Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!! FEATURE NEWS
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..! FEATURE NEWS
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes? FEATURE NEWS
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand? FEATURE NEWS
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult? FEATURE NEWS
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy! FEATURE NEWS
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly! FEATURE NEWS
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation FEATURE NEWS
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan! FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS

2026లో బ్యాంకింగ్‌ రంగంలో కీలక మార్పులు..! Big Changes in Banking Rules 2026

Posted on 02/01/2026 By admin No Comments on 2026లో బ్యాంకింగ్‌ రంగంలో కీలక మార్పులు..! Big Changes in Banking Rules 2026

కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టే వేళ… మన జీవితాల్లోనే కాదు… బ్యాంకింగ్‌ రంగంలోనూ కొన్ని కీలక మార్పులు (Big Changes in Banking Rules) చోటు చేసుకుంటున్నాయి. నేటి రోజుల్లో ప్రతి ఒక్కరికీ బ్యాంక్‌ అకౌంట్‌ ఉండటం సహజమే. నగదు లావాదేవీలకన్నా డిజిటల్‌ చెల్లింపులే ఎక్కువగా మారాయి. ఈ నేపథ్యంలో 2026 జనవరి 1 నుంచి బ్యాంకింగ్‌ విధానాల్లో ఏమైనా కొత్త మార్పులు అమల్లోకి వచ్చాయి?… ఖాతాదారులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

KYC విషయంలో కఠినతరం..KYC Rules Tightened

(Big Changes in Banking Rules)2026 నుంచి KYC నిబంధనలు మరింత కఠినంగా అమలవుతాయి. ఇప్పటివరకు అసంపూర్తి KYCతో కొనసాగుతున్న ఖాతాలపై బ్యాంకులు ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నాయి. ఈ మేర‌కు ప్రతి ఖాతాకు పూర్తి KYC తప్పనిసరి. పాన్‌–ఆధార్‌ లింక్‌ లేకుంటే లావాదేవీలపై ఆంక్షలు అమ‌లవుతాయి. KYC అప్డేట్‌ చేయకపోతే ATM కార్డు, UPI, చెక్‌ బుక్‌ సేవలు నిలిచే అవకాశం ఉంది. ఈ నేప‌థ్యంలో ఖాతాదారులు బ్యాంక్‌ బ్రాంచ్‌కి వెళ్లినా, లేదా డిజిటల్‌ KYC (వీడియో KYC, e-KYC) ద్వారా అయినా తప్పనిసరిగా అప్డేట్‌ చేసుకోవాలి.

ఎస్‌ఎంఎస్ అలర్ట్‌ ఉంటేనే బ్యాంక్‌ అకౌంట్‌కు భద్రత..SMS Alerts Are Essential for Bank Account Security

2026 జనవరి 1 నుంచి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొత్త KYC (Know Your Customer) నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. బ్యాంకింగ్‌ లావాదేవీలను (Big Changes in Banking Rules)మరింత సురక్షితంగా మార్చడం, డిజిటల్‌ మోసాలను నియంత్రించడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశ్యం. ఈ నేపథ్యంలో ప్రతి బ్యాంక్‌ ఖాతాదారుడు తమ వ్యక్తిగత వివరాలను సకాలంలో అప్డేట్‌ చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఎస్‌ఎంఎస్ అలర్ట్‌ ఉంటేనే బ్యాంక్‌ అకౌంట్‌కు భద్రత ఉన్న‌ట్లుగా నిపుణులు చెబుతున్నారు. నూత‌న నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఆధార్‌ నంబర్‌, పాన్‌ కార్డు వివరాలు, ఖాతాకు లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌.. ఇందులో ఏదైనా అసంపూర్తిగా ఉంటే భవిష్యత్తులో లావాదేవీలపై పరిమితులు విధించే అవకాశం ఉందని బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి. బ్యాంకింగ్‌ అకౌంట్‌ భద్రతలో అత్యంత కీలకమైనది ఎస్‌ఎంఎస్ అలర్ట్‌ వ్యవస్థ. ఖాతాలో డబ్బులు జమ అయినా, విత్‌డ్రా అయినా… ప్రతి ట్రాన్సాక్షన్‌ జరిగిన వెంటనే మొబైల్‌కు సందేశం రావడం తప్పనిసరి. దీనివ‌ల్ల అనుమానాస్పద లావాదేవీలు వెంటనే గుర్తించవచ్చు. మోసాలు జరిగినప్పుడు త్వరగా స్పందించే అవకాశం ఉంటుంది. ఖాతాపై పూర్తి నియంత్రణ మీ చేతిలోనే ఉంటుంది.

