కష్టపడి సంపాదించిన డబ్బుకు మంచి రాబడిని అందించే సురక్షితమైన మార్గంగా పోస్ట్ ఆఫీసు పథకాలను ఖాతాదారులు చూస్తారు. అటువంటి పథకాల్లో పోస్ట్ ఆఫీసు రికరింగ్ డిపాజిట్(ఆర్‌డీ) ఒకటి. దీనిలో సాధారణ బ్యాంకుల్లో లభించే ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ లకన్నా అధికంగా వడ్డీ వస్తుంది.
మన దేశంలోని మధ్య తరగతి ప్రజలు పోస్టు ఆఫీసుల్లో నగదు దాచుకోవడానికి ఎక్కువగా మొగ్గుచూపుతారు. బ్యాంకుల్లో ఎన్ని రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నా ఎక్కువగా పోస్ట్ ఆఫీసుల వైపే చూస్తారు. దీనికి ప్రధాన కారణం అధిక వడ్డీతోపాటు ప్రభుత్వ భరోసా ఉండటమే. కష్టపడి సంపాదించిన డబ్బుకు మంచి రాబడి అందించే సురక్షితమైన మార్గంగా పోస్ట్ ఆఫీసు పథకాలను వినియోగదారులు చూస్తారు. అటువంటి పథకాలలో పోస్ట్ ఆఫీసు రికరింగ్ డిపాజిట్(ఆర్‌డీ) ఒకటి. దీనిలో సాధారణ బ్యాంకులలో లభించే ఫిక్స్‌డ్ డిపాజిట్, రికరింగ్ డిపాజిట్ లకన్నా అధికంగా వడ్డీ వస్తుంది. క్రమం తప్పకుండా దీనిలో పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుంది.
మన దేశంలో బ్యాంకింగ్ సిస్టమ్ రాకముందు నుండే పోస్టాఫీసులో పొదుపు మొత్తాల స్కీమ్ ఉంది. ప్రస్తుతం పోస్టాఫీస్‌లో ఎన్నో రకాల స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో రికరింగ్ డిపాజిట్ స్కీం కూడా ఒకటని చెప్పొచ్చు. దీంట్లో చేరితే ఒకేసారి భారీ మొత్తం కూడా పొందొచ్చు. అంతేకాకుండా.. ప్రతి నెల కొంత మొత్తం కట్టుకుంటూ వెళ్లొచ్చు. దీంట్లో ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రతి నెలా చిన్న మొత్తాల్లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఈ స్కీం చక్కగా పనిచేస్తుందని చెప్పొచ్చు. దీంట్లో చాలా సులభంగా లోన్ కూడా పొందొచ్చు. పోస్టాఫీస్‌లో మీరు చెల్లించే డబ్బుల ఆధారంగానే మీకు వచ్చే రాబడి కూడా ఆధారపడి ఉంటుంది. ఎక్కువ డబ్బులు కడితే మరింత ఎక్కువ లాభం వస్తుంది. పోస్టాఫీస్ RD స్కీం గడువు ఐదేళ్లుగా ఉంది. అంటే ఐదేళ్లపాటు ప్రతి నెలా డబ్బులు చెల్లిస్తూ ఉండాలి. తర్వాత మీ చేతికి ఒకసారి భారీ మొత్తం లభిస్తుంది.
ఇందులో మీరు రోజుకు రూ.133 సేవ్ చేయాలని భావిస్తే.. నెలకు దాదాపు రూ. 4 వేలు అవుతుంది. ఈ డబ్బుల్ని పోస్టాఫీస్ ఆర్‌డీ పథకంలో డిపాజిట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో చేతికి ఒకేసారి రూ. 3 లక్షల వరకు వస్తుంది. దీంట్లో రిస్క్ లేకుండా మంచి రాబడి ఉంటుందని చెప్పొచ్చు.
