Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • నామినీకే డబ్బంతా చెల్లుతుందా? Does the Entire Money Go to the Nominee? FEATURE NEWS
  • పెట్టుబడులు.. మీ భవిష్యత్తును నిర్మించే పునాదులు..!! Investments: The Foundation That Builds Your Future FEATURE NEWS
  • ఈపీఎఫ్‌వోలో మార్పులు.. త్వ‌ర‌లో ఆటో విత్‌డ్రా సదుపాయం!! Major Changes in EPFO Withdrawal System FEATURE NEWS
  • లాభాల బాటలో మార్కెట్లు.. Markets End in Green Amid Positive Global Signals FEATURE NEWS
  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases? FEATURE NEWS
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April FEATURE NEWS
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams FEATURE NEWS
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses FEATURE NEWS
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments? FEATURE NEWS
  • 15 శాతానికి కస్టమ్స్ డ్యూటీ పెంపు.. బంగారం, వెండి ధ‌ర‌లు మ‌రింత ప్రియం.. Customs Duty Hiked to 15%.. Gold and Silver Set to Become Costlier FEATURE NEWS

సుంకం పెరిగితే బంగారం కొనుగోలు తగ్గుతాయా? Will Higher Import Duty Reduce Gold Demand?

Posted on 14/05/2026 By admin No Comments on సుంకం పెరిగితే బంగారం కొనుగోలు తగ్గుతాయా? Will Higher Import Duty Reduce Gold Demand?

భారతీయులకు బంగారంతో ఉన్న అనుబంధం కేవలం ఆభరణాల వరకే పరిమితం కాదు. అది ఒక భావోద్వేగం.. ఒక భద్రత.. ఒక సంప్రదాయం.. అవసర సమయాల్లో ఆదుకునే ఆస్తి.. తరతరాలుగా కుటుంబ సంపదకు ప్రతీకగా నిలిచిన విలువైన లోహం. అందుకే ప్రపంచవ్యాప్తంగా బంగారాన్ని పెట్టుబడి సాధనంగా చూస్తే, భారతదేశంలో మాత్రం అది కుటుంబ ఆర్థిక సంస్కృతిలో భాగమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచడం వల్ల నిజంగానే కొనుగోళ్లు తగ్గుతాయా? (Reduce Gold Demand) వాణిజ్య లోటు అదుపులోకి వస్తుందా? విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోగలమా? లేక మరోసారి అక్రమ రవాణా, బిల్లు లేని వ్యాపారాలకు ఊతమిస్తుందా? అనే ప్రశ్నలు ఇప్పుడు ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల బంగారంపై దిగుమతి సుంకాన్ని మళ్లీ పెంచడంతో దేశవ్యాప్తంగా బంగారం మార్కెట్‌లో కొత్త చర్చ మొదలైంది. గతంలో అధిక సుంకాల వల్ల స్మగ్లింగ్‌ పెరిగిందని చెబుతూ ప్రభుత్వం 2024-25 బడ్జెట్‌లో సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. అయితే ఇప్పుడు మళ్లీ అదే సుంకాన్ని పెంచడం వెనుక ప్రభుత్వ ఆలోచన విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడం, వాణిజ్య లోటును తగ్గించడం. కానీ పరిశ్రమ వర్గాలు మాత్రం ఇది ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చని చెబుతున్నాయి.

భారతీయులకు బంగారం అంటే ఎందుకింత మక్కువ? Why Indians Are Emotionally Attached to Gold?
భారతదేశంలో బంగారం కొనుగోలు (Reduce Gold Demand)కేవలం పెట్టుబడి కోసం మాత్రమే కాదు. పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు, కుటుంబ సంప్రదాయాలు అన్నీ బంగారంతో ముడిపడి ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ బంగారాన్నే నిజమైన పొదుపుగా భావిస్తారు. బ్యాంకుల కంటే, స్టాక్‌మార్కెట్ల కంటే, మ్యూచువల్‌ ఫండ్ల కంటే బంగారంపైనే ఎక్కువ నమ్మకం ఉంచే కుటుంబాలు ఇంకా లక్షల్లో ఉన్నాయి. చాలా మంది మహిళలకు బంగారం అంటే ఆర్థిక భద్రత. అవసర సమయంలో తాకట్టు పెట్టుకోవచ్చు.. అమ్ముకోవచ్చు.. కుటుంబానికి అండగా నిలుస్తుంది. అందుకే ధరలు ఎంత పెరిగినా కొనుగోళ్లు పూర్తిగా ఆగిపోవు. పరిమాణం తగ్గవచ్చు.. కానీ గిరాకీ పూర్తిగా మాయం కావడం కష్టం అని నిపుణులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో మరో మార్పు కూడా కనిపిస్తోంది. పాత తరహా ఆభరణాల కొనుగోళ్లతో పాటు, ఇప్పుడు యువత బంగారం బిస్కెట్లు, నాణేలు, డిజిటల్‌ గోల్డ్‌, గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో కూడా పెట్టుబడులు పెడుతోంది. అంటే బంగారం కేవలం అలంకరణ వస్తువే కాదు.. సంపద పెంపు సాధనంగా కూడా మారిపోయింది.

