2022లో ఇండియ‌న్ స్టాక్‌ మార్కెట్ ఎలా ప‌నిచేసింది How Indian Stock Market Performed in 2022

2022 సంవ‌త్స‌రం స్టాక్ మార్కెట్ మ‌దుప‌రుల‌కు, ట్రేడ‌ర్ల‌కు ఒక విభిన్న‌మైన అనుభ‌వాన్ని మిగిల్చింది. కోవిడ్ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే ప్ర‌పంచం తేరుకుంటున్న స‌మ‌యంలో ర‌ష్యా ఉక్రెయిన్ యుద్ధం
మ‌ళ్లీ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై తీవ్ర ప్ర‌భావం చూపింది. ప్ర‌పంచ‌మంతా తీవ్ర న‌ష్టాల‌ను ఎదుర్కొన్నా, ఇండియా మార్కెట్ మాత్రం కొంచెం స్థిరంగానే ఉంద‌ని చెప్పాలి.

2022 సంవత్సరం ఫిబ్రవరి నెలలో రష్యా ఉక్రెయిన్ యుద్దం జరిగింది. దీనితో ఒక్కసారిగా కమొడిటీ మార్కెట్ బూమ్ స్టార్ట్ అయ్యింది. ఆయిల్, న్యాచురల్ గ్యాస్ రేట్స్ ఎక్కువ‌గా పెరిగాయి. ఒక టైమ్ లో ఆయిల్ ప్రైస్ 131 డాలర్స్ కి వెళ్ళిపోయింది. అంత వరస్ట్ ఇన్విరాల్‌మెంట్‌లో కూడా మన స్టాక్ మార్కెట్ వరల్డ్ మార్కెట్స్ ని బీట్ చేస్తోంది. ఇక్కడ మనం పరీశిలించవలిసినది ఏమిటంటే ఎఫ్ఐఐ లు ఈ సంవత్సరం మొత్తం కంటిన్యూస్ గా అమ్ముతూనే ఉన్నారు. సుమారు రూ.1.2 లక్షలకోట్లను అమ్మేసి వెళ్లిపోయారు. కేవలం ఆగష్టు, నవంబర్ నెలల్లో మాత్ర‌మే పోజిటివ్ గా నెట్ అమౌంట్ ని ఎఫ్ఐఐ లు ఇన్వెస్ట్ చేశారు. ఈ రెండు నెలలు కలిపి వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది రూ.40 వేలకోట్లు మాత్ర‌మే. అంటే ఇక్క‌డ వాళ్ళు తీసుకెళ్ళిందే ఎక్కువ ఇన్వెస్ట్ చేసింది తక్కువ.

దేశీయ ఇన్వెస్ట‌ర్ల నుంచే అధిక పెట్టుబ‌డులు

కానీ ఇండియాలో మ్యూచువల్ ఫండ్స్ మొత్తం 2లక్షల కోట్ల రూపాయ‌ల‌ను స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశాయి. నవంబర్ నెలలో అయితే ఒక ఎస్ఐపీ ద్వారా వచ్చిన అమౌంట్ రూ.13వేలకోట్లు. ఇండియన్ మార్కెట్ స్ట్రాంగ్ నిలబడిందంటే దానికి కారణం డీఐఐ లు, రిటైల్ ఇన్వెస్టర్స్. కాబట్టి మార్కెట్ పోజిటివ్ గా క్లోజ్ అయ్యింది. వరల్డ్ మొత్తం మీద పోజిటివ్ గా క్లోజ్ అయిన అతి త‌క్కువ మార్కెట్ల‌లో ఇండియా ఒక‌టి. 2022 సంవత్సరంలో ఇండియాలో ఎటువంటి నెగిటివ్ న్యూస్ కూడా మార్కెట్ ని ప్ర‌భావితం చేయ‌లేక పోయాయి. ఎందుకంటే ఇండియాలో మార్కెట్ ప్రతి రోజూ గ్యాప్‌ డౌన్ తో ఓపెన్ అయిన వెంటనే రికవరీకి ట్రై చేస్తుంది తప్ప సరెండర్ ఎక్కడా కాలేదు. వలటాలిటీ ఎంత వచ్చినా తట్టుకుని నిలబడింది. ఇక ముందు ముందు రోజుల్లో కూడా ఈ వలటాలిటీని ఖచ్చితంగా తట్టుకోగలుగుతుంది.

