Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

100% విదేశీ పెట్టుబడులకు అనుమతి.. ఇన్సూరెన్స్ రంగంలో ఎలాంటి మార్పులు వస్తాయ్..? 100% Foreign Investment Approval: What Changes Will It Bring to the Insurance Sector?

Posted on 14/12/2025 By admin No Comments on 100% విదేశీ పెట్టుబడులకు అనుమతి.. ఇన్సూరెన్స్ రంగంలో ఎలాంటి మార్పులు వస్తాయ్..? 100% Foreign Investment Approval: What Changes Will It Bring to the Insurance Sector?

భారత ఆర్థిక వ్యవస్థలో కీలకమైన రంగాల్లో ఇన్సూరెన్స్ రంగం (Insurance Industry)ఒకటి. దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు భద్రత కల్పించే ఈ రంగంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం చర్చకు దారి తీస్తోంది. ఇన్సూరెన్స్ కంపెనీల్లో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (FDI) అనుమతి ఇవ్వడంతో భారత ఇన్సూరెన్స్ పరిశ్రమలో పెద్ద మార్పులు రాబోతున్నాయి. ఇప్పటివరకు పరిమిత స్థాయిలోనే ఉన్న విదేశీ పెట్టుబడులు ఇకపై పూర్తిస్థాయిలో ప్రవేశించనున్నాయి. ఇది దేశ ఆర్థిక విధానాల్లో ఒక కీలక మలుపుగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇంతవరకు 74 శాతం వరకే అనుమతించిన విదేశీ పెట్టుబడులను పూర్తిగా తెరవడం వల్ల ఇన్సూరెన్స్ పరిశ్రమ రూపురేఖలు మారే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు లాభ‌మా? దేశీయ కంపెనీలకు ప్రమాదమా? ఉద్యోగాలపై ప్రభావం ఏమిటి? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇన్సూరెన్స్ రంగం – ఇప్పటి పరిస్థితి .. Current Status of Insurance Industry

భారతదేశంలో ఇన్సూరెన్స్ రంగం (Insurance Industry) ఇప్పటికీ పూర్తిగా వినియోగించుకోబడని అవకాశాలతో నిండి ఉంది. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దేశంలో ఇన్సూరెన్స్ పెనెట్రేషన్ (Insurance Penetration) తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో ఇప్పటికీ బీమా అవసరం, ప్రయోజనాలపై పూర్తి అవగాహన లేదు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించి, సేవల పరిధిని పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో LIC ఆధిపత్యం కొనసాగుతుండగా, ప్రైవేట్ రంగంలో దేశీయ-విదేశీ భాగస్వామ్య కంపెనీలు పనిచేస్తున్నాయి.

100% FDI అనుమతి – నిర్ణయానికి కారణాలు .. Why Government Allowed 100% FDI

ఇప్పటివరకు ఇన్సూరెన్స్ రంగం (Insurance Industry)లో విదేశీ కంపెనీలు దేశీయ భాగస్వాములతో కలిసి మాత్రమే వ్యాపారం చేయాల్సి వచ్చేది. తాజా నిర్ణయంతో విదేశీ సంస్థలు పూర్తిగా తమ సొంత యాజమాన్యంతో భారతదేశంలో ఇన్సూరెన్స్ వ్యాపారం చేయగలుగుతాయి. దీంతో ప్రపంచంలోని అగ్రశ్రేణి ఇన్సూరెన్స్ కంపెనీలు నేరుగా భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టే అవకాశం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం (FDI) ఈ కీలక నిర్ణయం తీసుకోవడానికి పలు కారణాలు ఉన్నాయి. వాస్త‌వంగా ఇన్సూరెన్స్ రంగానికి భారీ మూలధనం అవసరం. దీర్ఘకాలిక పెట్టుబడులు సమకూర్చడం, అంతర్జాతీయ సాంకేతికత, నైపుణ్యాల వినియోగం, గ్రామీణ, అసంఘటిత రంగాలకు బీమా విస్తరణ, భారతదేశాన్ని గ్లోబల్ ఇన్సూరెన్స్ హబ్‌గా మార్చడం.. త‌దిత‌ర‌ లక్ష్యాలను సాధించాలంటే విదేశీ పెట్టుబడులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాల్సిందేనన్న అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది.

