ఆర్థిక అవసరాలు ఎప్పుడు వస్తాయో ఎవరూ చెప్పలేరు. ఒక్కసారిగా వైద్య ఖర్చులు, వ్యాపార అవసరాలు, పిల్లల చదువులు, అత్యవసర పరిస్థితులు—ఇలా అనేక సందర్భాల్లో పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఈ పరిస్థితుల్లో చాలా మంది చేసే మొదటి ఆలోచన ఏమిటంటే… “ఇల్లు లేదా స్థలం అమ్మేస్తే సరిపోతుంది” (Get Lakhs Without Selling Your House) అనే దిశగా వెళ్లిపోతారు. కానీ ఒకసారి ఆస్తి అమ్మితే తిరిగి దానిని సంపాదించడం చాలా కష్టం. ఇల్లు అనేది కేవలం ఆస్తి మాత్రమే కాదు… అది ఒక కుటుంబానికి భద్రత, గౌరవం, భావోద్వేగం. అయితే, ఈ పరిస్థితుల్లో ఒక ప్రత్యామ్నాయం ఉంది. అదే ‘లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ’ (Loan Against Property – LAP). అంటే, మీ ఆస్తిని అమ్మకుండానే దాని విలువను నగదు రూపంలో పొందే అవకాశం. అయితే ఇది ఎంతవరకు ఉపయోగకరం? ఇందులో ఉన్న రిస్క్ ఏమిటి? ఎవరికి ఇది సరైన మార్గం? అన్న విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం.
లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ అంటే ఏమిటి? What is Loan Against Property (LAP)?
లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ అనేది ఒక సెక్యూర్డ్ లోన్. అంటే, మీరు మీ ఇంటిని లేదా స్థలాన్ని బ్యాంక్ వద్ద తాకట్టు పెట్టి రుణం (Get Lakhs Without Selling Your House) తీసుకుంటారు. ఈ ప్రక్రియలో ఆస్తి మీ పేరులోనే ఉంటుంది. మీరు అదే ఇంట్లో నివసించవచ్చు లేదా ఉపయోగించవచ్చు. కానీ చట్టపరంగా ఆ రుణం పూర్తిగా తీర్చే వరకు ఆ ఆస్తిపై బ్యాంకుకు హక్కు ఉంటుంది. ఇది వ్యక్తిగత రుణం (Personal Loan) లేదా క్రెడిట్ కార్డ్ రుణంతో పోలిస్తే చాలా తక్కువ వడ్డీతో లభిస్తుంది. ఎందుకంటే బ్యాంక్‌కు గ్యారెంటీగా ఆస్తి ఉంటుంది.
ఎంత వరకు లోన్ లభిస్తుంది? How Much Loan Can You Get?
ఈ రుణం (Get Lakhs Without Selling Your House) పొందేటప్పుడు చాలా మంది ఒక తప్పుదారి పడతారు. “నా ఇల్లు విలువ కోటి రూపాయలు… అంటే నాకు కోటి రూపాయల లోన్ వస్తుంది” అని అనుకుంటారు. కానీ వాస్తవం వేరేలా ఉంటుంది. బ్యాంకులు సాధారణంగా ఆస్తి మార్కెట్ విలువలో 50% నుండి 70% వరకు మాత్రమే లోన్ ఇస్తాయి. దీనినే ‘లోన్ టు వ్యాల్యూ’ (Loan to Value – LTV) అంటారు. ఉదాహరణకు, మీ ఇంటి విలువ ₹1 కోటి ఉంటే, ₹50 లక్షల నుంచి ₹70 లక్షల వరకు మాత్రమే రుణం లభిస్తుంది. ఇది కూడా కేవలం ఆస్తి విలువపైనే ఆధారపడదు. మీ ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం, క్రెడిట్ హిస్టరీ (సిబిల్ స్కోర్), మీకు ఉన్న ఇతర రుణాలు.. ఇవన్నీ కలిపి బ్యాంక్ నిర్ణయం తీసుకుంటుంది.
ఎందుకు ఇది ఆకర్షణీయంగా ఉంటుంది? Why is LAP Attractive?
లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ (Get Lakhs Without Selling Your House) చాలా మందికి ఆకర్షణీయంగా అనిపించే ప్రధాన కారణం ఏమిటంటే తక్కువ వడ్డీ. ఇది సెక్యూర్డ్ లోన్ కావడంతో బ్యాంకులు రిస్క్ తక్కువగా భావిస్తాయి. అందుకే వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉంటాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే—ఈ లోన్ టెన్యూర్ ఎక్కువగా ఉంటుంది. 15 నుండి 20 సంవత్సరాల వరకు చెల్లించే అవకాశం ఉంటుంది. దీని వల్ల నెలవారీ ఈఎంఐలు తక్కువగా ఉంటాయి. మధ్యతరగతి కుటుంబాలకు ఇది కొంత ఊరట ఇస్తుంది. అలాగే, ఇతర రుణాలతో పోలిస్తే ఎక్కువ మొత్తంలో డబ్బు పొందే అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణ, పిల్లల ఉన్నత విద్య, పెద్ద ఖర్చులు—ఇలాంటి అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది.
