
మనం ఎంత సంపాదిస్తున్నామన్నది ముఖ్యం కాదు.. ఎంత ఖర్చు చేస్తున్నామన్నదే ముఖ్యం. ఎంత పొదుపు చేస్తున్నామన్నది ఇంకా ముఖ్యం. నెలకు రూ.లక్ష సంపాదిస్తూ రూ.95 వేలు ఖర్చు చేసేవారు కన్నా నెలకు 50 వేలు సంపాదిస్తూ రూ.40 వేలు ఖర్చు చేసేవారే బెటర్. ఎందుకంటే జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం కదా. ఆరోగ్య సమస్య రావొచ్చు.. కుటుంబ అవసరాలు కావొచ్చు, శుభకార్యాలు, ప్రమాదాలు.. ఇలా ఏదైనా కావొచ్చు. అకస్మాత్తుగా సంభవించే కొన్ని అత్యవసరాలకు చేతిలో సొమ్ము లేకుంటే ఇక అంతే సంగతి. అప్పుల కోసం పరుగులు పెట్టాల్సిందే. అందుకే ప్రతి ఒక్కరికీ పొదుపు అనేది చాలా అవసరం. అదే అత్యవసరాల్లో మనల్ని కాపాడుతుంది. భవిష్యత్ అవసరాలకు అండగా ఉంటుంది. అయితే పొదుపును పక్కా గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంది. లేకుంటే ఆర్థిక పరమైన చిక్కులు తప్పవు. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే తప్పనిసరిగా కొన్ని ఫైనాన్సియల్ రూల్స్ మనం పాటించాల్సి ఉంటుంది. మన దగ్గర ఉన్న డబ్బు ఎన్నిరోజుల్లో double, triple అవుతుంది.. మన దగ్గర ఉన్న డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి.. ఒక వేళ invest చేయకపోతే దాని విలువ ఎప్పుడు సగానికి పడిపోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
best financial rules గురించి తెలుసుకుందాం
మనం సంపాదించిన దానికి విలువ ఉండాలంటే తక్కువ ఖర్చుపెట్టాలి. ఎక్కువ సేవ్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఎందుకంటే జీవితంలో ఎదైనా జరగొచ్చు. ఉద్యోగం పొవచ్చు.. లేదా లాక్‌డౌన్ లాంటివి ఎదురవ్చొచ్చు. లేదా బిజినెస్ జోరు తగ్గవచ్చు. అనారోగ్య సమస్యలు అవ్వొచ్చు. పరిస్థితులు ఏమైనా చెప్పి రావు. అందుకే మనం అప్రమత్తంగా ఉండాలి. మనకు ఏమీ కాదనే ఆలోచనలో ఉండొద్దు. మన వద్ద కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా డబ్బులు ఉంచుకోవాలి. అవి మనకు అత్యవసరాల్లో ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతినెలా ఎంతోకొంత పొదుపు చేసుకోవాలి. ఉదాహరణకు నెలకు రూ.10 వేలు సంపాదిస్తే.. కనీసం రూ.1000 సేవ్ చేసుకోవాలి.
ఈ విషయంలో మనం కొన్ని ఫైనాన్షియల్ రూల్స్ని తెలుసుకుంటే ఆర్థిక ప్రణాళిక కొంత సులభతరం అవుతుంది.
how to double, triple your money
what is Rule of 72
మనం post office లో లేదా fixed deposite చేసినా, mutual funds లో invest చేసిన మన డబ్బులు ఎన్నిరోజుల్లో double అవుతుందో తెలియజేయడాన్ని rule of 72 అంటారు.
