
స్టాక్ మార్కెట్లలో నేరుగా ఇన్వెస్ట్ చేసేందుకు చాలా మంది భయపడుతుంటారు. కారణం ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండటమే. మ్యూచువల్ ఫండ్లు దీనికి ప్రత్యామ్నాయంగా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అని వీటిల్లో చాలా రకాలు ఉంటాయి. స్టాక్ మార్కెట్లపై అవగాహన లేకున్నా.. ఈ స్మాల్ క్యాప్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మంచి లాభాలు అందుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్లు మన దగ్గర నిధులు సేకరించి.. వేర్వేరు పెట్టుబడి సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఫండ్ మేనేజర్లు.. మనకు మంచి రిటర్న్స్ వచ్చేందుకు బంగారం, స్టాక్స్, బాండ్లు వంటి వాటిల్లో పెట్టుబడులు పెడుతుంటారు. ఇక్కడ కాస్త రిస్క్ తక్కువ ఉంటుంది. గత చరిత్రను పరిశీలిస్తే లాంగ్ టర్మ్‌లో మ్యూచువల్ ఫండ్లు మంచి రిటర్న్స్ అందించాయని చెప్పొచ్చు. ఏదేమైనా మనం ఇన్వెస్ట్ మెంట్ చేసే డబ్బులు మనకి ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలని అనుకుంటాం. అయితే దానికోసం చాలా రకాల ఆప్షన్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మ్యూచువల్ ఫండ్ ఆప్షన్ అనేది మంచి ఎంపిక. అయితే మనం తీసుకున్న మ్యూచువల్ ఫండ్స్ ఏ విధంగా పర్ ఫార్మ్ చేస్తుందో తెలుసుకోవడం చాలా అవసరం.
ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఫండ్
2023 సంవత్సరంలో చాలా స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు ఇన్వెస్టర్లకు ఏడాది వ్యవధిలో బెటర్ రిటర్న్స్ ఇచ్చాయి. కొన్ని 50 శాతానికి పైగా కూడా లాభాలు ఇచ్చాయి. ఏడాది తిరగకముందే లక్షకు రూ. 50 వేల వరకు లాభాలు ఇచ్చాయని చెప్పొచ్చు. ఏడాది కాలంలో ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ అత్యధికంగా 53 శాతం రిటర్న్స్ ఇచ్చింది. నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 49 శాతం, సుందరం స్మాల్ క్యాప్ ఫండ్ 45 శాతం పెరిగింది.
నిఫ్టీ స్మాల్ క్యాప్-250 ఇండెక్స్ మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ప్రత్యర్థులతో చూస్తే 46 శాతంతో బెటర్ ప్రాఫిట్ అందించింది. క్వాంటమ్ స్మాల్ క్యాప్ ఫండ్ 2023లో 48 శాతం లాభాలు అందించింది. హెచ్ డీఎఫ్ సీ పుంజుకుంది. ఐసీఐసీఐ ప్రూ స్మాల్ క్యాప్ ఫండ్ 38 శాతం, కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ 35 శాతం, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ 34 శాతం, డీఎస్పీ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ 42 శాతం మేర లాభాలు అందించగా.. ఇన్వెస్కో ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 45 శాతం మేర ప్రాఫిట్స్ అందించాయి.
మూడేళ్ల టెన్యూర్ అత్యధిక లాభాలు అందించిన వాటిలో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ 46 శాతం మేర ఎగబాకింది. తర్వాతి స్థానంలో నిప్పన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ 42 శాతం మేర పుంజుకుంది. ఐదేళ్ల కాలానికి చూస్తే మ్యూచువల్ ఫండ్లలో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ 31 శాతానికిపైగా పెరిగింది. నిప్పన్ ఇండియా ఫండ్ 28 శాతం లాభంతో రెండో స్థానంలో ఉంది. పదేళ్ల కాలానికి సంబంధించి మ్యూచువల్ ఫండ్లలో నిప్పన్ ఫండ్ 27 శాతం వృద్ధితో తొలి స్థానంలో ఉండగా.. DSP స్మాల్ క్యాప్ ఫండ్ తర్వాతి స్థానంలో ఉంది. ఇవి 2024లోనూ పుంజుకునే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు.
