FDలు పెట్టుబడిదారులకు స్థిరమైన ఆదాయం, భద్రత ఇస్తాయి. అయితే వడ్డీ రేట్లు, ట్యాక్స్ ప్రభావం, లాక్‌ఇన్ పీరియడ్ వంటి అంశాలను పూర్తిగా తెలుసుకుని ముందడుగు వేయాలి. స్టాక్ మార్కెట్ల ప్రభావం వాటిపై పడదు. కాగా ఆర్థిక భద్రత కోసం చాలా మంది పెట్టుబడిదారులు ఇప్పటికీ ఫిక్స్‌డ్ డిపాజిట్స్ (FDs) పై విశ్వాసం ఉంచుతున్నారు. మార్కెట్లో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో వంటి అధిక రిస్క్ పెట్టుబడి మార్గాలు ఉన్నా FD మాత్రం సేఫ్ జోన్‌గా కొనసాగుతోంది. మొత్తం డబ్బుని ఒకే FDలో కాకుండా, విభిన్న కాలవ్యవధుల్లో, వేర్వేరు బ్యాంకుల్లో పెట్టడం ఉత్తమం. ఇలా చేస్తే వడ్డీ రిస్క్, లిక్విడిటీ ఇబ్బందులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
డిపాజిట్ సురక్షితం…Deposit is Safe
బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) అందించే ఒక పెట్టుబడి విధానం ఇది. మీరు ఒకసారి డబ్బు జమచేస్తే అది నిర్ణీత కాలానికి “ఫిక్స్” అవుతుంది. ఆ కాలం ముగిసే వరకు వడ్డీతో పాటు మీ డిపాజిట్ సురక్షితంగా ఉంటుంది. కాలపరిమితి ముగిసినప్పుడు మూలధనం + వడ్డీ మొత్తాన్ని బ్యాంకు తిరిగి ఇస్తుంది.
భద్రత ప్రధాన ఆకర్షణ.. Safety is the Main Attraction
FDలో రిస్క్ చాలా తక్కువ. మార్కెట్ ప్రభావం ఉండదు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ వంటి పెట్టుబడుల మాదిరిగా నష్టాలు ఉండవు. అందుకే ఉద్యోగులు, రిటైర్డ్ వ్యక్తులు, సీనియర్ సిటిజన్లు ఎక్కువగా FDనే నమ్ముతారు. FDలో డబ్బు పెట్టాక మధ్యలో తీసుకోవాలంటే పెనాల్టీ చెల్లించాలి. కాబట్టి మీ అవసరాల ప్రకారం కాల వ్యవధిని జాగ్రత్తగా ఎంచుకోవాలి. తక్షణ అవసరాలకు కొన్ని “షార్ట్ టర్మ్ FDలు” ఉంచడం మంచిది.
వడ్డీ రేట్లు .. కాల వ్యవధి కీలకం .. Interest Rates.. Tenure is the Key
బ్యాంకు FDలు సేఫ్‌గా పరిగణించబడతాయి. కానీ కొంత ఎక్కువ వడ్డీ కోసం NBFCలు కూడా అనేక ఆఫర్లు ఇస్తాయి. అయితే NBFC FDలలో పెట్టుబడి పెట్టే ముందు సంస్థకు CRISIL, ICRA వంటి ఏజెన్సీల రేటింగ్ తప్పనిసరిగా పరిశీలించాలి. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) ఒక్కోటి వేర్వేరు వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తున్నాయి. ప్రస్తుతం చాలా బ్యాంకుల్లో FD రేట్లు 6.5% నుంచి 8% మధ్య ఉన్నాయి. సీనియర్ సిటిజన్‌లకు అయితే అదనంగా 0.5% వడ్డీ లభిస్తోంది. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు వడ్డీ రేట్లను తప్పనిసరిగా పోల్చుకోవాలి. FDలో కాల వ్యవధి (Tenure) ఎంత ఎక్కువైతే అంత ఎక్కువ వడ్డీ లభిస్తుంది. కానీ అదే సమయంలో లిక్విడిటీ తగ్గిపోతుంది. అవసరం వచ్చినప్పుడు ముందే డబ్బు తీసుకుంటే ప్రీమేచ్యూర్ పెనాల్టీ విధిస్తారు. అందువల్ల మీ అవసరాల ప్రకారం చిన్న, మధ్య, దీర్ఘకాల FDలను విభజించి పెట్టడం మంచిది. మీరే ముందుగానే ఎంచుకున్న వడ్డీ రేటు మొత్తం కాలానికి అలాగే ఉంటుంది. మార్కెట్‌లో రేట్లు తగ్గినా మీ రాబడి తగ్గదు. అందుకే ఇది ‘ప్రెడిక్టబుల్ ఇన్‌కమ్ సోర్స్’గా పనిచేస్తుంది. ఎఫ్‌డీలకు కాల పరిమితి (Tenure) మీరు నిర్ణయించుకోవచ్చు — మూడు నెలల నుంచి పది సంవత్సరాల వరకు. అదనంగా, వడ్డీని నెలవారీ, త్రైమాసిక, వార్షికంగా పొందే అవకాశం కూడా ఉంటుంది.
ట్యాక్స్ ప్రభావం…Tax Impact
FDపై లభించే వడ్డీ ట్యాక్స్‌బుల్ ఇన్‌కమ్ లో చేరుతుంది. సంవత్సరానికి ₹40,000 (సీనియర్ సిటిజన్‌లకు ₹50,000) కంటే ఎక్కువ వడ్డీ వస్తే TDS కట్ అవుతుంది. ట్యాక్స్ సేవింగ్ FDలు కూడా ఉన్నాయి, కానీ అవి 5 ఏళ్ల లాక్‌ఇన్ పీరియడ్ తో వస్తాయి. FD ఓపెన్ చేసే సమయంలో నామినీ వివరాలు ఇవ్వడం చాలా అవసరం. అకాల మరణం సంభవించినప్పుడు వారసులకు డబ్బు సులభంగా లభించేందుకు ఇది ఉపయోగపడుతుంది. మార్కెట్ వడ్డీ రేట్లు పెరిగినప్పుడు FD పెట్టడం మంచిది. ఎందుకంటే మీరు ఆ రేటును ఆ కాలానికి లాక్ చేసుకున్నట్లే అవుతుంది.
నష్టాలు..Drawbacks..
రాబడి పరిమితం: మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ వంటి పెట్టుబడులతో పోలిస్తే ఎఫ్‌డీ రాబడి తక్కువ. దీర్ఘకాలానికి ద్రవ్యోల్బణం (Inflation) కారణంగా రియల్ రిటర్న్ తగ్గిపోతుంది.
లిక్విడిటీ సమస్య: పెట్టుబడి కాలం ముగియకముందే డబ్బు అవసరం అయితే తీసుకోవచ్చు గానీ — పెనాల్టీ చెల్లించాల్సి వస్తుంది. ఇది వడ్డీని తగ్గిస్తుంది.
వడ్డీ రిస్క్: భవిష్యత్తులో వడ్డీ రేట్లు పెరిగితే — పాత FDలో తక్కువ రేటుతో పెట్టినవారికి నష్టం అవుతుంది. ఎందుకంటే రేటును మధ్యలో మార్చలేరు.
ప్రస్తుతం అధిక వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంకులు
Banks Currently Offering High Interest Rates
• Suryoday SFB ఇటీవల FD వడ్డీ రేట్లను సవరించింది. 8.10% వడ్డీ వరకూ ఇది ఆఫర్ చేస్తుంది.
• Telangana Grameena Bank ఇది ఏడాది నుండి 2 సంవత్సరాల FDలకు 7.60% వడ్డీ రేటును ప్రకటించింది.
• ICICI Bank, HDFC Bank వంటి పెద్ద బ్యాంకులు సాధారణంగా 6.6% వరకు వడ్డీ ఇస్తున్నాయి.
• SBI కూడా 2–3 సంవత్సరాల FDపై సుమారు 6.45% వడ్డీ రేటును అందిస్తోంది.
• Bank of Baroda, Bank of India, Canara Bank వంటి బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు టాప్ రేట్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి.
NBFCs / స్పెషల్ FD స్కీములు
• Shriram Finance అనేది FDలో 8.15% వరకూ వడ్డీ రేటును ఇచ్చే అవకాశం ఉంది. సీనియర్ సిటిజన్లకు అదనపు రాయితీ కూడా ఉంది.
• కొన్ని విలక్షణ FD స్కీములు (ఉదాహరణకి “IND Secure”, “IND Green” వంటి బ్యాంకులు రూపొందించిన స్కీములు) 7.45% వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయని సమాచారం.
• IDBI బ్యాంకు “ఉత్సవ్ FD” స్కీమ్ ద్వారా FD వడ్డీ రేట్లను పెంచి, కొన్ని టెన్యూర్లపై 7.30% వరకు వడ్డీ అందిస్తున్నదిగా ప్రకటించింది