ఉదాహరణకు fixed deposite లో చూసుకుంటే.. మనం లక్ష రూపాయలను fixed deposite లో పెడితే.. 5.5 శాతం వడ్డీరేటుతో 13 సంవత్సరా ల్లో ఆ డబ్బు double అవుతుంది. అదే మనం PPF లో invest చేస్తే మన డబ్బులు డబుల్ అవ్వాలంటే 7.1 శాతం వడ్డీరేటుతో 10 సంవత్సరాలు పడుతుంది. అవే డబ్బులను index fund లో పెడితే .. మన డబ్బులు డబుల్ అవ్వాలంటే 12శాతం వడ్డీ రేటుతో 6 సంవత్సరాలు పడుతుంది. ఇలా మనం పెట్టుబడి పెట్టే డబ్బు ఎలా డబుల్ అవ్వాలో తెలుసుకోవడానికి rule of 72 ఉపయోగపడుతుంది. వచ్చే వడ్డీని 72తో డివైడెడ్ బై చేస్తే.. మీరు పెట్టుబడి పెట్టిన డబ్బులు ఎన్ని సంవత్సరాలలో double అవుతుందో తెలుస్తుంది.
Rule of 114
ఇది కూడా దాదాపు rule of 72 లా ఉంటుంది. అయితే ఈ రూల్ లో మన డబ్బులు triple ఎప్పుడు అవుతాయో తెలుస్తుంది. ఒకవేళ మన వడ్డీరేటు 5.5 శాతం అనుకుంటే దానిని డివైడెడ్ బై 114 చేస్తే.. 20.7 అని వస్తుంది. అంటే 20 సంవత్సరాల ఏడు నెలల్లో మీ డబ్బు triple అవుతుంది. ఒకవేళ వడ్డీరేటు 7.1 శాతం తీసుకుంటే మనం లక్ష రూపాయలను invest చేస్తే .. ఆ డబ్బులు triple అవ్వడానికి దాదాపుగా 16 సంవత్సరాలు పడుతుంది.
మన డబ్బును ఎందులో ఇన్వెస్ట్ చేయకుండా మన దగ్గర ఉంచుకుంటే దాని విలువ ఎంత తగ్గిపోతుందో తెలుసుకుందాం.
Rule of 70
ఎందులోనూ ఇన్వెస్ట్ చేయకుండా మన చేతిలోనే డబ్బులుంచుకుంటే inflation వల్ల దాని విలువ తగ్గిపోతుంది. అదెలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీనినే rule of 70 అంటారు. ఉదాహరణకు మీ దగ్గర రూ.10లక్షలు ఉందనుకుందాం. ఆ ఆ డబ్బును ఎందులోనూ invest చేయలేదు. Just బీరువాలో ఉంచారనుకుందాం. అలా ఉన్న amount ఎన్ని రోజుల్లో దాని విలువ పడిపోతుందో తెలుసుకోవాలంటే 70/inflation ఆరు శాతం వేసుకోవాలి. అలా లెక్కిస్తే 11 సంత్సరాల ఆరు నెలల్లో ఆ రూ.10 లక్షల విలువ రూ.5 లక్షలకు పడిపోతుంది. అంటే రూ.10 లక్షలకు ఒక కారు కొన్నారనుకుందాం.. పదకొండు సంవత్సరాల తర్వాత కారు విలువ 20 లక్షలు అవుతుంది. అంటే మనం దాచుకున్న 10 లక్షల రూపాయలు అలానే ఉన్నాయి కానీ కారు విలువ పెరిగింది. అంటే మన డబ్బు విలువ తగ్గినట్టే కదా. అంటే ఇక్కడ Cash చేతిలో ఉంచుకోకుండా ఎక్కువగా invest చేయాలి. PPF, GOLD, REAL ESTATE, MUTUAL FUNDS తదితర వాటిల్లో invest చేస్తే కనీసం inflation దాటి దాని విలువ పెరుగుతూ ఉంటుంది. అసలు ఆ డబ్బులు వాడకుండా ఇంటిలోనే పెడితే inflation ప్రకారం దాదాపు 11 సంవత్సరాలకు దాని విలువ సగానికి పడిపోతుంది. అదే బ్యాంకులో amount వేసుకుంటే..inflation 5.5 శాతం ప్రకారం చూసుకుంటే.. నగదు విలువ సగానికి పడిపోవడానికి 12 సంవత్సరాల ఏడు నెలల సమయం పడుతుంది. ఎక్కడ ఎక్కువ వడ్డీ వస్తుందో చూసుకుని invest చేయాలి. ఖర్చుల పెరుగుదల 6 శాతం చూసుకుంటే దాదాపు 11 సంవత్సరాల్లో దాని విలువ సగానికి పడిపోతుంది. అందువలన cashని చేతిలో ఉంచుకోకుండా దానిని దేనిలోనైనా invest చేసుకోవాలి. REAL ESTATE, MUTUAL FUNDS ఇలాంటి వాటిలో invest చేస్తే 12 శాతం వడ్డీరేటుతో మనకి profits వస్తాయి. మన కి ఎక్కడ ఎక్కువ వడ్డీ వస్తుందో చూసుకుని సేఫ్ గా, సెక్యూరిటీ ఉన్న వాటిలో invest చేసుకోవాలి.
Budget rule 50-30-20
ఇది బేసిక్ రూల్. ఈ రూల్ అనేది పక్కాగా ప్లాన్ చేసుకున్న వారికి ఎంతో ఉపయోగపడుతుంది. అప్పులపాలవ్వకుండా చేస్తుంది. 50 రూల్ అంటే ఏమిటంటే మనం సంపాదించే జీతంలో 50 శాతం మన అవసరాలకు ఖర్చు పెట్టాలి. ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులు, ట్రాన్స్‌పోర్టు తదితర ఖర్చులన్నీ జీతంలోని 50 శాతంలో అయిపోవాలి. మిగతా 30 శాతం డబ్బులు మన చిన్న చిన్న సంతోషాలకోసం ఖర్చు పెట్టుకోవాలి. సినిమాలకు వెళ్లడం, టూర్లు, భవిష్యత్‌లో లగ్జరీ వస్తువు కొనుక్కోవడం కోసం దాచిపెట్టుకోవడం వంటి వాటి కోసం ఈ 30 శాతం డబ్బులు కేటాయించాలి. ఇక మిగిలిన 20 శాతం నగదును savings, investment, retirment, పిల్లల భవిష్యత్తు కోసం కేటాయించాలి. మనం కచ్చితంగా జీతాన్ని 50-30-20 రూల్‌గా విభజిస్తే కొంత వయసు వచ్చాక మనకి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. సంతోషంగా జీవితాన్ని సాగించవచ్చు.
40% EMI RULE
ఇది నిర్లక్ష్యం చేయలేని రూల్. ఎందుకంటే మనకు జీతం రాగానే కట్టేద్దాం అనుకుని credit card, రకారకాల loans తీసుకుంటాం. Personal, bike, housing తదితర అన్ని loans వాడేస్తాం. దీనివలన చాలా ఇబ్బందులు పడవలిసి వస్తుంది. ఎప్పుడైనా మనకి వచ్చిన జీతంలో 40 శాతానికి మించి EMI లు దాటకూడదు. మన EMI లు ఎప్పుడైతే 40 శాతం దాటుతుందో అప్పుడే తెలియకుండా అప్పులు పాలవుతాం. ఉదాహరణకు మనకు నెలకు రూ.లక్ష జీతం అనుకుంటే అన్ని EMI కలిపి రూ.40 వేల లోపే ఉండాలి. ఒకవేళ EMI లు రూ.40 వేలు దాటితే దీర్ఘకాలంలో పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయే అవకాశం ఉంది. 40% EMI RULE పాటించకపోతే చాలీచాలని జీతంతో కుటుంబాన్ని పోషించడం కష్టమవుతుంది. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులు, మెడికల్ తదితర వాటికి జీతం డబ్బులు సరిపోక, అన్నింటికీ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జీవితం భారంగా మారుతుంది.
4% WITHDRAWAL RULE
మనం RETIRMENT అయిన తర్వాత CORPUS ఉంటుంది. దాని నుంచి ప్రతి నెలా 4 శాతం మాత్రమే WITHDRAW చెయ్యాలి. 4 శాతం WITHDRAW రూల్ వల్ల మన AMOUNT ఎన్ని రోజులు ఉన్నా SAFE గా ఉంటుంది. ఉదాహరణకు మీ CORPUS fund రూ.1కోటి ఉందనుకుందాం. మీరు దాన్ని FD, SW స్కీంలో పెడితే ఆ రూ.కోటి నుంచి ఏటా నాలుగు శాతం ప్రకారం రూ. 4 లక్షలే తీయాలి. అంటే నెలకు రూ.33 వేలు వస్తుంది. ఇలా తీసుకుంటూ పోతే మన AMOUNT SAFE గా ఉంటుంది. ఇలా మనం 8 సంవత్సరాలు చేస్తే మన AMOUNT SAFE గా ఉంటుంది. దానిపై వచ్చే వడ్డీతో మన జీవితాన్ని సంతోషంగా గడిపేయవచ్చు. ఒకవేళ INFLATION పెరిగితే దాన్ని కలుపుకుని AMOUNT తీయాల్సి ఉంటుంది. ఉదాహరణకు గతేడాది మీరు రూ.4 లక్షలు తీస్తే ఈ ఏడాది INFLATION ఆరు శాతం కలుపుకుని రూ.4 లక్షల 24 వేలు తీయాలి. ఆ తర్వాత ఏడాదిలో రూ.4 లక్షల 24 వేలకు ఆరు శాతం కలుపుకుని WITHDRAWAL చేయాలి. అలా చేస్తే పెరిగిన ఖర్చులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమంది నెలకు రూ.50 వేలు తీస్తుంటారు. అంటే రూ.కోటిలో మొదటి ఏడాది రూ.10 లక్షలు, ఆ తర్వాత సంవత్సరం రూ.7 లక్షలు ఇలా తీసుకుంటా పోతారు. లెక్కలేకుండా తీసుకుంటే RETIRMENT CORPUS FUND దాదాపు 7 నుంచి 8 సంవత్సరాల్లో CLOSE అయిపోతుంది. మనం RETIRMENT అయిన తర్వాత మళ్లీ డబ్బు రాదు. అందుకే దీనిని జాగ్రత్తగా కాపాడుకోవాలి.
EMERGENCY FUND RULE
మీరు ఏదైనా జాబ్ చేస్తున్నా లేదా ఏదైనా వ్యాపారం చేస్తున్నా సంపాదించినపుడే 6 నెలలకి సరిపడా అత్యవసర నిధులను ఒక చోట ఉంచుకోవాలి. EMERGENCY FUND అంటే ఏదైనా మనకి అత్యవసరం వచ్చినపుడు ఇబ్బంది పడకుండా మన దగ్గర డబ్బులను WITHDRAWAL చేసినట్లు ఉండాలి. మనం ఆ డబ్బులను SAFEగా ఉంచితే బిజినెస్ సరిగా నడవకపోయినా, ఉద్యోగులకు జీతాలు సరిగా లేకపోయినా అలాంటి సమయాల్లో EMERGENCY FUND నుండి కొంత డబ్బును తీసుకుని మన అవసరాలకు వాడుకోవచ్చు. ఉదాహరణకు నెలకు రూ.50 వేలు సంపాదిస్తుంటే.. ఆరు నెలల జీతం అంటే రూ.3 లక్షలు EMERGENCY FUND CREATE చేసుకోవాలి. అది ఎప్పుడో ఒకప్పుడు WITHDRAWAL చేసుకునేందుకు వీలుగా ఉండాలి. వ్యా పారులకు ప్రతి నెలా స్థిరమైన ఆదాయం రాకపోవచ్చు. కాబట్టి ఏడాదిలో జనవరి నుంచి డిసెంబర్ వరకు వచ్చే సరాసరి ఆదాయం పరిశీలించి డివైడెడ్‌బై 12 చేస్తే.. ఆ వచ్చే మొత్తమే మీ EMERGENCY FUND. దీనిని save చేసుకోవడం వల్ల వ్యాపారం బాగోలేకపోయిన సందర్భాల్లో, ఉద్యోగం పోయినప్పుడు, ప్రతినెలా సక్రమంగా జీతం రానప్పుడు ఈ FUND ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఎలాంటి అవసరం పడుతుందో తెలియదు కాబట్టి EMERGENCY FUND ను ఉంచుకోవడం మంచిది. EMERGENCY FUND ను gold రూపంలో ఉంచుకోవచ్చు. అత్యవసర సమయాల్లో దానిని తాకట్టు పెట్టి నగదును పొందొచ్చు.