విదేశీ కంపెనీలకు కొత్త అవకాశాలు.. New Opportunities for Global Insurers

100 శాతం FDI అనుమతితో ప్రపంచంలోని అగ్రశ్రేణి ఇన్సూరెన్స్ సంస్థలు భారత మార్కెట్‌పై దృష్టి సారించనున్నాయి. ఇప్పటివరకు భాగస్వామ్యంగా మాత్రమే ప్రవేశించిన సంస్థలు ఇకపై స్వతంత్రంగా కంపెనీలు స్థాపించుకునే అవకాశం లభిస్తుంది. దీంతో కొత్త ఇన్సూరెన్స్ ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో సేవలు అందించ‌నున్నాయి. డిజిటల్ బీమా విధానాలు తక్కువ ప్రీమియంతో అధిక కవరేజ్ ఇవ్వ‌నున్నాయి.

దేశీయ ఇన్సూరెన్స్ కంపెనీలపై ప్రభావం.. Impact on Indian Insurance Companies

విదేశీ పెట్టుబడుల (FDI) పెరుగుదలతో దేశీయ ఇన్సూరెన్స్ కంపెనీలపై పోటీ ఒత్తిడి పెరగడం ఖాయం. అయితే ఇది పూర్తిగా ప్రతికూలమేనని చెప్పలేం. పోటీ పెరగడం వల్ల సేవల నాణ్యత మెరుగుపడుతుంది. ఖర్చులు తగ్గుతాయి. వినియోగదారులకు ఎక్కువ ఎంపికలు లభిస్తాయి. అయితే చిన్న, మధ్య స్థాయి దేశీయ కంపెనీలు నిలదొక్కుకోవడం కష్టంగా మారే అవకాశమూ ఉంది.

పాలసీదారులకు లాభాలేనా? Benefits for Policyholders?

ఈ నిర్ణయం (FDI) వల్ల సాధారణ బీమా వినియోగదారులే ప్రధాన లబ్ధిదారులు అవుతారని నిపుణులు చెబుతున్నారు. కొత్త రకాల పాలసీలు అందుబాటులోకి వ‌స్తాయి. క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో వేగం పెరుగుతుంది. డిజిటల్ సేవలు అందుబాటులోకి వ‌స్తాయి. కస్టమర్ సపోర్ట్ మెరుగ‌వుతుంది. అంతేకాదు అంతర్జాతీయ అనుభవం ఉన్న సంస్థలు రావడంతో పారదర్శకత కూడా పెరుగుతుందని అంచనా. పోటీ పెరిగితే కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీలు మరింత శ్రమిస్తాయి . ప్రీమియం ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. పాలసీ నిబంధనలు మరింత స్పష్టంగా మారతాయి. సేవల నాణ్యత మెరుగుపడుతుంది. ఇన్సూరెన్స్ అనుభవం కూడా బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్‌లా సులభంగా, ఆధునికంగా మారనుంది.

డిజిటల్ ఇన్సూరెన్స్ దిశగా అడుగులు.. Shift Towards Digital Insurance

విదేశీ కంపెనీల (100% FDI )తో పాటు ఆధునిక టెక్నాలజీ కూడా భారత్‌లోకి రానుంది. మొబైల్ యాప్‌లోనే పాలసీ కొనుగోలు, ఆన్‌లైన్‌లో ప్రీమియం వివరాలు, డిజిటల్ డ్యాష్‌బోర్డులు, వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఇన్సూరెన్స్ తీసుకోవడం, నిర్వహించడం మరింత సులభమవుతుంది.

ప్రీమియాలు తగ్గే అవకాశముందా? Will Insurance Premiums Come Down?

పోటీ పెరిగితే ప్రీమియాలు తగ్గుతాయన్నది సాధారణ ఆర్థిక సూత్రం. అయితే ఇన్సూరెన్స్ రంగం (Insurance Industry)లో ఇది పూర్తిగా అమలవుతుందా అన్నది చూడాల్సిందే. ప్రారంభ దశలో కొన్ని పాలసీలపై రాయితీలు, ప్రత్యేక ఆఫర్లు రావొచ్చు. కానీ దీర్ఘకాలంలో రిస్క్ ఫ్యాక్టర్లు,
రీ–ఇన్సూరెన్స్ ఖర్చులు, రెగ్యులేటరీ నిబంధనలు వంటి అంశాలు ప్రీమియాలపై ప్రభావం చూపుతాయి.

ఉద్యోగాలపై ప్రభావం.. Impact on Employment

100% FDI అనుమతితో ఇన్సూరెన్స్ రంగం (Insurance Industry)లో ఉద్యోగావకాశాలు పెరిగే అవకాశం ఉంది. సేల్స్, కస్టమర్ సర్వీస్, ఐటీ & డిజిటల్ విభాగాలు, యాక్చువరీ నిపుణులు , ఆటోమేషన్ పెరగడం వల్ల సంప్రదాయ ఉద్యోగాలు తగ్గే ప్రమాదం కూడా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

LIC స్థానం ఏమిటి? What About LIC’s Dominance?

ప్రభుత్వ రంగ దిగ్గజం LIC ఇప్పటికీ మార్కెట్‌లో అగ్రస్థానంలో ఉంది. 100% విదేశీ పెట్టుబడులు వచ్చినా LIC ఆధిపత్యం వెంటనే తగ్గిపోదని నిపుణులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నమ్మకం, ప్రభుత్వ మద్దతు, విస్తృత నెట్‌వర్క్ వంటి అంశాలు LICకు బలంగా నిలుస్తాయి. అయితే ప్రైవేట్, విదేశీ సంస్థల పోటీతో సేవల మెరుగుదల అవసరం మరింత పెరుగుతుంది.

నియంత్రణ సంస్థ IRDAI పాత్ర .. Role of IRDAI

ఇన్సూరెన్స్ రంగం (Insurance Industry)లో ఎన్ని మార్పులు వచ్చినా IRDAI (Insurance Regulatory and Development Authority of India) కీలక పాత్ర పోషించనుంది. పాలసీదారుల ప్రయోజనాల రక్షణ, విదేశీ సంస్థల పర్యవేక్షణ, ఆర్థిక స్థిరత్వం, మార్కెట్ పారదర్శకత త‌దిత‌ర అంశాలపై IRDAI కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది.

జాతీయ ప్రయోజనాలపై సందేహాలు.. Concerns Over National Interest

కొంతమంది విమర్శకులు 100% FDI నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశీ కంపెనీల ఆధిపత్యం పెరగడం, లాభాలు విదేశాలకు తరలిపోవడం, వ్యూహాత్మక రంగంలో నియంత్రణ తగ్గడం .. వంటి అంశాలు చర్చకు వస్తున్నాయి. ఈ కారణంగానే ప్రభుత్వం కొన్ని సేఫ్‌గార్డ్ నిబంధనలు కొనసాగిస్తుందని చెబుతోంది.

గ్రామీణ, పేద వర్గాలకు ఉపయోగమా? Reach to Rural and Poor Sections

ప్రభుత్వ లక్ష్యం గ్రామీణ, తక్కువ ఆదాయ వర్గాలకు బీమా రక్షణ అందించడం. విదేశీ పెట్టుబడులు వచ్చినా ఈ లక్ష్యం నెరవేరాలంటే
మైక్రో ఇన్సూరెన్స్, తక్కువ ప్రీమియం పాలసీలు, ప్రభుత్వ పథకాలతో అనుసంధానం అత్యవసరం అవుతుంది. భారత్‌లో ఇప్పటికీ మూడింట ఒకరికే లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్కువగా పట్టణాలకే పరిమితం అయింది. విదేశీ పెట్టుబడులు పెరిగితే కంపెనీలు గ్రామాలు, చిన్న పట్టణాలపై దృష్టి పెడతాయి. కొత్త బ్రాంచ్‌లు, కాల్ సెంటర్లు, మొబైల్ ఏజెంట్లు, AI ఆధారిత సేవల ద్వారా తక్కువ సమయంలో పాలసీలు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఇన్సూరెన్స్ లగ్జరీ కాకుండా అవసరమైన భద్రతా సాధనంగా మారుతుంది.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం.. Impact on Indian Economy