UPI లావాదేవీలపై కొత్త నియమాలు…New Rules for UPI Transactions

(Big Changes in Banking Rules)డిజిటల్‌ చెల్లింపులు పెరుగుతున్న నేపథ్యంలో UPI వ్యవస్థను మరింత సురక్షితంగా మార్చేందుకు కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. పెద్ద మొత్తాల లావాదేవీలకు అదనపు ధృవీకరణ అవ‌స‌రం. రోజువారీ UPI లిమిట్లు KYC స్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటారు. ఫ్రాడ్‌ ట్రాన్సాక్షన్లపై వెంటనే ఖాతా ఫ్రీజ్‌ చేసే అధికారం బ్యాంకులకు ఉంది. తప్పుగా డబ్బులు వెళ్లినప్పుడు త్వరిత పరిష్కారం అందేలా చర్యలు తీసుకోనున్నారు.

డిజిటల్‌ మోసాలపై అప్రమత్తం..Be Alert Against Digital Frauds

కొత్త ఏడాదిలో కూడా సైబర్‌ మోసాలు తగ్గలేదు. ఈనేప‌థ్యంలో ఖాతారులు బ్యాంక్‌ పేరుతో వచ్చే కాల్స్‌కు స్పందించరాదు. OTP, పిన్‌ నంబర్లు ఎవరితోనూ పంచరాదు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయ‌కూడ‌దు. చిన్న పొరపాటు కూడా పెద్ద నష్టానికి దారి తీస్తుంద‌ని బ్యాంక‌ర్లు సూచిస్తున్నారు.

ఖాతాదారులు తప్పక చేయాల్సింది ఇదే..! What Account Holders Must Do

ఖాతాదారులు త‌ప్ప‌నిస‌రిగా ఖాతా KYC స్టేటస్‌ చెక్‌ చేసుకోవాలి. పాన్‌–ఆధార్‌ లింక్‌ పూర్తయిందో లేదో నిర్ధారించుకోవాలి. బ్యాంక్‌ మొబైల్‌ యాప్‌లో అలర్ట్స్‌, నోటిఫికేషన్లు ఆన్‌ లో ఉంచాలి. సమస్య ఎదురైతే వెంటనే బ్యాంక్‌ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలి. మొత్తంగా చెప్పాంటే 2026లో అమల్లోకి వచ్చిన ఈ బ్యాంకింగ్‌ మార్పులు ఖాతాదారుల భద్రతే లక్ష్యంగా తీసుకొచ్చినవే. కొంత అసౌకర్యంగా అనిపించినా, జాగ్రత్తలు పాటిస్తే డిజిటల్‌ బ్యాంకింగ్‌ మరింత సురక్షితంగా మారుతుందని బ్యాంకింగ్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

మొబైల్‌ నంబర్‌ సరైందో లేదో చెక్‌ చేసుకోవాలి..Check Whether Your Registered Mobile Number Is Correct

చాలామంది ఖాతాదారులు అకౌంట్‌ ఓపెన్‌ చేసినప్పుడు ఇచ్చిన మొబైల్‌ నంబర్‌ మారిపోయినా, బ్యాంక్‌ రికార్డుల్లో అప్డేట్‌ చేయడం మరిచిపోతుంటారు. ఇది భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. అందుకే… మీ అకౌంట్‌కు ఏ మొబైల్‌ నంబర్‌ లింక్‌ అయి ఉందో తెలుసుకోవాలి. నంబర్‌ మారితే వెంటనే బ్యాంక్‌లో అప్డేట్ చేయాలి. ఎస్‌ఎంఎస్ అలర్ట్‌లు వస్తున్నాయో లేదో తరచూ తనిఖీ చేయాలి. ఆధార్‌, పాన్‌, మొబైల్‌ వివరాలు సకాలంలో అప్డేట్ చేయాలి. ఎస్‌ఎంఎస్ అలర్ట్‌ సేవను ఎప్పుడూ ఆన్‌లో ఉంచాలి.

