
లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరూ తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే కుటుంబాన్ని పోషించే వ్యక్తి అనుకోని విధంగా దూరమైనప్పుడు ఇంటిల్లిపాది ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆదాయం కోల్పోయి కష్టాల్లో పడాల్సి వస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటే కొంత వరకైనా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు. అందువల్ల term insurace పాలసీ తీసుకుంటే.. ఆ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగినా లేదా చనిపోయిన ఆ డబ్బులు నామినీకి వెళ్తాయి. కాబట్టి ఆ కుటుంబం ఫైనాన్షియల్ ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. అందువలన ప్రతి ఒక్కరూ term insurance తీసుకోవడం చాలా మంచిది.
చాలా మంది insurance premium ఎక్కువగా ఉంటుందన్న కారణంతో వెనకడుగు వేస్తుంటారు. ఈ క్రమంలో సామాన్యులకు సైతం తక్కువ అందుబాటులో ఉండాలని తక్కువ ప్రీమియంతో కేంద్ర ప్రభుత్వం Pradhana Mantri Jeevan Jyothi Bima Yojana term insurance ను తీసుకొచ్చింది. ఇది 2015లో అందుబాటులోకి తీసుకొచ్చింది. పాలసీ తీసుకున్న వ్యక్తి మరణించిన సందర్భంలో రూ.2 లక్షల insurance సొమ్ము అందుతుంది. ఇప్పటి వరకు ఈ scheme కింద 16.2 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. ఈ పథకంలో 6.64 లక్షల కుటుంబాలు రూ.13,290 కోట్ల ఆర్థిక సాయాన్ని పొందాయి.
what are the conditions for taking term insurance
టర్మ్ ఇన్సురెన్స్ తీసుకోవడానికి కొన్ని షరతులు ఉంటాయి. అవి ఏమిటంటే
Term insurance తీసుకోవాలంటే Education Qualification, Income Tax Returns ఇవన్నీ అడుగుతారు. దీంతో కొంతమంది Term insurance policy premium చెల్లించలేక పోతున్నారు. అందుకే ఇలాంటి షరతులు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరూ ఒకే premium చెల్లిస్తూ.. Eligible related గా ఎటువంటి conditions లేకుండా ఇన్సూరెన్స్ పొందడానికి ప్రభుత్వం Pradhan Mantri Jeevan Jyothi Bima Yojana పథకాన్ని ప్రవేశపెట్టింది.
* ఈ schemeలో చేరేందుకు 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు.
* Bank లేదా Post office లో Savings Account ఉన్న వారెవరైనా ఈ schemeలో చేరొచ్చు.
* ఇందు కోసం Bank account ను Aadhaarతో అనుసంధానించాల్సి ఉంటుంది.
* Know Your Customer చేయించాలి.
* ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ Savings Accounts కలిగి ఉంటే, ఏదైనా ఒక Savings Account ఉన్న bank నుంచి మాత్రమే ఈ పథకంలో చేరడం అవుతుంది.
* ఎవరైనా రెండు అకౌంట్ల ద్వారా నమోదు చేసుకుని premium చెల్లించినా ఒకటి మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
* పాలసీదారుకు 55 సంవత్సరాల వరకు జీవిత బీమా పొందేందుకు వీలుంటుంది. ఉమ్మడి ఖాతా తీసుకున్న వారు కూడా ఈ పథకంలో చేరవచ్చు. ఇద్దరూ విడివిడిగా premium డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
* ఈ పథకంలో ఒక ఏడాది కాల పరిమితితో premium చెల్లించాల్సి ఉంటుంది.
* ఒకసారి ఇందులో చేరిన వారికి మే 25-31 మధ్య premium మొత్తం Auto Debit ద్వారా Renewal అవుతుంది.
* ఒక వేళ Cancel చేయాలనుకుంటే రద్దు కోసం bankకు దరఖాస్తు చేసుకోవాలి.
* కొత్తగా ఈ పథకంలో చేరే వారికి జూన్ 1 నుంచి మే 31 వరకు కవరేజీ లభిస్తుంది.
* ఈ పథకంలోకి కొత్తగా చేరినా లేదా తిరిగి జాయిన్ అయిన వ్యక్తి ఏ కారణం చేతనైనా మరణిస్తే నమోదు చేసుకున్న 30 రోజుల తర్వాత మాత్రమే Claimకు అనుమతి ఉంటుంది.
* ఒక వేళ రోడ్డు ప్రమాదంలో మరణిస్తే Claim కోసం దాఖలు చేసుకోవచ్చు.
* Pradhana mantri jeevan jyothi bima yojana పాలసీలో మనం సంవత్సరానికి రూ.436 మాత్రమే premium కట్టాలి. Insurance తీసుకున్న వ్యక్తి ఒకవేళ చనిపోయినట్లయితే Nominee ఎవరైతే ఉంటారో రూ.2లక్షలు Claim చేసుకోవచ్చు. వాస్తవంగా మనకి రూ.2లక్షలు సరిపోకపోవచ్చు. కానీ మన Financial Capability బట్టి Term Insurance తీసుకోవాలి. మన అవసరాన్ని బట్టి మరింత ఎక్కువ మొత్తం కోసం మరో టెర్మ్ పాలసీ తీసుకోవాలి. కానీ ఏదైనా తప్పకుండా టర్మ్ ఇన్సురెన్స్ తీసుకోవాలి.
* Term Insurance తీసుకోవాలనుకున్నప్పుడు ఏ A company’s claim settlement ratio బాగుంటుందో అటువంటి కంపెనీ Term Insurance తీసుకుంటే మనకి Claims కొంచెం Easy అవుతాయి.
* ఈ Insurance policyలో మనకి Maturity, Surrender Value ఏమీ ఉండవు. ఏదైతే premium pay చేస్తామో ఆ premium అన్నది మనకి వచ్చెటటువంటి Sum assuer కి pay చేస్తున్నట్లు. ఒకవేళ Insurance policy Surrender చేస్తే మనకి ఎటువంటి డబ్బులు కూడా Return రావు.
* తొలుత ఈ పథకాన్ని కేవలం రూ.330 premium తోనే అందించేవారు. ఇప్పుడు ఆ premium ను రూ.436కు పెంచారు. Auto debit ద్వారా bank లేదా post office account నుంచే వాయిదాలో premium మొత్తాన్ని చెల్లించాలి.
* ఈ స్కీమ్‌లో చేరే నెలను అనుసరించి premium మారుతూ ఉంటుంది. జూన్ నుంచి ఆగస్టు మధ్యలో చేరితే ఏడాదికి రూ.436 చెల్లించాలి. సెప్టెంబరు నుంచి నవంబర్ మధ్య కాలంలో చేరితే రూ.342, డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య చేరితే రూ.228, మార్చి నుంచి మే మధ్య అయితే రూ.114 premium కట్టాల్సి ఉంటుంది.
* ఇది మొత్తంగా Term Policy కావడంతో Maturity ప్రయోజనాలు ఉండవు. పాలసీదారుడు మరణించినప్పుడు మాత్రమే లబ్ధిదారునికి మొత్తం చెల్లిస్తారు.
HOW TO APPLY SCHEME
స్కీమ్‌ను ఎలా దరఖాస్తు చేయాలి
ఈ scheme కి OFF LINE , ONLINE లో రెండు రకాలుగా apply చేసుకోవచ్చు.
* మనకి saving bank account ఏ bankలో ఉంటుందో అక్కడికి వెళ్లి Pradhan Mantri Jeevan Jyothi Bima Yojana పథకానికి apply చేసుకోవాలనుకుంటన్నామని చెబితే మనకి ఒక Farm ఇస్తారు. ఆ Farm లో మన వివరాలను నింపి వాళ్లకి ఇస్తే ఆ bankలో మన పథకం apply అయిపోతుంది. అప్పుడు bank వాళ్లు మనకి acknowledgement Receipt ఇస్తారు. దానిని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి.
* scheme తీసుకున్నప్పుడు Automatic Debit Option పెట్టమని bank వాళ్లకి చెప్పాలి. ఎందుకంటే మనం busyగా ఉండి Premium చెల్లించకపోతే మన Term Insurance రద్దు అయిపోతుంది. రద్దు అయిపోయిన తర్వాత మనం Reapply చేసుకోవచ్చు. కానీ Reapply చేసుకున్న తర్వాత మనకి 30రోజులు Waiting period ఉంటుంది. ఆ 30 రోజుల్లో మనకి ఏదైనా జరిగితే మన family కి Some assured అందదు.
* మొదటిసారి Term Insurance తీసుకున్న కూడా 30రోజులు Leave period ఉంటుంది. 30రోజుల్లో ఏమి జరిగినా కూడా మనకి ఈ పాలసీ వర్తించదు.
* scheme తీసుకున్నప్పుడు Nomineeని నమోదు చెయ్యాలి. మనం apply చేసిన తర్వాత మన కుటుంబ సభ్యులకు ఈ పథకం గురించి చెప్పాలి. ఎందుకంటే మనకి ఏదైనా జరిగితే వాళ్లు Insurance claim చేసుకోవాలి.
How to claim this scheme
ఈ స్కీమ్ తీసుకున్న వ్యక్తికి ఏదైనా జరిగితే నామినీ ఎలా క్లెయిమ్ చేసుకోవాలి
ఇన్సురెన్స్ తీసుకున్న వ్యక్తి చనిపోతే .. అతని డెత్ సర్టిఫికేట్ లేదా hospital బిల్లులను
nomineeగా ఉన్నవారు bankకి తీసుకుని వెళ్లాలి. ఆ బ్యాంకు వాళ్లకి నామినీ పూర్తి వివరాలు చెబితే ఆ బ్యాంకు వాళ్లు మనకి farm ఇస్తారు. అది మనం నింపి bankలో apply చేస్తే 30 రోజులు Verification Period ఉంటుంది. తర్వాత నామినీ బ్యాంకు అకౌంట్ కి వచ్చి cash credit అవుతుంది.
what is Pradhana Mantri Suraksha Bima Yojana
ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మరో పథకం Central Government Accidental Scheme. ఈ స్కీమ్ లో సంవత్సరానికి రూ.20 premium చెల్లిస్తే సరిపోతుంది. యాక్సిడెంట్ వల్ల నష్టంజరిగిన వ్యక్తి కి, అతని కుటుంబానికి భరోసా ఇవ్వడం ఈ పథకం ఉద్దేశం.
* 18- 70 సంవత్సరాల మధ్యలో ఉన్నవాళ్లు Pradhana Mantri Suraksha Bima Yojana పథకానికి apply చేసుకోవచ్చు.
* ఈ స్కీమ్ లో మనం సంవత్సరానికి రూ.20 Premium చెల్లించవలిసి ఉంటుంది.
* ఈ స్కీమ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్లకి రూ.2లక్షల వరకు Sum assured వస్తుంది. ఒకవేళ ఈ స్కీమ్ తీసుకున్న వ్యక్తి Accident అయ్యి చనిపోతే నామినీకి రూ.2లక్షలు వెళ్తాయి.
* ఇన్సురెన్స్ తీసుకున్న వ్యక్తికి Accident అయ్యి, చనిపోకుండా ఏవైనా రెండు అవయవాల లోపం అయితే అప్పుడు కూడా రూ.2లక్షలు క్లెయిమ్ చేసుకోవచ్చు.
* అదే ఒక్క అవయవం అంటే ఒక కన్ను లేదా కాలు లేదా చేయి ఇలా ఏదైనా లోపం అయితే అతనికి రూ.1లక్ష Some assured లభిస్తుంది.