాలు రావాలంటే ఎక్కువ తెలివి కాదు, ఓర్పు, క్రమశిక్షణ ముఖ్యం.
హోవర్డ్ మార్క్స్ ఏం చెప్పారంటే.. Howard Marks Said That…
ప్రపంచ పెట్టుబడుల రంగంలో ‘థాట్ లీడర్’గా పేరుగాంచిన హోవర్డ్ మార్క్స్ (Howard Marks) రాసిన తాజా పుస్తకం ‘Behind the Memo’ ఇన్వెస్టర్లలో ఆలోచన రేకెత్తిస్తోంది. ఇన్వెస్టర్‌గా ఎలా ఆలోచించాలి అన్నదే ఈ పుస్తకం సారాంశం. హోవర్డ్ మార్క్స్ అభిప్రాయం ప్రకారం.. పెట్టుబడి విజయానికి గణిత సమీకరణాలు కాదని, మన ఆలోచనా విధానమే ప్రధానమని అంటారు. మార్కెట్‌లో సంపాదించేవారు, అందరికంటే భిన్నంగా ఆలోచించే వారు. అని ఆయన తేల్చి చెప్పారు. భయపడే సమయంలో ధైర్యం చూపడం, ఆశ పెరిగినప్పుడు జాగ్రత్తగా ఉండడం నిజమైన ఇన్వెస్టర్ లక్షణమని పేర్కొన్నారు. ఆయన 1990ల నుంచి రాసిన పుస్తకాల్లో మార్కెట్ సైకిల్స్, ఇన్వెస్టర్ ప్రవర్తన, రిస్క్ అంచనా గురించి విలువైన విశ్లేషణలు అందించారు. ఒక్కోసారి మార్కెట్‌ను మనసుతో కాకుండా బుద్ధితో స్పందించాలి. అనే ఆయన పాఠం నేటికీ అనుసరణీయమే. హోవర్డ్ మార్క్స్ చెప్పిన విధంగా మార్కెట్ ఎప్పుడూ ‘హై’ లేదా ‘లో’ లో ఉండదు. అది ఎల్లప్పుడూ చక్రంలా తిరుగుతుంది. దానిని అర్థం చేసుకుని, సరైన సమయంలో పెట్టుబడి పెట్టి, ఓర్పుతో ఎదురు చూడగలిగినవారే నిజమైన విజేతలు. రిస్క్ అనేది సంఖ్య కాదు, అది భావన. అని మార్క్స్ చెప్పారు. ఒక ఇన్వెస్టర్ రిస్క్‌ను గుర్తించి, దాన్ని స్వీకరించగలిగితేనే ఆయన నిర్ణయాలు సరైనవవుతాయి. లాభం రిస్క్‌తోనే వస్తుంది, కానీ రిస్క్‌ను అర్థం చేసుకోవడం విజ్ఞానం. అని ఆయన చెబుతున్నారు.
ఈ జాగ్రత్తలు అవసరం..These Precautions Are Necessary
– మార్కెట్ తాత్కాలిక మార్పులను పట్టించుకోకూడదు. మార్కెట్ శబ్దం (Noise) కన్నా డేటా, ఫాక్ట్స్‌పై ఆధారపడాలి.
– దీర్ఘకాల ఇన్వెస్ట్‌లపై దృష్టి పెట్టాలి.
– ఎస్‌ఐపీ లాంటి క్రమబద్ధ పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
– ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలో భావోద్వేగాలపై కాదు. ప్లాన్‌పై ఆధారపడాలి.
– ఇతరుల మాదిరిగా కాకుండా భిన్నంగా ఆలోచించాలి.
– భయం, ఆశల మధ్య సంతులనం అవసరం.
– క్రమశిక్షణే విజయ రహస్యం.
తెలుసుకున్నవారు కాదు.. నేర్చుకునేవారే నిజమైన ఇన్వెస్టర్లు!
It’s Not the Knowers… The Learners Are the Real Investors!
“మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది?” “ఎప్పుడు పడిపోతుంది?” అని ఎవరైనా అడిగితే — ప్రముఖ ఇన్వెస్టర్ హోవర్డ్ మార్క్స్ ఇచ్చిన సమాధానం ఒకటే… “I don’t know!” అంటే ఆయనకు తెలియదా? కాదు… మార్కెట్ ఎప్పుడూ అంచనా వేయలేమనే నిజం ఆయనకు తెలుసు. ఇదే ఇన్వెస్టింగ్‌లో పెద్ద పాఠం!
తెలుసుకోవడమే కాదు.. అర్థం చేసుకోవాలి..It’s Not Just About Knowing… You Must Understand!
