ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) 3.0 వెర్షన్‌పై ఉద్యోగుల్లో ఉత్సాహం, ఆతృత రెండూ కనిపిస్తున్నాయి. ఏటీఎం ద్వారా నేరుగా పీఎఫ్ మొత్తం డ్రా చేసుకునే సదుపాయం త్వరలోనే రానుందనే అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సంవత్సరం ఆ సదుపాయం అందుబాటులోకి రాకపోవచ్చని సంకేతాలు వెలువడుతున్నాయి.
ఏమిటి ఈ EPFO 3.0 What is EPFO 3.0
ఉద్యోగుల సౌకర్యం కోసం EPFO (Employees’ Provident Fund Organisation) రూపొందిస్తున్న కొత్త డిజిటల్ ప్లాట్‌ఫాం ఇది. దీనిలో పీఎఫ్ అకౌంట్ మేనేజ్‌మెంట్, క్లెయిమ్ ప్రాసెసింగ్, ట్రాన్స్‌ఫర్ వంటి అన్ని సదుపాయాలు ఒకే చోట అందుబాటులో ఉండనున్నాయి. అంతేకాదు డెబిట్ కార్డ్‌లా పనిచేసే EPFO కార్డ్ ద్వారా ఉద్యోగులు ఏటీఎంలలో నేరుగా పీఎఫ్ నుంచి డ్రా చేసుకునే అవకాశం కూడా ఉండనుంది.
ఎందుకు ఆలస్యం Why Is It Delayed
సాంకేతిక సమస్యలు, భద్రతా ప్రమాణాల సమీక్ష, బ్యాంకింగ్ వ్యవస్థల సమన్వయం వంటివి కారణాలుగా అధికారులు చెబుతున్నారు. ట్రాన్సాక్షన్ భద్రత, యూజర్ డేటా రక్షణ అంశాలపై EPFO, NPCI (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సంయుక్తంగా పని చేస్తుండగా, అన్ని టెస్టులు పూర్తయ్యే వరకు ప్రజలకు ఈ సదుపాయం ఇవ్వబోమని సమాచారం.
ఉద్యోగుల అంచనాలు.. Employees’ Expectations
పీఎఫ్ మొత్తాన్ని నేరుగా ఏటీఎం ద్వారా పొందే అవకాశం రావడంతో చాలా మంది ఉద్యోగులు దీనిని “ఫైనాన్షియల్ గేమ్‌చేంజర్”గా చూస్తున్నారు. ఎమర్జెన్సీ సమయంలో బ్యాంక్ క్లెయిమ్ ప్రాసెసింగ్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా తక్షణం నిధులు పొందొచ్చని వారు చెబుతున్నారు.
కొత్త ఫీచర్లు ఏవంటే… What Are the New Features?
EPFO 3.0 ద్వారా పీఎఫ్ అకౌంట్‌లను ఒకే ప్లాట్‌ఫామ్‌లో నిర్వహించుకునే వీలుంటుంది. ఉద్యోగులు తమ పీఎఫ్ బాలెన్స్, పాస్‌బుక్, క్లెయిమ్ స్టేటస్ వంటి వివరాలను సులభంగా చెక్ చేసుకోగలరు. పీఎఫ్ ట్రాన్స్‌ఫర్, నామినీ అప్‌డేట్, క్లెయిమ్ ట్రాకింగ్—all in one సర్వీస్‌గా ఉండనుంది. ప్రస్తుతం EPFO వెబ్‌సైట్, ‘UMANG’ యాప్ ద్వారా పీఎఫ్ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఏటీఎం ఫీచర్ కోసం మాత్రం ఉద్యోగులు ఇంకాస్త ఆగాల్సిందే!
ఎప్పుడు ప్రారంభం అవుతుందంటే.. When Will It Be Launched?
EPFO అధికారులు సూచించిన మేరకు 3.0 ప్లాట్‌ఫాం టెస్టింగ్ ఫేజ్‌లోనే ఉందని, పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టేందుకు మరికొన్ని నెలలు పట్టవచ్చని అంచనా. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు. EPFO 3.0తో ఉద్యోగుల పీఎఫ్ సేవలు మరింత వేగవంతం, సులభం కానున్నాయి. కానీ ఏటీఎం ద్వారా పీఎఫ్ డ్రా సదుపాయం మాత్రం ఈ ఏడాది లేనట్టే కనిపిస్తోంది. అయినా సరే టెక్నాలజీతో మారుతున్న ఈ వ్యవస్థ, ఉద్యోగులకు భవిష్యత్తులో పెద్ద సౌలభ్యాన్ని ఇవ్వడం ఖాయం!
ఉద్యోగుల డేటా భద్రతకు ప్రాధాన్యం.. Priority to Employee Data Security
డేటా సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని EPFO అన్ని మార్పులను దశలవారీగా అమలు చేస్తోంది. లాగిన్, వెరిఫికేషన్ పద్ధతులు, OTP సిస్టమ్, బహుళ స్థాయి ఆథెంటికేషన్ వంటి సదుపాయాలు EPFO 3.0లో భాగం కానున్నాయి.
ఈపీఎఫ్ఓ కొత్త రూల్‌తో ఉద్యోగులకు భారీ లాభం Big Benefits for Employees with New EPFO Rule!
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) తాజాగా ప్రవేశపెట్టిన కొత్త రూల్‌తో ఉద్యోగులకు పెద్ద ఊరట లభించింది. పీఎఫ్ బదిలీ, అకౌంట్ మేనేజ్‌మెంట్, క్లెయిమ్ ప్రాసెసింగ్ వంటి సేవలను మరింత సులభతరం చేస్తూ, EPFO తన సేవలను పూర్తిగా డిజిటల్ దిశగా మలుస్తోంది. ఈ కొత్త మార్పులతో ఉద్యోగులు సమయం, కాగితపనులు రెండింటినీ ఆదా చేసుకోగలరు. ఇప్పటి వరకు ఉద్యోగులు ఒక సంస్థ నుంచి మరొకదానికి మారితే పీఎఫ్ బదిలీ కోసం ప్రత్యేకంగా అప్లై చేయాల్సి వచ్చేది. కానీ కొత్త రూల్ ప్రకారం, ఉద్యోగి కొత్త సంస్థలో చేరిన వెంటనే పాత అకౌంట్ నుంచి పీఎఫ్ ఆటోమేటిక్‌గా కొత్త అకౌంట్‌కి బదిలీ అవుతుంది. UAN ఆధారంగా సిస్టమ్ స్వయంగా ఆ డిటైల్స్ తీసుకుంటుంది. ఈ మార్పుతో మానవ జోక్యం, పేపర్‌వర్క్ రెండూ తగ్గిపోయాయి.
క్లెయిమ్ ప్రాసెసింగ్ వేగవంతం.. Faster Claim Processing
గతంలో క్లెయిమ్ ప్రాసెస్ పూర్తి కావడానికి రోజులు పట్టేవి. ఇప్పుడు EPFO కొత్త డిజిటల్ సిస్టమ్ ద్వారా క్లెయిమ్‌లను ఆటోమేటిక్‌గా వెరిఫై చేస్తోంది. దాంతో రీఫండ్, అడ్వాన్స్ లేదా విత్‌డ్రా మొత్తాలు 3–5 రోజుల్లోనే ఉద్యోగుల బ్యాంక్ అకౌంట్‌కి చేరేలా చర్యలు తీసుకున్నారు.
EPFO కొత్త నిబంధన: కనీస నిల్వ 25%.. EPFO New Rule: Minimum Balance 25%
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) నుంచి తాజాగా మరో ముఖ్యమైన మార్పు చేసింది. పీఎఫ్ అకౌంట్‌లో ఉండే కనీస నిల్వ (Minimum Balance) మొత్తానికి సంబంధించిన నిబంధనలను సడలించింది. ఇప్పటివరకు పీఎఫ్ ఖాతాలో కనీసం 25 శాతం నిల్వ తప్పనిసరి కాగా, ఇప్పుడు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆ మొత్తాన్ని కూడా విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. అత్యవసర వైద్య చికిత్స, ఇంటి నిర్మాణం లేదా మరమ్మత్తులు, పిల్లల విద్య లేదా వివాహం, ప్రమాదం లేదా ఉద్యోగ కోల్పోవడం వంటి సందర్భాల్లో సభ్యులు పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం 100 శాతం వరకు డ్రా చేసుకోవచ్చు. ఇంతకుముందు ఇలాంటి పరిస్థితుల్లో గరిష్టంగా 75 శాతం మాత్రమే డ్రా చేసుకునే అవకాశం ఉండేది. కానీ కొత్త రూల్ ప్రకారం కనీస నిల్వ 25 శాతం కూడా అవసరమైతే ఉపసంహరించుకోవచ్చు. ఉద్యోగులు UAN పోర్టల్ లేదా UMANG యాప్ ద్వారా ఆన్‌లైన్‌లోనే క్లెయిమ్ చేయవచ్చు. అవసరమైన పత్రాలు (మెడికల్ సర్టిఫికేట్, విద్యాప్రమాణపత్రం, లేదా ఉద్యోగం కోల్పోయిన ధృవీకరణ) అప్లోడ్ చేస్తే, EPFO ఆమోదం అనంతరం నిధులు 3–5 రోజుల్లో బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతాయి.