వీటిలో నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ను ఉదాహరణగా తీసుకుని దాని పనితీరు, పోర్ట్‌ఫోలియో, రిటర్న్ రేషియో, ఫండ్ గ్రోత్.. వీటన్నింటినీ ఒక సారి పరిశీలిద్దాం.
Nippon India Small cap Fund review
నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఎలా పనిచేస్తుంది
Nippon India Mutual Fund House అందిస్తున్న ఈ Small cap fund అనేది రెగ్యులర్ ప్లాన్, డైరక్ట్ గ్రోత్ ప్లాన్ గా అందుబాటులో ఉంది. రెగ్యులర్ ప్లాన్ అనేది 2010 సెప్టెంబర్ 16లో లాంచ్ చేశారు. డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ అనేది 2013, 1 జనవరి లో లాంచ్ చేశారు.
ఈ కంపెనీ నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్-250 టోటల్ రిటర్న్ ఇండెక్స్ ఎక్కువ రాబడి ఇచ్చింది. ఈ పర్టిక్యులర్ ఫండ్ టోటల్ ఎక్స్ పెన్స్ రేషియో 0.69.
Small cap companies .. స్మాల్ క్యాప్ కంపెనీలు
ఈ ఫండ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా ఈక్విటీ, ఈక్విటీ రిలేటెడ్ ఇతర వాటిల్లో ఇన్వెస్ట్ మెంట్ చేస్తూ, లాంగ్ టర్మ్ లో క్యాపిటల్ అప్రిషియేట్ ను సాధిస్తుంది. దీర్ఘకాలంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని ఆలోచించే వారికి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ (Mutual Funds) మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. వాల్యూ రీసెర్చ్ ప్రకారం.. 7 ఏళ్లలోపు ఇన్వెస్ట్‌మెంట్ టార్గెట్ అయితే.. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌కు దూరంగా ఉండటం మంచిది. అదే మీ టార్గెట్ 7 ఏళ్లు పైన అయితే వీటిల్లో డబ్బులు పెట్టొచ్చు. దీనికి ఒక ఊదాహరణ చెప్పుకోవచ్చు. నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ ఇన్వెస్టర్లకు భారీ లాభాన్ని అందించి పెట్టింది. గత ఏడేళ్ల కాలంలో రూ.10 వేల సిప్ (SIP) (సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్) ఇన్వెస్ట్‌మెంట్‌ను ఏకంగా రూ.17.58 లక్షలుగా మార్చేసింది. అంటే ఇది కళ్లుచెదిరే రాబడి అని చెప్పుకోవచ్చు.
– స్థిరమైన ఆదాయం కోసం డెట్ ఇన్ స్ట్రుమెంట్ మనీ మేనేజ్ మెంట్ లో పెట్టుబడి పెట్టొచ్చు.
– స్మాల్ క్యాప్ ఫండ్స్ లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ ఫండ్స్ ఎప్పుడూ రిస్క్ ను దాటి మంచి రిటర్న్స్ ఇవ్వడం పై ఎక్కువ ఫోకస్ పెడుతుంది.
ఈ ఫండ్ ఏ విషయాలపై ఆధారపడి స్టాక్స్ ను ఎంచుకుంటుంది
* ఎంచుకున్న స్మాల్ క్యాప్ కంపెనీల ఎదుగుదల అవకాశాలు ఎలా ఉన్నాయని చూస్తారు. ఆ కంపెనీ మిడ్ సైజు కంపెనీగా మారే అవకాశం ఉంటేనే ఎంచుకుంటారు.
* ఆ కంపెనీని ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాళ్ళ అనుభవం కూడా చూస్తారు. సైజు రీజనబుల్ గా ఉండాలి. ఆ కంపెనీ వాల్యూవేషన్స్ మిగతా కంపెనీలతో పోల్చితే రీజనబుల్ గా ఉండాలి.
* రిస్క్ మేనేజ్ మెంట్ అప్రోచ్ కూడా ఫాలో అవుతారు. వివిధ రకాల సెక్టార్, వివిధ రకాల స్టాక్స్ లో డైవర్సిఫికేషన్ చేస్తూ మార్జిన్ ఆఫ్ సేప్టీని కూడా మెంటైన్ చేస్తూ రిస్క్ ను తగ్గించుకుంటూ, మంచి రిటర్న్స్ ను అందిస్తుంది.
SMALL CAP FUND CATEGORY (స్మాల్ క్యాప్ ఫండ్ కేటగిరీ)
అంటే ఏవైతే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ స్మాల్ క్యాప్ కంపెనీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారో వాటిని స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటారు. స్మాల్ క్యాప్ ఫండ్స్ టోటల్ అసెట్స్ లో 65 శాతం మినిమమ్ స్మాల్ క్యాప్ కంపెనీ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని సెబీ తీసుకొచ్చిన రెగ్యులేషన్. ఈ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ సిప్ వార్షిక రాబడి 24.7 శాతంగా ఉంది. గత మూడేళ్లలో మొత్తం రాబడి దాదాపు 94 శాతం. అదే ఐదేళ్ల కాలంలో చూస్తే ఫండ్ వార్షిక రాబడి 17.45 శాతంగా ఉంది. మొత్తం రాబడి 123.68 శాతం అని చెప్పుకోవచ్చు. 2010 సెప్టెంబర్ 16 ఆరంభం నుంచి చూస్తే ఈ మ్యూచువల్ ఫండ్ వార్షిక రాబడి దాదాపు 20 శాతంగా ఉంది. మొత్తం రాబడి 750 శాతం కన్నా పైమాటే అని చెప్పుకోవచ్చు.
సిప్ క్యాలిక్యులేటర్ ప్రకారం చూస్తే.. ఇన్వెస్టర్లు ప్రతి నెలా రూ.10 వేల సిప్ ఇన్వెస్ట్‌మెంట్‌ను కొనసాగిస్తూ వచ్చి ఉంటే.. మూడేళ్ల కాలంలో రూ.5.86 లక్షలు పొందే వారు. అదే ఐదేళ్ల పాటు సిప్ పెట్టుబడులను కొనసాగించి ఉంటే.. రూ.10.49 లక్షలు వచ్చేవి. ఏడేళ్ల వరకు సిప్ ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగించి ఉంటే పెట్టుబడి విలువ రూ. 17.58 లక్షలుగా మారేది. అంటే ఇది అదిరే రాబడి అని చెప్పుకోవాలి.
నిప్పాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్, ఎస్‌బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్, కోటక్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్, కెనరా రొబెకో స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ వంటివి దీర్ఘకాలంలో ఇన్వెస్టర్లకు మంచి రాబడిని అందించాయని నిపుణులు చెబుతున్నారు.
మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా రిస్క్ ఉంటుంది కాబట్టి డబ్బులు పెట్టడానికి ముందు ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం. లేదంటే డబ్బులు ఇన్వెస్ట్ చేసినా కూడా నష్టాలు పొందాల్సి రావొచ్చు.
what are large cap, mid cap, small cap companies
స్టాక్ మార్కెట్లో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి. వీటి గురించి కచ్చితమైన అవగాహన ఉండాలి. అప్పుడే వీటిలో పెట్టుబడులు పెట్టి, మీ ఆర్థిక లక్ష్యాన్ని నెరవేర్చుకోగలరు. అందుకే వీటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
* కంపెనీల పరిమాణం, మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ స్టాక్లను వర్గీకరిస్తారు. మనదేశంలో స్టాక్ ఎక్స్చేంజీ లో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా కంపెనీల ర్యాంకింగ్ ఉంటుంది. ఏవైతే కంపెనీలు 1 నుంచి 100లోపు ఉంటాయో వాటి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా అవి లార్జ్ క్యాప్ కంపెనీలుగా విభజిస్తారు. భారీ పెట్టుబడితో, పెద్ద స్థాయిలో వ్యాపారం చేసే ఇలాంటి కంపెనీలు ఎలాంటి ఒడుదొడుకులు వచ్చినా, తట్టుకొని నిలబడగలుగుతాయి. పెట్టుబడిదారులకు దీర్ఘకాలంలో మంచి రాబడులను అందిస్తాయి.
* 101 నుంచి 250 లోపు ఉన్న కంపెనీలన్నీ మిడ్ క్యాప్ కంపెనీలవుతాయి. 250 తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా ర్యాంకింగ్ పొందే అన్ని కంపెనీలను స్మాల్ క్యాప్ కంపెనీలుగా చెప్తారు. మిడ్ క్యాప్ కంపెనీల పరిస్థితి కాస్త భిన్నంగా ఉంటుంది. మిడ్ క్యాప్ కంపెనీలకు భారీ పెట్టుబడుల మద్దతు ఉండదు. కానీ చిన్నపాటి మార్కెట్ అస్థిరతలను ఇవి కొంత వరకు తట్టుకోగలవు. అదే సమయంలో ఇవి మంచి గ్రోత్ పొటెన్షియాలిటీని కలిగి ఉంటాయి. స్మాల్ క్యాప్ కంపెనీలకు భారీ పెట్టుబడులు ఉండవు. అలాగే వాటి వ్యాపార పరిధి కూడా తక్కువగానే ఉంటుంది. కనుక మార్కెట్ ఒడుదొడుకులను ఇవి తట్టుకోలేవు. కానీ అన్నీ కలిసి వస్తే, ఇవి పెట్టుబడిదారులకు భారీ లాభాలను ఆర్జించిపెట్టగలవు.
* పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోను డైవర్సిఫై చేసుకోవాలి. అంటే తమ పోర్ట్‌ఫోలియోలో తగు నిష్పత్తిలో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ స్టాక్స్‌ను చేర్చుకోవాలి. అప్పుడే రిస్క్ తగ్గుతుంది. దీర్ఘకాలంలో మంచి రాబడులు రావడానికి అవకాశం ఏర్పడుతుంది.
* ఒక ఇన్వెస్టర్ సమకూర్చిన సొమ్మును ఫండ్ మేనేజర్ ఏ ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనే అంశం ఆధారంగా ఆ ఫండ్ కు ఒక పేరు ఖరారు అవుతుంది. ఒకవేళ ఫండ్ మేనేజర్ మొత్తం నిధులను లార్జ్ కాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తే దానిని లార్జ్ కాప్ మ్యూచువల్ ఫండ్ గా పరిగణిస్తారు. అలా కాకుండా మొత్తం నిధుల్లో కొంత మిడ్ క్యాప్ కంపెనీలలో, ఇంకొంత స్మాల్ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లైతే దానిని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్ గా పేర్కొంటారు. అంటే ఇన్వెస్టర్ సొమ్ము ఆ రెండు రకాల కంపెనీల షేర్ల లో ఒక నిర్దిష్ట నిష్పత్తి ప్రకారం పెట్టుబడి పెడుతున్నారన్నమాట. లార్జ్ కాప్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టాలంటే ఎక్కువ మొత్తం నిధులు అవసరం. సహజంగానే వాటి షేర్ల విలువ అధికంగా ఉంటుంది. అలా కాకుండా మిడ్ క్యాప్ లేదా స్మాల్ కాప్ అయితే షేర్ల విలువ కాస్త అందుబాటులో ఉంటుంది. కాబట్టి తక్కువ మొత్తంలో కూడా అధిక షేర్ యూనిట్లు పొందవచ్చు.
* కోడిగుడ్లు అన్నీ ఒకే బుట్టలో పెట్టొద్దని సామెత. ఒకవేళ ఆ బుట్ట కింద పడితే అందులోని గుడ్లన్నీ ఒకేసారి పగిలిపోతాయి. పెట్టుబడులకు సంబంధించి కూడా ఇదే సూత్రాన్ని పెద్దలు, అనుభవజ్ఞులు, నిపుణులు సూచిస్తుంటారు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ దీనినే అనుసరిస్తుంటాయి.
* అయితే కొన్ని సార్లు చిన్న కంపెనీలు కూడా బ్రహ్మాండమైన పనితీరు కనబరిచి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. వృద్ధి రేటును కొనసాగిస్తూ దూసుకుపోతాయి. మొదట్లో వద్దనుకున్న వారు మధ్యలో వాటిని కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతారు. కాబట్టి ఇలా వాటి విలువ కూడా పెరుగుతుంది. కాబట్టి ఇన్వెస్టర్లకు అలాంటి ఒక సదవకాశం కూడా మిస్ కాకుండా ఉండేందుకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ ఉపయోగపడతాయి.
గ్రోత్ ఆపర్చూనిటీస్..
what are the Growth Opportunities of small cap companies
స్మాల్ క్యాప్ కంపెనీలకు వృద్ధి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కొత్తగా ప్రారంభించిన కంపెనీలు, బిజినెస్‌లు, స్టార్టప్‌లకు మంచి గ్రోత్ పొటెన్సియాలిటీ ఉంటుంది. కనుక పెట్టుబడిదారులకు భారీ లాభాలు వచ్చే అవకాశముంది. అయితే వీటికి మార్కెట్ క్యాపిటలైజేషన్ తక్కువగా ఉంటుంది. కనుక మార్కెట్ ఒడుదొడుకులను ఇవి తట్టుకోలేకపోవచ్చు. ఇది పెట్టుబడిదారులకు కాస్త రిస్క్ అనే చెప్పవచ్చు.
* లార్జ్ క్యాప్ కంపెనీల వద్ద భారీ స్థాయిలో మూలధనం ఉంటుంది. కనుక మార్కెట్ ఒడుదొడుకులను తట్టుకుని ఇవి నిలబడగలుగుతాయి. కనుక పెట్టుబడిదారులకు నష్టభయం తక్కువగా ఉంటుంది. పైగా దీర్ఘకాలంలో మంచి రాబడులు సంపాదించే అవకాశముంటుంది.
* మిడ్ క్యాప్ కంపెనీ పరిస్థితి కాస్త మధ్యస్థంగా ఉంటుంది. దీనిలో రిస్క్, రివార్డ్ రెండూ సమాన స్థాయిలో ఉంటాయి. కనుక మీ పోర్ట్‌ఫోలియోలో ఈ మూడు కేటగిరీల స్టాక్లను తగు నిష్పత్తిలో చేర్చుకోవడం మంచిది.
ఎకనామిక్ ట్రెండ్స్.. Economic trends
– మార్కెట్ ట్రెండ్స్, సెక్టోరల్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా స్మాల్, మిడ్, లార్జ్ క్యాప్ ఫండ్స్ ప్రతిస్పందిస్తూ ఉంటాయి. ఎమర్జింగ్ సెక్టార్స్‌లోని స్మాల్ క్యాప్ కంపెనీలు బాగా అభివృద్ధి చెందుతాయి. మార్కెట్ ట్రెండ్ కూడా వీటికి అనుగుణంగా ఉంటే ఇక చెప్పాల్సిన పనే లేదు.
– లార్జ్ క్యాప్ కంపెనీల విషయానికి వస్తే, ఇవి ఆర్థిక మాంద్యం లాంటి తీవ్రమైన పరిస్థితుల్లోనూ తట్టుకుని నిలబడగలుగుతాయి.
– బాగా విస్తరిస్తున్న రంగాల్లో ఉన్న మిడ్ క్యాప్ కంపెనీలు తక్కువ కాలంలోనే మంచి రాబడులను అందించగలుగుతాయి.
– పెట్టుబడిదారులు మార్కెట్ తీరుతెన్నులను, దేశ ఆర్థిక పరిస్థితులను, భిన్న రంగాల పనితీరును ఎప్పటికప్పుడు సమగ్రంగా పరిశీలిస్తూ ఉండాలి.
లిక్విడిటీ.. Liquidity
పెట్టుబడిదారులు తమ భవిష్యత్ అవసరాల కోసం డబ్బులను మదుపు చేస్తూ ఉంటారు. తీరా అవసరం వచ్చినప్పుడు డబ్బులు చేతికి అందకపోతే, అది తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. అందుకే పెట్టుబడుల విషయంలో లిక్విడిటీ గురించి కచ్చితంగా ఆలోచించాలి. సింపుల్‌గా చెప్పాలంటే, మన పెట్టుబడులను, రాబడులను డబ్బు రూపంలోకి మార్చుకోగలగాలి.
– స్టాక్ మార్కెట్లో లార్జ్ క్యాప్ షేర్లు భారీ ఎత్తున ట్రేడ్ అవుతుంటాయి. కనుక మీ షేర్లను చాలా సులువుగా అమ్మేసి డబ్బు తీసుకోవచ్చు. కానీ స్మాల్ క్యాప్ షేర్ల విషయంలో అలా ఉండదు. స్మాల్ క్యాప్ షేర్ల ట్రేడింగ్ చాలా తక్కువ పరిమాణంలో జరుగుతుంటుంది. కనుక వెంటనే వాటిని అమ్మేసి సొమ్ము చేసుకోవడం కష్టమవుతుంది. ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి.
– మిడ్ క్యాప్ స్టాక్స్ విషయంలో ఇది కాస్త భిన్నంగా ఉంటుంది. మార్కెట్ ట్రెండ్ బాగున్నప్పుడు మిడ్ క్యాప్ షేర్లను ఈజీగా అమ్మేసి డబ్బు చేసుకోవచ్చు. ఒక వేళ మార్కెట్ ఒడుదొడుకుల్లో ఉంటే మిడ్ క్యాప్ షేర్లను అమ్మడం కష్టమవుతుంది. అంటే లిక్విడిటీ సమస్య ఎదురవుతుంది.
– పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలో వీటన్నింటికీ తగినంత స్థాయిలో చోటు కల్పించుకోవాలి. అప్పుడే రిస్క్ తగ్గుతుంది. మంచి లాభాలు సంపాదించే వీలు కలుగుతుంది.
Now let’s find out how the portfolio mix of this company looks like
ఈ కంపెనీకి సంబంధించిన పోర్ట్ ఫోలియో మిక్స్ ఎలా ఉందో తెలుసుకుందాం
The Category Mix – Small cap Fund
కేటగిరీ మిక్స్ – స్మాల్ క్యాప్ ఫండ్
మినిమమ్ 55 శాతం ఫండ్స్ ఈక్విటీ ఇన్ స్ట్రుమెంట్ లో ఉండాలి. 13 నవంబర్ 2023 కి ఈ కంపెనీ పోర్ట్ ఫోలియో చూస్తే 96.26శాతం ఈక్విటీలో ఉంది. దాంట్లో 15శాతం లార్జ్ క్యాప్ కంపెనీస్, 15 శాతం మిడ్ క్యాప్ కంపెనీస్, మిగిలిన 70శాతం స్మాల్ క్యాప్ కంపెనీస్ లో ఉంది.
క్యాష్ హోల్డింగ్ చూస్తే నవంబర్ 2022 నుంచి నవంబర్ 2023 వరకు ఒకే విధంగా క్యాష్ హోల్డింగ్ ను మెంటైన్ చేస్తున్నారు.
Fund Snapshot
ఈ ఫండ్ అసెట్ అండర్ మేనేజ్ మెంట్ రూ. 41,018,84 కోట్లు పై మాటే. మనం ఇందులో యూనిట్స్ తీసుకున్న సంవత్సరంలోపే వాటిని తిరిగి అమ్మి ఎగ్జిట్ అయితే 1శాతం ఎగ్జిట్ లోడ్ అనేది చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫండ్ పోర్ట్ ఫోలియో టర్నోవర్ రేషియో 0.19 శాతం. పోర్ట్ పోలియోలో ఏవైతే హోల్డింగ్స్ ఫండ్ మేనేజర్ ద్వారా కొనబడుతున్నాయో, అమ్మబడుతున్నాయో.. ఆ రేషియోని కొలవడానికి పోర్ట్ పోలియో టర్నోవర్ రేషియోను లెక్కపెడతారు. ఈ కంపెనీ యావరేజీ టర్నోవర్ రేషియో 127.24 శాతం.
Portfolio Analysis
30 నవంబర్ 2023 నాటికి ఈ పోర్ట్ పోలియోకి సంబంధించి 197 స్టాక్స్ లో ఇన్వెస్ట్ మెంట్ జరిగాయి. టాప్ 10 స్టాక్స్ లో నుంచి దాదాపు 15.67 శాతం టోటల్ అసెట్స్ కి కాంట్రిబ్యూషన్ వెళ్లింది.
నవంబర్ 2023లో చూస్తే Tube Investment of india Limited కంపెనీ 2.68 శాతం అలకేషన్ తో ఎక్కువ వెయిటేజ్ తో నిల్చింది.
Top 5 Sector Holdings …
ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసిన టాప్ 5 సెక్టార్ హోల్డింగ్స్ చూసుకుంటే
8.34 శాతం ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ లో…
7.21 శాతం ఎలక్ట్రికల్ ఎక్విప్ మెంట్ లో ..
6.12 శాతం ఫార్మాసిటికల్స్, బయోటెక్నాలజీ
5.84 శాతం ఆటో కాంపోనెంట్స్
5.38 శాతం కన్ స్ట్రక్షన్
Scheme Riskometer
ఈ ఫండ్స్ ఎక్కువ రిస్క్ కలిగిన కేటగిరిలోకి వస్తుంది. ఎందుకంటే ఇందులో దీర్ఘకాలంలో మనం ఇన్వెస్ట్ చేస్తేనే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
* జనవరి 2013లో డైరక్ట్ గ్రోత్ లో రూ. లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు దాని విలువ రూ.14 లక్షలుగా మారేది. యాన్యువల్ రిటర్న్ 27.01 శాతం.
గత 3 సంవత్సరాల యాన్యువల్ ఇన్ కమ్ మనం చూసినట్లయితే దాదాపుగా 41.90 శాతం గా ఉంది.
* ఫండ్ ర్యాంకింగ్ ప్రకారంగా చూస్తే ఒక సంవత్సరం టైమ్ ఫ్రేమ్ లో 7వ ర్యాంక్, 3 సంవత్సరాల టైమ్ ప్రేమ్ లో 2వ ర్యాంక్, 5 సంవత్సరాల టైమ్ ప్రేమ్ లో 2వ ర్యాంక్ కలిగి ఉంది.
ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రిస్క్ ను దాటుకుంటూ మనం రిటర్న్ ను ఎలా పొందాలి, రిస్క్ ను ఎలా కొలవాలి ఇవన్నీ తెలుసుకోవడానికి కొన్ని ముఖ్యమైన Critical Ratios ని చూద్దాం.