స్టాక్ మార్కెట్ లో సక్సెస్ సాధించిన ప్రపంచ స్థాయి పెట్టుబడిదారు వారెన్ బఫెట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి 7 కీలక నియమాలు సూచించారు. ఈ నియమాలు పాటిస్తే, దీర్ఘకాలికంగా మంచి రిటర్న్స్ సాధించవచ్చని స్పష్టమవుతుంది. మ్యూచువల్ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టేటప్పుడు, ఫండ్స్ సదుపాయాలు, SIP, డైవర్సిఫికేషన్, దీర్ఘకాలిక హోల్డింగ్ వంటి పాయింట్లు పాటించడం ముఖ్యమని వారెన్ బఫెట్ సూచిస్తున్నారు. వారెన్ బఫెట్ సూచనలు అనేవి పెట్టుబడిదారులకు మార్కెట్ రిస్క్‌ను తగ్గిస్తూ, స్థిరమైన సంపదను సృష్టించడానికి ఉపయోగపడతాయి.
వారెన్ బఫెట్ సూచించిన 7 ముఖ్య నియమాలు .. 7 Key Rules Recommended by Warren Buffett
1. దీర్ఘకాలిక దృష్టికోణం: ఒక ఇన్వెస్ట్‌మెంట్‌లో కనీసం 10 సంవత్సరాలు హోల్డ్ చేయాలి. ఉదాహరణ: 2013–2023 వరకు ₹5,000 నెలకు SIP పెట్టినవారు కొవిడ్ సమయంలో మార్కెట్ పడినా 10 సంవత్సరాల తర్వాత మంచి లాభాలు పొందారు.
2. తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో ఉన్న ఫండ్స్ ఎంచుకోవాలి. యాక్టివ్ ఫండ్స్ ఎక్కువ ఖర్చులు వసూలు చేస్తాయి. కానీ ఇండెక్స్ ఫండ్స్ తరచూ వాటిని బీట్ చేయలేవు. తక్కువ ఖర్చుతో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సమానమైన లేదా మెరుగైన రిటర్న్స్ సాధ్యం.
3. డిసిప్లిన్ తో ఇన్వెస్ట్ చేయడం ముఖ్యం. SIP ద్వారా ప్రతినెలా చిన్న మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం.మార్కెట్ అప్-డౌన్ లలో ఆందోళన చెందకుండా దీర్ఘకాలికంగా పెట్టుబడి కొనసాగించాలి.
4.మార్కెట్ వాల్యూషన్స్ అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. స్టాక్ కొనడం, అమ్మడం ముందు మార్కెట్ పరిస్థితులను విశ్లేషించాలి. భయం ఉన్నప్పుడు కొనడం, overly optimistic సమయంలో జాగ్రత్తగా ఉండడం మేలు.
5. ఫండ్స్ & కంపెనీల పూర్తి అవగాహన అవసరం. ఇన్వెస్ట్ చేయేముందు కంపెనీ ప్రొఫైల్, ఫండ్ మెనేజ్‌మెంట్, గత పనితీరు తెలుసుకోవడం ఉత్తమం.
6.ఈక్యూ (Emotional Intelligence) ప్రాధాన్యం ముఖ్యం. స్టాక్ మార్కెట్ లో ఐక్యూకంటే ఈక్యూ (పేషెన్స్, డిసిప్లిన్, ఎమోషనల్ కంట్రోల్) చాలా అవసరం.
7. మార్కెట్ ప్రెడిక్షన్స్‌పై ఆధారపడకూడదు. డేటా ఆధారిత విశ్లేషణ మాత్రమే ప్రధాన మార్గం. జోస్యం, ఊహాగానాలు, మీడియా hype మీద ఆధారపడవద్దు. ఇన్వెస్ట్ చేయే ముందు ప్రతి ఫండ్, కంపెనీ, మేనేజ్‌మెంట్ గురించి తెలుసుకోవాలి. రూపీజీ, Groww వంటి డిజిటల్ టూల్స్ ద్వారా ఫండ్స్ పూర్వపు పనితీరును విశ్లేషించి, రిస్క్ అర్థం చేసుకోవచ్చు.
