Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

ట్రంప్‌ సుంకాల వేళ … భారత్‌ వైపు చూస్తున్న ఐటీ దిగ్గ‌జ‌ కంపెనీలు.. IT Giants Turn to India Amid Trump’s Tariff Pressure

Posted on 11/12/2025 By admin No Comments on ట్రంప్‌ సుంకాల వేళ … భారత్‌ వైపు చూస్తున్న ఐటీ దిగ్గ‌జ‌ కంపెనీలు.. IT Giants Turn to India Amid Trump’s Tariff Pressure

ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగాన్ని ఏఐ ప్రభావం బలంగా తాకుతుండగా… అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుంకాలు, వీసా ఆంక్షలతో సృష్టించిన అనిశ్చితి అక్కడి కంపెనీలను భారత్‌ వైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రశ్రేణి అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాలు భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్ట‌నున్న‌ట్టు ప్ర‌క‌టించాయి. ముఖ్యంగా ఏఐ, క్లౌడ్‌, డిజిటల్‌ ఇన్నోవేషన్‌ విభాగాల్లో బిలియన్ల డాలర్లతో కొత్త ప్రాజెక్టులు తెరపైకి వస్తుండటం తో దేశీయ ఐటీ రంగం మరోసారి కళకళ లాడ‌నుంది.

చిగురిస్తున్న ఆశ‌లు..Hope Blossoms

అమెరికాలో ఖర్చులు పెరగడం, నిపుణులను నియమించుకోవడంలో వీసా ఆంక్షలు తీవ్రతరమవడం వల్ల ఐటీ దిగ్గజాలు భారత్‌ను ‘సేఫ్‌ & స్కిల్‌-రిచ్‌ డెస్టినేషన్‌’గా భావిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశీయ ఐటీ రంగంలో గత కొంతకాలంగా స్తబ్దత నెలకొన్నప్పటికీ… అంతర్జాతీయ కంపెనీల తాజా పెట్టుబడుల వార్తలతో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.

మైక్రోసాఫ్ట్‌.. రూ.1.58 లక్షల కోట్ల భారీ పెట్టుబడి..Microsoft Announces ₹1.58 Lakh-Crore Mega Investment

భారత మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించిన మైక్రోసాఫ్ట్ .. వచ్చే అయిదేళ్లలో 17.5 బిలియన్‌ డాలర్లు (రూ.1.58 లక్షల కోట్లు) పెట్టుబ‌డి పెట్ట‌న‌న్న‌ట్లు ప్ర‌క‌టించింది. క్లౌడ్‌ సర్వీసుల విస్తరణ, ఏఐ సామర్థ్యాల పెంపు, నైపుణ్యాభివృద్ధి, ప్రస్తుత కార్యకలాపాల బలోపేతం కోసం ఈ నిధులను వినియోగించ‌నుంది. ఇది మైక్రోసాఫ్ట్‌ ఇప్పటివరకు భారత్‌లో ప్రకటించిన అత్యంత భారీ పెట్టుబడిగా చెప్పొచ్చు. దీనివ‌ల్ల‌ 1.5 నుండి 2 లక్షల మంది వరకు ఉద్యోగావకాశాలు పొందే అవకాశం ఉంది.

అమెజాన్‌.. 2030 నాటికి రూ.3.15 లక్షల కోట్లు.. Amazon to Invest ₹3.15 Lakh Crore by 2030

ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ భారత్‌లో 2030 నాటికి మొత్తం 35 బిలియన్‌ డాలర్ల (రూ.3.15 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్ట‌నుంది. ఏఐ ఆధారిత డిజిటైజేషన్‌ కార్యక్రమాలు, భారత ఎగుమతుల పెంపు త‌దిత‌ర వాటికి ఈ నిధులు వినియోగించ‌నుంది. ఇంతకుముందు తెలంగాణ, మహారాష్ట్రల్లో AWS విస్తరణ కోసం అమెజాన్‌ 12.7 బి.డాలర్లు (రూ.1.14 లక్షల కోట్లు) ప్రకటించింది.వాటితో పాటు ఇతర ప్రాజెక్టులు కలిపి మొత్తం పెట్టుబడులు 35 బిలియన్‌ డాలర్లకు చేరనున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌ భారత్‌లో 1.20 లక్షల మంది ఉద్యోగులను కలిగి ఉంది. రానున్న కాలంలో అద‌నంగా 80,000 నుంచి 1,00,000 కొత్త నియామ‌కాలు చేప‌ట్టే అవకాశముందని అమెజాన్‌ వర్గాలు తెలిపాయి.

గూగుల్‌.. విశాఖలో ఏఐ–డేటా సెంటర్ .. Google to Set Up AI Data Center in Visakhapatnam

గూగుల్ సంస్థ విశాఖపట్నాన్ని ప్రపంచ ఏఐ మ్యాప్‌లో నిలబెట్టబోతోంది.15 బిలియన్‌ డాలర్ల (రూ.1.35 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్ట‌నుంది. అత్యాధునిక ఏఐ హబ్‌, గిగావాట్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయ‌నుంది. ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌, సబ్‌సీ కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్ త‌దిత‌ర వాటికి నిధులు వెచ్చించ‌నుంది. అమెరికా త‌ర్వాత‌ గూగుల్‌ ఏర్పాటు చేసే అతిపెద్ద ఏఐ/డేటా ఇన్‌ఫ్రా ఇది అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా 45,000 నుంచి 55,000 ఉద్యోగాలు క‌ల్పించే అవ‌కాశం ఉంది.

మెటా-100 మిలియన్ డాల‌ర్లు..Meta to Invest $100 Million

ఫేస్‌బుక్‌–ఇన్‌స్టాగ్రామ్‌ మాతృసంస్థ మెటా… రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో కలిసి 100 మిలియన్‌ డాలర్లకు పైగా (రూ.900 కోట్లకు పైగా) భార‌త్‌తో పెట్టుబడి పెట్టనుంది. అత్యాధునిక ఏఐ సేవల అభివృద్ధి, వ్యాపార సంస్థలకు డిజిటల్‌ సొల్యూషన్స్‌ అందించడమే దీని లక్ష్యం.అదేవిధంగా సిఫీ టెక్నాలజీస్‌తో కలిసి 500 మెగావాట్ల డేటా సెంటర్‌ను విశాఖలో ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతోంది.ఇటీవల ఇంటెల్‌ సీఈఓ భారత సెమీకండక్టర్‌ ప్రయాణానికి మద్దతుగా, కాగ్నిజెంట్‌ CEO సేవల విస్తరణ కోసం విశాఖలో కార్యక్రమాలను ప్రారంభించారు. ఏఐ ఇంజనీరింగ్‌, నెట్‌వర్క్ ఆపరేషన్స్‌, సెక్యూరిటీ ఆపరేషన్స్‌, టెక్‌ సపోర్ట్ విభాగాల్లో 10,000 నుంచి 15,000 వ‌ర‌కూ ఉద్యోగ‌ నియామ‌కాలు చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. జీసీసీ ల విస్తరణతో మరో 2–3 లక్షల ఉద్యోగాలకు మార్గం సుగ‌మం అవుతుంది.

అమెరికా విధానాలు .. దేశీర ఐటీ రంగానికి ఊతం.. US Policies Giving a Boost to India’s IT Sector

ట్రంప్ సుంకాలు.. వర్క్‌ వీసాలపై కఠిన ఆంక్షలతో అమెరికాకు విదేశీ నిపుణులను తీసుకురావడం కష్టమవుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా ఐటీ సంస్థలు భారత్‌లోనే పెద్ద జీసీసీలు (Global Capability Centers) ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. ఇవి కేవలం ఖర్చులను తగ్గించడానికే కాదు. పరిశోధన కేంద్రాలుగా.. ఏఐ అభివృద్ధి కేంద్రాలుగా.. ప్రపంచ కార్యకలాపాల నర్వ్‌ సెంటర్‌లుగా వాటిని రూపొందిస్తున్నాయి. ఏఐ ఆధారిత సేవల అభివృద్ధి అంతా ఇప్పుడు జీసీసీ కేంద్రాల్లోనే జరుగుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా అమెరికా రాజకీయ–ఆర్థిక ఒత్తిళ్లు, ప్రపంచ ఏఐ మార్పులు కలిసొచ్చి… భారత్‌ను మళ్లీ అంతర్జాతీయ టెక్‌ దిగ్గజాల ప్రధాన గమ్యస్థానంగా మార్చుతున్నాయి. ఈ పెట్టుబడుల ప్రవాహం దేశీయ ఐటీ రంగానికి భారీ ఊతం ఇవ్వనుంది. ఏఐ, క్లౌడ్‌, సైబర్‌ సెక్యూరిటీ స్కిల్స్‌కు భారీ డిమాండ్ పెర‌గ‌నుంది. స్టార్టప్‌లకు పెట్టుబడుల అవకాశాలు మెరుగుప‌డ‌తాయి. డిజిటల్‌ ఎకానమీ వేగవంతం కానుంది. అగ్రశ్రేణి కంపెనీల పెట్టుబడులు , కొత్త జీసీసీల వ‌ల్ల వచ్చే 3–5 సంవత్సరాల్లో భారత్‌లో ఐటీ/టెక్‌ రంగంలో 5 లక్షలకు పైగా ఉద్యోగ నియామ‌కాలు జ‌రిగే వీలుంది.

దేశీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఎంత‌వ‌ర‌కు లాభం? How Much Will the Indian Economy Benefit?

ప్రపంచ టెక్‌ రంగం ఏఐ ఆధారిత కొత్త దశలోకి అడుగుపెడుతున్న వేళ… మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, మెటా వంటి ఐటీ దిగ్గజాలు భారత్‌ను ప్రధాన పెట్టుబడి కేంద్రంగా ఎంచుకోవడం దేశ ఆర్థిక వ్యవస్థకు పెద్ద లాభంగా మారనుంది. బిలియన్ల డాలర్ల పెట్టుబడులు కేవలం ఐటీ రంగానికే కాకుండా ఉద్యోగావకాశాలు, రాబడి, ఎగుమతులు, స్టార్టప్‌ రంగం, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు వంటి విభాగాలను అక్షరాలా మలిచే శక్తి కలిగి ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

జీడీపీకి ప్రత్యక్ష ప్రోత్సాహం..Direct Boost to GDP

ఐటీ రంగం దేశ జీడీపీలో ప్రస్తుతం 7–8% వంతు అందిస్తోంది. గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌ పెట్టుబడులు పూర్తి స్థాయిలో అమలైతే అదనంగా 1–1.5% వృద్ధి సాధ్యమని ఆర్థిక శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఏఐ–క్లౌడ్‌ ప్రాజెక్టుల అమలు, డేటా సెంటర్ల నిర్మాణం, నైపుణ్య శిక్షణ కేంద్రాలు, లాజిస్టిక్స్‌, రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల్లో చైతన్యం.. ఇవన్నీ జీడీపీ వృద్ధికి గణనీయమైన తోడ్పాటును అందించనున్నాయి.

ఉద్యోగాలు పెరిగితే.. If Jobs Increase…

ఐటీ దిగ్గజాల ఏర్పాట్లతో వచ్చే 5 లక్షలకుపైగా ఉద్యోగాలు ఆర్థిక వ్యవస్థ అంతటా డిమాండ్‌ను పెంచనున్నాయి. ఉద్యోగాలు పెరిగితే.. వినియోగం, ప‌న్నుల ఆదాయం పెగుతుంది. గృహ నిర్మాణం, రవాణా, ఆరోగ్య రంగాల్లో వ్యయాలు పెరుగుతాయి. GST, ఆదాయ పన్నుల రూపంలో ప్రభుత్వానికి భారీ ఆదాయం రానుంది. ప్రతి టెక్ ఉద్యోగం కనీసం 2–3 పరోక్ష ఉద్యోగాలు సృష్టిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎగుమతుల్లో భారీ వృద్ధి .. Massive Growth in Exports

భారత్‌ ఐటీ/ఐటీఎస్‌ ఎగుమతులు ఇప్పటికే $250 బిలియన్లు దాటాయి. తాజా పెట్టుబడులతో ఏఐ ఆధారిత సేవల ఎగుమతి మరింత పెరగనుందని నాస్‌కామ్‌ అంచనా వేస్తోంది. గూగుల్‌–అమెజాన్‌ వంటి సంస్థలు ఏర్పాటు చేస్తున్న జీసీసీలు ప్రపంచ మార్కెట్‌కు సేవలు అందిస్తాయి. దీనివ‌ల్ల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు, క్లౌడ్‌ సేవలు, సైబర్‌ సెక్యూరిటీ ఉత్పత్తులు, డేటా ఇంజనీరింగ్‌ సేవల‌కు డిమాండ్‌ మరింతగా పెరుగుతుంది. స్టార్టప్‌లు–ఇన్నోవేషన్‌కు బలమైన మద్దతు ల‌భిస్తుంది. ఏఐ రంగానికి సంబంధించి R&D సెంటర్లు, ఇన్నోవేషన్‌ ల్యాబ్స్‌, డెవలపర్‌ సపోర్ట్‌ ప్రోగ్రామ్‌లను ఐటీ దిగ్గ‌జ కంపెనీలు ఏర్పాటు చేస్తుండటం స్టార్టప్‌లకు ఊతం ఇవ్వనుంది. మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌ స్కిల్‌ డెవలప్మెంట్‌ ప్రోగ్రామ్‌ల ద్వారా లక్షలాది మంది ఏఐ–క్లౌడ్‌ శిక్షణ పొందే వీలుంది.

ఇన్‌ఫ్రా రంగానికి ఉత్సాహం..Boost to the Infrastructure Sector

డేటా సెంటర్‌ నిర్మాణం అంటే పెద్దఎత్తున విద్యుత్‌ వినియోగమ‌వుతుంది. భూమి, నిర్మాణ సామగ్రి అవసరం. నెట్‌వర్క్‌ మౌలిక సదుపాయాల ఏర్పాటుతో ఈ రంగాల్లో వేల కోట్ల వ్యాపారం జ‌రుగుతుంది. గూగుల్‌ విశాఖలో ఏర్పాటు చేయనున్న గిగావాట్‌ స్థాయి డేటా సెంటర్‌ స్థానిక ఆర్థిక వ్యవస్థకు పెద్ద బలాన్నివ్వనుంది. భారత్ .. ప్రపంచ ఏఐ కేంద్రంగా ఎదిగే అవకాశం ఉంది. ఐటీ దిగ్గజాల పెట్టుబడులు కేవలం కంపెనీల విస్తరణ ప్రణాళికలు మాత్రమే కాదు. వాటితో భారతలో ఉద్యోగాలు, జీడీపీ, ఎగుమతులు, స్టార్టప్‌లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, నైపుణ్యాల పెంపు వంటి విభాగాల్లో బలమైన వృద్ధి నమోదు కానుంది. దేశ ఆర్థిక దశకు అవి కీలక దిక్సూచిగా మారనున్నాయి.

 

 

 

285
FEATURE NEWS Tags:Amazon to Invest ₹3.15 Lakh Crore by 2030, Boost to the Infrastructure Sector, Direct Boost to GDP, Google to Set Up AI Data Center in Visakhapatnam, Hope Blossoms, How Much Will the Indian Economy Benefit?, If Jobs Increase…, Massive Growth in Exports, Meta to Invest $100 Million, Microsoft Announces ₹1.58 Lakh-Crore Mega Investment, US Policies Giving a Boost to India’s IT Sector

Post navigation

Previous Post: కొత్త సంప‌న్నుల కోసం వెల్త్ సైకాలజిస్టులు Wealth Psychologists for New Affluents
Next Post: రిస్క్‌ Vs రాబడి – పెట్టుబడులను ఎంచుకునే సూత్రం Risk vs Reward – How to Choose Your Investments

Related Posts

  • బ్యాంక్ ఖాతాలో డబ్బులు పోయాయా?.. అయితే ఇలా చేయండి..! బ్యాంకే పరిహారం చెల్లిస్తుంది! Money Lost from Your Bank Account?.. Follow This Process and the Bank May Compensate You FEATURE NEWS
  • లోన్ వద్దనుకుంటున్నారా.. అయితే రద్దు చేసుకోండి ! ‘కూలింగ్-ఆఫ్’ నిబంధనతో సేఫ్ ఎగ్జిట్! Don’t Want the Loan? Cancel It! Safe Exit with ‘Cooling-Off’ Rule! FEATURE NEWS
  • ఈఎల్‌ఎస్‌ఎస్‌… పన్ను ఆదాలో జాగ్రత్తలు.. ELSS Funds – Avoid These Common Mistakes FEATURE NEWS
  • టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా.. ఈ విష‌యాలు తెలుసుకోండి Taking Term Insurance? Know These Important Things.. FEATURE NEWS
  • సుర‌క్షిత‌మైన‌వి పోస్టాఫీస్ సేవింగ్స్‌ post office saving schemes are safe FEATURE NEWS
  • కొత్త ఐటీఆర్‌ ఫారాలు.. జ‌న‌వ‌రి నుంచి అమ‌లు! New ITR Forms to Be Implemented from January! FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • should know these words in stock market MARKET
  • రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.20 వేలు.. Retirement Income Plan – Safe, Steady and Stress-Free FINICAL PLANNING
  • ఇంట్రాడే ట్రేడింగ్ అంటే what is intraday trading MARKET
  • ఇంటి రుణం పూర్తిస్థాయిలో ఎలా పొందాలో తెలియ‌డం లేదా? అయితే ఈ సూచ‌న‌లు పాటించండి Don’t Know How to Get a Full Home Loan? Follow These Tips FEATURE NEWS
  • కొత్త పాన్‌ కార్డ్‌ కోసం కేవలం ఆధార్‌ సరిపోదు! నిబంధనలు కఠినతరం… ఏమేం అవసరమంటే? New PAN Card Rules 2026 – Aadhaar Alone Not Enough Anymore FEATURE NEWS
  • ఆర్‌బీఐ గుడ్‌న్యూస్ … కీలక వడ్డీ రేట్లపై మ‌రో కోత RBI Delivers Good News Again: Another Cut in Key Interest Rates FEATURE NEWS
  • ఆన్‌లైన్‌లోనే అట‌ల్ పెన్ష‌న్ యోజ‌న‌ how to apply atal pension yojana in online FEATURE NEWS
  • క్రెడిట్ కార్డును స‌ద్వినియోగం చేసుకోండి how to get profits from credit card FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme