
ప్రతి ఒక్కరూ తమ పెట్టుబడులు వేగంగా వృద్ధి చెంది మంచి రాబడి రావాలని ఆశిస్తారు. ఈ క్రమంలో మంచి మ్యూచువల్ ఫండ్స్‌లో మదుపు చేయాలని భావిస్తారు. మ్యూచువల్ ఫండ్స్‌లో రాబడిని పొందినప్పుడు లాభాలపై పన్ను కట్టాలా? పన్ను శాతం ఏంత? మ్యూచువల్ ఫండ్ పెట్టుబడుల్లో నష్టపోయినా పన్ను చెల్లించాలా? మినహాయింపులు ఉంటాయా? అనే అనుమానాలు చాలా మంది ఇన్వెస్టర్లలో ఉంటాయి. మరెందుకు ఆలస్యం ఈ స్టోరీలో వాటికి సమాధానాలు తెలుసుకుందాం.
మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు మన డబ్బులను ఈక్విటీలు, డెట్ ఆప్షన్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, కార్పొరేట్ బాండ్లలో పెట్టుబడి పెడతాయి. వాటిపై వచ్చే ఆదాయాన్ని ఇన్వెష్టర్లకు పంచుతాయి. పెట్టుబడిదారులు పొందే రాబడినే మూలధన లాభాలు అంటారు. పెట్టుబడిదారులు తమ మ్యూచువల్ ఫండ్లను 12 నెలల్లోపు విక్రయించడం ద్వారా స్వల్పకాలిక మూలధన లాభాలను పొందుతారు. ఏడాది కంటే ఎక్కువ కాలం ఉంచిన తర్వాత వాటిని విక్రయిస్తే, దీర్ఘకాలిక మూలధన లాభాలను అందుకుంటారు.
మ్యూచువల్ ఫండ్ మూలధన లాభాలపై పన్ను రేట్లు
Tax rates on mutual fund capital gains
ఈక్విటీ ఫండ్స్ నుంచి వచ్చే లాభాలను ఏడాదిలోపు (స్వల్పకాలిక మూలధన లాభాలు) విక్రయిస్తే 15 శాతం, ఏడాది తర్వాత అమ్మితే (దీర్ఘకాలిక మూలధన లాభాలు) 10 శాతం టాక్స్ కట్టాలి. అలాగే ఈ పన్నుతో పాటు సంబంధిత సెస్, సర్ ఛార్జ్‌లు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
దీర్ఘకాలిక మూలధనంపై పన్ను మినహాయింపు ఉంటుందా
Is long term capital tax exempt
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం రూ.1 లక్ష కంటే ఎక్కువ దీర్ఘకాలిక మూలధన లాభాలపై 10 శాతం పన్ను విధిస్తారు. అంటే రూ.లక్ష లోపు దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను ఉండదు.
ఉదాహరణ : ఒక వ్యక్తి ఈక్విటీ ఫండ్స్ నుంచి రూ.2.5 లక్షల దీర్ఘకాలిక మూలధన లాభాలను కలిగి ఉన్నాడని అనుకుందాం. అతడు రూ.2.5 లక్షల దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను కట్టక్కర్లేదు. రూ. 1.5 లక్షల దీర్ఘకాలిక లాభాలపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది (రూ. 1 లక్ష వార్షిక మినహాయింపు కారణంగా). సెస్, సర్ ఛార్జీలు మరో రూ.15వేల వరకు ఉంటాయి. బ్యాలెన్స్డ్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్‌కు కూడా పన్ను కట్టాల్సి ఉంటుంది.
డెట్ ఫండ్స్‌కు పన్ను శాతం ఎంత
What is the tax rate for debt funds
డెట్ ఫండ్స్‌పై ఉన్న పన్ను రాయితీని కేంద్ర ప్రభుత్వం గతేడాది ఎత్తివేసింది. డెట్ ఫండ్స్‌పై వచ్చే రాబడిపై ఆదాయ పన్ను శ్లాబుల ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
What is mutual funds
మ్యూచుల్ ఫండ్స్ అంటే ఏమిటి
ఒక రకంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇన్వెస్టర్ల దగ్గర నుంచి రకరకాల స్కీముల ద్వారా డబ్బు సేకరించి, వాటిని వారి తరఫున రకరకాల పెట్టుబడి సాధనాలలో పెట్టుబడి పెట్టడం. ఏ స్కీము ల్లో పెట్టుబడి పెట్టాలనేది ఆ ఇన్వెస్టర్ల అభీష్టం మీద ఆధారపడి వుంటుంది.
మ్యూచువల్ ఫండ్స్‌లో ఎవరికి కావాల్సిన విధంగా వారు స్కీములను ఎన్నుకోవచ్చు. కొంతమంది నెలా నెలా స్థిర ఆదాయం ఇచ్చే ఇన్‌కమ్ ఫండ్స్‌ని ఎన్నుకుంటే, మరి కొందరు మొత్తం షేర్లలోనే పెట్టే ఎంక్వైరీ ఫండ్స్‌ని ఎన్నుకొంటారు. ఇలా ఎన్నో అవకాశాలు మ్యూచువల్ ఫండ్స్ లో వుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ లో ట్యాక్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం …
STT: SECURITIES TRANSACTION TAX
సెక్యూరిటీల లావాదేవీ పన్ను
మనం మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేసినపుడు లేదా విత్ డ్రా చేసినపుడు మనకి SECURITIES TRANSACTION TAX 0.001శాతం మాత్రమే కట్ అవుతుంది. ఆ కట్ అయిన డబ్బులు గవర్నమెంట్ కి వెళ్లిపోయి మిగిలిన డబ్బులు అసెట్ మేనేజ్ మెంట్ కంపెనీకి వెళ్తుంది. వాళ్ళు ఈ డబ్బులను ఈక్విటీ లేదా ఇంకా ఎక్కడైనా పెట్టుబడి పెట్టుకోవచ్చు.
* మనం డబ్బులను విత్ డ్రా చేసినా కూడా 0.001 శాతం కట్ అయ్యి మిగిలిన డబ్బులు మనకి వస్తాయి. ఇది కూడా కేవలం Equity Mutual Funds కి మాత్రమే వర్తిస్తుంది. ఫండ్ మేనేజర్ మన డబ్బులో ఎక్కువశాతం ఈ క్విటీలో పెట్టుబడి పెడితే అలాంటి ఫండ్స్ కి మాత్రమే ఈ ట్యాక్స్ కట్ అవుతుంది.
ఎప్పుడైతే ఫండ్ మేనేజర్ 65 శాతం కంటే ఎక్కువ అమౌంట్ ని ఈక్విటీ మార్కెట్లో పెడతాడో అలాంటి సందర్భాల్లో hybrid funds లో కూడా ట్యాక్స్ కట్ అవుతుంది.
Earnings Tax (ఆదాయపు పన్ను): మనకి ఎంతైతే లాభం వస్తుందో దానిపై ఖచ్చితంగా ట్యాక్స్ కట్ అవుతుంది. అయితే అవి ఎలాంటి లాభాలంటే..
DIVIDEND (డివిడెండ్) : డివిడెండ్ కూడా ఒక రకమైన లాభం. అందువల్ల దానిపై ట్యాక్స్ కట్ అవుతుంది.
Returns (తిరిగి వస్తుంది) : మనం ఎంతైతే డబ్బును పెట్టుబడి పెట్టామో అది కాకుండా మనకి ఎంతైతే డబ్బు లాభం వచ్చిందో దానిని మనం రిటర్న్స్ అంటాం. ఆ రిటర్న్స్ పై కూడా మనం ట్యాక్స్ చెల్లించాలి. ఈ రెండింటిని ఎర్నింగ్ ట్యాక్స్ అంటాం.
DIVIDEND అంటే మనం ఎప్పుడైతే డివిడెండ్ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెడతామో .. అటువంటి సందర్భాల్లో ఫండ్ మేనేజర్ ఎక్కువగా డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ లో డబ్బును పెట్టుబడి పెడితే ఆ కంపెనీస్ లు డివిడెండ్ ఆఫర్ చేస్తుంటాయి. ఇక్కడ కూడా మనకి డివిడెండ్ వస్తుంది. మనకి ట్యాక్స్ ఎప్పుడు కట్ అవుతుందంటే.. ఒక సంవత్సరంలో రూ.10లక్షలు కంటే ఎక్కువ డివిడెండ్ అనేది జనరేట్ అయితే దాని మీద మనం ట్యాక్స్ చెల్లించాలి. సుమారు 10 శాతం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది.
Normal returns: మనం ఎంతైతే డబ్బును మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టామో దానిమీద ఎంతైతే రిటర్న్ జనరేట్ అవుతుందో దానిమీద కట్టవలిసిన ట్యాక్స్ ను నార్మల్ రిటర్న్స్ అంటాం. ఇందులో రెండు రకాలు ఉన్నాయి.
1. Long term capital gain
2. Short term capital gain
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కి Long term capital gain, Short term capital gain ఒకలా ఉంటుంది. మిగిలిన మ్యూచువల్ ఫండ్స్ కి ఒకలా ఉంటుంది.
* ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో 1సంవత్సరం కంటే తక్కువ కాలంలో పెట్టుబడి పెట్టిన అమౌంట్ పై ఎంతైతే వడ్డీ జనరేట్ అయ్యిందో దానిమీద కట్టవలిసిన ట్యాక్స్ ను Short term capital gain అంటాం. ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలంలో పెట్టుబడి పెట్టి తర్వాత మన డబ్బులను విత్ డ్రా చేసుకుంటే దానిమీద ఎంతైతే లాభం వచ్చిందో దానిని Long term capital gain అంటాం. మనం పెట్టుబడి పెట్టిన 1సంవత్సరం కంటే తక్కువ కాలంలో రిటర్న్ జనరేట్ అయితే దానిపైన 15 శాతం ట్యాక్స్ కట్టాలి. మనం ఎప్పుడైతే ఇన్ కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తామో అప్పుడు కట్టాలి.
* లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత మనం విత్ డ్రా చేస్తే .. అప్పుడు దానిపైన వచ్చిన రిటర్న్స్ రూ.లక్ష వరకు ఉంటే ఎటువంటి ట్యాక్స్ కట్టనవసరం లేదు. అదే రూ.లక్ష కంటే ఎక్కువ లాభం వస్తే అప్పుడు 10శాతం వరకు ట్యాక్స్ కట్టాలి.
* హైబ్రిడ్జ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఎప్పుడైతే ఫండ్ మేనేజర్ 65శాతం కంటే ఎక్కువ అమౌంట్ ని ఈక్విటీ అనగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతాడో.. అప్పుడు హైబ్రిడ్జ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈ ట్యాక్స్ వర్తిస్తుంది.
* Normal Mutual funds అనగా వీటికి ఏ విధంగా ట్యాక్స్ ఉంటుందంటే ఇక్కడ కూడా Long term capital gain & Short term capital gain ఉంటుంది. కాకపోతే టర్మ్ మారుతుంది. ఈక్విటీకి 1సంవత్సరం. నార్మల్ ఫండ్స్ కి 3 సంవత్సరాలు టర్మ్ ఉంటుంది.
* మూడు సంవత్సరాల లోపు మన పెట్టుబడిని విత్ డ్రా చేసుకున్నట్లయితే అది Short term capital gain లోకి వస్తుంది. 3 సంవత్సరాల కంటే ఎక్కువకాలం ఉంచుకున్నట్లయితే మనకి ఎంతైతే లాభం వచ్చిందో దానిమీద లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద 20 శాతం ట్యాక్స్ కట్టాలి. పెట్టుబడిదారుడికి ఈక్విటీ ఫండ్స్‌లో నష్టాలు వస్తే వాటిని తర్వాత ఏడాదికి పొడిగించుకోవచ్చు.
రిస్క్ తీసుకోని వారు
Those who don’t take risk
స్టాక్ మార్కెట్ల ద్వారా చాలా మంది ఇన్వెస్టర్లు కంపెనీల షేర్లలో పెట్టుబడులు పెడుతుంటారు. వీరు లాభనష్టాలకు సిద్దపడి ట్రేడింగ్ చేస్తుంటారు. ట్రేడింగ్ కు సంబంధించి అవగాహన పెంచుకోవడమేకాకుండా కంపెనీలకు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకుంటూ పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇంతలా కష్టపడలేని వారు, ట్రేడింగ్ పై అవగాహన లేని వారు, ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని వారు మ్యూచువల్ ఫండ్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడుల వల్ల మంచి ప్రయోజనం లభిస్తుందని సూచిస్తుంటారు. ప్రస్తుతం మన దేశంలో అనేక రకాల మ్యూచువల్ ఫండ్ సంస్థలున్నాయి. ఇవి ఎప్పటికప్పుడు కొత్తఫండ్స్ ను జారీ చేస్తూ ఇన్వెస్టర్ల నుంచి పెద్ద మొత్తంలో నిధులను సేకరిస్తూ పెట్టుబడులు పెడుతున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారుల నుంచి సొమ్మును సేకరించి షేర్లు, బాండ్లు, మనీ మార్కెట్ సాధనాలు లేదా సెక్యూరిటీల్లో పెట్టుబడి పెడతాయి. ఉమ్మడి పెట్టుబడి ద్వారా వచ్చే ఆదాయం లేదా రాబడిలో నుంచి వ్యయాలు, చార్జీలను మినహాయించుకుని ఇన్వెస్టర్లకు పంచుతారు.
– ఇక మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను మార్కెట్ పై మంచి అవగాహన ఉన్న ఫండ్ మేనేజర్ చేతికి అప్పగిస్తాయి. పెట్టుబడిదారుల ఎంపిక మేరకు ఆ మేనేజరు లాభాలను అందించే వాటిలో పెట్టుబడి పెడతాడు. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టే వారిని యూనిట్ హోల్డర్లుగా వ్యవహరిస్తుంటారు.
ఇన్వెస్టర్ల అవసరానికి అనుగుణంగా…
According to the requirement of investors…
పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు మ్యూచువల్ ఫండ్ సంస్థలు అనేక రకాల పథకాలను ఆఫర్ చేస్తుంటాయి. తమ భవిష్యత్ లక్ష్యానికి అనుగుణంగా ఉన్న వాటిని ఇన్వెస్టర్లు ఎంచుకోవచ్చు. కొంత మంది తమ రిటైర్ మెంట్ తర్వాతి వ్యయాల కోసం, మరికొంత మంది పిల్లల చదువులు లేదా వివాహం కోసం, ఇంకొంత మంది ఇంటి కొనుగోలు తదితరాల కోసం పెట్టుబడులు పెడుతుంటారు. వారు తీసుకునే రిస్క్ ఆధారంగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. అన్ని రకాల ఇన్వెస్టర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేశంలోని మ్యూచువల్ ఫండ్ సంస్థలు అనేక పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇన్వెస్టర్లు తమకు మంచి రిటర్ను కావాలనుకున్నప్పుడు సరైన ఫండ్ ను ఎంచుకోవాలి. ఇది కొంచెం శ్రమతో కూడినదే. అయినప్పటికీ డబ్బుతో వ్యవహారం కాబట్టి ఫండ్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే. ఫండ్లో ఉన్న రిస్క్, రిటర్ను, కాలపరిమితికి సంబంధించిన వివరాలు చూసుకోవాలి. పూర్తి అవగాహన లేకపోతే మంచి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ను సంప్రదించాలి.
వివిధీకరణ ముఖ్యం
Diversification is important
అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టకూడదన్నది నిపుణుల సలహా. కాబట్టి మొత్తం పెట్టుబడులను ఒకే రకం ఫండ్స్ లో పెట్టకూడదు. ఈక్విటీ, డెట్, బంగారం వంటి కేటగిరీల్లో ఫండ్స్ ను ఎంచుకోవడం ద్వారా ఒక కేటగిరీ పనితీరు బాగోలేకపోయినా మరో కేటగిరీ ద్వారా మంచి రిటర్నునుపొందే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా అన్నింటి పనితీరు ఒకే విధంగా ఉండదన్న విషయం తెలిసిందే. ఒక సారి ఈక్విటీ మార్కెట్లు పెరిగితే బంగారం తగ్గుతుంది. ఈక్విటీ మార్కెట్లు పతన బాట పట్టినప్పుడు బంగారం పెరుగుతుంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో పెట్టుబడులను వివిధీకరించుకోవడం ద్వారా రిస్క్ ను తగ్గించుకుని మంచి రాబడులను పొందవచ్చు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ముందు వాటి గురించి అవగాహన పెంచుకుని ఫండ్స్ ను ఆఫర్ చేసే సంస్థలను సంప్రదించడం ద్వారా తమ పెట్టుబడులపై సరైన నిర్ణయం తీసుకుని రాబడులను పెంచుకునే అవకాశం ఏర్పడుతుంది.