టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వార్షిక వేతనం కొత్త రికార్డు సృష్టించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆయనకు ఈసారి గణనీయమైన పెంపు లభించింది. కంపెనీ తాజా ఆర్థిక నివేదికల ప్రకారం నాదెళ్ల మొత్తం పారితోషికం డాలర్లలో 101.3 మిలియన్ (భారత కరెన్సీలో సుమారు రూ.845.77 కోట్లు)గా నమోదైంది. 2024లో ఆయన పొందిన $79.1 మిలియన్ (రూ.664 కోట్లు) తో పోలిస్తే ఈసారి వేతనం 22 శాతం ఎక్కువగా ఉందని కంపెనీ వెల్లడించింది. కాగా కంపెనీ పనితీరు, మార్కెట్ విలువ, AI విభాగంలో మైక్రోసాఫ్ట్ సాధించిన పురోగతిని దృష్టిలో ఉంచుకుని ఈ పెంపు అమలులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. నాదెళ్ల వేతనంలో బేసిక్ సాలరీతో పాటు స్టాక్ ఆప్షన్లు, బోనస్‌లు, ఇతర ప్రోత్సాహకాలు ఉన్నాయి. సంస్థలో ఆయన నాయకత్వం వల్ల గత కొన్నేళ్లుగా మైక్రోసాఫ్ట్ లాభాలు గణనీయంగా పెరిగినట్లు బోర్డు పేర్కొంది. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సత్య నాదెళ్ల తీసుకువచ్చిన మార్పులు కంపెనీని కొత్త స్థాయికి తీసుకెళ్లాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ ప్రపంచంలో రెండో అతిపెద్ద టెక్ సంస్థగా నిలిచింది. ఈ క్రమంలో నాదెళ్ల వేతన పెంపు “సముచితం” అని కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి.
తెలంగాణ తేజం..Telangana Tejam
1967 ఆగస్టు 19న హైదరాబాద్‌లో జన్మించిన సత్య నాదెళ్ల బాల్యం నుంచే విజ్ఞానంపై మక్కువ చూపారు. చదువులో ఎల్లప్పుడూ ప్రతిభ చూపిన ఆయన మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత అమెరికా వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్ మిల్వాకీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చదివారు. అనంతరం చికాగో యూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ చేశారు.
1992లో మైక్రోసాఫ్ట్‌లో కి.. Joined Microsoft in 1992
1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరిన నాదెళ్ల, తన కృషి, విజన్ వల్ల సంస్థలోని కీలక బాధ్యతలు చేపట్టారు. క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ప్రొడక్టివిటీ సాఫ్ట్‌వేర్‌ల అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. 2014లో మైక్రోసాఫ్ట్ సీఈఓగా నియమితులైన ఆయన, సంస్థను కొత్త దిశగా నడిపించారు. విండోస్ యుగం నుంచి క్లౌడ్–AI ఆధారిత వ్యాపార నమూనా వైపు మైక్రోసాఫ్ట్‌ను మలిచారు. ఆయన నాయకత్వంలో కంపెనీ లాభాలు, మార్కెట్ విలువలు రికార్డులను సృష్టించాయి. శాంత స్వభావం, స్పష్టమైన దృష్టి, కఠిన నిర్ణయాలు.. ఇవే నాదెళ్ల విజయ రహస్యాలు. ప్రపంచ టెక్ రంగంలో ఆయన ఇప్పుడు ఒక ప్రేరణాత్మక వ్యక్తిత్వం.
ఉద్యోగిగా మొదలై… సీఈఓగా శిఖరానికి! Started as an employee… reached the pinnacle as CEO!
– సత్య నాదెళ్ల 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరిన సమయంలో ఆయనను ఎవరు గుర్తించలేదు… కానీ తన పనితీరుతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆదిలో విండోస్ డెవలప్‌మెంట్ టీమ్‌లో ఇంజనీర్‌గా పనిచేసి, క్లౌడ్, సర్వర్ రంగాలపై దృష్టిపెట్టారు.
– ఆ తర్వాత క్లౌడ్ విభాగానికి కొత్త ఊపు తెచ్చారు. 2000లలో మైక్రోసాఫ్ట్ దిశ మారుస్తుండగా, నాదెళ్ల క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో Azure సేవలు విపరీతంగా పెరిగి, కంపెనీ లాభాల్లో కీలక భాగమయ్యాయి. ఇదే ఆయనకు మైక్రోసాఫ్ట్ బోర్డులో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది.
2014లో సీఈఓగా నియామకం ..Appointed as CEO in 2014
2014లో స్టీవ్ బాల్మర్ స్థానంలో సత్య నాదెళ్లను మైక్రోసాఫ్ట్ సీఈఓగా నియమించారు. ఆ సమయంలో కంపెనీ వృద్ధి మందగమనం దశలో ఉండగా, ఆయన తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు మైక్రోసాఫ్ట్‌ను తిరిగి శిఖరానికి చేర్చాయి.
AI యుగానికి మైక్రోసాఫ్ట్ మార్పు..Microsoft’s Transformation for the AI Era
నాదెళ్ల నేతృత్వంలో మైక్రోసాఫ్ట్ కృత్రిమ మేధ (AI) రంగంలో విప్లవాత్మక పురోగతి సాధించింది. OpenAIతో భాగస్వామ్యం, Copilot, ChatGPT Integration, Azure AI లాంటి ఆవిష్కరణలు సంస్థకు కొత్త శకం తెచ్చాయి.
లాభాల్లో రికార్డులు..Record Profits
ఆయన నాయకత్వంలో కంపెనీ మార్కెట్ విలువ $3 ట్రిలియన్ దాటింది. మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే అత్యధిక లాభాలు, అత్యధిక వేతన ప్యాకేజ్ పొందిన సీఈఓలలో ఒకరుగా నాదెళ్ల నిలిచారు.
సత్య నాదెళ్ల జీవిత పాఠాలు..Life Lessons from Satya Nadella
1. విజన్ క్లియర్‌గా ఉండాలి. భవిష్యత్తు మన ఆలోచనలలోనే మొదలవుతుంది.
2. లీడర్ అంటే టీమ్‌కి స్ఫూర్తి అని ఆయన ఎప్పుడూ చెబుతారు . నాయకుడు అంటే ఆదేశించేవాడు కాదు, ప్రేరేపించేవాడు. తన బృందం ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వడం, ప్రతి ఉద్యోగిని భాగస్వామిగా చూడడం ఆయన నాయకత్వానికి బలం.
3. తప్పిదాలనుంచి నేర్చుకోవాలనేది నాదెళ్ల అభిప్రాయం . విఫలమవడం తప్పు కాదు, నేర్చుకోకపోవడమే తప్పు. అని చెబుతుంటారు. ప్రతి వైఫల్యాన్ని ఒక పాఠంగా తీసుకుని ముందుకు సాగడం ఆయన జీవన విధానం.
4. సానుభూతి, వినయం నాదెళ్ల నాయకత్వానికి మూలస్తంభాలు. టెక్నాలజీ మనుషుల జీవితాలను మెరుగుపర్చడానికే ఉండాలి. అనే ఆయన దృక్పథం, మైక్రోసాఫ్ట్ సంస్కృతిని పూర్తిగా మార్చింది.
5. ఎప్పటికీ నేర్చుకోవడాన్ని ఆపొద్దని సత్య నాదెళ్ల చెబుతారు . “Learn it all, don’t know it all.”
తన బృందానికి కూడా అదే పాఠం చెబుతారు. ఎప్పుడూ కొత్తగా నేర్చుకోవడమే విజయ రహస్యం అని ఆయన నమ్మకం.
నాదెళ్ల భవిష్యత్ ప్రణాళికలు..Nadella’s Future Plans
– నాదెళ్ల అభిప్రాయం ప్రకారం.. కృత్రిమ మేధ (AI) కేవలం యంత్రాల ఆధిపత్యం కాదు. మనుషుల సృజనాత్మకతకు సహాయక శక్తి. AIని విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, వ్యాపార రంగాల్లో విస్తరింపజేయాలని ఆయన ప్రణాళిక. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే Copilot, Azure AI, ChatGPT Integration వంటి ప్రాజెక్టుల ద్వారా ఆ దిశగా అడుగులు వేస్తోంది.
– నాదెళ్ల భవిష్యత్తు లక్ష్యాల్లో ఒకటి క్వాంటమ్ కంప్యూటింగ్. ఈ టెక్నాలజీతో భారీ డేటా ప్రాసెసింగ్, సెక్యూరిటీ సొల్యూషన్లు, మెడికల్ రీసెర్చ్ వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చే దిశగా మైక్రోసాఫ్ట్ దూసుకెళ్తోంది.
– సస్టైనబిలిటీ & గ్రీన్ టెక్ ఇది నాదెళ్ల మరో ప్రధాన లక్ష్యం. టెక్నాలజీతో పర్యావరణ పరిరక్షణ.
2030 నాటికి కార్బన్ న్యూట్రల్ కంపెనీగా మైక్రోసాఫ్ట్‌ను తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది. పునర్వినియోగ శక్తి వినియోగం, గ్రీన్ డేటా సెంటర్లు ఆయన ప్రణాళికలో భాగం.
– ఎప్పటికీ నేర్చుకుంటూ ఉండటం, కొత్తగా ఆవిష్కరించడం .. ఇదే మైక్రోసాఫ్ట్ సంస్కృతి కావాలి” అని నాదెళ్ల స్పష్టం చేశారు. స్టార్టప్‌లతో భాగస్వామ్యం, AI ఆధారిత టూల్స్, భవిష్యత్ ప్రాజెక్టులు అన్నీ ఈ దిశగా సాగుతున్నాయి.
– టెక్నాలజీ అందరికీ చేరాలన్నదే నాదెళ్ల ధ్యేయం. అందుకే మైక్రోసాఫ్ట్ ప్రపంచ వ్యాప్తంగా సాంకేతిక విద్యా కార్యక్రమాలు, AI శిక్షణా ప్రాజెక్టులు, డిజిటల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలు చేపడుతోంది.
ఉద్యోగులకు రాసిన లేఖలో ఏం చెప్పారంటే.. What He Said in the Letter to Employees
ప్రపంచం కృత్రిమ మేధ (AI) దిశగా వేగంగా మారుతున్న నేపథ్యంలో, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఉద్యోగులకు రాసిన లేఖలో కంపెనీ ప్రాధాన్యతలు, భవిష్యత్తుపై దృష్టి తదితర అంశాలను వివరించారు.
ప్రధానాంశాలు..Key Highlights..
సంస్థ స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మైక్రోసాఫ్ట్ ఇంకా టెక్‌లో ముందంజలో ఉంది. నవీన ఆవిష్కరణల్లో కంపెనీ ఎప్పుడూ ముందుంటుంది. ఈ వేగాన్ని సమతుల్యంగా నిలిపి ఉంచడం కష్టం. విజయం కోసం నిరంతరం ఆలోచించాలి. భద్రత, నాణ్యత, AI ఆవిష్కరణల లక్ష్యాలను సాధించడమే లక్ష్యం.
మైక్రోసాఫ్ట్ సేవలు ప్రపంచానికి కీలకంగా ఉన్నాయి. AI మౌలిక సదుపాయాల్లో అగ్రగామిగా కొనసాగుతోంది. 70 ప్రాంతాల్లో 400+ డేటా సెంటర్లు నిర్వహిస్తున్నాం. విస్కాన్సిన్‌లో అత్యంత శక్తివంతమైన AI డేటా సెంటర్ ను ప్రకటించాం. భూమి మీద ప్రతి వ్యక్తికి ప్రయోజనం చేకూర్చే విధంగా సాంకేతికతను సృష్టించడానికి కట్టుబడి ఉన్నాం. ఉద్యోగాలు సృష్టించడం, సైబర్ భద్రత, డిజిటల్ స్థిరత్వం బలోపేతం వంటి కార్యక్రమాల్లో అంకితభావంతో పనిచేయాలి. భవిష్యత్తుపై దృష్టి పెట్టి, నిరంతరం స్వీయాభివృద్ధి సాధించాలి. ప్రతి ఆవిష్కరణ, ప్రతి టెక్ ప్రాజెక్ట్ ప్రపంచానికి సేవగా ఉండాలి.
