కొత్త ఆర్థిక సంవత్సరం (2026–27) ఆరంభానికి కేవలం కొన్నిగంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. అయితే ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఏప్రిల్ 1 నుంచి అనేక మార్పులు అమల్లోకి (New Financial Year Brings Major Changes ) రానున్నాయి. అయితే ఈసారి ప్రత్యేకత ఏమిటంటే… ఈ మార్పులు కేవలం పన్నులకే పరిమితం కాకుండా ఉద్యోగులు, వ్యాపారులు, పెట్టుబడిదారులు, సాధారణ ప్రజలు, రైల్వే ప్రయాణికులు… దాదాపు ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపనున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఆదాయపు పన్ను చట్టం, లేబర్ కోడ్స్, బడ్జెట్ ప్రతిపాదనలు, బ్యాంకింగ్ మార్పులు, రైల్వే నిబంధనలు.. ఇలా అనేక అంశాలు కలిపి ఈసారి మార్పుల సంఖ్యను గణనీయంగా పెంచాయి. ఈ నేపథ్యంలో ఈ మార్పులు ఏంటి? ఇవి మన జీవితంపై ఎలా ప్రభావం చూపుతాయి? అనే అంశాలను సమగ్రంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
కొత్త ఆదాయపు పన్ను చట్టం… సరళతే లక్ష్యం.. New Income Tax Law Aims for Simplicity
1961 నుంచి అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టానికి బదులుగా కేంద్ర ప్రభుత్వం “ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, 2025” పేరుతో కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి (New Financial Year Brings Major Changes )రానుంది. ఈ చట్టాన్ని రూపొందించడంలో ప్రధాన ఉద్దేశ్యం.. పన్ను వ్యవస్థను సరళీకరించడం. పన్ను చెల్లింపుదారులు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న క్లిష్టతను తగ్గించేలా ఈ చట్టం రూపుదిద్దుకుంది. ముఖ్యంగా సాధారణ వ్యక్తికి అర్థమయ్యే భాషలో చట్టాన్ని రూపొందించడం విశేషం. అయితే పన్ను శ్లాబులు, రేట్లలో పెద్దగా మార్పులు లేకపోవడం గమనించాల్సిన అంశం.
ఫైనాన్షియల్ ఇయర్‌కు బదులు ‘ట్యాక్స్ ఇయర్’.. Introduction of a Single ‘Tax Year’ Concept
ఇప్పటి వరకు ఫైనాన్షియల్ ఇయర్ (FY), అసెస్మెంట్ ఇయర్ (AY) అనే రెండు పదాలు ఉండటం వల్ల చాలామంది గందరగో ళానికి గురయ్యేవారు. ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం “ట్యాక్స్ ఇయర్” అనే కొత్త పదాన్ని ప్రవేశపెట్టింది. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉండే (New Financial Year Brings Major Changes )కాలాన్ని ఇకపై ట్యాక్స్ ఇయర్‌గా పరిగణిస్తారు. దీంతో పన్ను వ్యవస్థ మరింత స్పష్టంగా మారనుంది.
హెచ్ఆర్ఏలో భారీ మార్పులు… మరిన్ని నగరాలకు లాభం.. HRA Benefits Extended to More Cities
ఇంటి అద్దె భత్యం (HRA) విషయంలో కూడా కీలక మార్పు చోటుచేసుకుంది. ఇప్పటి వరకు మెట్రో నగరాలుగా గుర్తించిన నాలుగు నగరాల్లో (దిల్లీ, ముంబయి, కోల్‌కతా, చెన్నై) నివసించే వారికి మాత్రమే 50% వరకు మినహాయింపు లభించేది. ఇప్పుడు ఆ జాబితాలో హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్, బెంగళూరు కూడా చేరాయి. దీంతో ఈ నగరాల్లో నివసించే ఉద్యోగులకు పెద్ద ఊరట లభించనుంది. అయితే ఈ మినహాయింపులు పొందాలంటే అద్దె ఒప్పందం, యజమాని వివరాలు, పాన్ వివరాలు ఇవ్వడం తప్పనిసరి.
లేబర్ కోడ్స్ ప్రభావం… చేతికి వచ్చే జీతం తగ్గే అవకాశమా? Labour Codes May Impact Take-Home Salary
కొత్త లేబర్ కోడ్స్ ప్రకారం (New Financial Year Brings Major Changes )ఉద్యోగుల బేసిక్ సాలరీ మొత్తం జీతంలో కనీసం 50% ఉండాలి. ప్రస్తుతం చాలా సంస్థల్లో ఇది 30–40% మధ్యలో ఉంది. ఈ మార్పుతో పీఎఫ్, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాల కోసం కేటాయించే మొత్తం పెరుగుతుంది. దీని వల్ల భవిష్యత్ భద్రత పెరిగినప్పటికీ, నెలవారీ చేతికి వచ్చే జీతం కొంత తగ్గే అవకాశం ఉంది.
ఎఫ్అండ్ఓ ట్రేడర్లకు షాక్… ఎస్టిటి పెంపు.. Higher STT for F&O Traders
స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ట్రేడింగ్ చేసే వారికి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (STT)ను పెంచింది. ఫ్యూచర్స్‌పై 0.02% నుంచి 0.05%కి, ఆప్షన్స్‌పై కూడా గణనీయంగా పెంపు చేసింది. దీంతో ట్రేడింగ్ ఖర్చులు పెరగడం ఖాయం.
పాన్ నిబంధనల్లో కఠినతరం.. PAN Rules Tightened Across Transactions
పాన్ కార్డు సంబంధిత నిబంధనల్లో పెద్ద మార్పులు (New Financial Year Brings Major Changes ) చోటుచేసుకున్నాయి. ఇప్పటి వరకు ఆధార్‌తోనే పాన్ పొందడం సాధ్యమయ్యేది. ఇకపై ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, జనన ధృవపత్రం వంటి అదనపు పత్రాలు అవసరం. అంతేకాకుండా బ్యాంక్ లావాదేవీలు, ఆస్తి కొనుగోలు, వాహనాలు, హోటల్ బిల్లులు—ఇలా అనేక రంగాల్లో పాన్ తప్పనిసరి చేస్తున్నారు. రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు లావాదేవీలకు, రూ.20 లక్షల పైబడిన ఆస్తి లావాదేవీలకు, రూ.5 లక్షల కంటే ఎక్కువ విలువైన వాహనాలకు పాన్ తప్పనిసరి అవుతుంది.
ఇన్సూరెన్స్ పాలసీలపై కొత్త నిబంధనలు.. PAN Mandatory for All Insurance Policies
ఇప్పటి వరకు సంవత్సరానికి రూ.50 వేల ప్రీమియం దాటితేనే పాన్ అవసరం ఉండేది. ఇకపై ప్రతి పాలసీకి పాన్ ఇవ్వడం తప్పనిసరి. ఇది పారదర్శకత పెంచడమే కాకుండా పన్ను ఎగవేతలను తగ్గించడంలో సహాయపడుతుంది.
రైల్వే ప్రయాణికులకు కఠిన నిబంధనలు.. Stricter Train Ticket Cancellation Rules
రైల్వే టికెట్ క్యాన్సిలేషన్ నిబంధనల్లో కూడా మార్పులు (New Financial Year Brings Major Changes ) చేశారు. రైలు బయల్దేరడానికి 8 గంటల లోపల టికెట్ రద్దు చేస్తే ఇకపై ఎలాంటి రిఫండ్ ఉండదు. ముందుగా ఇది 4 గంటలు మాత్రమే ఉండేది. ఇక 24 గంటల నుంచి 8 గంటల మధ్య రద్దు చేస్తే 50% కోత, 72 నుంచి 24 గంటల మధ్య రద్దు చేస్తే 25% కోత విధిస్తారు. దీంతో ప్రయాణికులు ముందుగానే ప్రణాళిక చేసుకోవాల్సిన అవసరం పెరుగుతుంది.
బ్యాంకింగ్, ఎల్పీజీ ధరల్లో మార్పులు.. Changes in Banking and LPG Prices
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎం నగదు ఉపసంహరణ పరిమితులను తగ్గించింది. కొన్ని కార్డులపై 50% వరకు పరిమితి తగ్గింపు అమలు చేసింది. అలాగే ఎల్పీజీ సిలిండర్ ధరలు కూడా పెరుగుతున్నాయి. మార్చిలోనే గృహ వాడుక గ్యాస్ రూ.60 పెరిగింది. ఏప్రిల్‌లో మరోసారి ధరలు సవరించే అవకాశం ఉంది. విమాన ఇంధన ధరలు కూడా పెరిగే అవకాశం ఉండటంతో ప్రయాణ ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి.
మార్పులు ఎందుకు? ప్రజలపై ప్రభావం ఎలా ఉంటుంది? Why These Changes and Their Impact?
ఈ మార్పుల (New Financial Year Brings Major Changes ) వెనుక ప్రధాన ఉద్దేశ్యం.. పన్ను వ్యవస్థను పారదర్శకంగా చేయడం, ఆర్థిక క్రమశిక్షణను పెంచడం, డిజిటల్ ట్రాకింగ్‌ను బలోపేతం చేయడం. అయితే సాధారణ ప్రజలపై వీటి ప్రభావం మిశ్రమంగా ఉంటుంది. కొందరికి లాభాలు ఉంటే, మరికొందరికి అదనపు భారంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగులకు భవిష్యత్ భద్రత పెరిగినా, ప్రస్తుతం చేతికి వచ్చే జీతం తగ్గవచ్చు. ట్రేడర్లకు ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణికులు ముందస్తు ప్రణాళిక అవసరం.
ముందస్తు అవగాహనతోనే లాభం.. Conclusion: Awareness is the Key
ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్పులు (New Financial Year Brings Major Changes ) సాధారణ విషయాలుగా కనిపించినా… దీర్ఘకాలంలో మన ఆర్థిక ప్రణాళికలను ప్రభావితం చేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. కాబట్టి ఉద్యోగులు, వ్యాపారులు, పెట్టుబడిదారులు, సాధారణ ప్రజలు.. ఎవరైనా సరే ఈ మార్పులను ముందుగానే అర్థం చేసుకుని తమ ఆర్థిక ప్రణాళికలను సవరించుకోవడం అవసరం. ఏదేమైనా మార్పులు తప్పనిసరి… కానీ అవగాహన ఉంటే అవే అవకాశాలుగా మారతాయి.