చెక్కుల క్లియరెన్స్‌ విధానంలోనూ మార్పులు..Changes in Cheque Clearance Procedures

కొత్తగా అమల్లోకి వచ్చిన బ్యాంకింగ్‌ నిబంధనల(Big Changes in Banking Rules) నేపథ్యంలో ఇక ఫిజికల్‌ చెక్కుల క్లియరెన్స్‌ విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఇప్పటివరకు చెక్కు ఇచ్చిన వెంటనే క్లియర్‌ అవుతుందనే భావన ఉండేది. అయితే కొత్త విధానం ప్రకారం… చెక్కు ఇచ్చిన వెంటనే డబ్బులు జమ కావడం ఉండకపోవచ్చు. చాలా సందర్భాల్లో సాయంత్రం లేదా మరుసటి రోజు ఉదయానికి క్లియర్‌ అవుతాయి. చెక్‌ క్లియరెన్స్‌కు కొంత సమయం పడుతుందని ఖాతాదారులు ముందే అంచనా వేసుకోవాలి. కాగా బ్యాంక్‌ అకౌంట్లకు తప్పు మొబైల్‌ నంబర్లు రిజిస్టర్‌ కావడం లేదా పాత నంబర్లు కొనసాగడం వల్ల ఖాతాదారులకు తెలియకుండానే లావాదేవీలు జరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బులు జమ అయినా, విత్‌డ్రా అయినా, UPI లేదా ATM ట్రాన్సాక్షన్‌ జరిగినా వెంటనే సమాచారం అందితే, ఏదైనా అనుమానాస్పద లావాదేవీ జరిగితే తక్షణమే చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఖాతాకు లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌ మారిపోయినా, బ్యాంక్‌ రికార్డుల్లో అప్డేట్‌ చేయకపోయినా.. మీకు ఎస్‌ఎంఎస్ అలర్ట్స్ రాక‌పోవ‌చ్చు. అందుకే…మీ అకౌంట్‌కు ఎస్‌ఎంఎస్ అలర్ట్స్‌ వస్తున్నాయో లేదో తరచూ తనిఖీ చేయాలి. మెసేజ్‌లు రాకపోతే వెంటనే హోమ్‌ బ్రాంచ్‌కు వెళ్లి వివరాలు చెక్‌ చేయించుకోవాలి. అవసరమైతే మొబైల్‌ నంబర్‌ను తిరిగి రిజిస్టర్‌ చేయించుకోవాలి.

UPI లావాదేవీలపై అపోహలు..Misconceptions About UPI Transactions

– బ్యాంకింగ్‌ వర్గాలు (Big Changes in Banking Rules)తెలిపిన దాని ప్రకారం… ఇప్పటి వరకు యూపిఐ లావాదేవీలపై రూ.20 వేల పరిమితి విధించే కొత్త నిబంధనలు ఏవీ అమల్లోకి రాలేదు. యూపిఐ ద్వారా డబ్బు పంపడం, స్వీకరించడం ఇప్పటిలాగే కొనసాగుతోంది. సాధారణ ఖాతాదారులు చేసే యూపిఐ ట్రాన్సాక్షన్ల వివరాలను ప్రత్యేకంగా అధికారులకు నివేదించాల్సిన అవసరం లేదు. అయితే నగదు లావాదేవీల విషయంలో ఇప్పటికే ఉన్న నిబంధనలు మాత్రం అమల్లోనే ఉన్నాయి. ఒక బ్యాంక్‌ అకౌంట్‌లో
సంవత్సరానికి రూ.10 లక్షల కంటే ఎక్కువ నగదు విత్‌డ్రా చేస్తే, ఆ వివరాలను బ్యాంకులు ఇన్కమ్‌ ట్యాక్స్‌ డిపార్ట్మెంట్‌కు తెలియజేయాలి ఇది కొత్త నిబంధన కాదు… ఎప్పటినుంచే ఇది అమలులో ఉంది. ఈ కారణంగా పెద్ద మొత్తంలో నగదు విత్‌డ్రా చేసే సమయంలో, డబ్బు అవసరంపై బ్యాంకుకు వివరణ ఇవ్వాల్సి ఉంది.

– బ్యాంకింగ్‌ నిపుణుల మాటల్లో… UPI, NEFT, RTGS, IMPS వంటి ఎలక్ట్రానిక్‌ ట్రాన్స్ఫర్‌లపై నగదు లావాదేవీల మాదిరిగా ప్రత్యేక నివేదిక నిబంధనలు లేవు. డిజిటల్‌ మార్గాల ద్వారా లావాదేవీలు చేయడం సులభం.. పారదర్శకంజ. రికార్డ్‌ ఆధారితంగా ఉంటుంది. అందుకే ప్రభుత్వం కూడా నగదు కంటే డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహిస్తోంది. యూపిఐ ట్రాన్సాక్షన్లపై వస్తున్న వార్తలను నమ్మే ముందు నిజానిజాలు తెలుసుకోవాలి. క్యాష్‌ లావాదేవీలు ఎక్కువైతే ఇబ్బందే. డిజిటల్‌ ట్రాన్స్ఫర్లు సురక్షితమైనవి.. సులభమైనవి. దీనిపై సందేహాలుంటే ఖాతాదారులు బ్యాంక్‌ లేదా అధికారిక ప్రకటనల ద్వారానే తెలుసుకోవాలి.

– ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల(Big Changes in Banking Rules) ప్రకారం… కొన్ని బ్యాంకులు రోజుకు రూ.35,000 వరకు యూపిఐ లావాదేవీలను అనుమతిస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు రూ.50,000 వరకు యూపిఐ ద్వారా డబ్బు పంపించే అవకాశం ఇస్తున్నాయి. ఈ పరిమితులు ఖాతాదారుని KYC స్థితి, ఖాతా రకం, బ్యాంకు అంతర్గత విధానాలపై ఆధారపడి మారొచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

– యూపిఐ చిన్న, రోజువారీ లావాదేవీల కోసం మాత్రమే రూపొందించబడింది. పెద్ద మొత్తంలో డబ్బు పంపించాలంటే… NEFT, RTGS, IMPS వంటి మార్గాలను వినియోగించాల్సి ఉంటుంది. యూపిఐ ద్వారా భారీ మొత్తాలు తరలించడం సాధ్యం కాదు.

బ్యాంకింగ్‌ రంగంలో కొత్త చర్చ..New Debate in the Banking Sector

2026లో బ్యాంకింగ్‌ రంగంలో కొన్ని పెద్ద మార్పులు (Big Changes in Banking Rules)వచ్చే అవకాశం ఉందన్న ఆలోచనలు రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చకు వస్తున్నాయి. ముఖ్యంగా పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల ప్రైవేటీకరణ అంశం మళ్లీ హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ పరిణామం ఖాతాదారులకు, బ్యాంక్‌ ఉద్యోగాలకు, అలాగే నిమ్న వర్గాల రుణ సదుపాయాలకు ఎలా ప్రభావం చూపుతుందన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. 1969లో 28 పెద్ద బ్యాంకులను ప్రభుత్వం జాతీయికరించింది. ఈ నిర్ణయంతో బ్యాంకింగ్‌ సేవలు గ్రామాలు, పేద ప్రజల దగ్గరికి చేరాయి. రైతులకు రుణాలు, చిన్న వ్యాపారులకు ఆర్థిక సహాయం అందింది. పేద‌, మధ్య తరగతికి బ్యాంకింగ్ సేవ‌లు విస్తృతంగా అందుబాటులోకి వచ్చాయి. బ్యాంకులు కేవలం లాభాలకే కాకుండా సామాజిక బాధ్యతతో పనిచేయడం మొదలుపెట్టాయి. ఇప్పుడు కాలం మారింది… ఆర్థిక విధానాలు కూడా మారుతున్నాయి. ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించడం, బ్యాంకుల పనితీరు మెరుగుపరచడం అనే కారణాలతో ప్రైవేట్‌ రంగానికి మరింత అవకాశాలు ఇవ్వాలన్న ఆలోచనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కొన్ని పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులను ప్రైవేట్‌ రంగానికి అప్పగించే ప్రయత్నాలు 2026లో వేగం పుంజుకోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఖాతాదారులు, ఉద్యోగుల‌కు ఏమవుతుంది? What Will Happen to Account Holders and Employees?

