
ప్రతి మనిషికి అత్యంత అవసరమైనది డబ్బు. అదే విధంగా ప్రతి మనిషికి అత్యంత సమస్య కూడా డబ్బే. డబ్బు మీద ఒక్కొక్కరికీ ఒక్కో అభిప్రాయం ఉంటుంది.
ప్రతి ఒక్కరూ డబ్బుతో సైకలాజికల్ గా ఒక అనుబంధం ఏర్పరుచుకుంటారు. మనం ఏం ఉద్యోగం చేస్తున్నాం, ఎంత సంపాదిస్తున్నామో అనే దానితో మనకి గుర్తింపుని ఇస్తారు. డబ్బుతోనే మన విలువను నిర్ణయిస్తుంటారు. డబ్బు మంచిదా లేదా చెడ్డదా? మంచి చెడులకు అందని విలువ ఏమైనా డబ్బులో ఉందా అనే ఆలోచన మనందరికీ రావచ్చు. ఇక్కడ మనిషికి ముఖ్యంగా కావలిసినది అనుభవం. డబ్బు మనకి అనుభవాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల మనం డబ్బును అనుభవంగా మాత్రమే చూడాలి. ఆస్తిలా చూడకూడదు. అంటే డబ్బుకు వ్యసనపరులం కాకుండా, అవసరానికి వాడుకునే ఒక సాధనంగా మాత్రమే చూడాలి.
మన జీవితంలో విలువలను ఇచ్చే గుణాలు చాలా ఉంటాయి. టైమ్ అన్నింటికంటే విలువైనది. అలాగే KNOWLEDGE, HAPPINESS, POSITIVITY ఇలాంటి వాటిని డబ్బుతో సంబంధం లేకుండా మనం పొందవచ్చు. డబ్బు అనేది ఇలాంటి విలువైన గుణాలకు అనుసంధానంలా ఉపయోగపడుతుంది.
మనకి ఉన్న నాలెడ్జ్ తో మనం ఒక పుస్తకాన్ని రచయిస్తే దాని నుంచి వచ్చే డబ్బుతో మనకి ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. రాస్తున్న క్రమంలో మనం పొందే అనుభూతి అన్నింటి కన్నా గొప్పది. దాంతో మనలో పాజిటివ్ ఎమోషన్స్ పెరుగుతాయి. అందువల్ల మనీ అనేది మనం చేసే పనికి, మన టాలెంట్ కి బై ప్రోడక్ట్ లాంటిది. ఇక్కడ మనం చేసింది మనకి నచ్చిన పని. ప్రధాన ప్రతిఫలం సంతోషం. రెండెవదో లేదా చివరాఖరుదో డబ్బు. ఇలా ఉంటేనే పనిలో ఒత్తిడి, జీవితంలో యాంత్రికత ఉండదు.
డబ్బు అనేది సమస్య కాదు
Money is not the problem
సాధారణంగా అందరూ అనుకున్న మాటేమిటంటే… మనకి వచ్చే సమస్యలకి డబ్బే కారణమని అనుకుంటాం. డబ్బు అనేది సమస్యకు కారణం కాదు. సమస్య వలన వచ్చే పరిణామం. మనకి సమస్య ఉంటే మనం చేసే ప్రయత్నంలో ఉంటుంది. కాని డబ్బులో ఉండదు. మనం మనీని డిజర్వ్ చేయాలంటే డెడికేటెడ్‌గా హార్డ్ వర్క్ చెయ్యాలి. ఎవరైతే డబ్బుకోసం కష్టపడతారో, డబ్బుకు విలువ ఇస్తారో వాళ్ళ దగ్గరికి డబ్బు తొందరగా చేరుతుంది.
THE DISEASE OF MORE
ఉన్నవాటి కన్నా ఇంకా ఎక్కువ కావాలనుకోవడం ఒక రకమైన మానసిక రుగ్మత. ఇది మనల్ని ఒక వ్యసనపరుడిలా తయారు చేస్తుంది. ఈ రోజుల్లో అవసరం ఉన్నా, లేకపోయినా వస్తువులను కొనడం కామన్ అయిపోయింది. దీనివలన మన దగ్గర ఎన్ని వస్తువులు ఉన్నా, ఎంత సంపాదించినా మనకి సంతృప్తి కలగడం లేదు.
THE THINGS YOU OWN END UP OWNING YOU అంటే నీ దగ్గర ఉన్న వస్తువులే చివరకి నిన్ను బానిసగా చేస్తాయి. లగ్జరీ వస్తువులు, అవసరం లేని సౌకర్యాలతో నువ్వు ఏర్పాటు చేసుకున్న అనుబంధం నిన్ను సాధారణ వ్యక్తిలా బతకనివ్వవు. రేపు ఆ వస్తువు లేకుంటే నిన్ను జీవించలేని పరిస్థితికి తీసుకువస్తాయి.
విలాసవంతంగా బతకాలనుకోవడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ కావలనుకోవడం అనే ఆశ ఎప్పటికీ తీరదు. నిరంతరం ఈ ఆశ మన మైండ్ లో తిరుగుతునే ఉంటుంది. దానికోసం గంటల తరబడి పనిచేస్తాం, ఎన్నో త్యాగాలు చేస్తాం. కానీ చివరికి సంపాదించినది, డబ్బుతో కొనుక్కున్నది ఇచ్చే సంతృప్తిని కూడా మనం ఆస్వాదించలేము. ఎందుకంటే మనం ఎంత సంపాదించినా కోరికలు చావవు. అందువలన దీనిని మనం Disease of more అంటాం.
డబ్బు ఎప్పుడూ పోజిటివ్ గా , నెగిటివ్ గా కాకుండా న్యూట్రల్ గానే ఉంటుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎక్స్ పీరియన్స్ ను షేర్ చేసుకోవడానికి ఒక కనెక్టింగ్ డివైజ్ లా పనిచేస్తుంది. ఎవరైనా డబ్బు సంపాదించాలంటే ఒక ఎక్స్ పీరియన్స్ ను క్రియేట్ చెయ్యాలి. డబ్బు రెట్టింపు అవ్వాలంటే మనం ఇతరులకు ఉపయోగపడాలి. మనకున్న ఎక్స్ పీరియన్స్ లో పవర్ ఉండవచ్చు, స్పీడ్ ఉండవచ్చు. అంతటితో ఆగకుండా మనం చేసే ప్రతి పనిలో ఎక్స్ పీరియన్స్ ను పొందాలి.
what are the Stress cycles
కొంతమంది డబ్బు సంపాదించడానికి చాలా కష్టపడతారు. అధిక ఒత్తిడికి లోనవుతారు. జాబ్ అయినా, బిజినెస్ అయినా ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఫీలవుతారు. జాబ్ వలన కలిగిన ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ఇంకా ఎక్కువ సంపాదించాలనుకుంటారు.. అప్పుడు ఇంకా ఎక్కువ ఒత్తిడికి లోనవ్వాలి. అందువల్ల ఎప్పుడు ఒత్తిడికి గురవ్వకూడదు.
ఇలాంటవన్నీ మనం మొదటినుంచీ తుడిచి వేయాలి. ఎందుకంటే డబ్బు మనకి మంచి చేయకపోయినా పర్వాలేదు. కానీ చెడు చేయకూడదు.
Ego cycles
ఈగో అనేది ప్రతి ఒక్కరిలో కామన్ గా ఉండే గుణం. కొన్నిసార్లు మన జీవితంలో మనకి అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. అలాంటప్పుడు వేరేవాళ్ళు మనల్ని కంట్రోల్ చేస్తారు. దీనితో తెలియకుండానే ఈగో సైకిల్ మన బ్రైన్ లో స్టార్ట్ అవుతుంది. ఇన్ సెక్యూరిటీ డబ్బులు ఖర్చుపెట్టడంలో మనీ మేనేజ్ మెంట్ లో ట్రాన్సఫర్ అవుతుంది. ఇలాంటి ఈగో నుంచి మనం ఎంత డబ్బు సంపాదించినా అది నిజమైన సంపాదన అవ్వదు. అందువలన ఈగో పనికిరాదు.
Pain cycles
కొంతమంది డబ్బు సంపాదించాలంటే శారీరకంగా, మానసికంగా కష్టపడవలిసి వస్తుంది. వీళ్ళకి డబ్బు వచ్చేది కష్టం నుండి. అందువలన ఆ పెయిన్ ను తగ్గించుకోవడానికి ఆల్కహాల్, మత్తు పదార్థాల వంటివి తీసుకుంటారు. దీని వల్ల వాళ్లు సంపాదించేది వీటికే ఖర్చయిపోతుంది. వాళ్ల ఆలోచనలు కూడా అడ్డదారి తొక్కి జీవితంపై అదుపు కోల్పోతారు. ఎటువంటి లక్ష్యం లేకుండా బతుకుతారు. ఇలాంటి పరిస్థితులకు అవకాశం ఉన్నవారు మనీ మీద ఇలాంటి మైండ్ సెట్ ను బ్రేక్ చెయ్యాలి.
how to Build true wealth
డబ్బు సంపదగా మారాలంటే అందుకు మనం అనుసరించాల్సిన ఒక నియమం తెలుసుకోవాలి.
మనం సంపాదించే మార్గం, ఖర్చుపెట్టే అవసరం రెండూ సరైన పద్ధతిలో ఉండాలి. ఎప్పటికప్పుడు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
ఎప్పుడైనా డబ్బుని మనం కంట్రోల్ చెయ్యాలి. డబ్బు మనల్ని కంట్రోల్ చెయ్యకూడదు.
డబ్బు అనేది సక్సెస్ అవ్వడానికి ఉపయోగపడే టూల్ మాత్రమే. డబ్బు కంటే విలువైన వాటిపై మనం మనుసు పెడితే మనీ కూడా మనకి హెల్ప్ చేయడం మొదలుపెడుతుంది. నిజమైన సంపాదన మనీ కాదు. మనీతో మనకున్నా పోజిటివ్ ఎక్స్ పీరియన్స్.