
ఫైనాన్షియల్ ఫ్రీడమ్…. ఈ పదం దాదాపు అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరికీ ఆర్థిక స్వేచ్ఛ కావాలి అనుకుంటారు. అప్పడు జీవితం హాయిగా సాగుతుందనే భావనం అందరిలో ఉంది. కానీ ఈ ఆర్థిక స్వేచ్చను ఎలా పొందాలి అనే విషయంలో మాత్రం అందరికీ అనేక సందేహాలు ఉన్నాయి. అయితే ఈ ఆర్థిక స్వేచ్ఛను పొందడానికి మనకు ఉపకరించే అంశాలు ఏమిటి? అనేది ఒక సారి చూద్దాం.
ఆర్ధిక స్వేచ్ఛ అంటే చక్కగా బతకడానికి తగ్గ డబ్బులు కలిగి ఉండడం. అవి యవ్వనంలో అవ్వచ్చు లేదా వృద్ధాప్యం లో అవ్వచ్చు. సరైన ఆర్ధిక ప్రణాళిక తో ఈ స్వేచ్ఛను మనం సాధించవచ్చు. అంటే యవ్వనంలో మనం ఎలాగైనా బతకగలం. ఏ పనైనా చేసి సంపాదించుకోగలం. ఎటువంటి రిస్క్ నైనా భరించగలం. కానీ వయసు పెరిగాక పరిస్థితి అలా ఉండదు. శారీరకంగా, మానసికంగా కూడా మనం అలసిపోతాం. అప్పుడు మనం రిస్క్ చేయలేం. కాబట్టి మనకు అప్పుడు ఆర్థిక స్వేచ్ఛ తప్పకుండా కావాలి.
మనిషి 50 సంవత్సరాలు తర్వాత ఒత్తిడి గురిఅయ్యి జాబ్ చెయ్యాలనుకోరు. కానీ తర్వాత ఖర్చులకు గాని దేనికైనా ఇబ్బంది పడకూడదు అని అనుకుంటాం. అంటే మనం పనిచేసినా, చెయ్యకపోయినా ఆ స్థానంలో మనకి ఇన్ కమ్ రావాలి. మనకి రిటైర్మెంట్ తర్వాత రెగ్యులర్ ఇన్ కమ్ ఉండదు. కాబట్టి రిటైర్మెంట్ తర్వాత ఇబ్బందులు పడకుండా అదే ఇన కమ్ తో జీవితాన్ని సాఫీగా సాగించాలంటే 15 లేదా 20 సంవత్సరాల ముందు ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకుందాం.
insurance
ఇన్సురెన్స్ తీసుకోవడం వల్ల మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ను రీచ్ అవ్వగలుగుతాం. అంటే ముందస్తుగా ఇన్సూరెన్స్ ను కలిగి ఉండడం అనేది మన ఆర్థిక స్వచ్చకు పునాది లాంటిది. ఇక్కడ మన సంవత్సర ఆదాయం రూ.5లక్షలు అయితే మనం రూ.కోటి వరకూ కవరేజీ ఉండేలా ఇన్సురెన్స్ తీసుకోవాలి. ఈ జీవితకాల బీమాతో మనకు ఏదైనా జరిగితే మన కుటుంబానికి ఎటువంటి భయం లేకుండా జీవితం ముందుకు వెళ్తుంది.
EMI
ఇంటి కోసమో, కార్ కోసమో, లేదా వ్యక్తిగత కారణాలు అని చెప్పో మనం బ్యాంకుల నుంచి అప్పు తీసుకుని మనం ఈఎంఐ రూపంలో తిరిగి తీర్చుతుంటాం. కానీ ఇలా చేసే క్రమంలో మనకు నెలకు వచ్చే ఆదాయంలో అధిక భాగం ఈఎంఐ కే చెల్లించడం వల్ల మనం ఆర్థికంగా చితికిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితి మనల్ని, కుటుంబాన్ని ఆర్థికంగా ఎదగకుండా చేస్తుంది. ఈఎమ్ఐ ఎంత వరకు తీసుకోవాలంటే మన సంవత్సర ఆదాయంలో 40 శాతానికి మించి ఉండకూడదు. ఈఎమ్ఐ 40శాతం కంటే ఎక్కువ తీసుకుంటే మనం ఫైనాన్షియల్ గోల్ రీచ్ అవ్వడం కష్టం.
ఎమర్జన్సీ ఫండ్
అనుకోకుండా మనకు కొన్ని అత్యవసర పరిస్థితులు, సందర్భాలు ఎదురవుతుంటాయి. అప్పటికప్పుడు డబ్బులు కావాల్సి ఉంటుంది. అప్పటికప్పుడు డబ్బులు ఉండకపోవచ్చు. అందువల్ల మనకి ఏ పని ఉన్నా, లేకపోయినా 6నెలల ఖర్చులకు సరిపడా డబ్బులను మనం సేవింగ్ చేసుకోవాలి.
WHAT IS 50-30-20 formula
50-30-20 ఫార్ములాను పాటించాలి
మనకు నెలకి రూ.1లక్ష జీతం వస్తే మనం వాటిని ఎలా ఖర్చు చెయ్యాలి అనే విషయంలో ఈ చిన్న చిట్కా పాటిస్తే మనం ఫైనాన్షియల్గా క్లియర్‌గా ఉంటాం. మనకి వచ్చిన జీతంలో 50 శాతం మన ఇంటి ఖర్చులకు ఉపయోగించాలి. 30శాతం చిన్న,చిన్న సంతోషాలకు ఖర్చు చెయ్యాలి. మిగిలిన 20 శాతం సేవింగ్ చెయ్యాలి. దీన్ని ఖచ్చితంగా పాటిస్తే విజేతలవడం ఖాయం.
How Much Returns Are Expected?
మన అంచనాలు Reasonble గా ఉండాలి.
మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటే 15శాతం రిటర్న్స్ ఎక్స్ పెక్ట్ చేయవచ్చు.
మనం ఎక్స్ పెక్టేషన్ కరెక్ట్ గా పెట్టుకుంటే మన డబ్బులు పోగొట్టుకోవడం తగ్గుతుంది.
ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కి ఎంత అమౌంట్ అవసరమౌతుంది దానిని మనం ఎలా లెక్కించుకోవాలి అనే దానిపై మనం వర్క్ చేస్తే అది ఫలితం ఇస్తుంది. అంటే మన ఖర్చులు, భవిష్యత్తులో పెరిగే మన ఖర్చులు, జీవిత కాల అవసరాలు, రిటైర్మెంట్ అవసరాలు, కుటుంబానికి సమకూర్చువలసిన సౌకర్యాలు, మనకున్న బాధ్యతలు.. వీటన్నింటినీ లెక్క పెట్టుకుని, అందుకు అవసరమయ్యే డబ్బులను ముందుగా మనం కాలిక్యులేట్ చేసుకుంటే, దాని కోసం ఇప్పటి నుంచే పొదుపు మొదలుపెట్టవచ్చు.
How many years you are money will get double ?
మన దగ్గర ఉన్న డబ్బులు ఎప్పటికి రెండింతలు అవుతాయి?
ఇది మనకి వచ్చిన రిటర్న్స్ పై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 6 శాతం వస్తుంది. అంటే మనం పెట్టే లక్ష రూపాయలు రూ.2లక్షలు అవ్వాలంటే 12సంవత్సరాలు పడుతుంది. అదే మనం 15శాతం రిటర్న్స్ వస్తే 5సంవత్సరాలలో మన మనీ డబుల్ అవుతుంది.
మన దగ్గర డబ్బులు దేనిలోనైనా పెట్టుబడి పెట్టకపోతే ప్రతి 10 సంవత్సరాలకి సగం అయిపోతుంది. మన వెల్త్ తగ్గిపోతూ ఉంటుంది.