ఈ పథకంలో చేరాలంటే దగ్గర్లో ఉన్న పోస్టాఫీస్‌కు వెళ్లి సంప్రదించవచ్చు. రూ.100 నుంచి కూడా డబ్బులు దాచుకోవచ్చు. గరిష్ఠ పరిమితి అంటూ ఏం లేదు. మీకు నచ్చిన మొత్తం కూడా డిపాజిట్ చేసుకోవచ్చు.
ఇప్పుడు పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్‌పై 6.5 శాతం వడ్డీ ఉంది. ఇది వరకు ఇది 6.2 శాతంగా ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ రాబడి వస్తుంది. దీని కింద సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ తెరవొచ్చు.
* మీరు నెలకు రూ. 10 వేల చొప్పున అంటే రోజుకు రూ.333 చొప్పున రికరింగ్ డిపాజిట్ స్కీంలో డబ్బులు పొదుపు చేస్తే.. ఐదేళ్లలోనే రూ. 7 లక్షలు వస్తాయి. మరో ఐదేళ్లు ఇలా టెన్యూర్ పొడిగిస్తే అంటే పదేళ్ల వరకు ఆర్‌డీ అకౌంట్ కొనసాగిస్తే మీకు ఒకేసారి రూ. 17 లక్షలు అందుతాయి. అందుకే ఇన్వెస్ట్‌మెంట్, టెన్యూర్ ఆధారంగా రాబడి మారుతుంది.
చాలామంది తమ తాతతండ్రుల నుంచి ఆస్తి రూపంలో వచ్చిన డబ్బును పోస్టాఫీసులో ఫిక్స్డ్ డిపాజి ట్ చేస్తుంటారు. మరికొంతమంది తమ పిల్లల కోసం వేరేగా ఫండ్‌ను క్రియేట్ చేసుకోవాలనుకుంటారు. మరికొందరు పిల్లల పెళ్లిళ్లు లేదా ఇల్లు గురించి ఫండ్ క్రియేట్ చేయాలనుకుంటారు. అయితే ఇలా డిపాజిట్ చేయాలనుకుంటే బ్యాంకులో రెండు రకాల అకౌంట్‌లు ఉన్నాయి. అవి
1. కరెంట్ అకౌంట్ 2. సేవింగ్ అకౌంట్.
సేవింగ్స్ అకౌంట్స్ పై బ్యాంకు ఎంతో కొంత వడ్డీ ఇస్తుంది. కరెంట్ అకౌంట్ కి బ్యాంక్స్ వడ్డీ ఇవ్వవు. ఎందుకంటే బిజినెస్ పర్పజ్ గా వాడుకునే వారికి కరెంట్ అకౌంట్ ని బ్యాంక్ ఇస్తుంది. సేవింగ్స్ లో ఉన్న డిపాజిట్స్ ని డిమాండ్ డిపాజిట్స్ అంటాం. మనకి అత్యవసర పరిస్థితుల్లో సేవింగ్ అమౌంట్ నుంచి ఎంతో కొంత తీసుకోవచ్చు.
పై రెండే కాకుండా టైమ్ డిపాజిట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. టైమ్ డిపాజిట్లో మనం డిపాజిట్ చేసేటపుడు నిర్ణీత కాలవ్యవధి పెట్టుకుంటాం. అయితే అత్యవసర వేళల్లో మనకు అవసరమైన ఈ డిపాజిట్ నుంచి మనం అమౌంట్ విత్ డ్రా చేయడం అవ్వదు. మెచ్యూర్డ్ టైమ్ అయిన తర్వాత మాత్రమే విత్ డ్రా తీసుకోవడం అవుతుంది. అయితే మనకి లిక్విడిటీ అవసరం తీరిన తర్వాత మళ్లీ డిపాజిట్ చేస్తాం అనుకుంటే.. అప్పుడు మనం ప్రీకోర్స్ చేసుకోవచ్చు. అంటే 6 శాతం వడ్డీతో మనకి డబ్బులు ఇవ్వాలనుకుంటే.. మనం ముందుగానే తీసుకోవడం వల్ల 1 శాతం పెనాల్టీ కింద తీసుకుని 5 శాతం వడ్డీతో డబ్బులు ఇస్తారు. బెనిఫిట్ ఏమిటంటే మనం పెనాల్టీ కట్టినందున అవసరానికి డబ్బులు వస్తాయి. ఇది కాకుండా మనం 90 శాతం వరకు లోన్ తీసుకోవచ్చు.
అధిక మొత్తంలో మన దగ్గర డబ్బులు లేకపోతే మనకి మంత్లీ శాలరీ వచ్చినపుడు ఖర్చులన్నీ పోగా నెలకి రూ.500 లేదా రూ.1000 లేదా మనకి ఎంత వీలైతే అంత అమౌంట్ వాయిదాల రూపంలో డిపాజిట్ చేయొచ్చు. ఇన్ స్టాల్ మెంట్ లో సేవ్ చేసే దానిని రికరింగ్ డిపాజిట్ అంటాం.
రికరింగ్ డిపాజిట్ తో లాభాలేమిటి
Benefits of Recurring Deposit
* మనం పోస్టాఫీసులో రికరింగ్ డిపాజిట్ చేసిన తర్వాత నిర్ణీత కాలవ్యవధిలో పెద్దమొత్తంలో అమౌంట్ వస్తుంది. దానిని మనం ఎఫ్ డీ చేసుకోవచ్చు. లేదంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ మెంటైనా చేసుకోవచ్చు.
* మనం ఏదైనా ఇన్వెస్ట్ చెయ్యడానికి కనీస మొత్తం మన దగ్గర లేకపోతే ఆ కనీస మొత్తం కోసం ఫండ్ ను క్రియేట్ చేసుకోవడానికి ఉపయోగపడేది రికరింగ్ డిపాజిట్.
* రికరింగ్ డిపాజిట్ చేయడానికి ఎటువంటి age limit లేదు. అందరూ అర్హులే.
* మనం ఎంత పొదుపు చేసుకోగలుగుతామో అంతే రికరింగ్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత వడ్డీ రేటు ఉంటుందో రికరింగ్ డిపాజిట్ కూడా ఒక పిరియడ్ కి అంతే వడ్డీ రేటు ఉంటుంది.
* ఈ పోస్టాఫీసు పథకంలో ప్రతి నెలా కనీసం రూ.100 ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. పోస్టాఫీసు RD పథకంలో పెట్టుబడికి గరిష్ఠ పరిమితి లేదు.
* పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఖాతా పథకంలో, ఒక వయోజన లేదా ముగ్గురు పెద్దలు కలిసి ఉమ్మడి ఖాతాను తెరవవచ్చు. ఇది కాకుండా, మైనర్ తరపున సంరక్షకుడు పథకం కింద గార్డియన్ ఖాతాను తెరవవచ్చు.
* 10 ఏళ్లు పైబడిన ఏ మైనర్ అయినా తన పేరు మీద కూడా పోస్టాఫీసులో ఖాతాను తెరవవచ్చు.
* పోస్ట్ ఆఫీస్ RD పథకం ఖాతా తెరిచిన తేదీ నుంచి ఐదు సంవత్సరాల మెచ్యూరిటీని కలిగి ఉంటుంది. సంబంధిత పోస్టాఫీసులో దరఖాస్తు ఇవ్వడం ద్వారా ఖాతాను మరో ఐదేళ్ల పాటు పొడిగించుకోవచ్చు. ఈ పొడిగించిన వ్యవధిలో వర్తించే వడ్డీ రేటు ఖాతా తెరిచిన వడ్డీ రేటులానే ఉంటుంది. పొడిగించిన వ్యవధిలో ఎప్పుడైనా ఖాతాను మూసివేయవచ్చు. పూర్తయిన సంవత్సరాలకు RD వడ్డీ రేటు వర్తిస్తుంది. ఒక సంవత్సరం కంటే తక్కువ కాల వ్యవధిలో, పోస్టాఫీసు సేవింగ్స్ ఖాతా వడ్డీ రేటు వర్తిస్తుంది. RD ఖాతాను 5 సంవత్సరాల వరకు ఎటువంటి డిపాజిట్లు చేయకుండా కూడా నిర్వహించవచ్చు.
* పోస్ట్ఆఫీసుల్లో రికరింగ్ డిపాజిట్ ఓపెన్ చేసిన రోజు నుంచి కనీసం ఐదేళ్లు లేదా 60 నెలల తర్వాత ఏది ముందుగా వస్తే దానిని గరిష్ఠ టెన్యూర్ గా నిర్ణయిస్తారు. అయితే డిపాజిటర్లు ఖాతా తెరచిన ఏడాది తర్వాత తమ మొత్తం నుంచి 50 శాతం విత్ డ్రా చేసుకునే అవకాశం ఇందులో ఉంటుంది. రుణం కింద 50 శాతం తీసుకోవచ్చు.
* ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్‌పై ఉన్న 5.8 – నుంచి 6.8 శాతం వరకూ వచ్చే వడ్డీ రేటు ప్రకారం, పెట్టుబడిదారుడు ప్రతి నెలా రూ. 10,000 లేదా ప్రతిరోజూ దాదాపు రూ. 333 పెట్టుబడి పెట్టడం ద్వారా దాదాపు రూ. 16 లక్షల రాబడిని పొందవచ్చు. మొత్తం డిపాజిట్ రూ. పదేళ్లకు 12 లక్షలు, వడ్డీ అంచనా రూ. 4. 26 లక్షలు, మొత్తం రాబడి రూ. 16. 26 లక్షలు అవుతుంది. ప్రతి మూడు నెలలకు, చక్రవడ్డీ లెక్కించబడుతుంది. ఇది పెట్టుబడిదారులకు సాధారణ రాబడిని అందిస్తుంది. ఈ వడ్డీ రేటు 1 ఏప్రిల్ 2020 నుంచి వర్తిస్తుంది.
* నెలవారీ ఆర్‌డీ చెల్లిస్తున్నప్పడు ఒకనెల డబ్బులు కట్టడం మర్చిపోతే కొంత పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
* పోస్ట్ ఆఫీస్ ఆర్‌డీ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు ఎంత డబ్బు పెట్టుబడి పెట్టగలిగినా, సురక్షితంగా ఉంటుంది. పైగా మీ భవిష్యత్తు అవసరాలను తీర్చడంలో బాగా ఉపయోగపడుతుంది. కచ్చితమైన రాబడికి ప్రభుత్వ భరోసా కూడా ఉంటుంది. కాబట్టి తమ నగదును దాచుకోవాలనుకునే వారికి ఇది చాలా మంది ఎంపిక.
ఆర్‌డీ ప్రత్యేకతలు ఇవీ
These are the features of RD
what is Variable Recurring Deposit
వేరియబుల్ రికరింగ్ డిపాజిట్ అంటే నెలవారీ వాయిదాలను మార్చుకునే ఎంపికతో కూడిన రికరింగ్ డిపాజిట్ పథకాన్ని వేరియబుల్ రికరింగ్ డిపాజిట్ పథకం అంటారు. ఇది కొత్తగా వచ్చిన స్కీమ్. ఇది చాలా బ్యాంకుల్లో ఉంది. బ్యాంకుల్లో డిపాజిట్ కంటే పోస్టాఫీసుల్లో డిపాజిట్లు చాలా సేఫ్. ఎందుకంటే బ్యాంకింగ్ సిస్టమ్ రాకముందు నుంచి పోస్టాఫీసు పొదుపు మొత్తాల స్కీమ్ ఉంది.
Loan facility at Recurring Deposit
ఆర్‌డీలో లోన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. స్కీంలో చేరిన సంవత్సరం తర్వాత మీరు లోన్ పొందేందుకు ఛాన్స్ ఉంటుంది. డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతం లోన్ కింద ఇస్తారు. తీసుకున్న లోన్‌ను ఇన్‌స్టాల్‌మెంట్ల రూపంలో లేదా ఒకేసారి కూడా చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. వడ్డీ రేటు RD వడ్డీ రేటు కంటే 2 శాతం ఎక్కువ ఉంటుంది. RD అకౌంట్‌ను మెచ్యూరిటీ తర్వాత కూడా మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు.