
మన దేశంలో మూడు రకాల ప్రజలు ఉన్నారు. వారే RICH, POOR, MIDDLE CLASS. అయితే మనలో చాలామంది MIDDLE CLASS (మధ్యతరగతి వర్గాలు) వాళ్లమే. మన దేశంలో ఏకంగా 50 కోట్ల మంది MIDDLE CLASS ప్రజలే ఉన్నారు. మన దేశానికి వచ్చే ట్యాక్స్‌ల్లో సుమారు 79 శాతం MIDDLE CLASS వాళ్లు చెల్లిస్తున్నారు. ఎంత కష్టపడినా మనమంతా ఇంకా MIDDLE CLASS గానే మిగిలిపోతున్నాం. అయితే ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ ఫినాన్షియల్ MISTAKES చేయడం వల్ల రిచ్ కాలేకపోతున్నాం. ఆ తప్పులేంటి? వాటినుంచి మనం ఎలా జాగ్రత్తపడాలి అనే విషయం ఓ సారి చూద్దాం.
You don’t track spending
మీ ఖర్చును అంచనా వేయలేకపోవడం
చేతినిండా డబ్బులు ఉండి, మంచి జీవితాన్ని కొనసాగించాలని చాలా మంది అనుకుంటారు. కానీ, సరైన ప్రణాళిక లేకపోవడంతో సతమతమవుతుంటారు. అయితే, గతం గతహః ఇప్పుడేంటి అనేది ఆలోచించాలి. సాధారణంగా అందరూ తమ దైనందిన జీవితంలో అనేక ఖర్చులు చేస్తుంటా రు .ఇందులో అవసరమైన ఖర్చులేంటి? అనవసర ఖర్చులేంటి? అనే విషయంలో అనేకమంది తర్జనభర్జన పడుతుంటారు. అనవసర ఖర్చుల విషయంలో సరైన క్లారిటీ లేకపోతే జీవితాంతం అవి మనల్ని వదిలిపెట్టవు. డబ్బు నిర్వహణ సరిగ్గా అలవర్చుకోకపోతే కొంతకాలానికి పరిస్థితి సంక్లిష్టంగా మారుతుంది. చాలామంది మిడిల్‌క్లాస్ వాళ్లు ఆర్థిక ప్రణాళికలో చేసే మొదటి తప్పు తమ ఖర్చులను అదుపులో పెట్టకపోవడం. జీవనశైలిలో మార్పులు చేయకుంటే ఆ ఖర్చులను అదుపులో ఉంచడం చాలా కష్టం. ఆర్థిక క్రమ శిక్షణను పెంపొందించేలా ఇది దీర్ఘకాలంలో సహాయపడుతుంది. ఖర్చులు మితిమీరితే అప్పులు చేయడం తప్ప వేరే మార్గం కనిపించదు.
what will happen if we Not having financial goals
ఆర్థిక లక్ష్యాలు లేకపోవడం
financial goals సాధించేందుకు ముఖ్యమైనది SMART గోల్స్ ఏర్పాటు చేసుకోవడం.
SMART అంటే
Specific- నిర్దిష్టమైన
Measurable- లెక్కించగల
Attainable- సాధించదగిన
Relevant- సంబంధిత
time-bound-సమయ పరిమితి
ఈ స్మార్ట్ గోల్స్ మీకు సమగ్రమైన ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసుకునేందుకు, వాటిని సాధించేందుకు ఉపయోగపడతాయి. అయితే చాలామందికి వారి డబ్బు ఎంత వస్తుందో, ఎంత ఖర్చు అవుతుందో, ఎక్కడ ఎక్కువ ఖర్చు అవుతుందో నెలచివరి వరకు తెలుసుకోలేరు. మనకి ఫైనాన్షియల్ గోల్స్ లేకపోతే డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నామో, దేనికి ఖర్చు చేస్తున్నామో మనకి క్లారిటీ లేకుండా పోతుంది. దీనివలన ఫైనాన్షియల్ గా ఎదగలేం.