నిపుణుల అభిప్రాయం ప్రకారం… ప్రైవేట్‌ బ్యాంకుల ప్రధాన లక్ష్యం లాభాలేనని, అందువల్ల ఖాతాలపై ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది. ఉచిత సేవలు తగ్గే ప్రమాదం ఉంది. గ్రామీణ ప్రాంతాలపై దృష్టి తగ్గే అవకాశం ఉంది. పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు లక్షలాది మందికి స్థిరమైన ఉద్యోగాలు అందిస్తున్నాయి. ప్రైవేటీకరణ జరిగితే… ఉద్యోగ భద్రతపై అనేక ప్రశ్నలు. ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. ప్ర‌ధానంగా నియామ‌కాలు త‌గ్గనున్నాయి. కాంట్రాక్ట్‌ విధానం పెరిగే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగ సంఘాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి.

పేదల రుణాల పరిస్థితి ఏంటి? What Is the Status of Loans for the Poor?

అత్యంత కీలకమైన అంశం ఇదే. పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు ఇప్పటికీ రైతు రుణాలు, స్వ‌యం ఉపాధి రుణాలు, చిన్న వ్యాపారాలకు సులభంగా లోన్లు ఇస్తున్నాయి. ప్రైవేటీకరణ జరిగితే ఈ వర్గాలకు రుణాలు అందుబాటులో ఉంటాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడులపై కొత్త చర్చ.. New Debate on Foreign Investments in Public Sector Banks

దేశంలోని పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల (PSBs) విషయంలో మరో కీలక చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ బ్యాంకుల్లో విదేశీ పెట్టుబడులకు పరిమితులు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ఈ పరిమితులను సడలించే దిశగా ఆలోచనలు చేస్తోందన్న విషయం బ్యాంకింగ్‌ వర్గాల్లో చర్చకు వస్తోంది. ఇప్పటివరకు అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం… పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో
విదేశీ పెట్టుబడిదారులు గరిష్ఠంగా 22% వరకు మాత్రమే పెట్టుబడి పెట్టగలరు. ఓటింగ్‌ హక్కులు మాత్రం 6% వరకు మాత్రమే పరిమితం. దీంతో బ్యాంకులపై ప్రభుత్వ నియంత్రణ కొనసాగుతోంది. కొత్త ప్రతిపాదనలు ప్ర‌కారం.. ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే.. విదేశీ పెట్టుబడుల పరిమితిని 22% నుంచి 49% వరకు పెంచే అవకాశం ఉంది. అలాగే ఓటింగ్‌ హక్కులను కూడా 49% వరకు ఇవ్వాలన్న ప్రతిపాదన చర్చలో ఉంది. ఇది అమలైతే పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల యాజమాన్యంలోనే కాకుండా, నిర్ణయాలపై కూడా ప్రైవేట్‌ ప్రభావం పెరిగే అవకాశం ఉంది. ఈ మార్పుల నేపథ్యంలో నాలుగు పెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ ఊపందుకుంటోంది. ఈ జాబితాలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) పేరు కూడా వినిపించడం బ్యాంకింగ్‌ రంగంలో మరింత చర్చకు దారి తీస్తోంది. ఈ మార్పులు అమలైతే బ్యాంకుల యాజమాన్య నిర్మాణంలో మార్పులు జ‌రుగుతాయి. నిర్ణయాల్లో ప్రైవేట్‌ రంగ పాత్ర పెరుగుతుంది. పబ్లిక్‌ సెక్టార్‌ భావన బలహీనపడే ప్రమాదం ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

LIC నుంచి బ్యాంకుల వరకు… From LIC to Banks…

ఇటీవల లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC) కు 100 శాతం విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పించడంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. LIC వంటి భారీ ప్రభుత్వ సంస్థలు విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్లే పరిస్థితి వస్తే, భారత ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం గణనీయంగా ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

డాలర్‌ బలపడటం… విదేశీ పెట్టుబడులకు అనుకూలం.. Strengthening Dollar… Favourable for Foreign Investments

ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌ విలువ పెరుగుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్‌లో పెట్టుబడులు పెట్టడం విదేశీ సంస్థలకు మరింత లాభదాయకంగా మారుతోంది. దీని ఫలితంగా… ఇన్సూరెన్స్‌ రంగంలోకి విదేశీ పెట్టుబడులు భారీగా రావడం, ప్రభుత్వ రంగ సంస్థలపై ప్రైవేట్‌ ప్రభావం పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. LIC వంటి సంస్థలు ఇప్పటివరకు ప్రజల పొదుపును భద్రంగా నిర్వహించాయి. సామాజిక భద్రత కల్పించాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు మద్దతు ఇచ్చాయి. కానీ విదేశీ పెట్టుబడిదారుల ఆధిపత్యం పెరిగితే, లాభాలే ప్రధాన లక్ష్యంగా మారే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇన్సూరెన్స్‌ రంగంలో జరుగుతున్న మార్పులే రేపు బ్యాంకింగ్‌ రంగంలోనూ జరిగే అవకాశముందా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బ్యాంకింగ్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం… విదేశీ పెట్టుబడులు పెరిగితే బ్యాంకుల సామాజిక బాధ్యత తగ్గే అవకాశం ఉంది. పేద వ‌ర్గాలకు రుణాలు అందడం కష్టమే. ప్ర‌భుత్వ రంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ సంస్థలు ఇప్పటివరకు లక్షలాది మందికి స్థిరమైన ఉద్యోగావకాశాలు క‌ల్పిస్తున్నాయి. ఉద్యోగ భద్రత, సామాజిక భరోసా అందిస్తున్నాయి. ప్రైవేట్‌–విదేశీ ఆధిపత్యం పెరిగితే ఉద్యోగాల కోత, కాంట్రాక్ట్‌ విధానం పెరుగుదల, ఉద్యోగ భద్రతపై ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

 

233
FEATURE NEWS Tags:Be Alert Against Digital Frauds, Changes in Cheque Clearance Procedures, Check Whether Your Registered Mobile Number Is Correct, From LIC to Banks…, KYC Rules Tightened, Misconceptions About UPI Transactions, New Debate in the Banking Sector, New Debate on Foreign Investments in Public Sector Banks, New Rules for UPI Transactions, SMS Alerts Are Essential for Bank Account Security, Strengthening Dollar… Favourable for Foreign Investments, What Account Holders Must Do, What Is the Status of Loans for the Poor?, What Will Happen to Account Holders and Employees?

Post navigation

Previous Post: 2025లో రూ.30 లక్షల కోట్లకు పెరిగిన మదుపర్ల సంపద..Investor Wealth Rises to ₹30 Lakh Crores in 2025
Next Post: పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్‌ సుంకం.. సిగ‌రెట్ల ధ‌రలు మ‌రింత ప్రియం .. Additional Excise Duty on Tobacco Products… Cigarette Prices to Rise Further

