Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

అద్దె ఇల్లా.. సొంతిల్లా..? ఏది మంచిది? Which is Better – Renting or Owning a Home?

Posted on 01/11/202501/11/2025 By admin No Comments on అద్దె ఇల్లా.. సొంతిల్లా..? ఏది మంచిది? Which is Better – Renting or Owning a Home?

సొంతిల్లు అనేది ప్ర‌తిఒక్క‌రి క‌ల‌. కానీ ఆ కలను నిజం చేసుకునే ముందు చాలామంది మ‌దిలో ఒక ప్ర‌శ్న మెదులుతుంది. “ఇప్పుడే సొంత ఇల్లు కొంటే మంచిదా..? లేక అద్దె ఇంట్లో ఉండడమే బెటరా..?” అని. ఈ ప్రశ్నకు సమాధానం ప్రతి ఒక్కరి పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ.. కొన్ని ఆర్థిక లెక్కలతో, వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే స్పష్టత వస్తుంది. ఇల్లు అంటే కేవలం కట్టడమే కాదు . మన ఆర్థిక శక్తి, భవిష్యత్‌ ప్రణాళికల ప్రతిబింబం. అద్దె ఇల్లు సౌకర్యం ఇస్తుంది. సొంత ఇల్లు భద్రత ఇస్తుంది. మీ ఆదాయం, జీవనశైలి, భవిష్యత్‌ లక్ష్యాలు బట్టి ఏది సరైనదో నిర్ణయించుకోవాలి.

సొంత ఇల్లు – ఆస్తి, బాధ్యత కూడా

సొంత ఇల్లు అంటే భద్రత, ఆత్మీయత, శాశ్వతం కూడా. ప్రతి నెల అద్దె చెల్లించాల్సిన అవసరం ఉండదు. భవిష్యత్తులో ఆ ఇల్లు విలువ పెరగొచ్చు. అయితే.. హౌసింగ్‌ లోన్‌ వడ్డీ భారం, ప్రాపర్టీ ట్యాక్స్‌, మెయింటెనెన్స్‌ ఖర్చులు కూడా భ‌రించాల్సి ఉంటుంది. ఉదాహరణకు, ₹50 లక్షల విలువైన ఫ్లాట్‌ కొనాలంటే సుమారు ₹10–₹12 లక్షల డౌన్‌ పేమెంట్‌ అవసరం. బ్యాలెన్స్‌ లోన్‌పై ప్రతి నెల ₹40–₹50 వేల వరకు EMI చెల్లించాల్సి రావచ్చు.

అద్దె ఇల్లు – తాత్కాలిక ఖర్చు, కానీ సౌలభ్యం ఎక్కువ!
Rented House – A Temporary Expense, But Greater Convenience!

అద్దె ఇల్లు అంటే ఆస్తి కాదు, కానీ సౌలభ్యం మాత్రం ఎక్కువ. ఉద్యోగం మారినా, నగరం మార్చుకున్నా పెద్ద ఇబ్బంది ఉండదు. ₹50 వేల EMI కంటే ₹15–₹20 వేల అద్దెతో మంచి ఇంట్లో ఉండొచ్చు. ఆ మిగిలిన డబ్బు ఇన్వెస్ట్‌మెంట్‌లో పెడితే returns కూడా ఎక్కువగా రావచ్చు. ఇల్లు కొంటే మనకి “ఆస్తి” వస్తుంది, కానీ అప్పు భారం కూడా వస్తుంది. అద్దె ఇంట్లో ఉంటే “సౌకర్యం” ఉంటుంది, కానీ ఆస్తి మాత్రం ఉండదు.

ఎవరికి ఏది బెటర్? Which Option Suits Whom?

స్థిరమైన ఉద్యోగం, ఒకేచోట ఎక్కువకాలం ఉండే వారికి సొంత ఇల్లు మంచిదే.

ఎక్కువగా ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యే ఉద్యోగాలు, వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ లేదా ఇతర నగరాల్లో పని చేసే వారికి అద్దె ఇల్లు ప్రాక్టికల్‌ ఆప్షన్‌.

యువ జంటలు, కొత్తగా కెరీర్‌ మొదలుపెట్టిన వారు కొంతకాలం అద్దెలో ఉండి, తరువాత సొంత ఇల్లు గురించి ఆలోచించాలి.

సొంత ఇల్లులో లాభాలు.. Advantages of Owning a Home

భద్రత, సొంత స్థలం భావన
భవిష్యత్‌లో ఆస్తి విలువ పెరిగే అవకాశం
పన్ను మినహాయింపులు (హౌసింగ్ లోన్‌పై)

Disadvantages of Owning a Home

భారీ వడ్డీ భారంతో EMI ఒత్తిడి
ఉద్యోగం మారితే లొకేషన్‌ సమస్య
మెయింటెనెన్స్‌, ప్రాపర్టీ ట్యాక్స్‌ ఖర్చులు

అద్దె ఇంట్లో లాభాలు.. Advantages of Living in a Rented House

తక్కువ నెలవారీ భారం
ఉద్యోగం మారితే సులభంగా మార్పు
మిగిలిన డబ్బుతో ఇతర పెట్టుబడులు చేయగల అవకాశం

నష్టాలు.. Disadvantages of Living in a Rented House

ఆస్తి రూపంలో ఎదుగుదల ఉండదు
అద్దె పెరుగుదల, ఇంటి మార్పుల ఇబ్బంది
ఎప్పటికీ “ఇల్లు మనదే” అనే భద్రతా భావం రాదు

 

ఏ వయసులో ప్లాన్ చేయాలంటే..?

At What Age Should You Plan to Buy a House?

చాలామంది కెరీర్‌ ప్రారంభ దశలోనే ఇల్లు కొనాలనే ఉత్సాహం చూపిస్తారు. వయసు తక్కువగా ఉండడం వల్ల లోన్‌ టెన్యూర్‌ ఎక్కువగా తీసుకోవచ్చు. ఉదాహరణకు, 25 ఏళ్ల వయసులో లోన్‌ తీసుకుంటే 20–25 ఏళ్ల కాలపరిమితి సులభంగా లభిస్తుంది. EMI కూడా తక్కువగా ఉంటుంది. అదే సమయంలో ఇల్లు విలువ పెరిగే అవకాశం ఎక్కువ. మీ వయస్సు పెరిగేకొద్దీ ఆర్థిక స్వేచ్ఛ పొందొచ్చు. అయితే ఉద్యోగం ప్రారంభ దశలో ఆదాయం తక్కువగా ఉండడం వల్ల EMI ఒత్తిడి ఉంటుంది.

30–40 ఏళ్ల మధ్య ఇల్లు కొనడం చాలామంది ఆచరణలో పెట్టే నిర్ణయం. ఈ దశలో ఆదాయం స్థిరంగా ఉంటుంది. పొదుపు కూడా పెరిగి, డౌన్‌పేమెంట్‌కు సరిపడే మొత్తం దాచుకోవచ్చు. అయితే వయసు పెరగడం వల్ల లోన్‌ టెన్యూర్‌ తగ్గి, EMI కొద్దిగా పెరగవచ్చు. 40 ఏళ్ల తర్వాత ఇల్లు కొనాలంటే– ఆచరణలో జాగ్రత్తలు అవసరం. ఈ దశలో ఆదాయం ఎక్కువైనా, రిటైర్మెంట్‌ సమయం దగ్గరగా ఉంటుంది. అందుకే ఎక్కువకాల లోన్‌ తీసుకోవడం కష్టం. EMI ఎక్కువగా ఉండవచ్చు.

కాబట్టి పెద్ద ఇల్లు కాకుండా స్మార్ట్‌ బడ్జెట్‌ ఇల్లు లేదా సెకండ్‌ హౌస్‌ ఆప్షన్లు బెటర్‌. లోన్‌ టెన్యూర్‌ను తగ్గించుకోవాలి. డౌన్‌పేమెంట్‌ను ఎక్కువగా పెట్టుకోవాలి. ఇతర పెట్టుబడులను కొనసాగించాలి.

ఆర్థిక ప్రణాళిక ఇలా ఉండాలి .. Here’s How Your Financial Planning Should Be

ఎమర్జెన్సీ ఫండ్‌: కనీసం 6 నెలల ఖర్చు దాచుకోవాలి.

డౌన్‌పేమెంట్‌: ఇల్లు విలువలో 20–25% సొంతంగా చెల్లించగల స్థోమత ఉండాలి.

EMI నియమం: మీ నెలవారీ ఆదాయం లో 40% కన్నా ఎక్కువ EMI కాకూడదు.

పన్ను లాభాలు వినియోగించుకోండి: సెక్షన్‌ 80C, 24(b) కింద హౌసింగ్‌ లోన్‌పై మినహాయింపులు తీసుకోవాలి.

ఇన్సూరెన్స్‌: హౌస్‌ లోన్‌ లైఫ్‌ కవర్‌ తప్పనిసరిగా ఉండాలి.

 

ఇల్లు కొనే ముందు ఎన్నేళ్లు పొదుపు చేయాలి?
How Many Years Should You Save Before Buying a House?

ఇల్లు కొనాలనే లక్ష్యానికి కనీసం 5–7 ఏళ్ల ముందు నుంచే ప్లానింగ్‌ మొదలుపెట్టాలి. ఈ కాలంలో ప్రతినెలా స్థిరంగా పొదుపు చేస్తూ ఫండ్‌ సృష్టించాలి. ఉదాహరణకు: ప్రతి నెల ₹20,000ని సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (SIP)లో 7 సంవత్సరాలు పెట్టుబడి పెడితే, సగటు 10% రాబడితో సుమారు ₹20 లక్షల వరకు వస్తుంది. అదే డౌన్‌పేమెంట్‌గా ఉపయోగించుకోవచ్చు.

స్మార్ట్‌ సేవింగ్స్‌ ప్రణాళిక … Smart Savings Plan

లక్ష్యం నిర్ణయించుకోండి: ఇల్లు విలువ, కావలసిన మొత్తం లెక్కకట్టండి.
టైమ్‌ఫ్రేమ్‌ పెట్టుకోండి: కనీసం 5–7 ఏళ్ల ముందే పొదుపు ప్రారంభించండి.
SIP లేదా RD: చిన్న మొత్తాలతో ప్రారంభించి, ప్రతి సంవత్సరం పొదుపు పెంచండి.
హై రిస్క్‌ ఇన్వెస్ట్మెంట్‌లు: యువ వయసులో ఉంటే ఈక్విటీ ఫండ్స్‌, హైబ్రిడ్‌ ఫండ్స్‌లో పెట్టుబడి బెటర్‌.
సేఫ్‌ ఆప్షన్లు: వయసు పెరిగినవారు FD, PPF, NPS వంటి సురక్షిత మార్గాలను ఎంచుకోవచ్చు.
పొదుపు మాత్రమే కాదు . అప్పులు త‌గ్గించుకోవాలి. క్రెడిట్‌ స్కోర్‌ మెరుగుపర‌చుకోవాలి (700+ ఉండాలి)

ఇల్లు కొన్న త‌ర్వాత భార‌మైతే ఏం చేయాలి.. What to Do If Buying a House Becomes a Burden? 

ఓ ఇంటిని కొనుగోలు చేసిన త‌ర్వాత‌ కొన్నాళ్లకు ఎంఐల చెల్లింపు భార‌మైతే.. ఖర్చులు మించి ఒత్తిడి ఎక్కువైతే
ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు . స్మార్ట్‌ ఆర్థిక ప్రణాళికతో ఈ భారాన్ని తగ్గించుకోవచ్చు. ఇటీవలి కాలంలో RBI మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు లోన్‌ రీస్ట్రక్చరింగ్‌కు అవకాశం ఇస్తున్నాయి. అంటే EMI మొత్తాన్ని తగ్గించడం లేదా టెన్యూర్‌ (కాలపరిమితి)ను పెంచడం ద్వారా తాత్కాలిక ఉపశమనం పొందవచ్చు.

ఉదాహరణకు – ₹45,000 EMIను ₹35,000కు తగ్గించుకునేలా టెన్యూర్‌ను 3–5 సంవత్సరాలు పెంచడం సాధ్యం. తాత్కాలిక ఉపశమనం కావాలంటే టెన్యూర్‌ పెంచడం మంచిది, కానీ దీర్ఘకాల వడ్డీ భారాన్ని గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు.

వడ్డీ రేటు తగ్గించుకోవాలి.. Look for Opportunities to Reduce the Interest Rate

వడ్డీ రేట్లు తగ్గినప్పుడు, మీ లోన్‌ రీఫైనాన్స్‌ (బ్యాలెన్స్‌ ట్రాన్స్‌ఫర్‌) చేసుకోవచ్చు. ఉదాహరణకు 9% వడ్డీ ఉన్న లోన్‌ను 8% వడ్డీకి మార్చితే, సంవత్సరానికి ₹50,000–₹60,000 వరకు ఆదా అవుతుంది. అందుకే ప్రతి రెండేళ్లకు ఒకసారి మీ హౌసింగ్‌ లోన్‌ రివ్యూ చేయడం మంచిది.

అదనపు చెల్లింపులతో EMI ఒత్తిడి తగ్గించుకోవాలి
Reduce EMI Burden with Additional Payments

సాలరీ ఇన్‌క్రిమెంట్‌ లేదా బోనస్‌ వచ్చినప్పుడు, పార్ట్‌ ప్రీపేమెంట్‌ చేయండి. ఒక్కసారిగా ₹2–₹3 లక్షలు చెల్లిస్తే, మొత్తం లోన్‌ కాలపరిమితి 2–3 సంవత్సరాలు తగ్గుతుంది. దీని వల్ల మొత్తం వడ్డీ భారమూ గణనీయంగా తగ్గుతుంది.

ఖర్చులను స‌మీక్షించాలి.. Review Your Expenses

EMI భారమవుతోందంటే మీ ఖర్చుల లెక్క తప్పుతోందన్న మాట. అవసరం లేని సబ్‌స్క్రిప్షన్‌లు రద్దు చేయండి. పెద్ద ఖర్చుల ముందు “EMI సామర్థ్యాన్ని” గమనించండి. స్మార్ట్‌ బడ్జెట్‌ యాప్‌లు ఉపయోగించండి

అద్దెకు ఇవ్వడం లేదా లీజ్‌కి ఇవ్వ‌డం
Consider Renting Out or Leasing the Property

మీరు రెండు బెడ్‌రూమ్‌ ఫ్లాట్‌లో ఉంటే, ఒక రూమ్‌ అద్దెకు ఇచ్చి EMI భారాన్ని తగ్గించవచ్చు. లేదా ఇల్లు ఒక నగరంలో ఉండి, మీరు మరొక చోట పని చేస్తే, పూర్తి ఇల్లు అద్దెకు ఇవ్వండి. ఇలా వచ్చిన అద్దె ఆదాయం EMIకి సహాయపడుతుంది. లీజ్‌కు ఇవ్వ‌డం వ‌ల్ల కూడా కొంత భారాన్ని త‌గ్గించుకోవ‌చ్చు.

అవసరమైతే అమ్మడం కూడా ఆప్షన్‌.. Selling the Property Can Also Be an Option, If Needed

చాలా సందర్భాల్లో, ఆస్తి విలువ పెరిగినప్పుడు అమ్మడం మంచిదే. కొత్తగా తక్కువ ధరలో ఉన్న ఫ్లాట్‌ లేదా రీసేల్‌ హౌస్‌లోకి మారి EMI భారాన్ని తగ్గించుకోవచ్చు. నష్టమేమీ కాకుండా భవిష్యత్‌ భారం తగ్గుతుంది.

నిపుణుల సూచనలు.. Expert Suggestions

హౌసింగ్‌ లోన్‌ కోసం EMI / ఆదాయం నిష్పత్తి 40% దాటకూడదు. ఎమర్జెన్సీ ఫండ్‌ లేకుంటే ఇల్లు కొనడం ఆలస్యం చేయడం మంచిది. EMI సమస్యలు వచ్చినప్పుడు బ్యాంకుతో ముందుగానే మాట్లాడాలి — డీఫాల్ట్‌ కాకముందే పరిష్కారం సులభం.

 

221
FEATURE NEWS, FINICAL PLANNING, MONEY TIPS Tags:Advantages of Living in a Rented House, Advantages of Owning a Home, At What Age Should You Plan to Buy a House?, But Greater Convenience!, Consider Renting Out or Leasing the Property, Disadvantages of Living in a Rented House, Disadvantages of Owning a Home, Expert Suggestions, Here’s How Your Financial Planning Should Be, How Many Years Should You Save Before Buying a House?, If Needed, Look for Opportunities to Reduce the Interest Rate, Own House – An Asset, Reduce EMI Burden with Additional Payments, Rented House – A Temporary Expense, Review Your Expenses, Selling the Property Can Also Be an Option, Smart Savings Plan, What to Do If Buying a House Becomes a Burden?, Which Option Suits Whom?, Yet a Responsibility!

Post navigation

Previous Post: మ్యూచువల్‌ ఫండ్ సంస్థ‌లు వ‌సూలు చేసే రుసుములకు క‌ళ్లెం.. A Check on the Fees Charged by Mutual Fund Companies
Next Post: ఆరోగ్య బీమా.. అన్ని వ‌య‌స్సుల్లో ఆదుకునేలా? Health Insurance – A Lifeline for All Ages!

Related Posts

  • ఐపీఓలకు ఊరట.. గడువు పొడిగించిన సెబీ FEATURE NEWS
  • హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు డిపాజిటర్లకు గుడ్‌న్యూస్.. ! Good News for HDFC Bank Depositors FEATURE NEWS
  • వెల్త్ బిల్డింగ్ మంత్రం | లోన్లు–ఆస్తులు ఎలా ప్లాన్ చేసుకోవాలి? How to Build Wealth | Smart Loans & Asset Planning FINICAL PLANNING
  • కీ పేడ్ ఫోన్‌లోనూ మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్‌ money transactions are possible in keypad mobile FEATURE NEWS
  • ఆన్‌లైన్‌లోనే అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌ how to apply atal pension yojana in online FEATURE NEWS
  • charges of Buying and selling shares in stock market స్టాక్ మార్కెట్ ఛార్జస్ గురించి తెలుసుకుందాం… FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • మ‌నీ మాస్ట‌ర్ ది గేమ్ బుక్ స‌మ‌రీ money master the game book summary telugu BOOKS
  • వంటనూనెల దిగుమతులు పెరిగాయ్ NEWS
  • ఏఐ సూచ‌న‌ .. జీతానికి ర‌క్ష‌! AI Guidance… A Shield for Your Salary! FEATURE NEWS
  • క్యూఆర్ కోడ్ స్కాన్ చేయక్కర్లేదు.. కెమెరా లేకుండానే యూపీఐ చెల్లింపులు.. No Need to Scan QR: Easy UPI Payments Without Camera FEATURE NEWS
  • ఏదీ స‌రైన పెట్టుబ‌డి..? FEATURE NEWS
  • ఆన్‌లైన్‌లో డ‌బ్బులు సంపాదించుకునే మార్గాలేమిటి What are the ways to make money online FEATURE NEWS
  • బడ్జెట్ రోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందో తెలుసా! Do You Know How the Stock Market Behaves on Budget Day? FEATURE NEWS
  • HDFC & HDFC BANK మెర్జింగ్ తో లాభ‌మేనా what are the benefits of HDFC merging MARKET

Copyright © 2026.

Powered by PressBook News Dark theme