మార్క్స్ అభిప్రాయం ప్రకారం.. మార్కెట్‌ను ముందే ఊహించే ప్రయత్నం వృథా. దానికి బదులుగా ఇన్వెస్టర్ తన ఆలోచనా విధానాన్ని, ఓర్పును అర్థం చేసుకోవాలి. తెలుసుకోవడమే కాదు, సరైన సమయంలో తెలుసుకున్నదాన్ని అమలు చేయడం నేర్చుకోవాలి. అని ఆయన చెబుతారు.
మార్కెట్ మాయ కాదు – మనసు మాయం.. The Market Isn’t an Illusion – The Mind Is!
మార్కెట్ పడిపోతే భయం, పెరిగితే ఆశ. ఇదే ఇన్వెస్టర్ల ప్రధాన సమస్య . కానీ హోవర్డ్ మార్క్స్ చెబుతున్నదేమిటంటే మార్కెట్ శబ్దం వినకండి. అది భయాన్ని, ఆశను పెంచుతుంది. కానీ జ్ఞానం మాత్రం నిశ్శబ్దంగా మాట్లాడుతుంది. “ఇన్వెస్టర్లు వారు ఎలా స్పందిస్తారు, ఎప్పుడు పొరబడతారు, ఎప్పుడు భయపడతారో నాకు తెలుసు. అంటే, మార్కెట్‌ను గెలవడం కష్టం కాదు… మనసును గెలవడమే నిజమైన విజయం.” అని మార్క్స్ చెబుతున్నారు.
విజేతలైన ఇన్వెస్టర్ల లక్షణాలు..Traits of Successful Investors
– మార్కెట్ ట్రెండ్‌లను బలవంతంగా అంచనా వేయరు
– లాభం కన్నా రిస్క్ మేనేజ్‌మెంట్‌కి ప్రాధాన్యం ఇస్తారు
– నష్టాలనూ పాఠాలుగా తీసుకుంటారు
– ఓర్పు, క్రమశిక్షణే ఆయుధాలు
ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన 9 సైకాలజీ పాయింట్లు! 9 Psychology Points Every Investor Must Know!
పెట్టుబడుల్లో విజయం సాధించాలంటే మార్కెట్ గురించి కాకుండా మన మనస్తత్వం గురించి తెలుసుకోవాలి అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే స్టాక్‌లు, ఫండ్స్, రాబడులు ఇవన్నీ మన నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి. కానీ ఆ నిర్ణయాలను ప్రభావితం చేసేది ఇన్వెస్టర్ సైకాలజీ. ఇన్వెస్టర్లు తప్పక తెలుసుకోవాల్సిన 9 ముఖ్యమైన సైకాలజీ పాయింట్ల ను ఇప్పుడు తెలుసుకుందాం.
1. భయం (Fear) : మార్కెట్ పడిపోతే భయంతో వెంటనే స్టాక్స్ ను అమ్మేయకూడదు. భయపడినవారు కాదు, ఓపిక పట్టినవారే విజేతలవుతారు.
2. ఆశ (Greed): స్టాక్ పెరిగితే “ఇంకా పెరుగుతుంది” అనే ఆశతో కొంతమంది స్టాక్స్‌ను తగిన సమయంలో అమ్మరు. ఫలితంగా లాభం తగ్గిపోతుంది. ఆశ నియంత్రణే పెట్టుబడిలో మొదటి పాఠం.
3.ఓర్పు (Patience): మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీల్లో నిజమైన లాభం రావాలంటే సమయం అవసరం. మూడు నెలల్లో లాభం కావాలి అనుకుంటే అది పెట్టుబడి కాదు. జూదం అవుతుంది.
4. క్రమశిక్షణ (Discipline): ఎస్ఐపీ లాంటి క్రమబద్ధ పెట్టుబడులు చేస్తే మార్కెట్ హెచ్చుతగ్గులు ప్రభావం చూపవు. లాభం కూడా స్థిరంగా ఉంటుంది.
5.గుంపు మనస్తత్వం (Herd Mentality): ఇతరులు పెట్టారన్న కారణంగా మీరు పెట్టుబడులు పెట్టడం తప్పు. మార్కెట్‌లో గెలవాలంటే గుంపు దారిలో కాకుండా మీ దారిలోనే నడవాలి.
6.ఆత్మవిశ్వాసం (Overconfidence): కొన్ని సార్లు లాభం వస్తే తామే మార్కెట్ నిపుణులమని అనుకునే వారు ఉంటారు. కానీ మార్కెట్ రోజూ కొత్త పాఠం నేర్పుతుంది.
7.నష్ట భయం (Loss Aversion): ఒకసారి నష్టపోయాక మళ్లీ పెట్టుబడి పెట్టడానికి భయపడటం కూడా పెద్ద అడ్డంకి. కానీ ప్రతి నష్టం ఒక పాఠం అని గుర్తుంచుకోవాలి.
8.తక్షణ నిర్ణయాలు (Impulsiveness): సోషల్ మీడియా సలహాలు, ఫ్రెండ్ టిప్స్ చూసి వెంటనే కొనుగోలు, అమ్మకం చేయడం వల్ల నష్టాలు ఎక్కువగా వస్తాయి. ప్లాన్ చేయి – అమలు చేయి – ఓపిక పట్టు అనే సూత్రాన్ని పాటించాలి.
9. దీర్ఘకాల దృష్టి (Long-Term Vision): చిన్నకాల రాబడులపై కాకుండా దీర్ఘకాల సంపదపై దృష్టి పెట్టాలి. మార్కెట్ ఎప్పుడూ వేగంగా లాభం ఇవ్వదు. కానీ ఓర్పుతో ఉంటే పెద్ద ఫలితం తప్పదు.
‘పర్‌ఫెక్షన్’ అనేది మాయ! ‘Perfection’ Is an Illusion!
“నేను తప్పు చేయను!”.. “నా ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడూ పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది!” ఇలాంటి ఆలోచన మార్కెట్‌లో అతిపెద్ద భ్రమ అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇన్వెస్టింగ్‌లో “పర్‌ఫెక్షన్ ఫ్యాలసీ” (The Fallacy of Perfection) అంటే తప్పు చేసే అవకాశం లేదని అనుకోవడం. కానీ వాస్తవం మాత్రం వేరే . తప్పులు, నష్టాలు, నేర్చుకోవడమే విజయానికి పునాది. “ఎవరూ ఎప్పుడూ సరైన నిర్ణయాలే తీసుకోలేరు. విజేత ఇన్వెస్టర్ అంటే తప్పులు తగ్గించేవాడు. వాటినుంచి నేర్చుకునేవాడు,” అని హోవర్డ్ మార్క్స్ తన ‘The Most Important Thing’ పుస్తకంలో చెబుతారు. ఇన్వెస్టర్లు పర్‌ఫెక్ట్‌గా ఉండాలని ప్రయత్నించే క్రమంలో భయం, ఆత్మవిశ్వాసం, అహంకారం కలగలిపి నష్టాలను ఆహ్వానిస్తారని ఆయన సూచించారు. మార్కెట్ ఎప్పుడూ అంచనాలకు లోబడదు. కొన్నిసార్లు ఫండమెంటల్స్ బాగున్న స్టాక్స్ పడిపోతాయి. లేదా బలహీన కంపెనీలు ఊహించని రీతిలో ఎగిసిపోతాయి. ఇది పర్‌ఫెక్షన్ కాకుండా ప్రాబబిలిటీ గేమ్!
మైండ్‌సెట్ మార్చుకోవాలి..You Need to Change Your Mindset
తప్పులు సహజం: మార్కెట్‌లో లాస్ రావడం ఓ డిఫెక్ట్ కాదు. ఒక లెసన్.
తప్పులనుంచి నేర్చుకోవాలి. వాటిని దాచిపెట్టకూడదు. ఓ నిర్ణయం తప్పైతే మార్పు చేయడానికి సంకోచించకూడదు.
ప్రాసెస్ ముఖ్యం: సరైన విశ్లేషణతో తీసుకున్న నిర్ణయం ఫలించకపోయినా తప్పు కాదు.
ఈగోకు చోటు లేదు: “నేను తప్పు చేయను” అనే ఆత్మవిశ్వాసం నష్టానికి దారితీస్తుంది.
పేషెన్స్ & ఫ్లెక్సిబిలిటీ: పరిస్థితులు మారినప్పుడు మన అభిప్రాయాన్ని మార్చుకోవడం జ్ఞానం. బలహీనత కాదు.
మార్కెట్‌లో ప్రతి అభిప్రాయం విలువైనది .. Every Opinion Has Value in the Market…
ఇన్వెస్టింగ్ అంటే కేవలం డబ్బు పెట్టడం మాత్రమే కాదు. మన ఆలోచనలను పంచుకోవడంలో కూడా బలముంది అని ఫైనాన్షియల్ నిపుణులు చెబుతున్నారు. హోవర్డ్ మార్క్స్, వారెన్ బఫెట్ వంటి లెజెండరీ ఇన్వెస్టర్లు ఎప్పుడూ “మీ అభిప్రాయం పంచుకోండి, కానీ నిర్ణయం స్వయంగా తీసుకోండి” అని సూచిస్తారు. “Share Your View” అనేది మార్కెట్‌లో కేవలం ఓ చాట్ కాదు, తప్పులు, అనుభవాలు, నేర్పులను పంచుకునే ఒక సాధనంగా మారింది. ఇన్వెస్టర్లు తమ వ్యూహాలు, నిర్ణయాలను మిత్రులతో, నిపుణులతో పంచుకుంటే సైకాలజీ బలహీనతలు గుర్తించగలరు త్వరిత నిర్ణయాల్లో ఊహించని పొరపాట్లు తగ్గుతాయి. కొత్త ఆలోచనల ద్వారా పెట్టుబడికి సరికొత్త మార్గాలు లభిస్తాయి
పెట్టుబడుల్లో అంచనాల మాయ! The Illusion of Predictions in Investments!
మార్కెట్‌లో కొత్త స్టాక్ లేదా హాట్ ఫండ్ ఎప్పుడూ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తుంది. అలాగే కొన్ని షేర్లను చూసి “This tree will grow to the sky!” అని కొందరు ఇన్వెస్టర్లు అంటారు. కానీ ఇన్వెస్టింగ్‌లో ఈ ఆలోచన అత్యంత ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్‌లో ఒక స్టాక్ లేదా ఫండ్ క్రమంగా పెరుగుతూ ఉంటే, కొత్త ఇన్వెస్టర్లు దీనిని చూసి ఎప్పుడూ పెరుగుతుంది అని భావిస్తారు. కానీ ఎలాంటి స్టాక్ కూడా శాశ్వతంగా పెరుగదు. ఎప్పుడో ఒక సందర్భంలో పతనం ఖాయం.హోవర్డ్ మార్క్స్, వారెన్ బఫెట్ చెప్పిన దాని ప్రకారం.. “మార్కెట్ ఎప్పుడూ ‘sky-high’ గా ఉండదు. తప్పు లేని పెట్టుబడి అంటే అర్థరహితం. వాస్తవాన్ని అర్థం చేసుకోవడం, భావోద్వేగాలను నియంత్రించడం ముఖ్యం.
మార్కెట్ క్యాపిటలైజేషన్ & కంపెనీ ఫండమెంటల్స్
Market Capitalization & Company Fundamentals
స్టాక్ మార్కెట్‌లో కొత్తగా అడుగు పెట్టే కొద్దీ ఇన్వెస్టర్లు “Market Capitalization” , “Company Fundamentals”. అనే ఈ రెండు పదాలను తరచూ వింటారు . కానీ వీటి అర్థం, ఉపయోగం స్పష్టంగా తెలిసి ఉండకపోతే, పెట్టుబడి చేయడం రిస్క్‌గా మారుతుంది.
మార్కెట్ క్యాపిటలైజేషన్ (Market Capitalization)
మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది “కంపెనీ మొత్తం విలువ = షేర్‌ప్రైస్ × షేర్ల మొత్తం సంఖ్య. పెట్టుబడిదారులు క్యాపిటల్ రకాన్ని బట్టి రిస్క్ & రాబడి అంచనా వేయాలి.
Large Cap: స్థిరమైన పెద్ద కంపెనీలు – తక్కువ రిస్క్
Mid Cap: మధ్యస్తంగా లభించే వృద్ధి అవకాశం – మోస్తరు రిస్క్
Small Cap: వేగంగా పెరుగుతుంది.. కానీ అధిక రిస్క్
కంపెనీ ఫండమెంటల్స్ (Company Fundamentals)
ఫండమెంటల్స్ అనగా కంపెనీ ఆర్థిక పరిస్థితి, మేనేజ్‌మెంట్, డెబ్ట్ స్థాయి, రెవెన్యూ, ప్రొఫిట్ మార్జిన్ వంటి అంశాలు. స్థిరమైన ఆదాయ శ్రేణి, తక్కువ అప్పులు, మంచి క్యాష్ ఫ్లో , మార్కెట్‌లో అగ్రస్థానం, దీర్ఘకాల వృద్ధి పథకం తదితర విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. Market Cap కేవలం సంఖ్య. నిజమైన పెట్టుబడి నిర్ణయం ఫండమెంటల్స్ ఆధారంగా తీసుకోవాలి.
ఇన్వెస్టర్స్‌కు టిప్స్.. Tips for Investors
Large Cap లో స్థిరమైన రాబడి, Small & Mid Cap లో వేగవంతమైన వృద్ధి
ఫండమెంటల్స్ బలమైన కంపెనీలను మాత్రమే ఎంపిక చేయాలి
క్రమశిక్షణతో SIP లేదా Direct Investment చేస్తే లాభం ఎక్కువ
Market hype లోకి పడి trend-following చేయకూడదు