ధరల పెరుగుదలే గిరాకీకి కారణమా? Rising Prices Driving Investment Demand
ప్రపంచ స్వర్ణ మండలి తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలో బంగారంపై పెట్టుబడులు (Reduce Gold Demand)గతంతో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా కరోనా తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, యుద్ధాలు, ద్రవ్యోల్బణం, బ్యాంకింగ్‌ సంక్షోభాలు వంటి అంశాల వల్ల పెట్టుబడిదారులు భద్రమైన ఆస్తుల వైపు మొగ్గుచూపుతున్నారు. అందులో బంగారం మొదటి స్థానంలో నిలుస్తోంది. ఇటీవలి సంవత్సరాల్లో బంగారం ధరలు నిరంతరం పెరుగుతుండటం కూడా పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. “ఇంకా పెరుగుతుందేమో” అన్న అంచనాతో చాలామంది బంగారం కొనుగోలు చేస్తున్నారు. ధర పెరుగుతుంటే గిరాకీ తగ్గడం బదులు మరింత పెరగడం భారత మార్కెట్‌లో ప్రత్యేక లక్షణంగా మారింది. ఈ నేపథ్యంలో దిగుమతి సుంకం పెరిగినా పెట్టుబడి గిరాకీపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే బంగారం ధరల్లో అంతర్జాతీయ ప్రభావమే ఎక్కువ. అంతర్జాతీయ మార్కెట్‌లో ధర పెరిగితే దేశీయంగా కూడా ధరలు ఎగసిపడతాయి. దానితో పోలిస్తే సుంకం ప్రభావం కొంతవరకే ఉంటుంది.

2019 తర్వాత కూడా దిగుమతులు తగ్గలేదు.. Gold Imports Stayed Strong Despite Higher Prices
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక బంగారం దిగుమతి (Reduce Gold Demand)చేసుకునే దేశాల్లో ఒకటి. 2019 నుంచి ఇప్పటివరకు ప్రతి ఏడాది సుమారు 700 నుంచి 800 టన్నుల వరకు బంగారం దిగుమతి అవుతూనే ఉంది. ఈ కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. అయినప్పటికీ కొనుగోళ్లలో పెద్దగా తగ్గుదల కనిపించలేదు. ఇది ఒక ముఖ్యమైన సంకేతం అని విశ్లేషకులు చెబుతున్నారు. ధరలు పెరిగినా గిరాకీ తగ్గకపోతే, ఇప్పుడు సుంకం పెంచినంత మాత్రాన భారీ మార్పు రాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఆభరణాల కొనుగోళ్లలో మాత్రం కొంత మందగమనం రావచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, చిన్న పట్టణాల వినియోగదారులు ఖర్చులను తగ్గించే అవకాశం ఉంది. తాజా సుంకాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు సుమారు 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతర్జాతీయ ధరలు కూడా పెరిగితే దేశీయంగా ధరలు మరింత భారమవుతాయి. ఈ నేపథ్యంలో ఆభరణాల గిరాకీపై 10 నుంచి 15 శాతం ప్రభావం ఉండొచ్చని చెబుతున్నారు. అంటే దేశ విదేశీ మారక ద్రవ్యంపై కొంత ఒత్తిడి తగ్గవచ్చు. దిగుమతులు తగ్గితే చెల్లింపుల భారం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా ఇదే లక్ష్యంతో సుంకాలను పెంచిందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

చిన్న వ్యాపారులకు పెరిగిన భారం.. Small Jewellers Under Pressure
బంగారం దిగుమతులపై సుంకం పెరగడం వల్ల (Reduce Gold Demand)పెద్ద కంపెనీలకంటే చిన్న జువెలరీ వ్యాపారులే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎగుమతుల కోసం సుంకం లేకుండా దిగుమతి చేసుకునే బంగారానికి భారీ బ్యాంక్‌ గ్యారెంటీలు సమర్పించాల్సి రావడం చిన్న సంస్థలకు భారంగా మారుతోంది. జెమ్స్‌ అండ్‌ జువెలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి ప్రకారం, కిలో బంగారానికి రూ.28 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు బ్యాంక్‌ గ్యారెంటీలు అవసరమవుతున్నాయి. పెద్ద సంస్థలకు ఇది పెద్ద సమస్య కాకపోయినా, చిన్న వ్యాపారులు మాత్రం ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే వడ్డీ రేట్లు, కార్మిక వ్యయాలు, అద్దెలు, విద్యుత్‌ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త సుంకాలు మరింత భారమవుతాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

మళ్లీ పెరుగుతాయా అక్రమ రవాణా మార్గాలు? Will Smuggling Rise Again?
బంగారంపై అధిక సుంకాలు (Reduce Gold Demand)విధించినప్పుడు గతంలో ఏమైంది? అన్న ప్రశ్న ఇప్పుడు మళ్లీ ముందుకొస్తోంది. ఆ సమయంలో బంగారం స్మగ్లింగ్‌ భారీగా పెరిగింది. విమానాశ్రయాలు, సముద్ర తీరాలు, సరిహద్దు ప్రాంతాల ద్వారా అక్రమంగా బంగారం దేశంలోకి తీసుకొచ్చే ఘటనలు తరచుగా వెలుగుచూశాయి. ఇప్పుడూ అదే పరిస్థితి మళ్లీ రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అధికారిక మార్గంలో దిగుమతి చేసుకుంటే అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది. అదే అక్రమ మార్గంలో తెస్తే తక్కువ ధరకు విక్రయించే అవకాశం ఉంటుంది. ఇది మరో ప్రమాదకర పరిణామానికి దారితీస్తుందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. బిల్లు లేకుండా జరిగే వ్యాపారం పెరిగితే వినియోగదారులే నష్టపోతారు. ఎందుకంటే ఆభరణాల స్వచ్ఛతపై హామీ ఉండదు. 22 క్యారెట్లు పేరుతో తక్కువ నాణ్యత గల ఆభరణాలు విక్రయించే ప్రమాదం ఉంటుంది. బిల్లు లేకుండా కొనుగోలు చేసినప్పుడు తర్వాత సమస్య వచ్చినా వినియోగదారులు వ్యాపారులను ప్రశ్నించే అవకాశం ఉండదు. అయినప్పటికీ తక్కువ ధర కోసం చాలామంది అలాంటి కొనుగోళ్లకు మొగ్గుచూపే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

కస్టమ్స్‌, డీఆర్‌ఐ అప్రమత్తం.. Customs and DRI Increase Surveillance
సుంకాలు పెరిగిన నేపథ్యంలో (Reduce Gold Demand)అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కేంద్ర సంస్థలు అప్రమత్తమయ్యాయి. రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ డైరెక్టరేట్‌ (డీఆర్‌ఐ), కస్టమ్స్‌ అధికారులు ఇప్పటికే పలు ప్రాంతాల్లో నిఘాను పెంచినట్లు సమాచారం. ప్రత్యేకంగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌, పశ్చిమ బెంగాల్‌ వంటి సముద్ర తీర రాష్ట్రాల్లో స్మగ్లింగ్‌ కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతుంటాయని అధికారులు చెబుతున్నారు. కేరళ విమానాశ్రయాల్లో తరచుగా బంగారం పట్టుబడుతున్న ఘటనలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. పొరుగు దేశాలతో సరిహద్దులు పంచుకునే అస్సోం, మణిపూర్‌, మిజోరం ప్రాంతాల్లో కూడా నిఘాను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. బంగారం అక్రమ రవాణా కేవలం ఆర్థిక నేరం మాత్రమే కాకుండా, ఉగ్రవాద నిధులు, హవాలా లావాదేవీలతో కూడా సంబంధం ఉండే అవకాశం ఉందని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి.