What are the factors that will destroy the market in 2022
2022లో మార్కెట్ ని పడగొట్టిన అంశాలేమిటి

ఈ ఏడాది అమెరికన్ మార్కెట్లు 20 నుంచి 30 శాతం వరకు డౌన్ అయ్యాయి. కానీ ఇండియా కంటిన్యూస్ గా మూడో సంవత్సరం వరల్డ్ మార్కెట్ ని బీట్ చేస్తోంది. అందులో ప్రపంచ వ్యాప్తంగా ప్ర‌తి దేశంలోనూ వడ్డీ రేట్లను పెంచడంతో ఇన్ ఫ్లేషన్ కొంచెం త‌గ్గుతోంది. చైనా జీరో కోవిడ్ పాలసీ అని చెప్పడం, మళ్లీ రీసెంట్ గా కోవిడ్ హైక్‌ అవ్వడం… ఇలా మొత్తం మనం చూసుకుంటే ఇంటర్నేషనల్ గా వచ్చిన న్యూస్ చాలా ఎక్కువ. అయితే ఈ ప్ర‌భావం ఇండియా మీద అంత‌గా లేద‌నే చెప్పాలి. ఇక్కడ మనకి కలిసివచ్చేది ఏమిటంటే ఇండియాలో ఈక్విటీ కల్చర్ బాగా పెరిగిపోయింది. స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్ షిప్, ఇన్‌ఫ్లేషన్ కంట్రోల్ లో ఉండడం వల్ల మ‌న మార్కెట్ స్టేబుల్ గా ఉంది. 2023 లో కూడా ఈ విధంగా ప్రపంచం మొత్తం మీద న్యూస్ ఉన్నా ఇండియాకు ఏమీ అవ్వకపోవచ్చు.

* వడ్డీ రేట్లు పెరిగితే పెరగవచ్చు. ఇండియాలో ఇన్ ఫ్లేషన్ డౌన్ లో ఉంది కాబట్టి ఇండియన్ మార్కెట్లో బెటర్ పర్ ఫార్మెన్స్ ఉండే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. కాబట్టి వరల్డ్ వైడ్ గా ఈ న్యూస్ వస్తూ ఉంటుంది. వాటితో మార్కెట్లో వలటాలిటీ స్టార్ట్ అవ్వడం మళ్ళీ రికవరీ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి.

2023 సంవత్సరం ఇండియన్ మార్కెట్ ఎక్కువ వలటాలిటీతో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ స్టెబులిటీ, గ్రోత్ ఉంది. జీఎస్టీ కలెక్షన్స్ ఆల్ టైమ్ హై లో ఉంది. గవర్నమెంట్ డైరెక్ట్ ట్యాక్స్ ఇన్ కమ్ 24 శాతం పెరిగింది. బ్యాంకులు 7 సంవత్సరాల తర్వాత మొదట సారిగా క్రెడిట్ గ్రోత్ చూపిస్తున్నాయి. గవర్నమెంట్ బ్యాడ్‌ బ్యాంక్ క్రియేట్ చేయడం వల్ల బ్యాంకింగ్‌ సెక్టార్ బాగా పర్ఫార్మెన్స్ చూపించింది. ఈ సంవత్సరం 18 శాతం బ్యాంక్ నిఫ్టీ పెరిగింది. ఇండియన్ ఇండస్ట్రీ క్రెడిట్ గ్రోత్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. అందువల్ల తర్వాత సంవత్సరం కూడా ఈ గ్రోత్‌ని బ్యాంకింగ్‌ సెక్టార్ కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

  • మంచి సెక్టార్ అంటే బ్యాంక్, ఇన్ఫ్రా స్ట్రక్చర్. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ప్ర‌త్యేకంగా లీడింగ్ లో ఉంది. వీటితో పాటు ఆటోమొబైల్ , ఎఫ్ ఎంసీజీ సెక్టార్ కూడా మనం లెక్కలోకి తీసుకోవచ్చు. కానీ వరల్డ్ మొత్తం బాడ్ న్యూస్ ఉన్నాయి. రెసిషన్, ఇన్ ఫ్లేషన్ కంట్రోల్ లో రాకపోవడంతో దాని న్యూస్ ప్ర‌భావం ఇండియా మీద వస్తున్న సంవత్సరాల్లో ఉండవచ్చు. ముందు ముందు రోజుల్లో వలటాలిటీలోకి ఎంటర్ కాబోతున్నాం.

Extreme pressure on technology companies

టెక్నాల‌జీ కంపెనీల‌పై తీవ్ర ఒత్తిడి

టెక్ కంపెనీల‌పై ఈ ఏడాది తీవ్ర ఒత్తిడి ఏర్ప‌డింది. అన్ని కంపెనీలు చాలా శాతం న‌ష్ట‌పోయాయి. టెక్నాలజీ డౌన్ సైడ్ ఎంతవరకు మార్కెట్ పోతుందో ఊహించలేం. మనం సేఫ్టీగా, స్టేబుల్ గా ఉండాలనుకుంటే రిటైలర్స్ అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్‌ లో పెట్టుబ‌డులు కొన‌సాగించ‌డం అవ‌స‌రం. దీని ద్వారా రిస్క్ తగ్గించుకుని మనం స్టేబుల్ గా ఉండే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంది.
* వ‌రల్డ్ వైడ్ గా మనం చూస్తే మెటా, టెస్లా, నెట్ ఫ్లిక్స్ కంపెనీలన్నీ ఎక్కువగా డౌన్ అయ్యాయి. ఈ మొత్తం స్టాక్స్ ఉన్న పరాగ్ పరిక్‌ ఫ్లెక్సీ క్యాప్ 5 శాతం మాత్రం డౌన్ అయ్యింది. ఈ స్టాక్స్ మొత్తం మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నాయి.. కానీ మ్యూచువల్ ఫండ్స్ మాత్రం మ‌రీ అంత‌గా డ్రాప్ అవ్వడం లేదు. ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చెయ్యడం ద్వారా రిస్క్ మినిమైజ్ చేసుకోవచ్చు. మొత్తం మీద 2022 సంవత్సరంలో వచ్చిన నెగిటివ్ వేవ్స్ వల్ల ఇక్కడ మార్కెట్లో కొంత కరెక్షన్స్, డౌన్ ట్రెండ్ జరిగింది.

