బంగారం అంటే ఎప్పటికీ భద్రమైన పెట్టుబడి అని భావించే భారతీయులు ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అదే డిజిటల్ గోల్డ్. డిజిటల్ యుగంలో డిజిటల్ బంగారం అనే కొత్త పెట్టుబడి పద్ధతి రోజురోజుకూ ప్రాచుర్యం పొందుతోంది. గ్రాములు కాకుండా “రూ. 100”తోనూ బంగారం కొనుగోలు చేసే సౌకర్యం ఉండటమే ప్రధాన ఆకర్షణగా మారింది. బంగారం ధరలు ఎగబాకుతుండటంతో పెట్టుబడిదారులు ఇప్పుడు డిజిటల్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. Paytm, PhonePe, Google Pay వంటి ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా డిజిటల్ గోల్డ్ కొనుగోలు, అమ్మకం సులభమైంది. భౌతిక బంగారం మాదిరిగానే ఇది కూడా 24 క్యారెట్ల బంగారమే . దీర్ఘకాలిక పెట్టుబడికి డిజిటల్ గోల్డ్ మంచి ప్రత్యామ్నాయం. కానీ పూర్తి భద్రతా ప్రమాణాలు ఉన్న సంస్థల ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. అని నిపుణులు సూచిస్తున్నారు.
చిన్న మొత్తాలతో పెట్టుబడి.. Investment with Small Amounts
డిజిటల్ గోల్డ్ ద్వారా రూ.100 నుంచే పెట్టుబడి పెట్టవచ్చు. ఈ సౌకర్యం యువతరాన్ని ఆకర్షిస్తోంది. Paytm, PhonePe, Google Pay వంటి యాప్స్ ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం అని కంపెనీలు చెబుతున్నాయి. చిన్న మొత్తాలతో పెట్టుబడి చేసే అవకాశం
ఉండగా.. ఇది భద్రతతో కూడిన నిల్వ. ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించే వీలుంది.
ఎందుకింత ఆకర్షణ..?..Why Is It So Attractive?
బంగారం ధరలు పెరుగుతుండటంతో, భౌతిక బంగారం భద్రతా సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు ఇప్పుడు డిజిటల్ మార్గం వైపు మొగ్గుతున్నారు. భౌతిక నిల్వ అవసరం లేకుండా, ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకునే అవకాశం ఉండటం ప్రధాన ఆకర్షణగా మారింది. డిజిటల్ గోల్డ్ పెట్టుబడులకు మంచి ఆప్షన్. కానీ రిజిస్టర్డ్ కంపెనీలు, నమ్మకమైన యాప్స్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలి. కొనుగోలు ముందు ఛార్జీలు, లాక్-ఇన్ పీరియడ్, భౌతిక మార్పిడి సదుపాయాలు తెలుసుకోవాలి. ఇంటర్నెట్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో అనుమానాస్పద యాప్స్, తెలియని లింకులు ద్వారా కొనుగోలు చేయవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. RBI నియంత్రణలో లేని ప్లాట్‌ఫార్మ్‌లను దూరంగా ఉండడం మంచిది.
నష్టాలు / ప్రమాదాలు Losses / Risks
వడ్డీ లాభాలు లేవు: డిజిటల్ గోల్డ్ వడ్డీ లేదా డివిడెండ్ ఇవ్వదు. నిల్వ ఉన్నంత కాలం ఆదాయం ఉండదు.
అదనపు ఛార్జీలు: కొన్ని ప్లాట్‌ఫార్మ్‌లు నిల్వ, మార్పిడి, డెలివరీ ఛార్జీలు వసూలు చేస్తాయి.
RBI నియంత్రణలో లేదు: ప్రస్తుతం డిజిటల్ గోల్డ్‌పై నేరుగా RBI పర్యవేక్షణ లేదు. కాబట్టి నమ్మకమైన కంపెనీలను మాత్రమే ఎంచుకోవాలి.
మోసాల ప్రమాదం: అధికారిక లైసెన్స్ లేని యాప్స్ ద్వారా కొనుగోలు చేస్తే మోసాలకు గురయ్యే అవకాశం ఉంటుంది.
పన్నులు: విక్రయించినప్పుడు క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తించే అవకాశం ఉంది.
మ్యూచువల్ ఫండ్లు అందించే గోల్డ్ ఫండ్లు, ఈటీఎఫ్‌లు
Gold Funds and ETFs Offered by Mutual Funds
– మ్యూచువల్ ఫండ్ సంస్థలు నడిపే ఈ స్కీములు ప్రధానంగా గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెడతాయి. పెట్టుబడిదారు నేరుగా ఈటీఎఫ్ కొనకపోయినా, గోల్డ్ ఫండ్ ద్వారా పరోక్షంగా బంగారంలో పెట్టుబడి పెట్టినట్టే. చిన్న మొత్తాలతో ప్రారంభించవచ్చు, SIP రూపంలోనూ పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది.
– గోల్డ్ ఈటీఎఫ్‌లు అంటే స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిన బంగారం ఆధారిత ఫండ్లు. ఇవి ఒక గ్రాము లేదా పది గ్రాముల బంగారం విలువ ఆధారంగా ఉంటాయి. పెట్టుబడిదారు డీమాట్ ఖాతా ద్వారా వీటిని కొనుగోలు, విక్రయాలు చేయవచ్చు. స్టాక్‌ల మాదిరిగానే వీటికి మార్కెట్ ధరలు మారుతుంటాయి.
– భౌతిక బంగారం కంటే గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఫండ్లు ఎక్కువ పారదర్శకత కలిగినవి. SIP రూపంలో చిన్న మొత్తాలతో దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇవి అనువైనవి.
ప్రయోజనాలు…Benefits
భద్రత: భౌతిక బంగారం లేనందున దొంగతనం, నిల్వ సమస్యలు ఉండవు.
పారదర్శకత: మార్కెట్ ధరల ఆధారంగా విలువ నిర్ణయమవుతుంది.
లిక్విడిటీ: మార్కెట్‌లో ఎప్పుడైనా అమ్ముకునే అవకాశం ఉంటుంది.
పన్ను ప్రయోజనాలు: దీర్ఘకాలిక పెట్టుబడిగా పరిగణిస్తే ట్యాక్స్ బెనిఫిట్లు లభిస్తాయి.
SIP సౌకర్యం: గోల్డ్ ఫండ్లలో నెలనెలా పెట్టుబడి చేసే అవకాశం.
లోపాలు…Drawbacks
ఈటీఎఫ్‌ల కోసం డీమాట్ ఖాతా తప్పనిసరి.
మార్కెట్ ధరలు మారుతుండటంతో లాభనష్టాలు ఉంటాయి.
ఫండ్ మేనేజ్‌మెంట్ ఫీజులు, ఎక్స్పెన్స్ రేషియో ఉంటాయి.
భౌతిక బంగారం పొందాలంటే విక్రయం తప్పదని నిపుణులు చెబుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..Precautions to Take
ఇప్పటి కాలంలో బంగారం కొనాలంటే బంగారు దుకాణానికి వెళ్లాల్సిన అవసరం లేదు. మొబైల్‌లో క్లిక్ చేస్తే బంగారం మీ ఖాతాలోకి వస్తుంది. కానీ ఈ డిజిటల్ గోల్డ్ పెట్టుబడి నిజంగా ఎంతవరకు పెట్టుబడిదారులకు శ్రేయస్కరమో తెలుసుకోవడం ఇప్పుడు అవసరం.ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో నమ్మకమైన ప్లాట్‌ఫార్మ్‌లలో మాత్రమే డిజిటల్ బంగారం కొనుగోలు చేయాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. డిజిటల్ గోల్డ్‌ను భౌతిక రూపంలో మార్చుకునే అవకాశాలు, నిల్వ గడువు, ఛార్జీలు వంటి అంశాలను ముందుగానే తెలుసుకోవాలని హెచ్చరిస్తున్నారు. మార్కెట్‌లో అనేక యాప్‌లు ఉన్నా, అన్ని విశ్వసనీయమవు. రిజిస్టర్డ్ కంపెనీలు, గుర్తింపు పొందిన ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారానే కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసిన బంగారం ఎక్కడ నిల్వవుంటుందో, ఎవరే కస్టోడియన్లో తెలుసుకోవాలి. సాధారణంగా MMTC-PAMP, Augmont వంటి సంస్థలు ఉంటాయి. డిజిటల్ గోల్డ్‌ను భౌతిక బంగారంగా మార్చుకుంటే అదనపు ఛార్జీలు ఉండొచ్చు. వాటిని ముందుగానే తెలుసుకోవాలి. కొన్ని కంపెనీలు నిర్దిష్ట కాలానికే నిల్వ సదుపాయం ఇస్తాయి. ఆ గడువు ముగిసేలోపు అమ్మకాలు లేదా మార్పిడి చేయాలి. ప్రస్తుతం డిజిటల్ గోల్డ్‌పై RBI నేరుగా పర్యవేక్షణ చేయడం లేదు. కాబట్టి పెట్టుబడి చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