Ignoring investment
పెట్టుబడిని విస్మరించడం
మీ financial goals సాధించాలంటే invest చేసే దానికన్నా ఎక్కువగా శ్రమించాలి. మీ పోర్టిఫోలియోను తరుచూ చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు మీ లక్ష్యం వైపు వెళ్తున్నారా? ఏవైనా మార్పులు చేసుకోవాలా? అనేది దీని ద్వారా తెలుసుకోవచ్చు. పోర్టిఫోలియో విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు లెక్కల్లో ఉండాలి కానీ సెంటిమెంట్లు, న్యూస్ పై ఆధారపడకూడదు. మనలో చాలామందికి ఫైనాన్షియల్ గోల్స్ ఉంటాయి. కానీ వచ్చిన జీతం ఖర్చులకే సరి పోతుంటాయి. ఇన్వెస్ట్ మెంట్ చేయడానికి డబ్బులు ఉండడం లేదు అనుకుంటారు. తర్వాత ఇన్వెస్ట్ మెంట్ చేద్దాం అనుకుంటా రు. దీనివలన ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలిసి ఉంటుంది. అందువలన మనకి జీతం వచ్చిన వెంటనే 10శాతం investment కోసం తీసి మిగిలిన డబ్బులతో మన ప్లానింగ్ అంతా జరగాలి. ఎప్పుడైతే ఇలా చేస్తామో భవిష్యత్తులో ఫైనాన్షియల్ సమస్యలకి చాలా దూరంగా ఉంటాం. మీరు నెలకు ఎంత సంపాదిస్తున్నారు? నిత్యావసరాలు, విద్యుత్తు బిల్లు, ఇంటర్ నెట్ కనెక్షన్, ఫోన్ బిల్స్‌కి నెలకి ఎంత ఖర్చు చేస్తున్నారు? అనే విషయాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకున్నప్పుడు మీ దగ్గర క్యాష్ ఫ్లో ఎలా ఉందనేది తెలుస్తుంది. అదే మీ ఫైనాన్షియల్ గోల్స్ సాధించేందుకు సాయపడుతుంది. మీ ఆదాయం, ఖర్చులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకునేందుకు సులభమైన పద్దతి బడ్జెటింగ్ యాప్‌ను మీ స్మార్ట్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవడం.
Easily Influenced Impulsive Purchase
అనుకోని కొనుగోలు
మనకి ఏదైనా ఆఫర్ వచ్చిందని, మనకి అవసరంలేని వస్తువులు కూడా కొంటాం. credit card ఆఫర్ ఉంటే మనం కొనేస్తాం. అంటే మనం ఏదైనా ఆఫర్ చూడగానే ఆ వస్తువులను కొనడానికి తొందరగా రియాక్ట్ అవుతాం. అప్పుడు మన ఖర్చులు మన control లో లేకుండా పోతాయి. ఈ మధ్య చాలామందిలో credit card వాడకం బాగా పెరిగింది. జేబు నుంచి నగదు ఖర్చు పెట్టడానికి, క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లు జరపడానికి చాలా తేడా ఉంటుంది. వెంటనే డబ్బు ఖర్చు పెట్టనక్కర్లేదు కాబట్టి అత్యధికులు credit card వినియోగం వైపే మొగ్గుచూపుతారు. అయితే దీనివల్ల మనం సాధారణం కంటే 12-18 శాతం అధికంగా ఖర్చు చేస్తున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుత కాలంలో online కొనుగోళ్లు బాగా పెరిగిపోయాయి. credit card తో ఈ కొనుగోళ్లు చాలా సులభం. పండగ వేళల్లో ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలు ఆఫర్లు కూడా ప్రకటిస్తుంటాయి. ఆ సమయంలో మనం ఖర్చు కోసం ఆలోచించం. చేతిలో credit card ఉండడం వల్ల పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తుంటాం. అయితే ఇది మన అప్పును పెంచడానికి కారణమవుతుంది. బిల్ వచ్చినప్పుడు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. డిఫాల్టయితే credit స్కోరు దెబ్బతింటుంది. జరిమానా కూడా తప్పదు. అంతేగాకుండా ఎక్కువ credit card లను కలిగి ఉండడం వల్ల రుణాలను track చేయడం కష్టమవుతుంది. కాబట్టి చిన్న, చిన్న ఆఫర్లు, డీల్స్ కోసం credit card లను ఆశ్రయించకపోవడం మంచింది. credit cardలను బాధ్యతాయుతంగా నిర్వహిస్తేనే మేలు.
మీ డబ్బును దాయండి
మీరు ఏదైనా పాలసీ తీసుకోవాలనుకుంటే లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ ఇచ్చేదాన్ని ఎంపిక చేసుకోవాలి. కొంతమంది friends కి డబ్బులు ఇస్తారు. అయితే ఆ డబ్బులు మనం తర్వాత అడగడం అలవాటు చేసుకోవాలి. లేకపోతే వాళ్ళు మనకి అవసరం లేదనుకుని ఖర్చులు పెట్టేస్తారు. కొంతమంది రిటర్న్ ఇచ్చేస్తారు.
They Don’t Negotiate
బేరం ఆడరు
మనం ఏదైనా వస్తువు తీసుకున్నపుడు బేరం ఆడడానికి ఆలోచిస్తాం. కాని కొన్ని వస్తువులు కొనేటప్పుడు బేరం ఆడవలిసిన సమయంలో ఆ పని చేయం. వ్యాపారులు వారి బెనిఫిట్ వాళ్ళు చూసుకుని మనకి వస్తువులను విక్రయిస్తుంటారు. ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలి. పండగలు , ఇతరత్రా వేడుల సమయాల్లో మనకి కొన్ని వస్తువులు ఆఫర్స్ వస్తుంటాయి. ఏ సీజన్లో ఆఫర్ వస్తున్నాయో తెలుసుకుని అప్పుడు కొనుక్కోవడం ఉత్తమం. మనం ప్రతిసారీ ఏ వస్తువు కొన్నా branded తీసుకోవాలనుకుంటాం. అయితే ఎప్పుడైనా మన చుట్టు పక్కల షాపులలో వస్తువులను చూసుకుని ధర తెలుసుకుని కొనుక్కోవాలి. వస్తువు నాణ్యత చూసి తీసుకోవడం ఉత్తమం. అన్ని branded వాడితే మన డబ్బులు చాలా లాస్ అయ్యే పరిస్థితి వస్తుంది.
lack of Budgeting
బడ్జెట్ వేయడం లేదు
మనకు ప్రతినెలా budget planning అవసరం. ప్రతి వస్తువుకోసం బడ్జెట్ అనేది క్లారిటీగా ఉండాలి. ముందు మనం బడ్జెట్ రాసుకోవాలి. బడ్జెట్ లో మనకి ఎంత ఖర్చు అవుతుందో లేదో మనకి ట్రాకింగ్ లో తెలిసిపోతుంది. ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నామో అంచనా వేసుకోవాలి. నెలచివరికి వచ్చేసరికి ఖర్చు లెక్కిస్తే మనం ఎక్స్ ట్రా ఖర్చు ఎక్కడ పెట్టామో, దానిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుస్తుంది. చాలామందికి Tracking Process లేకపోవడం వల్ల అప్పుల పాలైపోతున్నారు. ఫైనాన్షియల్ గా ఎదగలేకపోతున్నారు. చాలామంది మిడిల్ క్లాస్ వాళ్లు ఇంటి ఖర్చుల విషయంలో బడ్జెట్‌ను తయారుచేసుకోరు. బడ్జెట్ తయారుచేసుకున్న వారు కూడా కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇందులో బడ్జెట్ రాయకపోవడం అతిపెద్ద తప్పు. బడ్జెట్ రాసిపెట్టుకున్నప్పుడు ఎంత ఖర్చు చేస్తున్నాం? ఎంతవరకు చేయవచ్చు? అనేవాటిపై మనకు స్పష్టత ఉంటుంది. భవిష్యత్ ఖర్చులను కూడా అంచనా వేస్తేనే బడ్జెట్ సరైన విధంగా ఉంటుంది. చాలా మంది ఆసక్తితో బడ్జెట్ రాయడం మొదలు పెడతారు. కానీ ఒకటి లేదా రెండు నెలల్లో ఆపేస్తుంటారు. దీర్ఘకాలం పాటు రాస్తుంటేనే ఖర్చుల మీద అవగాహన ఉంటుంది. తప్పులు తెలుసుకోవచ్చు. ఖర్చులను తగ్గించుకుని సొమ్మును పొదుపు చేయొచ్చు.
విహారయాత్రలకు ఎక్కువ ఖర్చు
మనం ఏదైనా వెకేషన్ కి వెళ్ళినపుడు అక్కడ ఖర్చులకు తగ్గట్లుగా ముందుగానే బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి.లేకపోతే వెళ్ళిన తర్వాత ఎక్కువ ఖర్చులు అవుతాయి. ఈ విధంగా కూడా ఆర్థిక ఇబ్బందులు చాలా జరుగుతాయి. విహార యాత్రలు, తీర్థయాత్రలు, పుణ్యకేత్రాలు తదితర సందర్శనలకు వెళ్లేటప్పుడు ఆచితూచి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇందుకోసం కొంత నగదును ముంస్తుగానే సిద్ధం చేసుకోవాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవు.
Delayed debt payments
రుణ చెల్లింపులు ఆలస్యం
tax planning ఆలస్యమయినా, గడువులోగా పనులు పూర్తి చేయకపోయినా పెనాల్టీలు చెల్లించాల్సి వస్తుంది. ఈ పనులు ముందే ప్లాన్ చేసుకుంటే, అవకాశం Tax saving opportunities లను గుర్తించవచ్చు. వాయిదా వేయడం వల్ల అవసరమైన దానికంటే ఎక్కువ పన్నులు చెల్లించాల్సి రావచ్చు. అప్పులకు సంబంధించిన ఈఎంఐలను లేట్ చేసే కొద్ది ఫైన్ పడిపోతుంది. అందువల్ల ఇలాంటివి ఆలస్యం చేయకుండా వాటిని చెల్లించాలి.
Living Beyond Means
స్థోమతకు మించి జీవించడం
మనకి స్థోమత లేకపోయినా అప్పులు చేసి కొత్త వస్తువులు కొంటాం. అప్పులు పెరుగుతున్న కొద్దీ జీవితం సంతోషంగా ఉండదు. అందువల్ల మన స్థోమతకి తగ్గట్టుగా ఏదైనా కొనుక్కోవాలి. ఉదాహరణకు నెలకు రూ.35వేలు సంపాదించే వారు కూడా రూ.80-90 వేలు ఖరీదు చేసే ఐఫోన్‌ను కొనుగోలు చేయాలని ఆశిస్తారు. అద్భుతంగా పనిచేసే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు రూ.15 వేలకే లభిస్తాయి. ఇవికూడా ప్రస్తుత కాలంలో అందరికీ ఉపయోగపడే అన్ని సేవలను అందిస్తాయి. కాబట్టి స్థోమత లేనివారు ఖర్చులను తగ్గించుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు, మరికొంతమంది జీవితంలో పూర్తిగా స్థిరపడకముందే కారు కొనుగోలుకు మొగ్గు చూపుతారు. కారు అవసరం కూడా వారికి రోజూ ఉండదు. కారుకు బీమా, పార్కింగ్ రుసుము, ఇతర నిర్వహణ ఖర్చులు చాలానే ఉంటాయి. ఇటువంటి అన్ని ఖర్చులతో పాటు బ్యాంకుకు చెల్లించే ఈఎంఐ మొత్తం కూడా వేలల్లో ఉంటుంది. ఇలాంటి అధిక ఖర్చలు చెల్లించే బదులు ఆ డబ్బులను మంచి పొదుపు పథకంలో వేసి రాబడిని పెంచుకోవచ్చు. మన దైనందిన జీవితంలో చాలా ఖర్చులను తగ్గించుకుని డబ్బులను ఆదా చేయొచ్చు. ఖర్చుల విషయంలో సమర్థమైన డబ్బు నిర్వహణ మనల్ని విజయతీరాలకు చేరుస్తుంది.
Know about your investment
మీ పెట్టుబడి గురించి తెలుసుకోండి
స్టాక్ మార్కెట్లో Trading చెయ్యడం తప్పుకాదు. కానీ మనకి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ పై అవగాహన తెచ్చుకుని అప్పుడు మనం ఇన్వెస్ట్ మెంట్ చెయ్యాలి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చివరిగా లాటరీస్, బెట్టింగ్ లు వీటివల్ల కూడా చాలా డబ్బులు లాస్ అయ్యినవారు ఉన్నారు. బెట్టింగ్ లో, లాటరీలో ఇన్వెస్ట్ చెయ్యడం కరెక్ట్ కాదు. మనం మనీని నెగ్లెట్ చేసినన్నీ రోజులు మనీ మన నుంచి దూరమైపోతుంది. భారీ లాభాలు పొందాలనే ఆశతో గుడ్డిగా పెట్టుబడి పెట్టవద్దు. దీనికి బదులుగా మీ లక్ష్యాలకు తగ్గట్లు సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ సెలక్ట్ చేసుకోండి. పదవీ విరమణ కోసం, ఇంటి డౌన్ పేమెంట్ కోసం, పిల్లల ఉన్నత విద్య.. ఇలాంటి అవసరాలకు ప్రత్యేకంగా మనీ సేవ్ చేయాలనుకుంటే టైమ్‌లైన్, రిస్క్ టాలరెన్స్‌కు సరిపోయే ఇన్వెస్ట్‌మెంట్‌లను సెలక్ట్ చేసుకోవచ్చు.
Never Depend on a Single income
ఒకే ఆదాయంపై ఎప్పుడూ ఆధారపడకండి
మనం యుక్తవయసులో ఉన్నప్పుడే సెకెండ్ ఇన్ కమ్ జనరేట్ చేసుకోవడం మంచిది. మనకి ఒక ఇన్ కమ్ కి ఇబ్బంది వచ్చిన ఇంకొక ఇన్ కమ్ మనకి వచ్చినట్లు ప్లాన్ చేసుకోవాలి. ఉదాహరణకు చదువుతూ.. ఏదైనా పార్ట్‌టైం జాబ్ చేయొచ్చు. ఒకవేళం ఉద్యోగం చేస్తే ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు, సాయంత్రం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆన్‌లైన్ వర్క్‌లు చేసుకోవచ్చు. ఎంత త్వరగా పదవీ విరమణ కోసం పొదుపు చేయడం ప్రారంభిస్తే, మలి వయసులో ఆర్థికంగా అంత బలంగా ఉంటారు. చిన్న వయస్సులో ఉన్నప్పటికీ, రిటైర్‌మెంట్ ప్లానింగ్ అస్సలు వాయిదా వేయకండి. ఈ విషయంలో మీరు వేసే ప్రతి చిన్న అడుగు దీర్ఘకాలంలో ఊహించని ఫలితాలను అందిస్తుంది.
Reduce small costs too
ఈ ఖర్చులనూ తగ్గించుకోండి
* కొంతమంది ఏడాది పొడవునా జిమ్, క్లబ్ ఫీజులు చెల్లించి సక్రమంగా హాజరవ్వరు. దీనివల్ల దానిపై చేసిన ఖర్చు వృథా అవుతుంది. digital subscription విషయంలో కూడా ఇదే జరుగుతుంది. టీవీలో అనేక చానళ్లను చూడకపోయినా సరే ఎక్కువ చానళ్లకు డబ్బు చెల్లిస్తుంటాం. మనం రోజూ చూసే చానళ్లను మాత్రమే ఎంచుకుంటే ఖర్చు తగ్గి డబ్బు ఆదా అవుతుంది. మరికొంత మంది చదవకపోయినా సరే అనేక మ్యగజైన్లు, న్యూస్‌పేపర్లను ఇంటికి తెప్పిస్తారు. ఇందులో ఎక్కువ చదవగలిగేవే తీసుకోవడం ఉత్తమం. ఖర్చులు కూడా తగ్గుతాయి.
* ఇల్లు అనేది ఎవరికైనా అవసరమే. ప్రాథమిక అవసరాలను తీర్చేది కూడా ఇల్లే. అయితే చాలామంది ఎక్కువ అద్దె ఇచ్చి సిటీ మధ్యలో ఇరుకు ఇళ్లలో నివసిస్తుంటారు. దీనికి బదులుగా పట్టణ శివారుకు మారడం మంచింది. దీనివల్ల అద్దె కలిసి వస్తుంది. ఇల్లు సౌకర్యంగా ఉంటుంది. ఇంటిని కొనుగోలు చేసినా సరసమైన ధరకు లభించే శివారు ప్రాంతాలకు వెళ్లడం మంచిది. దీనివల్ల కొనుగోలు మొత్తంలో చాలా ఎక్కవ డబ్బును ఆదా చేసుకోవచ్చు.
* ప్రస్తుత కాలంలో విద్యుత్ వినియోగం అనేది చాలా కామన్. అంతేకాకుండా రకరకాల విద్యుత్ ఉపకరాణాలు కూడా బాగా పెరిగిపోయాయి. దీంతో ప్రతి ఇంటిలో వాటి వాడకం కూడా గణనీయంగా పెరిగింది. అయితే వాటిని పొదుపుగా వాడుకోవాలి. మనుషులు లేనిచోట ఫ్యాన్, ఏసీ, లైట్లు, టీవీలు వేసి ఉంచొద్దు . ఇంటికి అనవసర లైటింగ్ ఎఫెక్ట్‌లను పెంచవద్దు. ఇలాంటి అనవసర ఖర్చులను తగ్గిస్తే చాలా వరకు మనం పొదుపు చేసుకోవచ్చు. విద్యుత్ విషయంలో ఒక యూనిట్‌ను పొదుపు చేస్తే విద్యుత్ బిల్లులు కూడా తక్కువగా వచ్చే అవకాశం ఉంది. వీలైతే విద్యుత్ ఖర్చులను తగ్గించుకోవడానికి సోలార్ పానెల్స్‌ను అమర్చుకోవాలి.
* వివాహం అనేది జీవితంలో ఒక మధురమైన ఘట్టం. అయితే పెళ్లి వేడుక ఎప్పుడేతే ఘనంగా కావాలని ఆశిస్తారో ఖర్చులు కూడా అంతే భారీగా పెరిగే అవకాశం ఉంది. పెళ్లి వ్యవహారాల్లో ఖర్చులు ఎలా ఉంటాయో చాలామందికి అనుభవంగా తెలిసిన విషయమే. భారత్‌లో వధూవరుల కుటుంబాలు వివాహానికి అడ్డూ అదుపు లేకుండా ఖర్చు పెడుతుంటాయి. భారత్‌లో ఎక్కువ మంది మధ్యతరగతి వర్గాల వారే అధికం. వారికి పెళ్ళి ఖర్చు ఒక భారీ బడ్జెట్ లాంటిదేనని చెప్పొచ్చు. భారత్‌లో ఒక మధ్యతరగతి వ్యక్తి తన 30 ఏళ్ల ఉద్యోగ జీవితంలో సంపాదించిన పీఎఫ్ డబ్బును ఈ వేడుకలోనే ఖర్చు పెట్టేస్తున్నారని కొన్ని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంటికి ఖర్చు పెడితే ఇళ్లు మన కళ్ల ముందు కనిపిస్తుంది. చదువుకు పెట్టిన ఖర్చు ఎక్కడికీ పోదు. జీవితాంతం ఆ విద్య ఆవ్యక్తినే కాకుండా మొత్తం కుటుంబాన్నే పోషిస్తుంది. కానీ పెళ్లికి పెట్టిన ఖర్చు మాత్రం ఆ రోజే కనిపిస్తుంది. ఆ తర్వాత కనిపించదు . కాబట్టి వివాహం, పుట్టినరోజు వేడుకల ఖర్చుల విషయంలో మిడిల్‌క్లాస్ వాళ్లు సంయమనం పాటించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం చేసే పొరపాట్లే ఇంకా మనల్ని మధ్యతరగతిలో ఉంచుతాయి. వీటినే మనం ఇంకా కొనసాగిస్తే పేదరికంలోకి వెళ్లే అవకాశం కూడా ఉంది.