2023లో ఇండియన్ స్టాక్ మార్కెట్ కి కలిసొచ్చే అంశాలు ఇవే
These are the things that will happen to the Indian stock market in 2023

మార్కెట్లో బేర్ ర్యాలీ గాని, బుల్ ర్యాలీ గాని జరిగే ఛాన్సస్ ఎక్కువగా ఉంటుంది. 2022 సంవత్సరంలో హిస్టారికల్ హై ని మార్కెట్ చేరుకుంది. నిఫ్టీ 18వేల 830 ని టచ్ అయింది. 2023 సంవత్సరంలో 20వేలు వరకు మార్కెట్ చేరుకునే అవ‌కాశం ఉంటుంది. కానీ అదే టైమ్ లో వలటాలిటీ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. రూపీ డాలర్ కూడా హిస్టారికల్ హై 83.2 దాకా టచ్ అయ్యింది. 2023 సంవత్సరంలో 81 నుంచి 84 మధ్య రూపీ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 2023 లో రూపీ డారల్ కంటే తగ్గుతుంది. ఎందుకంటే వడ్డీ రేట్లు పెరుగుతాయి. కాబట్టి మొత్తం మీద 2023లో ప్రపంచం మొత్తం మీద ఇన్ ఫ్లేషన్ తగ్గి వడ్డీ రేట్ పీక్ లెవల్ కి వస్తాయి కాబట్టి ఎకానమీ వలటాలిటీ నుంచి స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 2023 ఇండియన్ మార్కెట్ స్ట్రాంగ్ గా ఉంటుందని మనం అనుకోవచ్చు.

* అమెరికా కి ఏదైనా అయిందంటే ఆ ఎఫెక్ట్ వరల్డ్ వైడ్ గా పడాల్సిందే. ఎఫ్ఐఎస్ అంతా మెజారిటీ అమెరికా వాళ్ళు ఉంటారు కాబట్టి. అంతే కాకుండా టెక్నాలజీ అంతా అమెరికా నుంచే వస్తుంది. 2023లో వరల్డ్ వైడ్ గా ఇన్ ప్లేషన్ తగ్గవచ్చు. రష్యా, ఉక్రెయిన్ యుద్దం చివరి దశకి వచ్చింది కాబట్టి అక్కడ సెటిల్ అయిపోతే ఇన్ ఫ్లేష‌న్‌ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది.

* ముందు ముందు రోజుల్లో డాలర్ డిమాండ్ లేకపోవచ్చు. డాలర్ డిమాండ్ తగ్గితే ఇన్ ఫ్లేషన్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ఓవరాల్ గా రూపీ స్టేబుల్ అవుతుంది. ఇన్ ప్లేషన్ కంట్రోల్ లోకి వస్తుంది. ఎకానమీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఓవరాల్ గా మన ఇండియన్ మార్కెట్ కు ఎటువంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొనే శక్తి ఉంది. ఈ సంవత్సరం డైరక్ట్ ఇన్ కమ్ ట్యాక్స్ 24 శాతం ఎక్కువ. వరల్డ్ వైడ్ గా ఎంత బ్యాడ్‌గా ఉన్నా లోకల్ గా మాత్రం వేగంగా ముందుకు వెళ్తుంది ఇండియన్ మార్కెట్.

* ఈక్విటీ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేసే కల్చర్ పెరిగింది. 5 సంవత్సరాల కింద‌ట మంత్లీ రూ.3వేలు కోట్లు వచ్చే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబ‌డులు ఇప్పుడు 13 వేలు కోట్లకి చేరుకుంది. ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది తప్ప తగ్గేది లేదు.

* 2023 సంవత్సరం పోజిటివ్ మ‌రింత పాజిట‌వ్ గా ఉండే అవ‌కాశం ఉంది. కానీ వలటాలిటీ అధికంగానే ఉంటుంది. దానిని మనం తొలగించలేం. వడ్డీ రేట్లు పెరగకుండా ఉంటే మాత్రం 2023 అనేది ఈక్విటీ మార్కెట్ దే. కానీ డెట్ ఫండ్స్ కి డిమాండ్ పెరిగితే ఈక్విటీ మార్కెట్ కి మనీ ఫ్లోటింగ్ తగ్గిపోవచ్చు. వడ్డీ రేట్లు పెరిగితే డెట్ కి బాగా అట్రాక్ట్ అవుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *