
కేవలం డబ్బును దాచుకుంటే సరిపోదు. వీలైనంత ఎక్కువ రాబడిని, వడ్డీని, లాభాన్నిచ్చే చోట డబ్బును దాచుకోవడం చాలా అవసరం. అప్పుడే మన డబ్బు రెట్టింపవుతుంది.
మంచి లాభం పొందాలని చూస్తున్నప్పడు చేతిలో ఉన్న డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా అనేది మనకు కలిగే అతి పెద్ద సందేహం. రిస్క్ లేకుండా డబ్బు రెట్టింపు ఎలా అవుతుందో ముందుగా మనం తెలుసుకోవాలి. మన వద్ద ఉన్న డబ్బును రెట్టింపు చేసే మార్గాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం పెట్టుబడులు పెట్టాలని అనుకుంటూ ఉంటారు. తమ కష్టార్జితమైన సొమ్మును నష్టపోకుండా, మంచి రాబడి సంపాదించాలని ఆశిస్తారు. ఇలాంటి వారి కోసం మన దేశంలో అనేక పెట్టుబడి మార్గాలు ఉన్నాయి. ఇవి స్వల్పకాలిక, దీర్ఘకాలిక లక్ష్యాలు సాధించడానికి వీలు కల్పిస్తాయి. అయితే వీటిలో మీకు అనువైన దానిని ఎంచుకోవాల్సి ఉంటుంది. మన దేశంలో అందుబాటులో ఉన్న ప్రధానమైన పెట్టుబడి మార్గాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Fixed deposit or recurring deposit
ఫిక్స్‌డ్ డిపాజిట్ లేదా రికరింగ్ డిపాజిట్
ఎలాంటి రిస్క్ లేకుండా, గ్యారెంటీగా ఆదాయం సంపాదించాలని ఆశించేవారికి ఈ
ఫిక్స్డ్ డిపాజిట్లు మంచి ఆప్షన్ అవుతాయి. ఈ ఫిక్స్డ్ డిపాజిట్లలో 7 రోజుల నుంచి 10 ఏళ్ల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా రూ.5 కోట్లు వరకు దీనిలో పొదుపు చేయవచ్చు. దీనిపై గరిష్ఠంగా 4% నుంచి 9% వరకు వడ్డీ లభిస్తుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ రాబడులపై పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. ఇక్కడ ఒకేసారి డబ్బులు డిపాజిట్ చేయాలి. నిర్ణీత కాలం వరకు ఈ డబ్బులను అలాగే కొనసాగించాలి. మెచ్యూరిటీ సమయంలో ఈ డబ్బులు చేతికి వస్తాయి. వడ్డీ కూడా వస్తుంది. 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాల పరిమితితో డబ్బులను బ్యాంకుల్లో ఎఫ్‌డీ చేయొచ్చు. మన వద్ద ఉన్న డబ్బులను హామీ పూర్వకంగా రిటర్న్స్ రావాలని అనుకుంటే.. బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. బ్యాంకులు 4 లేదా 5 శాతం వడ్డీ ఇస్తాయి. మనకి రిటర్న్స్ ఎక్కువ కావాలంటే రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. రిటర్న్స్ తక్కువ కావాలంటే రిస్క్ తక్కువ ఉంటుంది.
* పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఎంచుకునే ఉత్తమమైన మార్గం ఫిక్స్డ్ డిపాజిట్లు. పెట్టుబడులకు రక్షణ, రాబడికి హామీ, కావాల్సినంత సమయం ఎంచుకునే వెసులుబాటు ఇలా ఫిక్స్డ్ డిపాజిట్లవల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మరోసారి వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వల్ల ఎఫ్డీలకు మరికొంతకాలం మంచి రోజులే ఉన్నట్లు చెప్పవచ్చు. నిధుల సమీకరణకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుండటం వల్ల బ్యాంకులు వీటిపైనా 7-7.5 శాతానికి మించి హామీతో కూడిన వడ్డీలు అందిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచాయి.
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్సియల్ కార్పోరేషన్స్ (ఎన్‌బీఎఫ్‌సీ) వివిధ రకాల వడ్డీ రేట్లు అందిస్తున్నాయి. కొన్ని చిన్న బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే అధిక వడ్డీని ఇస్తున్నాయి. దాదాపు 9-11 శాతం వడ్డీతో మరికొన్ని కార్పొరేట్ సంస్థలు ఎన్సీడీలను అందుబాటులోకి తెస్తున్నాయి.
* ఫిక్స్‌డ్ డిపాజిట్లు నిర్ణీత కాలవ్యవధి వరకు కొనసాగుతాయి. గడువుకు ముందే తీసుకుంటే కొంత అపరాధ రుసుం వర్తిస్తుంది. కనుక వ్యవధులను ఎంచుకునేటప్పుడు కాస్త తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. వీలైనంత వరకూ ఒకే వ్యవధికి మొత్తం డిపాజిట్లను చేయొద్దు. వివిధ సందర్భాల్లో వచ్చే మీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఆయా డిపాజిట్లకు వ్యవధులను నిర్ణయించుకోవాలి. దీనివల్ల ఎలాంటి ఫైన్ లేకుండా డిపాజిట్లను వెనక్కి తీసుకునేందుకు వీలవుతుంది.
* కొన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లు(ఎఫ్డీలు) తక్కువ వడ్డీని ఇవ్వొచ్చు. అలాంటప్పుడు ఆ డిపాజిట్‌ను రద్దు చేసి, మళ్లీ కొత్తగా ఎఫ్‌డీ చేయాలి. దీనివల్ల వడ్డీ నష్టపోకుండా జాగ్రత్తపడొచ్చు. కనీసం అర శాతం కన్నా ఎక్కువగా లభిస్తున్నప్పుడే దీన్ని పరిశీలించాలి.
ఉదాహరణకు రెండేళ్ల క్రితం అయిదేళ్ల కాలవ్యవధికి డిపాజిట్ చేశారని అనుకుందాం. అప్పుడు ఉన్న వడ్డీ రేట్ల ప్రకారం 5.50 శాతానికంటే తక్కువగా ఉంది. కానీ, ఇప్పుడు మూడేళ్ల వ్యవధికి దాదాపు 7- 7.5 శాతం వరకు వడ్డీనిస్తున్నాయి బ్యాంకులు. కనుక, పాత డిపాజిట్‌ను రద్దు చేసుకొని, కొత్తగా జమ చేయొచ్చు. రుసుములు వర్తిస్తాయనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు.
* కొన్ని సార్లు 365 రోజులు, 400 రోజులు లాంటి ప్రత్యేక వ్యవధితో డిపాజిట్లు చేసుకునే సౌలభ్యాన్ని బ్యాంకులు కల్పిస్తుంటాయి. ఇలాంటి పథకాలను సీనియర్ సిటిజన్లు పరిశీలించవచ్చు. అత్యవసర సమయాల్లో మధ్యలోనే డిపాజిట్లను విత్‌డ్రా చేయకుండా, దానిపై రుణం తీసుకునే ప్రయత్నం చేయొచ్చు.
* ప్రస్తుత కాలంలో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినందువల్ల ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి బ్యాంక్‌కే వెళ్లాల్సిన పనిలేదు. సులభంగా బ్యాంకింగ్ మొబైల్ యాప్‌లలో డిపాజిట్ చేసుకోనే సౌలభ్యం ఉంది. కార్పొరేట్ ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎన్సీడీలనూ డీమ్యాట్ ఖాతా సహాయంతో చేసుకోవచ్చు.
* ఎఫ్‌డీలపై వచ్చే వడ్డీకి శ్లాబుల ఆధారంగా ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.40 వేల లోపు (సీనియర్ సిటిజన్లకు రూ.50వేలు) వడ్డీ సంపాదన ఉంటే బ్యాంకులు మూలం వద్ద పన్ను కోత విధించవు. పరిమితికి మించి అధికంగా వడ్డీ వచ్చే అవకాశం ఉన్న వారు ఫారం 15జీ, ఫారం 15హెచ్ (సీనియర్ సిటిజన్లు) బ్యాంక్‌కు సమర్పించాలి. దీనివల్ల మూలం వద్ద పన్ను కోత ఉండదు.
recurring deposit
రికరింగ్ డిపాజిట్
రికరింగ్ డిపాజిట్ల విషయానికి వస్తే.. ప్రతి నెలా డబ్బులు దాచుకుంటూ వెళ్లాలి. అంటే మీరు ఎంత కాలం డబ్బులు డిపాజిట్ చేయాలి అనే అంశాన్ని ముందే నిర్ణయించుకోవాలి. మీరు ఎంచుకున్న కాల పరిమితి ప్రకారం మీరు ప్రతి నెలా నిర్ణీత మొత్తంలో డబ్బులు పెడుతూనే వెళ్లాలి. మెచ్యూరిటీ తర్వాత మీ డబ్బులు మీకు ఒకేసారి చెల్లిస్తారు. వడ్డీ కూడా వస్తుంది. ప్రతి నెలా మీరు చెల్లించాల్సిన మొత్తం ఒక్కసారి డిసైడ్ అయితే మళ్లీ మార్చుకోవడానికి వీలుండదు. ప్రతి నెలా ఒకే మాదిరి డబ్బులు కట్టాలి. ఎఫ్‌డీలపై లోన్ ఫెసిలిటీ పొందొచ్చు. ఆర్‌డీలపై ఈ సౌలభ్యం ఉండదు. చేతిలో ఎక్కువ డబ్బులు ఉంటే.. ఒకేసారి ఎఫ్‌డీలో పెట్టొచ్చు. లేనివారు ఆర్‌డీ అకౌంట్ తెరవొచ్చు. తక్కువ రిస్క్ లతో ఖచ్చితమైన రాబడులను అందించే పెట్టుబడి సాధనాల్లో రికవరింగ్ డిపాజిట్ కూడా ఒకటి. ప్రతి నెల కొంత మొత్తం డిపాజిట్ చేస్తూ కాల వ్యవధిని బట్టి దాదాపు ఫిక్స్డ్ డిపాజిట్ స్థాయి వడ్డీ రేటును పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. నెలవారి పొదుపుచేస్తూ స్వల్పకాలికంగా లేదా దీర్ఘకాలికంగా నిధిని సమకూర్చుకునేందుకు రికరింగ్ డిపాజిట్ ఉపయోగపడుతుంది. ఇందులో తక్కువ రిటర్న్స్ ఉంటాయి. రికరింగ్ డిపాజిట్ disadvantage ఏమిటంటే మనకి ప్రతి సంవత్సరం 7 శాతం ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. కానీ ఆర్డీ దానికి తగ్గట్టుగా వడ్డీ ఇవ్వదు.
Gold investment
బంగారంపై పెట్టుబడి
మన దేశంలో చాలా మంది బంగారం కొనేందుకు ఇష్టపడతారు. కష్ట సమయంలో బంగారం మనల్ని ఆదుకుంటుందని నమ్ముతారు. బంగారంపై దీర్ఘకాలంలో 8% – 18% వరకు రాబడి వచ్చే అవకాశం ఉంది. అయితే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ద్వారా వచ్చిన లాభాలపై ప్రభుత్వానికి (ఎస్టీసీజీ, ఎల్టీసీజీ) పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. గోల్డ్ లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తక్కువ ఉంటుంది. రిటర్న్స్ తక్కువ ఉంటాయి. గోల్డ్ లో ఎప్పుడూ లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే వెంటవెంటనే గోల్డ్ ధర పెరగదు. గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ లో కూడా చాలా ప్రయోజనాలు ఉంటాయి. కాని దీనిని రెండు రకాలుగా ఇన్వెస్ట్ చెయ్యాలి. గోల్డ్ ని కోయిన్స్ రూపంలో తీసుకుంటే మనకి తరుగురూపంలో సమస్య ఉండదు.
అదే మనం గోల్డ్ ఆభరణాల రూపంలో తీసుకుంటే అమ్మేటప్పుడు తరుగు, మజూరు వల్ల ఎక్కువ ధరకి రాదు. Gold investment disadvantage ఏమిటంటే మనం గోల్డ్ ని భద్రంగా చూసుకోవాలి. గోల్డ్ ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. అక్కడే చాలామంది మోసపోతుంటారు. ఇప్పుడు గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ కొత్తగా వచ్చింది. అదే e- GOLD. మనం ఈ యాప్ లో ఆప్షన్స్ ఎంచుకోవచ్చు. ఇందులో మనం రూ.150 నుంచి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చెయ్యవచ్చు. మళ్లీ మనం అదే వెబ్ సైట్లో అమ్మేయవచ్చు.
REAL ESTATE
రియల్ ఎస్టేట్
మన దేశంలో నేడు స్థిరాస్తి రంగం మంచి భూమ్లో ఉంది. అందుకే అందరూ వీటివైపు ఆసక్తి చూపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కనుక రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది. లీగల్ ఇష్యూస్ కూడా వస్తుంటాయి. అయితే భూమిని నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడిపోడు అని పెద్దలు చెబుతుంటారు. కనుక రియల్ ఎస్టేట్ పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇస్తాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాబడులపై గవర్నమెంట్‌కు కచ్చితంగా (ఎస్టీసీజీ, ఎల్టీసీజీ) పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ మెంట్ చాలా కరెక్ట్ గా ఉండాలి. డాక్యుమెంట్స్, రిజిస్ట్రేషన్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి మోసాలు కూడా ఎక్కువ జరుగుతుంటాయి. రియల్ ఎస్టేట్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ మెంట్ చెయ్యాలి. ఎందుకంటే వెంట వెంటనే ధర పెరగదు. కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. దీనిలో ఖచ్చితంగా రిటర్న్స్ బాగుంటాయి. రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలాగే రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయి.
GOVERNAMENT BONDS
ప్రభుత్వ బాండ్లు
ప్రభుత్వాలు సావరిన్ బాండ్స్ జారీ చేస్తుంటాయి. ఈ బాండ్స్ పూర్తి సురక్షితమైనవి. ఇన్వెస్టర్లకు దీనిపై ఫిక్స్డ్ ఇన్‌కం వస్తుంది. కనుక ఏమాత్రం నష్టభయం లేకుండా మంచి రాబడి సంపాదించాలని ఆశించేవారు ఈ గవర్నమెంట్ బాండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలి. ప్రభుత్వ బాండ్ అనేది ప్రభుత్వ వ్యయానికి మద్దతుగా జారీ చేసే బాండ్ . ఇది సాధారణంగా కూపన్ చెల్లింపులు అని పిలవబడే కాలానుగుణ వడ్డీ చెల్లించడానికి, మెచ్యూరిటీ తేదీలలో ముఖ విలువలను తిరిగి చెల్లించడానికి ఉద్దేశించబడింది. ఈ బాండ్స్ లో ఇన్వెస్ట్ మెంట్ కి గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది. ఇందులో ఇన్వెస్ట్ మెంట్ చాలా సేఫ్. ఈ బాండ్స్ ఎక్కడ దొరుకుతాయంటే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ వెబ్ సైట్లో Nse Go Bid అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అందులో మనకి అందుబాటులో ఉన్న బాండ్స్, బాండ్స్ వాల్యూస్ ఇలా అన్ని వివరాలు కనిపిస్తాయి. దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలిసింది ఏమిటంటే.. టైమ్ పిరియడ్ లాక్ అయిపోయి ఉంటుంది.
Mutual funds
మ్యూచువల్ ఫండ్స్
కాస్త రిస్క్ తీసుకుని మంచి రాబడులు సంపాదించాలని ఆశించేవారికి మ్యుచువల్ ఫండ్స్ మంచి ఆప్షన్ అవుతాయి. చాలా మంది సిప్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌కు నిర్దిష్ట సమయం వరకు లాకిన్ పీరియడ్ కూడా ఉంటుంది. చరిత్రను పరిశీలిస్తే, మ్యూచువల్ ఫండ్స్‌పై దీర్ఘకాలంలో 8% నుంచి 20% వరకు లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. మ్యూచువల్ ఫండ్స్‌పై సంపాదించిన లాభాలపై ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టాలి. అయితే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్‌తో ముడిపడిన మ్యూచువల్ ఫండ్లకు ఆదాయపన్ను చట్టం 1961, సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఆ డబ్బులను కంపెనీ ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చెయ్యాలో అనేది మనకి మూడు ఆప్షన్స్ ను ఇస్తుంది.
అవి ఏంటంటే.. 1.high risk 2. Middle risk 3. Low risk
– high risk లో పెడితే రిటర్న్స్ కూడా ఎక్కువ వస్తాయి.
– Middle risk లో పెడితే రిటర్న్స్ కూడా మిడిల్ గా ఉంటాయి.
– Low risk లో పెడితే రిటర్న్స్ కూడా మినిమమ్ రిటర్న్స్ వస్తాయి.
Stock market
స్టాక్ మార్కెట్
తక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉన్న బిజినెస్ మాత్రం స్టాక్ మార్కెట్. అయితే ఇది హెవీ రిస్క్‌తో కూడుకున్నది. లాభాలు కూడా అంతే స్థాయిలో వచ్చే అవకాశం ఉంటుంది. దీనిలో మీకు నచ్చినంత డబ్బును పెట్టుబడి పెట్టవచ్చు. స్టాక్ మార్కెట్లో వచ్చిన లాభాలపై ప్రభుత్వానికి (ఎస్టీసీజీ, ఎల్టీసీజీ) పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. స్టాక్ మార్కెట్ అంటే ఒక కంపెనీలో 30శాతం లేదా 50 శాతం కంపెనీవాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. మిగిలిన 70 శాతం పబ్లిక్ పెట్టుబడి కోసం షేర్లు జారీ చేస్తారు. వాటిని మనం కొనుగోలు చేస్తే ఆ కంపెనీలోషేర్ హోల్డర్ అవుతాం.
షేర్ హోల్డర్ అంటే కంపెనీలో పార్టనర్స్. పెట్టుబడి పెట్టినపుడు మనకి షేర్ ఇస్తారు. బిజినెస్ డెవలప్ అయితే మనం తీసుకున్న షేర్ ప్రైస్ పెరుగుతుంది. ఒకవేళ బిజినెస్ డెవలప్ అవ్వకపోతే లాస్ కూడా మనం భరించవలిసి ఉంటుంది.
ఇక్కడ అన్ని ప్రైవేటు లిమిటెడ్ కంపెనీస్ ఉంటాయి. ఈ లిమిటెడ్ కంపెనీలో ఎంత వరకు సక్సెస్ అవుతామో మనం చెప్పలేం. కనుక మనం ముందు స్టాక్ మార్కెట్ పై ఎక్కువ రీసెర్చ్ చెయ్యాలి. కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి. కంపెనీ ప్రోఫైల్స్ ఫాలో అవ్వాలి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చెయ్యాలంటే చాలా అవగాహన ఉండాలి. ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
National pension scheme
నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)
18-70 ఏళ్ల వయస్సు ఉన్న వారంతా ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్పీఎస్)లో ఇన్వెస్ట్ చేయవచ్చు. అయితే మార్కెట్ లింక్డ్ స్కీమ్ కనుక దీనిలో కాస్త రిస్క్ ఉంటుంది. కానీ దీర్ఘకాల పెట్టుబడులపై పెద్దగా రిస్క్ ఉండదు. చరిత్రను పరిశీలిస్తే, దీర్ఘకాలంలో ఈ ఎన్పీఎస్ స్కీమ్స్‌పై 9% – 15% వరకు రాబడి వస్తుంది. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో టైర్-1, టైర్-2 ఆప్షన్లు ఉంటాయి.
టైర్ 1 : కనిష్ఠంగా రూ.500 నుంచి గరిష్ఠంగా ఎంతైనా మదుపు చేయవచ్చు.
టైర్ 2 : కనిష్ఠంగా రూ.250 మదుపు చేయవచ్చు. గరిష్ఠ మొత్తంపై ఎలాంటి పరిమితి లేదు. ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో పెట్టుబడిపెట్టిన వారికి ఐటీ యాక్ట్-1961లోని సెక్షన్ 80 సీసీడీ(1), సెక్షన్ 80 సీసీడీ (2), సెక్షన్ 80 సీసీడీ (1బీ) కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి.
– ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ లో మనం ఇన్వెస్ట్ చేసే డబ్బులను వేర్వేరు మార్కెట్లలలో ఇన్వెస్ట్ చేస్తారు. అవి ఏమిటంటే ఈక్విటీ షేర్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్, గవర్నమెంట్ బాండ్స్ లో పెడతారు. వాటి నుండి మనకి రిటర్న్స్ ఇస్తారు. దీనికి గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది.
Provident Fund Investment
ప్రావిడెంట్ ఫండ్
మన జీతంలో ప్రతి నెలా పీఎఫ్ కట్ చేస్తారు. ఆ డబ్బులను ఈక్విటీ షేర్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్, గవర్నమెంట్ బాండ్స్ లో పెడతారు. మనం రిటైర్ అయిపోయినపుడు ఆ డబ్బులకు వడ్డీ కలిపి మనకి ఇస్తారు. దీనికి గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది. కాగా ఆర్థిక పరమైన లక్ష్యాల్లో రిటైర్మెంట్ కోసం పొదుపు చేయడం కీలక అంశం. సంపాదించడానికి ఇబ్బందులు పడే వయసులో అన్ని రకాల అవసరాలు తీర్చుకునేందుకు, వయసు మళ్లిన సమయంలో సుఖసంతోషాలతో ఉండేందుకు పొదుపు తప్పనిసరి. దీని కోసం చాలా రకాల మార్గాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) వంటి ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాలు భవిష్యత్తును సురక్షితంగా, భద్రంగా ఉంచుకునేందుకు విభిన్న మార్గాల్ని అందిస్తాయి.
* ఈ రెండు పథకాలు రిటైర్మెంట్ కార్పస్‌ను నిర్మించే లక్ష్యంతో రూపొందినప్పటికీ అర్హత, కాంట్రిబ్యూషన్, టాక్స్ బెనిఫిట్, విత్‌డ్రా రూల్స్ సహా పలు అంశాలు విభిన్నంగా ఉంటాయి. రిటైర్మెంట్ కోసం ఈ రెండింట్లో ఒకటి ఎంచుకోవాలంటే వీటి మధ్య తేడాల్ని కచ్చితంగా తెలుసుకోవాలి.
పీపీఎఫ్ ఫీచర్లు
Public Provident Fund.. భారతీయులు సహా ఎన్ఆర్ఐలకు అందుబాటులో ఉన్నటువంటి వాలంటరీ సేవింగ్స్ స్కీమ్. జీతం, జీతం లేని వ్యక్తులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. పీపీఎఫ్ లో వ్యక్తులు మినిమం కాంట్రిబ్యూషన్‌తో ఇన్వెస్ట్‌మెంట్ మొదలు పెట్టే అవకాశం ఉంటుంది. కాంట్రిబ్యూషన్స్, వడ్డీ, మెచ్యూరిటీ అమౌంట్‌పై పన్ను ప్రయోజనాల్ని అందిస్తుంది.
ఈపీఎఫ్ మాదిరిగా కాకుండా.. పీపీఎఫ్‌ని నేరుగా ప్రభుత్వం నిర్వహిస్తుంటుంది. అధిక భద్రతకు హామీ అందిస్తుంది. పీపీఎఫ్‌లో నిర్దిష్ట వ్యవధి తర్వాత పాక్షికంగా అమౌంట్ విత్‌డ్రా చేసుకునే ఆప్షన్ ఇస్తుంది. దీంట్లో ప్రస్తుతం 7.10 శాతం వడ్డీ ఉండగా.. వడ్డీ పరంగా ఈపీఎఫ్‌తో చూస్తే తక్కువ వడ్డీనే వస్తుంది.
ఈపీఎఫ్ ప్రత్యేకతలు
Employees Provident Fund.. ప్రైవేట్ రంగంలో జీతం పొందే ఉద్యోగుల కోసం రూపొందించిన పథకం. దీంట్లో కంపెనీ మన వేతనం నుంచి 12 శాతం కట్ చేసి పీఎఫ్ అకౌంట్లో వేస్తుంది. కంపెనీ కూడా అంతే మొత్తం జమ చేయాల్సి ఉంటుంది. దీనిపై కేంద్రం వడ్డీ చెల్లిస్తుంటుంది. ప్రస్తుతం 8.25 శాతం వడ్డీ ఉంది. దీంట్లో కూడా డిపాజిట్లపై ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80c కింద పన్ను తగ్గించుకోవచ్చు. ఈపీఎఫ్ లిమిటెడ్ లిక్విడిటీ కలిగి ఉంటుంది.
– పీపీఎఫ్‌లో కనీసం రూ. 500 పెట్టుబడితో ఇన్వెస్ట్‌మెంట్ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ జీతంలో తప్పకుండా 12 శాతం ఉండాల్సిందే.
– పీపీఎఫ్ స్కీమ్ టెన్యూర్ 15 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత ఐదేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు. ఈపీఎఫ్‌లో అయితే రిటైర్మెంట్ లేదా సుదీర్ఘ నిరుద్యోగం తర్వాతే క్లోజ్ అవుతాయి.
– రెండూ సెక్షన్ 80c కింద పన్ను ప్రయోజనాల్ని కల్పిస్తాయి. ఐదేళ్ల ఉద్యోగాన్ని పూర్తి చేసేందుకు ముందు ఈపీఎఫ్ అకౌంట్లో చేసే విత్‌డ్రాలు టాక్స్ పరిధిలోకి వస్తాయి.
– మన జీతంలో ప్రతి నెలా పీఎఫ్ కట్ చేస్తారు. ఆ డబ్బులను ఈక్విటీ షేర్ మార్కెట్లో, మ్యూచువల్ ఫండ్స్, గవర్నమెంట్ బాండ్స్ లో పెడతారు. మనం రిటైర్ అయిపోయినపుడు ఆ డబ్బులకు వడ్డీ కలిపి మనకి ఇస్తారు. దీనికి గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది.
Post Office
తపాలా కార్యాలయం
పోస్టాఫీసులో కూడా ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్స్ చాలా బాగుంటాయి. కొన్ని స్కీమ్స్ మనకి ఎక్కువ వడ్డీ వచ్చేవి ఉన్నాయి. దీనికి గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది. అందరూ ఈ పోస్ట్ ఆఫీస్ పథకాల్లో మదుపు చేయవచ్చు. దీనిలో రిస్క్ ఏమీ ఉండదు. ఈ పథకంలో కనీసం 5 ఏళ్లపాటు పెట్టుబడులు కొనసాగించాల్సి ఉంటుంది. ఈ స్కీమ్‌లో వ్యక్తిగతంగా రూ.1000 నుంచి రూ.9 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. జాయింట్‌గా అయితే రూ.1000 నుంచి రూ.15 లక్షల వరకు మదుపు చేయవచ్చు. దీనిపై గరిష్ఠంగా 7.4% వరకు రాబడి వస్తుంది. అయితే ఈ ఇన్వెస్ట్‌మెంట్‌పై ఎలాంటి పన్ను మినహాయింపులు లభించవు.
pradhan mantri vaya vandana yojana scheme
ప్రధానమంత్రి వయో వందన్ యోజన పథకం
రిస్క్ లేకుండా రాబడి పొందాలని చూస్తున్నారా? అయితే మీకు ఒక పెన్షన్ Pension స్కీమ్ అందుబాటులో ఉంది. అదే ప్రధాన్ మంత్రి వయ వందన యోజన. ఇందులో చేరితే కచ్చితమైన పెన్షన్ వస్తుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు ఎలాంటి రిస్క్ ఉండదు. దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC ఈ స్కీమ్ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటోంది. ఈ స్కీమ్ లో మనం దాదాపుగా 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చెయ్యవచ్చు. మనం రూ.15లక్షలు వరకు ఇన్వెస్ట్ చెయ్యవచ్చు. మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బులను మనకి ప్రతినెలా లేదా 3 నెలలకి ఒకసారి లేదా 6 నెలలకి ఒకసారి లేదా సంవత్సరానికి ఒకసారి రిటర్న్స్ ఇస్తుంటారు. ఈ డబ్బులను కూడా గవర్నమెంట్ బాండ్స్ లేదా కార్పోరేట్ బాండ్స్ లో పెడతారు. దీనికి కూడా గవర్నమెంట్ సెక్యూరిటీ ఉంటుంది.
ప్రస్తుతం ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పథకంపై 7.4 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. ఈ స్కీమ్ మెచ్యూరిటీ కాలం పదేళ్లు. అయితే ఈ మార్చి 31 తర్వాత వడ్డీ రేటు మారే అవకాశం ఉందని నివేదికలు వెలువడుతున్నాయి. అందుకే ముందుగానే చేరితే 7.4 శాతం వడ్డీని పొందొచ్చు.