దీర్ఘకాలంలో 100% FDI నిర్ణయం వల్ల దేశంలో పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. క్యాపిటల్ మార్కెట్లకు బలం చేకూరుతుంది. మౌలిక వసతుల పెట్టుబడులకు మద్దతు ల‌భిస్తుంది. ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుంద‌ని ప్రభుత్వం ఆశిస్తోంది.ఏదేమైనా ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీ పెట్టుబడులకు అనుమతి అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఇది అవకాశాలతో పాటు సవాళ్లను కూడా తెస్తుంది. సరైన నియంత్రణ, పారదర్శక విధానాలు, దేశీయ సంస్థలకు మద్దతు ఉంటే ఈ మార్పు వినియోగదారులకు, ఆర్థిక వ్యవస్థకు మేలు చేసే దిశగా సాగుతుంది. ఇక ముందు ఇన్సూరెన్స్ రంగం ఎలా మారుతుందన్నది కాలమే నిర్ణయించాలి. కానీ 100% FDI నిర్ణయం మాత్రం భారత ఇన్సూరెన్స్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి నాంది.

మన డబ్బు ఇక్కడే… విదేశీ నైపుణ్యం మనకు.. Indian Money Stays Here, Global Expertise Comes In

విదేశీ కంపెనీలు వస్తే మన డబ్బు విదేశాలకు వెళ్లిపోతుందన్న భయం చాలామందిలో ఉంది. కానీ నియమాలు స్పష్టంగా ఉన్నాయి. పాలసీదారుల ప్రీమియం డబ్బు భారత్‌లోనే పెట్టుబడి పెట్టాలి. ప్రభుత్వ బాండ్లు, మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో వినియోగించాలి. అంటే మన డబ్బు మన ఆర్థిక వ్యవస్థకే బలంగా నిలుస్తుంది. అదే సమయంలో విదేశాల నుంచి అధునాతన టెక్నాలజీ, డేటా అనలిటిక్స్, మెరుగైన క్లెయిమ్ వ్యవస్థలు మనకు అందుతాయి.

జాగ్రత్తలు తప్పనిసరి.. Need for Caution While Choosing Policies

ఎక్కువ కంపెనీలు వస్తే ఎక్కువ ఆప్షన్లు లభిస్తాయి. కానీ అదే సమయంలో గందరగోళం కూడా పెరుగుతుంది. ఆకర్షించే యాప్‌లు, క్లిష్టమైన రైడర్లు, భారీ హామీలు వినియోగదారులను తప్పుదారి పట్టించవచ్చు. కాబట్టి క్లెయిమ్ సెటిల్మెంట్ రికార్డ్ చూడాలి. పాలసీలో ఏమి కవర్ అవుతుందో స్పష్టంగా తెలుసుకోవాలి. ఆఫర్లకంటే అవసరానికి తగిన పాలసీ ఎంచుకోవాలి. ఇన్సూరెన్స్ విలువ కష్టకాలంలోనే తెలుస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇన్సూరెన్స్ రంగం (Insurance Industry)లో 100% FDI అనుమతి అనేది.. సరైన నియంత్రణలు, వినియోగదారుల అవగాహన పెరిగితే ఈ నిర్ణయం దేశానికీ, ప్రజలకీ లాభదాయకంగా మారుతుంది. పోటీ పెరిగి సేవలు మెరుగుపడతాయి. గ్రామాల వరకు బీమా విస్తరిస్తుంది. కానీ పాలసీ ఎంపికలో జాగ్రత్త మాత్రం తప్పనిసరి. భద్రత కోసం తీసుకునే బీమా, భారం కాకుండా ఉపయోగకరంగా ఉండాలంటే తెలివైన నిర్ణయమే కీలకం.

211
INSURANCE Tags:Benefits for Policyholders?, Concerns Over National Interest, Current Status of Insurance Industry, Global Expertise Comes In, Impact on Employment, Impact on Indian Economy, Impact on Indian Insurance Companies, Indian Money Stays Here, Need for Caution While Choosing Policies, New Opportunities for Global Insurers, Reach to Rural and Poor Sections, Role of IRDAI, Shift Towards Digital Insurance, What About LIC’s Dominance?, Why Government Allowed 100% FDI, Will Insurance Premiums Come Down?

Post navigation

Previous Post: కార్ లోన్ తీసుకుంటే క్రెడిట్ స్కోర్ పడిపోతుందా? Does Taking a Car Loan Reduce Your Credit Score?
Next Post: రూపాయి క్షీణత .. ‘టీవీ – మొబైల్‌’ భారం.. ! Rupee Depreciation: ‘TV–Mobile’ Burden Mounts!

Related Posts

  • ఎల్ఐసీ లాభం రూ.10,053 కోట్లు! భారీ వృద్ధితో బీమా దిగ్గజం బలమైన ప్రదర్శన LIC Profit Hits ₹10,053 Crore! Insurance Giant Shows Strong Performance with Massive Growth FEATURE NEWS
  • ₹2 కోట్లు బీమా..! LIC నుంచి కొత్త ప్లాన్స్‌! ₹2 Crore Insurance! New LIC Plans Launched INSURANCE
  • హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో చేయకూడని ముఖ్యమైన పొరపాట్లు | హెల్త్ ఇన్స్యూరెన్స్ కొనడానికి ఉత్తమ సమయం Top Health Insurance Mistakes to Avoid | Best Time to Buy Health Insurance INSURANCE
  • పీఎఫ్‌ ఖాతా నుంచి LIC ప్రీమియం చెల్లించొచ్చు! LIC Premium from PF Account – A Financial Safety Option INSURANCE
  • ఆరోగ్య బీమా వైపు ప్ర‌జ‌ల చూపు… రూ.1.2 లక్షల కోట్లకు చేరిన‌ ప్రీమియం.. People Turning Towards Health Insurance… Premiums Reach ₹1.2 Lakh Crore INSURANCE
  • పెన్షన్ టెన్షన్ వద్దు.. LIC ‘మ్యాజిక్’ పాలసీలతో జీవితాంతం ఆదాయం! No Pension Worries.. Lifetime Income with LIC ‘Magic’ Policies! INSURANCE

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్స్ అంటే చేదా..? What are equity mutual funds? MUTUAL FUNDS
  • స్టాక్ మార్కెట్ అంటే గేంబ్లింగ్ కాదు stock market is not a gambling MARKET
  • ఈ మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో హై రిట‌ర్న్స్ which mutual funds generate good returns MUTUAL FUNDS
  • యుద్ధంతో ఇండియా ఉక్కుకు డిమాండ్‌ NEWS
  • భ‌విష్య‌త్ ఖర్చులకు సింకింగ్‌ ఫండ్ ! Sinking Fund for Future Expenses! FINICAL PLANNING
  • ఏటీఎం కార్డు లేకుండా డ‌బ్బులు విత్‌డ్రా ఎలా how to withdraw money without ATM card NEWS
  • అర్బన్‌ సహకార బ్యాంకుల రుణాలపై ఆర్‌బీఐ కొత్త నిబంధ‌న‌లు.. RBI Introduces New Lending Norms for Urban Co-operative Banks FEATURE NEWS
  • వెండి ధర పైపైకి.. కిలో రూ.2ల‌క్ష‌లు .. Silver Prices Soar: One Kilogram Crosses ₹2 Lakh FEATURE NEWS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme