
ఈ రోజుల్లో మనం ఎక్కడ లోన్ తీసుకోవాలనుకున్నా, క్రెడిట్ కార్డు పొందాలనుకున్నా సిబిల్ స్కోర్ చాలా ముఖ్యమైనదిగా తయారైంది. ఇంత కీలకమైన సిబిల్ స్కోర్ విషయంలో బ్యాంకులు, ఫినాన్షియల్ ఆర్గనైజేషన్స్ చాలా కచ్చితంగా ఉండి లోన్‌లను ఇస్తాయి. కానీ కొందరు తెలసీ తెలియక చేసిన తప్పలు కొన్ని సార్లు సిబిల్ స్కోర్ మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయి. అయితే సిబిల్ స్కోర్ పెంచుకునేందుకు మనం తీసుకోవాల్సిన ప్రధానమైన జాగ్రత్తలు ఏమిటి? తెలుసుకోవాల్సిన కీలకమైన అంశాలేమిటో ఓ సారి చూద్దాం.
సిబిల్ స్కోర్ గురించి తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఇందులో కూడా రెండు రకాల కేటగిరిలు ఉన్నాయి. మొదటి కేటగిరికి చెందినవారు సిబిల్ స్కోర్ బాగా ఉన్నతెలియక కొన్ని తప్పులు చెయ్యడం వలన సిబిల్ స్కోర్ పై ప్రభావం పడి ఇబ్బందులు పడవలిసి ఉంటుంది. రెండవ కేటగిరికి చెందినవారు సిబిల్ స్కోర్ బాగోకపోయిన దానిని ఎలా ఇంప్రూవ్ చెయ్యాలో తెలియక ఇబ్బందులు పడుతూంటారు.
* మన పాన్ నంబర్ ను ఉపయోగించుకుని, మన క్రెడిట్ హిస్టరీ ఆధారంగా Credit information bureau (india) limited అనేటువంటి థర్డ్ పార్టీ ప్రైవేటు ఆర్గనైజేషన్ సిబిల్ స్కోర్ ను జనరేట్ చేస్తుంది.
* సిబిల్ స్కోర్ బాగుంటే మనకి లోన్ వస్తుంది. అంతేకాకుండా సిబిల్ స్కోర్ ని మనం బాగా మెంటైన్ చేసినట్లయితే తక్కువ వడ్డీరేటుకి లోన్ దొరుకుతుంది. మంచి లిమిట్‌తో క్రెడిట్ కార్డులు కూడా మనకు లభిస్తాయి.
* మన సిబిల్ స్కోర్ తక్కువ ఉంటే బ్యాంక్స్ మనకి ఇచ్చిన లోన్స్ పై ఎక్కువశాతం వడ్డీని వసూలు చేస్తారు. మరీ తక్కువ సిబిల్ స్కోర్ ఉన్నట్లయితే మనకి అసలు లోన్స్ రావు. అందువలన మనం సిబిల్ స్కోర్ ని బాగా మెంటైన్ చెయ్యాలి.
అసలు సిబిల్ స్కోర్ ని ఎవరు, ఎలా జనరేట్ చేయాలనే దానికి ఆర్బీఐ మన దేశంలో కొంతమందికి అనుమతులు ఇచ్చి లైసెన్స్ ఇచ్చింది.
TransUnion CIBIL, Experian, EQUIFAX, CRF ఈ ఆర్గనైజేషన్స్ మన క్రెడిట్ స్కోర్ ని జనరేట్ చేస్తాయి. వీళ్ళలో ఎక్కువగా సిబిల్ వాళ్ళతో, బ్యాంక్స్, నాన్ ఫైనాన్షియల్ బ్యాంక్స్ తో కలవడం వలన చాలామంది క్రెడిట్ స్కోర్ ని జనరేట్ చేస్తూ ఉంటారు. వీళ్లంతా కొన్ని విషయాల ఆధారంగా క్రెడిట్ స్కోర్ ని జనరేట్ చేస్తారు. అందులో ప్రధానంగా పేమెంట్ హిస్టరీ, లోన్ క్వాలిటీని పరిశీలిస్తారు.
PAYMENT HISTORY
మనం ఏదైనా లోన్ తీసుకున్నా లేదా క్రెడిట్ కార్డ్ ఉపయోగించిన, మన రీపేమెంట్ హిస్టరీ ఎలా ఉందో చెక్ చేస్తారు. ఈ రీపేమెంట్ హిస్టరీలో క్రెడిట్ స్కోర్ కి 35 శాతం వెయిటేజ్ ఉంది. అందువలన రీపేమెంట్ తప్పకుండా చేసినవారికే స్కోర్ ఎక్కువగా ఉంటుంది.
LOAN QUALITY
లోన్ క్వాలిటీకి మన క్రెడిట్ స్కోర్ లో ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. లోన్ క్వాలిటీ అంటే మనం తీసుకునేటటువంటి లోన్ టైపు. మనం ఏ అవసరం కోసం లోన్ తీసుకున్నామో అనే విషయాలన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారు.
రెండు రకాల లోన్ క్వాలిటీస్ ఉంటాయి.
1. SECURED LOAN 2. UNSECURED LOAN
* సెక్యూర్డ్ లోన్ అంటే ఇల్లు లేదా కారు తీసుకోవడానికి ఇచ్చే బ్యాంకు లోన్. ఇక్కడ మనం లోన్ ను రీపే చేయలేని పక్షంలో మన దగ్గర నుంచి కారును తీసుకుని రీసేల్ చేసి లోన్ ను క్లియర్ చేసుకుంటారు. వీటిని సెక్యూర్డ్ లోన్స్ అంటారు. అంటే ఒక ఆస్తిని ఆధారంగా చేసుకుని లోన్ ఇవ్వడం అని అర్థం.
* అన్ సెక్యూర్డ్ లోన్స్ అంటే క్రెడిట్ కార్డ్ , పర్సనల్ లోన్ వంటివి. ఇక్కడ ఎటువంటి గారెంటీ లేకుండా లోన్స్ ఇస్తారు. వీటని అన్ సెక్యూర్డ్ లోన్స్ గా పిలుస్తారు. మనం ఇక్కడ డీఫాల్ట్ చేసినట్లయితే బ్యాంకు మన దగ్గర లోన్ వసూలు చెయ్యడానికి చాలా కష్టపడవలిసి ఉంటుంది.
* అన్ సెక్యూర్డ్ లోన్స్ ఎవరైతే తీసుకుంటారో వారి సిబిల్ స్కోర్ బాగా ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన అన్ సెక్యూర్డ్ లోన్స్ తక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించాలి.
క్రెడిట్ స్కోర్ లో ఎన్ని పాయింట్స్ ఉంటాయి
How many points are there in a credit score
మన క్రెడిట్ స్కోర్ ని 300 నుంచి మాగ్జిమమ్ 900 వరకు లెక్కిస్తారు.
– మన క్రెడిట్ స్కోర్ మినిమమ్ 300 నుంచి 549 మధ్యలో ఉంటే మన క్రెడిట్ స్కోర్ బ్యాడ్ గా ఉన్నట్లు. అలాంటపుడు మనకి లోన్ వచ్చే అవకాశం లేదు.
– మన క్రెడిట్ స్కోర్ 550 నుంచి 699 మధ్యలో ఉంటే మన క్రెడిట్ స్కోర్ యావరేజ్ గా ఉన్నట్లు అని అర్థం. అయితే ఇక్కడ మనకి లోన్స్ పెద్ద బ్యాంక్స్ నుంచి రావు. చిన్న చిన్న బ్యాంక్స్ నుంచి, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి మాత్రమే వస్తాయి. కాకపోతే వీటిలో మనకి ఇచ్చే లోన్ పై ఎక్కువ వడ్డీ వేసే అవకాశం ఉంటుంది.
-700 నుంచి 749 మధ్యలో మన క్రెడిట్ స్కోర్ ఉంటే మంచి కేటగిరిలో ఉన్నట్లు. ఇక్కడ మనకి పెద్ద బ్యాంక్స్ నుంచి కూడా లోన్స్ దొరుకుతాయి. కాకపోతే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది.
-750 నుంచి 900 మధ్యలో మన క్రెడిట్ స్కోర్ ఉంటే అద్భుతంగా మన క్రెడిట్ స్కోర్ ఉన్నట్లు. మనకి ఏ బ్యాంక్స్ వాళ్ళైనా చాలా తక్కువ వడ్డీరేటుకే లోన్ ఇస్తారు.
WHAT ARE THE ADVANTAGES OF CREDIT SCORE
క్రెడిట్ స్కోర్ బాగా ఉన్నప్పుడే మనకి మల్టీపుల్ బ్యాంక్స్ నుంచి లోన్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులో మనకి తక్కువ వడ్డీకి ఏ బ్యాంక్ ఇస్తుందో తెలుసుకుని లోన్ తీసుకోవచ్చు.
అందువలన మన సిబిల్ స్కోర్ బాగా మెంటైన్ చెయ్యవలిసి ఉంటుంది.
క్రెడిట్ స్కోర్ బాగులేని వారు ఏం చెయ్యాలి
What to do if you have bad credit score
* మనం ఏవైనా లోన్స్ తీసుకుని వాటికి ఈఎమ్ఐ పే చేస్తున్నా, లేదా క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తున్న క్రమంలో తప్పకుండా DUE DATE కి మనం REPAYMENT చెయ్యాలి.
* UNSECURED LOANS తక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించాలి.
* క్రెడిట్ కార్డ్ లిమిట్ లో మాగ్జిమమ్ లిమిట్ ని ఉపయోగించి మళ్ళీ రీపేమెంట్ చేస్తున్న కూడా మన క్రెడిట్ హిస్టరీ తగ్గి పోయే ప్రమాదం ఉంటుంది.
* మన క్రెడిట్ కార్డ్ లిమిట్ లో మాగ్జిమమ్ 35 శాతం నుంచి 55 శాతం మాత్రమే ఉపయోగించాలి.
* ఎవరి దగ్గరైతే ఓల్డ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయో వాటిని ఉపయోగించకపోతే, ఇప్పుడు వాటిని ఉపయోగించాలి. లిమిట్ లో ఉపయోగిస్తూ రీపేమెంట్ కరెక్ట్ గా చేస్తే మన క్రెడిట్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంది.
* మన క్రెడిట్ కార్డ్ లో ఎంత అమౌంట్ ఉపయోగించామో దానిని మనం రీపే చేసిన తర్వాత కొన్ని చార్జస్ పడతాయి. వాటిని సైతం మనం పే చెయ్యాలి. వాటిని పే చెయ్యకపోతే దాని ప్రభావం కూడా క్రెడిట్ స్కోర్ పై పడుతుంది.
* తెలిసినవాళ్ళు లోన్ తీసుకుంటే వాళ్ళకి మనం గ్యారంటీ సంతకం పెడతాం. ఒకవేళ లోన్ డీఫాల్ట్ చేస్తే అది మన క్రెడిట్ స్కోర్ పై ప్రభావం చూపుతుంది. అందువలన మనం గ్యారంటీ ఇచ్చినపుడు ఒక్కసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.