Related Posts

  • CAN NRIS INVEST IN PPF ఎన్ఆర్ఐలు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయ‌వ‌చ్చా FEATURE NEWS
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security FEATURE NEWS
  • ఇక‌పై బ్యాంకు ఖాతాకు న‌లుగురు నామినీలు! న‌వంబ‌ర్ 1 నుంచి అమ‌లులోకి.. Now Four Nominees Allowed per Bank Account! Effective from November 1 FEATURE NEWS
  • ప్ర‌భుత్వ రంగ జీవిత బీమా సంస్థ‌ చరిత్రాత్మక నిర్ణయం.. బోన‌స్ షేర్ల జారీకి ఆమోదం..! Historic Decision by State-Owned Life Insurance Giant… Bonus Share Issue Approved! FEATURE NEWS
  • యూపీఐ క్రెడిట్ కార్డుల జోరు.. అదిరే రివార్డులు, క్యాష్‌బ్యాక్‌లు.. UPI Credit Cards in 2026: Rewards, Cashback and Digital Convenience FEATURE NEWS
  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • dhanammoolam.com
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • చమురు మంటలు.. ప్రభుత్వ రంగ సంస్థలకు భారీ న‌ష్టం!!
  • ఈ టిప్స్‌ పాటిస్తే.. క్రెడిట్ కార్డు వినియోగంతో డబ్బును ఆదా చేయొచ్చు..!! Follow These Tips to Save Money Through Smart Credit Card Usage..!
  • క‌రెన్సీ నోట్లపై సీరియల్ నంబర్ పక్కన ఉండే అక్షరాల వెనుక కథ ఏంటో తెలుసా? Do You Know the Story Behind the Letters Next to the Serial Number on Currency Notes?
  • పేరుకే రూ.కోటి ప్యాకేజీ..! చేతికి మిగిలేదెంతో తెలుసా? ₹1 Crore Package Only on Paper..! Know How Much Actually Reaches Your Hand?
  • బంగారం ఉన్నా.. డబ్బు పొందడం కష్టమేనా? Even If You Have Gold… Is Getting a Loan Becoming Difficult?
  • స్టెప్‌-అప్‌ SIP విధానంలో.. జాబ్ చేస్తూనే కోట్లు సంపాదించొచ్చు..!! Build Crores While Working — With the Step-Up SIP Strategy!
  • ఐటీ నోటీసు వచ్చిందా?.. కంగారు ప‌డొద్దు! Income Tax Notice? Don’t Panic… Respond Smartly!
  • తాత్కాలిక పతనాలే.. దీర్ఘకాలిక సంపద సృష్టికి అవకాశాలు.. Temporary Market Falls Are Opportunities for Long-Term Wealth Creation
  • రుణంపై వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం ఎలా? Here’s How to Reduce the Interest Burden on Your Loan!
  • డిజిటల్‌ సిగ్నేచర్‌.. ప‌త్రాల‌కు నమ్మకమైన రక్షణ కవచం .. Digital Signature: A Trusted Shield for Document Security
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) .Precautions to Take 000 Awareness is the Best Protection Benefits Benefits for Consumers Big Impact Common Mistakes Investors Make Convenience Drawbacks Eligibility Criteria Expert Advice Final Takeaway Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Impact on Credit Score Importance of Credit Score Importance of Emergency Fund In Conclusion Interest Rate Investment Limits Explained Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Start Early Stock Market The Road Ahead Tips for Investors What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

May 2026
S M T W T F S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
« Apr    
  • 100% విదేశీ పెట్టుబడులకు అనుమతి.. ఇన్సూరెన్స్ రంగంలో ఎలాంటి మార్పులు వస్తాయ్..? 100% Foreign Investment Approval: What Changes Will It Bring to the Insurance Sector? INSURANCE
  • రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.61 వేల ఆదాయం… పీపీఎఫ్‌తో సాధ్యమేనా? ₹61,000 Monthly Income After Retirement.. Can PPF Make It Possible? FEATURE NEWS
  • Why Rbi increases interest rate వ‌డ్డీ రేట్లు ఎందుకు పెరిగాయి FEATURE NEWS
  • భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌.. ఒక్క రోజులో రూ.6 వేలు త‌గ్గింపు.. Gold Prices Plunge Sharply ..Price Drops ₹6,000 in a Single Day FEATURE NEWS
  • ఇక ‘సర్‌ప్రైజ్ బిల్లులు’ ఉండవ్‌..! ఆ ధరలను ప్రైవేట్ ఆసుపత్రులు ముందుగానే వెల్లడించాలి! No More “Surprise Bills”! Private Hospitals Must Disclose Treatment Costs in Advance FEATURE NEWS
  • మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు హెచ్చరిక: కేవైసీ పేరుతో కొత్త మోసాల ముప్పు .. Alert for Mutual Fund Investors: New KYC Scams on the Rise FEATURE NEWS
  • భారీ మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన ఇండియన్ ఆయిల్ FEATURE NEWS
  • 35 ఏళ్లలోనే కోటీశ్వరుల దారిలో .. Path to Becoming a Crorepati by 60 FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme