జీవితంలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు. మనకు ఎదురయ్యే అనూహ్య ఘటనలకు రక్షణగా నిలిచేది టర్మ్ ఇన్సూరెన్స్. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ ఇచ్చే ఈ పాలసీలు ఇటీవల ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులు, స్వతంత్ర వృత్తిదారులు ఎవరైనా తమ కుటుంబ భద్రత కోసం ఈ బీమా తప్పనిసరిగా తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
టర్మ్ ఇన్సూరెన్స్ అంటే What is Term Insurance
టర్మ్ ఇన్సూరెన్స్ అనేది సాదాసీదా రిస్క్ కవర్ పాలసీ. పాలసీదారుడు నిర్దిష్ట కాలంలో మరణిస్తే, అతని కుటుంబానికి భారీ సొమ్ము లభిస్తుంది. అయితే పాలసీ గడువు ముగిసేలోపు పాలసీదారుడు సజీవంగా ఉంటే ఎలాంటి రిటర్న్స్ ఉండవు. అందుకే దీన్ని “ప్యూర్ రిస్క్ ప్లాన్” అంటారు.
లాభాలు ఏంటంటే… What Are the Benefits?
తక్కువ ప్రీమియంతో అధిక కవరేజ్
పన్ను మినహాయింపు (80C, 10(10D) కింద)
ఆన్‌లైన్‌లో సులభంగా కొనుగోలు చేసే వీలు
దీర్ఘకాల భద్రత – కుటుంబానికి ఆర్థిక అండ
ఎవరు తీసుకోవాలి? Who Should Take It?
కుటుంబ బాధ్యతలు ఉన్నవారు, గృహ రుణాలు లేదా ఇతర అప్పులు ఉన్నవారు తప్పనిసరిగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ముఖ్యంగా ఉద్యోగులు, స్వయం ఉపాధి పొందిన వారు, చిన్న వ్యాపారులు వంటి వర్గాలకు ఇది అత్యవసరం.
ప్రీమియం ఎలా నిర్ణయిస్తారు? How is the Premium Determined?
వయసు, ఆరోగ్య పరిస్థితి, ఆదాయం, పాలసీ గడువు , ఈ అంశాల ఆధారంగా కంపెనీలు ప్రీమియం ఫిక్స్ చేస్తాయి. యువకులు చిన్న వయసులో తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. ప్రీమియం తక్కువగా ఉందని మాత్రమే కాకుండా, క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోను కూడా పరిశీలించాలి. కుటుంబ అవసరాలకు సరిపోయే కవరేజ్ ఎంచుకోవడం చాలా ముఖ్యం.
మార్కెట్లో ప్రధాన కంపెనీలు..Leading Companies in the Market
ఎల్‌ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్, టాటా ఏఐఏ, మ్యాక్స్ లైఫ్, పీఎన్బీ మెటలైఫ్ వంటి సంస్థలు వివిధ రకాల టర్మ్ ప్లాన్లు అందిస్తున్నాయి.
టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాంటే… When to Take Term Insurance
25–35 సంవత్సరాల మధ్య టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మేలు. ఈ వయసులో అయితే ప్రీమియం తక్కువగా ఉంటుంది. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ పొందవచ్చు. ఆరోగ్య పరిస్థితులు సజీవంగా ఉంటే పాలసీ నెగోటియేషన్ సులభమవుతుంది. ప్రీ-ఎగ్జిస్టింగ్ పరిస్థితులు రీజెక్ట్ చేయబడవు. స్థిర జీతం లేకపోయినా, కుటుంబ భద్రత కోసం టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. గృహ రుణాలు లేదా ఇతర అప్పులు ఉన్నవారు ముందుగానే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం తక్షణం అవసరం. పాలసీదారు మరణం తర్వాత కుటుంబం అప్పుల నుంచి విముక్తి పొందుతుంది.
క్లెయిం సెటిల్మెంట్ రేషియో..Claim Settlement Ratio
బీమా అంటే నమ్మకం! కానీ ఆ నమ్మకం నిలబడాలంటే కంపెనీ క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంతో కీలకం. కస్టమర్ మరణం తర్వాత కుటుంబానికి బీమా సొమ్ము సమయానికి అందించగలదా లేదా? అనేది ఆ రేషియో ద్వారా తెలుస్తుంది. అందుకే పాలసీ తీసుకునే ముందు ఈ అంశాన్ని తప్పనిసరిగా పరిశీలించాలంటున్నారు నిపుణులు. ఒక బీమా కంపెనీకి సంవత్సరంలో వచ్చిన మొత్తం క్లెయిమ్‌లలో ఎంత శాతం క్లెయిమ్‌లు పరిష్కరించబడాయో చూపే సూచీ ఇది. ఉదాహరణకు ఒక కంపెనీకి 1,000 క్లెయిమ్‌లు వచ్చి 980 క్లెయిమ్‌లు చెల్లించిందంటే ఆ కంపెనీ రేషియో 98%. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ప్రభుత్వ రంగ ఎల్‌ఐసీకి అత్యధిక క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఉంది. ప్రైవేట్ కంపెనీల్లో హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, మ్యాక్స్ లైఫ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కూడా బాగానే రాణిస్తున్నాయి.
ఎందుకు ఇది ముఖ్యం? Why Is It Important?
పాలసీ తీసుకునే ముందు కంపెనీ విశ్వసనీయతను అంచనా వేయడానికి , కుటుంబానికి క్లెయిం సమయంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికి క్లెయిం సెటిల్మెంట్ రేషియో ముఖ్యం. ఎక్కువ రేషియో ఉన్న కంపెనీ అంటే కస్టమర్ నమ్మకానికి ప్రతీక.
IRDAI గడువు నియమాలు ..IRDAI Deadline Regulations
పూర్తి డాక్యుమెంట్లు అందిన 30 రోజుల్లో క్లెయిం సెటిల్ చేయాలి.
అదనపు పరిశీలన అవసరమైతే, అది గరిష్టంగా 90 రోజుల్లోపే పూర్తవ్వాలి.
ఈ గడువులు దాటితే కంపెనీ వడ్డీతో పాటు క్లెయిం మొత్తాన్ని చెల్లించాలి.
అవసరమైన డాక్యుమెంట్లు.. Required Documents
క్లెయిం వేయడానికి పాలసీ బాండ్ ఒరిజినల్ కాపీ, మరణ సర్టిఫికేట్, నామినీ ఐడీ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆసుపత్రి/మెడికల్ రిపోర్టులు (అవసరమైతే) అవసరం. IRDAI మార్గదర్శకాల ప్రకారం, కంపెనీ 30 రోజులు దాటితే State Bank of India బ్యాంక్ రేటుకు పైగా 2% వడ్డీతో క్లెయిం మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పాలసీ తీసుకునే సమయంలోనే నామినీ వివరాలు స్పష్టంగా ఇవ్వాలి. ఆన్‌లైన్‌లో అప్‌డేట్ చేసుకుంటే తర్వాత ఇబ్బందులు తక్కువ. క్లెయిం ఆలస్యం అయితే IRDAIకి ఫిర్యాదు చేయవచ్చు
క్లెయిం తిరస్కరణ ఎందుకు? Why Are Claims Rejected?
బీమా తీసుకోవడం ఒక్కటే కాదు — క్లెయిం సమయానికి ఆమోదం పొందడం కూడా అంతే ముఖ్యమైనది. కానీ చాలాసార్లు బీమా కంపెనీలు క్లెయింను తిరస్కరిస్తుంటాయి. కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్న బీమా సొమ్ము ఆలస్యమవడం, తిరస్కరణ రావడం వంటివి ఆర్థికంగా పెద్ద దెబ్బతీస్తాయి. పాలసీ తీసుకునే సమయంలో ఆరోగ్య వివరాలు, వయసు, ఉద్యోగ వివరాలు వంటి విషయాల్లో నిజాయితీగా ఉండాలి. చిన్న అబద్ధం కూడా తర్వాత పెద్ద ఇబ్బంది అవుతుంది. ఉదాహరణకు .. హృద్రోగం ఉన్నా చెప్పకపోవడం, పొగతాగే అలవాటు దాచడం లాంటివి తిరస్కరణకు కారణమవుతాయి. కొంతమంది ప్రీమియం చెల్లింపులు వాయిదా వేస్తారు లేదా పూర్తిగా మర్చిపోతారు. అలాంటి పాలసీలు ల్యాప్స్ అవుతాయి. ల్యాప్స్ పాలసీలకు క్లెయిం ఆమోదం దొరకదు. పాలసీదారుడు మరణించిన తర్వాత క్లెయిం ఎవరికీ ఇవ్వాలో కంపెనీకి స్పష్టంగా ఉండాలి. నామినీ పేరు లేదా సంబంధం తప్పుగా ఉంటే క్లెయిం ప్రాసెస్ ఆలస్యం అవుతుంది, కొన్ని సందర్భాల్లో తిరస్కరించబడుతుంది. మరణ సర్టిఫికేట్, హాస్పిటల్ రికార్డులు, ఐడీ ప్రూఫ్ వీటిలో ఏదైనా మిస్సయితే క్లెయిం ప్రాసెస్ పూర్తవదు. డాక్యుమెంట్స్ క్లియర్‌గా సమర్పించడం అత్యంత ముఖ్యం. కొన్ని టర్మ్ లేదా హెల్త్ పాలసీల్లో ప్రారంభం నుంచి కొన్ని నెలలు లేదా సంవత్సరం వరకు “వెయిటింగ్ పీరియడ్” ఉంటుంది. ఆ కాలంలో మరణిస్తే లేదా వ్యాధి వస్తే క్లెయిం తిరస్కరణకు అవకాశం ఉంది.
టర్మ్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ ప్రభావం..Impact of GST on Term Insurance
టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలకు వర్తించే జీఎస్టీ (GST) పన్నును ఇటీవల కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తొలగించింది.ఇన్సూరెన్స్ సహా వ్యక్తిగత జీవన బీమా ,ఆరోగ్య బీమా పాలసీలపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేసింది. ఇంతకు ముందు ఈ పాలసీలపై 18% జీఎస్టీ ఉండేది. ఉదాహరణకు, ₹10,000 ప్రీమియం ఉన్న పాలసీపై ₹1,800 జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. సంస్థల ద్వారా అందించే గుంపు బీమా పాలసీలపై జీఎస్టీ కొనసాగుతుంది.
ప్రముఖ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు Popular Term Insurance Plans
Tata AIA Sampoorna Raksha Promise
కవర్: ₹25 లక్షల నుండి పరిమితి లేదు
ప్రత్యేకతలు: మొదటి సంవత్సరానికి 18.5% వరకు డిస్కౌంట్, ₹1 కోటి కవరేజ్ నెలకు ₹501 నుండి ప్రారంభం
ICICI Prudential iProtect Smart Plus
కవర్: ₹50 లక్షల నుండి ₹20 కోట్లు
ప్రత్యేకతలు: ₹1 కోటి కవరేజ్ నెలకు ₹432 నుండి ప్రారంభం
HDFC Life Click 2 Supreme
కవర్: ₹10,000 నుండి పరిమితి లేదు
ప్రత్యేకతలు: 65 సంవత్సరాల వయస్సు వరకు ₹50,000 వరకు ప్రీమియం
SBI Life e Shield Next
కవర్: ₹50 లక్షల నుండి పరిమితి లేదు
ప్రత్యేకతలు: సులభమైన ప్రీమియం చెల్లింపు, నమ్మకమైన క్లెయిం సెటిల్మెంట్ రేషియో
Axis Max Life Smart Secure Plus
కవర్: ₹1 కోటి నుండి పరిమితి లేదు
ప్రత్యేకతలు: 99.70% క్లెయిం సెటిల్మెంట్ రేషియో, ₹578 నుండి ప్రారంభ ప్రీమియం