ఈ విధానాలు పాటిస్తే.. If these principles are followed…
2025లో మ్యూచువల్ ఫండ్‌లు ద్వారా దీర్ఘకాలిక సంపద నిర్మించాలంటే, సరైన ఫండ్స్ ఎంచుకోవాలి. SIP ద్వారా పెట్టుబడి కొనసాగించాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ , మార్కెట్ సైకల్స్ గురించి అవగాహన కలిగి ఉండడం అత్యంత ముఖ్యం. ఈ విధానం పాటిస్తే, పెట్టుబడిదారులు సురక్షితంగా , స్థిరంగా తమ సంపదను పెంచుకోవచ్చు.
మ్యూచువల్ ఫండ్ అంటే.. What is a Mutual Fund?
మ్యూచువల్ ఫండ్ అనేది ఒక pooled investment scheme. ఇక్కడ పెట్టుబడిదారుల ఫండ్స్ ఒకే ఫండ్ మేనేజర్ ద్వారా సేకరించి, స్టాక్స్, బాండ్స్, డెరివేటివ్స్, ఇతర ఆస్తులలో పెట్టుబడి చేయబడుతుంది.
ప్రధాన లక్ష్యాలు..Key Objectives
చిన్న మొత్తాల పెట్టుబడిదారులకు పెద్ద మార్కెట్ అవకాశాలు కల్పించడం
డైవర్సిఫికేషన్ (Diversification) ద్వారా రిస్క్ తగ్గించడం
ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్‌మెంట్ ద్వారా స్థిరమైన రాబడులు
మ్యూచువల్ ఫండ్ రకాలు..Types of Mutual Funds
ఈక్విటీ ఫండ్స్ (Equity Funds)
డెబ్ట్ ఫండ్స్ (Debt Funds)
హైబ్రిడ్/బలాన్స్డ్ ఫండ్స్ (Hybrid/ Balanced Funds)
ఇండెక్స్ ఫండ్స్ (Index Funds)
ఈటీఎఫ్ (ETFs – Exchange Traded Funds)
మ్యూచువల్ ఫండ్ల పనితీరు ..Performance of Mutual Funds
దేశంలోని మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఆస్తుల పరిమాణం ₹75.61 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది గత సంవత్సరం కంటే 12.7% వృద్ధిని సూచిస్తుంది. ఈ వృద్ధిలో ఎక్విటీ ఫండ్స్ ముఖ్య పాత్ర పోషించాయి, మార్కెట్‌లో పెట్టుబడిదారుల విశ్వాసం పెరిగింది. 2025లో, HDFC Flexi Cap Fund 6.62% రిటర్న్‌ను నమోదు చేసింది. ICICI Pru Value Fund 6.57% రిటర్న్‌ను అందించింది. Kotak Consumption Fund , Kotak Pioneer Fund వరుసగా 6.06% , 6.05% రిటర్న్‌లను అందించాయి. Motilal Oswal Midcap Fund 5 సంవత్సరాల్లో 35.11% వార్షికీకృత వృద్ధిని (CAGR) నమోదు చేసింది, ఇది దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలంగా ఉంది.
లాభనష్టాలు..Profits and Losses with Mutual Funds
– ఈక్విటీ ఫండ్స్ (Equity Funds) భారీ రాబడులు సాధించగలవు. ముఖ్యంగా లాంగ్-టర్మ్ (10–15 ఏళ్ళు) పెట్టుబడుల్లో మాత్రమే లాభాలు పొందగలం. HDFC Flexi Cap Fund, ICICI Pru Value Fund 2025లో 6–7% రిటర్న్స్ సాధించాయి. డెబ్ట్ ఫండ్స్ (Debt Funds) అనేవి స్థిరమైన, తక్కువ రిస్క్ రాబడులు కలిగి ఉంటాయి. వడ్డీ ఆధారిత ఆదాయన్ని ఇస్తాయి.
– ఈక్విటీ ఫండ్స్‌లో మార్కెట్ క్రాష్ సమయంలో షేర్స్ విలువ పడిపోతుది. చిన్న పెట్టుబడిదారులు ఈ సమయంలో panicking face చేయాల్సి ఉంది. యాక్టివ్ ఫండ్స్ ఎక్కువ ఫీజు వసూలు చేస్తాయి. రాబడులు తక్కువగా ఉన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కంపెనీ / ఫండ్ గురించి పూర్తి అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే నష్టాలు వచ్చే అవకాశం ఎక్కువ
సురక్షిత ఫండ్స్ రకాలు..Types of Safe Funds
లిక్విడ్ ఫండ్స్ (Liquid Funds) తో 1–3 రోజుల్లో నిధులను తిరిగి పొందగలం. ఇందులో తక్కువ రిస్క్.. తక్కువ రాబడులు ఉంటాయి. Open-Ended Debt Funds, బ్యాంక్ బాండ్స్, ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులతో స్థిరమైన ఆదాయం పొందొచ్చు. తక్కువ రిస్క్ ఉంటుంది. Fixed Maturity Plans – FMPsతో నిర్దిష్ట కాలంలో రాబడులు పొందొచ్చు. ముందే నిర్ణయించిన maturity లో ఆదాయాన్ని తిరిగి పొందగలం.
ఎంచుకోవడానికి సూచనలు…Tips for Choosing
ఫండ్ రేటింగ్స్ పరిశీలించాలి. CRISIL, ICRA వంటి రేటింగ్ ఏజెన్సీల ద్వారా రిస్క్ అంచనా వేయాలి. ఎక్స్‌పెన్స్ రేషియో చూడాలి. ఖర్చులు తక్కువ, రాబడులపై ప్రభావం వంటి వాటిని పరిశీలించాలి. ఒకే రకమైన డెబ్ట్ లేదా సెక్యూరిటీలో పెట్టుబడి పెట్టకూడదు. గత పనితీరు , మార్కెట్ పరిస్థితుల ఆధారంగా సురక్షిత మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి. సురక్షిత మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడిదారుల కు రక్షణ , స్థిరమైన రాబడులు కల్పిస్తాయి. SIP, తక్కువ ఖర్చు, డైవర్సిఫికేషన్, మార్కెట్ సైకల్స్ అర్థం చేసుకోవడం ద్వారా ఎవరైనా సురక్షితంగా , స్థిరంగా సంపదను నిర్మించవచ్చు.
ఇవి పాటించాలి.. These should be followed…
మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి చేయడం సులభమే. కానీ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు విక్రయించాలి అనే నిర్ణయం తీసుకోవడం చాలా కీలకం. చిన్న మొత్తాలను నెలవారీగా పెట్టడం వల్ల మార్కెట్ స్వింగ్ ప్రభావం తగ్గుతుంది. స్టాక్ మార్కెట్ ఎగిసినా, పడిపోయినా సగటు ధరలో units పొందగలరు. కనీసం 5–10 సంవత్సరాల హోల్డింగ్‌ను లక్ష్యంగా పెట్టుకోవాలి. పెట్టుబడి ప్రారంభించేటప్పుడు నిర్ణయించిన గోల్స్ సాధించినప్పుడు units విక్రయించవచ్చు. ఈక్విటీ ఫండ్స్‌లో మార్కెట్ excessively high levels లో ఉన్నప్పుడు కొంత units విక్రయించడం సాధ్యం. పర్సనల్ అవసరాల కోసం, అత్యవసర డబ్బు అవసరమైతే liquidity ఉన్న ఫండ్స్ ద్వారా units అమ్ముకోవచ్చు. సరైన సమయాన్ని గుర్తించి, ఎమోషనల్ కంట్రోల్‌తో ఇన్వెస్ట్ చేస్తే, పెట్టుబడిదారులు సురక్షితంగా, స్థిరంగా లాభాలను పొందవచ్చు.