దుబాయ్‌ నుంచి దిగుమతులు పెరుగుతాయా? Dubai May Gain Bigger Share in Gold Trade
యూఏఈతో భారతదేశానికి ఉన్న వాణిజ్య ఒప్పందాల కారణంగా దుబాయ్‌ నుంచి బంగారం దిగుమతులకు (Reduce Gold Demand) ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇతర దేశాల కంటే 1 శాతం తక్కువ సుంకంతో అక్కడి నుంచి బంగారం దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. పరిశోధనా సంస్థ జీటీఆర్‌ఐ అంచనా ప్రకారం, 2022లో దుబాయ్‌ నుంచి భారత్‌కు సుమారు 120 టన్నుల బంగారం దిగుమతి అయింది. 2027 నాటికి ఇది 200 టన్నులకు చేరే అవకాశం ఉందని చెబుతోంది. బంగారం ధరలు భారీగా ఉన్నప్పుడు 1 శాతం సుంకం కూడా పెద్ద తేడానే అవుతుంది. అందుకే వ్యాపారులు తక్కువ సుంకం ఉన్న మార్గాలను ఎక్కువగా ఉపయోగించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. యూఏఈతో భారతదేశం చేసుకున్న మరో ముఖ్య ఒప్పందం వెండిపై దిగుమతి సుంకం తగ్గింపు. 2022 నుంచి పదేళ్లలో వెండిపై సుంకాన్ని 10 శాతం నుంచి సున్నాకు తీసుకెళ్లాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఇది భవిష్యత్తులో విలువైన లోహాల వాణిజ్యాన్ని మరింత ప్రభావితం చేసే అవకాశం ఉంది.

ప్రభుత్వం లక్ష్యం నెరవేరుతుందా? Can the Government Achieve Its Goal?
బంగారం దిగుమతులు తగ్గితే (Reduce Gold Demand)దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలపై ఒత్తిడి తగ్గుతుంది. వాణిజ్య లోటు కూడా కొంతవరకు నియంత్రణలోకి రావచ్చు. ఈ కోణంలో చూస్తే సుంకాల పెంపు ప్రభుత్వానికి తాత్కాలికంగా ప్రయోజనకరంగా కనిపించవచ్చు. కానీ భారతీయుల బంగారంపై ఉన్న మక్కువ, పెరుగుతున్న పెట్టుబడి ధోరణి, అంతర్జాతీయ ధరల ప్రభావం, అక్రమ రవాణా అవకాశాలు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుంటే పరిస్థితి అంత సులభం కాదని నిపుణులు అంటున్నారు. ధరలు పెరిగినా కొనుగోళ్లు పూర్తిగా తగ్గకపోవచ్చు. అధికారిక దిగుమతులు తగ్గినా అక్రమ మార్గాలు పెరిగితే ప్రభుత్వ లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాదు చిన్న వ్యాపారులు, వినియోగదారులు కూడా ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు.

బంగారం.. భారత ఆర్థిక సంస్కృతిలో భాగమే… Gold Remains Deeply Rooted in Indian Economy
భారతదేశంలో బంగారం కేవలం విలువైన లోహం (Reduce Gold Demand) కాదు. అది కుటుంబ ఆర్థిక భద్రతకు చిహ్నం. తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయం. ప్రపంచ మార్కెట్ల ప్రభావం, ప్రభుత్వ విధానాలు, సుంకాల మార్పులు వచ్చినా.. భారతీయుల బంగారంపైనున్న నమ్మకం మాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు సుంకాలు పెరిగిన తర్వాత మార్కెట్‌లో ఎలాంటి మార్పులు వస్తాయో రాబోయే నెలల్లో స్పష్టత రానుంది. ఆభరణాల కొనుగోళ్లు కొంత మందగించినా.. పెట్టుబడి గిరాకీ కొనసాగొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. బంగారం విషయంలో భారతీయుల మనస్తత్వాన్ని కేవలం పన్నులతో మార్చడం అంత తేలిక కాదు.

7
FEATURE NEWS Tags:Can the Government Achieve Its Goal?, Customs and DRI Increase Surveillance, Dubai May Gain Bigger Share in Gold Trade, Gold Imports Stayed Strong Despite Higher Prices, Gold Remains Deeply Rooted in Indian Economy, Rising Prices Driving Investment Demand, Small Jewellers Under Pressure, Why Indians Are Emotionally Attached to Gold?, Will Smuggling Rise Again?

Post navigation

Previous Post: ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases?
Next Post: లాభాల బాటలో మార్కెట్లు.. Markets End in Green Amid Positive Global Signals

Related Posts

  • మన్మోహ‌న్‌ దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేశారు How did Manmohan affect the country’s economy FEATURE NEWS
  • అముల్ ఫ్రాంచైజీ ఇలా పొందండి how to apply for amul franchise FEATURE NEWS
  • సిల్వర్‌ ETFల‌పై షాకింగ్ న్యూస్‌.. వాటిని ఆపేసిన‌ మ్యూచువ‌ల్ ఫండ్ కంపెనీలు Shocking News on Silver ETFs: Mutual Fund Companies That Have Discontinued Them FEATURE NEWS
  • రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.61 వేల ఆదాయం… పీపీఎఫ్‌తో సాధ్యమేనా? ₹61,000 Monthly Income After Retirement.. Can PPF Make It Possible? FEATURE NEWS
  • రికార్డు స్థాయిలో సిప్ పెట్టుబడులు .. Record-Breaking SIP Contributions FEATURE NEWS
  • క్రెడిట్ కార్డ్‌ వాడ‌కుండా ప‌క్క‌న ప‌డేశారా?? మీ సిబిల్ స్కోర్ పోయిన‌ట్టే! FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • నామినీకే డబ్బంతా చెల్లుతుందా? Does the Entire Money Go to the Nominee?
  • పెట్టుబడులు.. మీ భవిష్యత్తును నిర్మించే పునాదులు..!! Investments: The Foundation That Builds Your Future
  • ఈపీఎఫ్‌వోలో మార్పులు.. త్వ‌ర‌లో ఆటో విత్‌డ్రా సదుపాయం!! Major Changes in EPFO Withdrawal System
  • లాభాల బాటలో మార్కెట్లు.. Markets End in Green Amid Positive Global Signals
  • సుంకం పెరిగితే బంగారం కొనుగోలు తగ్గుతాయా? Will Higher Import Duty Reduce Gold Demand?
  • ఆర్‌బీఐ బంగారం కొంటోంది.. ప్రజలను మాత్రం తగ్గించమంటోంది! ఎందుక‌లా? RBI Buys Gold Aggressively.. Why Is the Government Asking People to Cut Purchases?
  • భగ్గుమన్న నిత్యావసరాలు.. భారమైన జీవన వ్యయం.. ఏప్రిల్‌లో 3.48 శాతానికి రిటెయిల్‌ ద్రవ్యోల్బణం.. Essentials Burn a Hole in Pockets.. Cost of Living Turns Heavier as Retail Inflation Rises to 3.48% in April
  • ఒక్క ఉద్యోగం కాదు.. బహుళ ఆదాయ ఆర్జ‌న దిశ‌గా యువత.. Beyond One Job: Gen Z Chasing Multiple Income Streams
  • న‌ష్టాల నుంచి లాభాల బాట‌లోకి ప్రభుత్వ బ్యాంకులు.. Public Sector Banks Turn Profit Powerhouses
  • డెట్‌ ఫండ్లా?.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లా? పెట్టుబ‌డుల‌కు ఏది మంచిది? Debt Funds or Fixed Deposits? Which Is Better for Investments?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Financial Discipline Is the Key Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • 2026లో స్టాక్‌ మార్కెట్‌ సెలవుల జాబితా ఇదే..Here is the list of stock market holidays in 2026.. MARKET
  • కారు కొనేముందు ఇవి ఆలోచించండి Consider these before buying a car FEATURE NEWS
  • కొత్త ఆదాయపు పన్ను చట్టం-2025 ప్ర‌యోజ‌నాలు.. రిస్క్‌లు ఏమిటో తెలుసుకుందామా? New Income Tax Act 2025: Let’s Understand the Benefits and Risks FEATURE NEWS
  • మ్యూచువల్ ఫండ్స్ రకాలు ఇలా.. MUTUAL FUNDS
  • క్రెడిట్ కార్డును స‌ద్వినియోగం చేసుకోండి how to get profits from credit card FEATURE NEWS
  • గేర్ మార్చిన రిల‌య‌న్స్‌ reliance business strategy NEWS
  • 2025లో నెలకు లక్షకు పైగా ఆదాయం ఇచ్చే కొత్త ఆలోచ‌న‌లు Ideas that will give you a regular income of more than 1lakh per month in 2025 FEATURE NEWS
  • ఆర్థిక స్వేచ్ఛ‌ను హ‌రించే మనీ ట్రాప్..! దీని నుంచి ఇలా బ‌య‌ట‌ప‌డండి! The Money Trap That Destroys Financial Freedom..! Here’s How to Break Free! FEATURE NEWS
https://coinswitch.co/pro/signup?code=CReORan

Copyright © 2026.

Powered by PressBook News Dark theme