కనిపించని ప్రమాదం… పెద్ద రిస్క్! Hidden Danger… The Biggest Risk!
ఇది (Get Lakhs Without Selling Your House) ఎంత ఆకర్షణీయంగా కనిపించినా, ఇందులో ఒక పెద్ద రిస్క్ దాగి ఉంటుంది. అదే—మీ ఆస్తి కోల్పోయే ప్రమాదం. మీరు తీసుకున్న రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించలేకపోతే, బ్యాంక్‌కు ఆ ఆస్తిని స్వాధీనం చేసుకుని వేలం వేసే పూర్తి హక్కు ఉంటుంది. చాలా మంది ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేస్తారు. “ఈఎంఐలు తక్కువే కదా” అని భావించి పెద్ద మొత్తంలో లోన్ తీసుకుంటారు. కానీ ఆదాయం ఆగిపోతే? ఉద్యోగం కోల్పోతే? వ్యాపారం నష్టపోతే? అప్పుడు ఈఎంఐలు భారంగా మారతాయి. చివరకు మీ ఇల్లు ప్రమాదంలో పడుతుంది.
చట్టపరమైన అంశాలు కూడా కీలకం.. Legal Aspects Matter Too
లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ తీసుకోవాలంటే మీ ఆస్తి పత్రాలు (Get Lakhs Without Selling Your House) పూర్తి స్థాయిలో సరిగా ఉండాలి. టైటిల్ క్లియర్‌గా ఉండాలి. అన్ని అప్రూవల్స్ ఉండాలి. ఎలాంటి లీగల్ సమస్యలు ఉండకూడదు. ఇవేమైనా లోపిస్తే బ్యాంకులు రుణాన్ని తిరస్కరిస్తాయి. కాబట్టి ముందుగానే ఈ విషయాలను చెక్ చేసుకోవడం అవసరం.
ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి.. Alternative Options to Consider
మీకు తాత్కాలికంగా డబ్బు అవసరమైతే, వెంటనే ఆస్తిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మీ ఇంట్లో ఖాళీ భాగం ఉంటే అద్దెకు ఇవ్వవచ్చు. దీని ద్వారా రెగ్యులర్ ఇన్కమ్ వస్తుంది. అలాగే వృద్ధుల కోసం ‘రివర్స్ మార్టిగేజ్’ అనే ప్రత్యేక పథకం ఉంది. ఇందులో ఇంటిని తాకట్టు పెట్టి నెలవారీ ఆదాయం పొందవచ్చు. ముఖ్యంగా, ఈ రుణాన్ని వెంటనే తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఎప్పుడు ఈ నిర్ణయం తీసుకోవాలి? When Should You Opt for LAP?
లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ అనేది ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం. ఇది తేలికగా తీసుకునే విషయం కాదు. మీ ఆదాయం స్థిరంగా ఉంటే, ఈఎంఐలు సులభంగా చెల్లించగలిగితే, మరియు అవసరం నిజంగా అత్యవసరమైతే మాత్రమే ఈ మార్గాన్ని ఎంచుకోవాలి. అవసరం లేకుండా పెద్ద మొత్తంలో అప్పు తీసుకోవడం ప్రమాదకరం. బ్యాంక్ ఇస్తుంది కాబట్టి తీసుకోవాలి అనే ఆలోచన తప్పు. ఇల్లు అమ్మకుండానే లక్షలు (Get Lakhs Without Selling Your House) పొందే అవకాశం ఉన్నా, అది బాధ్యతతో కూడుకున్న నిర్ణయం. లోన్ అగైన్స్ట్ ప్రాపర్టీ సరైన విధంగా ఉపయోగిస్తే ఉపయోగకరం. కానీ నిర్లక్ష్యంగా తీసుకుంటే అదే మన ఇల్లు కోల్పోయే ప్రమాదానికి దారి తీస్తుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ముందుచూపుతో ఆలోచించాలి. అప్పు తీసుకోవడం ముందు రెండుసార్లు ఆలోచించాలి. ఎందుకంటే మన ఇల్లు కేవలం ఒక ఆస్తి కాదు… అది మన జీవిత సాఫల్యం.
