Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score? FEATURE NEWS
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan! FEATURE NEWS
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic! FEATURE NEWS
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched FEATURE NEWS
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh FEATURE NEWS
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk FEATURE NEWS
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula! FEATURE NEWS
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say? FEATURE NEWS
  • అప్పు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు… చట్టబద్ధ ఆధారాలే మీకు రక్షణ.. Legal Safety in Lending.. Why Proper Documentation Matters FEATURE NEWS
  • బంగారం పై రుణాలకు కొత్త దిశ… మధ్యతరగతికి ఊరట.. A New Direction for Gold Loans… Relief for the Middle Class FEATURE NEWS

సేఫ్టీ, వడ్డీ విషయంలో దీన్ని మించిన స్కీమ్ లేదు! వీపీఎఫ్ గురించి తెలుసుకుందామా! No Scheme Beats VPF in Safety and Returns – Let’s Understand VPF

Posted on 12/02/2026 By admin No Comments on సేఫ్టీ, వడ్డీ విషయంలో దీన్ని మించిన స్కీమ్ లేదు! వీపీఎఫ్ గురించి తెలుసుకుందామా! No Scheme Beats VPF in Safety and Returns – Let’s Understand VPF

“ సంపాదిస్తున్న డబ్బు నిజంగా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా?”.. “రిటైర్మెంట్ వచ్చినప్పుడు ఈ పొదుపులు సరిపోతాయా?”. అని ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు. అయితే చాలామంది ఉద్యోగులు ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ పీపీఎఫ్‌ (PPF), బ్యాంక్‌ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDs), ఇన్సూరెన్స్ పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్ చుట్టూ తిరుగుతుంటారు. ఇవన్నీ తెలిసిన మార్గాలే. భద్రత ఉంది, కొంత వడ్డీ ఉంది, ఒక స్థాయి నమ్మకం ఉంది. కానీ… ఇవన్నీ నిజంగా సంపదను పెంచుతున్నాయా? ద్రవ్యోల్బణాన్ని తట్టుకుంటున్నాయా? పన్నుల భారం లేకుండా నిశ్చింతగా నిద్రపోయే అవకాశం ఇస్తున్నాయా? ఈ ప్రశ్నలకు చాలామందికి “లేదు” అనే సమాధానమే వస్తోంది. అయితే ఉద్యోగులకే ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న ఒక అద్భుతమైన మార్గం ఉంది. అదే వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF). ఇది తెలిసినవాళ్లు చాలా తక్కువ. తెలిసినా వాడుతున్నవాళ్లు ఇంకా తక్కువ. కానీ ఒకసారి దీని అసలు శక్తి అర్థమైతే… “ఇన్ని రోజులు దీన్ని ఎందుకు పట్టించుకోలేదు?” అని అనిపించకమానదు.

ఉద్యోగుల పొదుపుల్లో దాగిన అసలు సమస్య.. The Hidden Problem with Traditional Savings
భారతదేశంలో ఎక్కువ మంది ఉద్యోగులు సంప్రదాయ పొదుపు మార్గాలనే నమ్ముతారు. పీపీఎఫ్‌లో ఖాతా తెరుస్తారు. బ్యాంక్ ఎఫ్‌డీలు వేస్తారు. కొంతమంది ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారు. ఇవి భద్రత ఇచ్చే మార్గాలే అయినప్పటికీ, కాలం మారుతున్న కొద్దీ వీటి లోపాలు బయటపడుతున్నాయి. పీపీఎఫ్‌పై ప్రస్తుతం లభిస్తున్న వడ్డీ సుమారు 7.1 శాతం మాత్రమే. బ్యాంక్ ఎఫ్‌డీలు 6 నుంచి 8 శాతం మధ్య వడ్డీ ఇస్తున్నాయి. ఈ వడ్డీ రేట్లు చూడ్డానికి బాగానే కనిపిస్తాయి. కానీ పన్నులు, ద్రవ్యోల్బణం లెక్కలోకి తీసుకుంటే అసలు నిజం బయటపడుతుంది. మీరు 30 శాతం పన్ను బ్రాకెట్‌లో ఉంటే, బ్యాంక్ ఎఫ్‌డీపై వచ్చే వడ్డీకి భారీగా పన్ను కట్టాల్సి వస్తుంది. అంటే 7 శాతం వడ్డీ చివరకు చేతికి వచ్చే సరికి 5 శాతం కూడా మిగలదు. ఇదంతా ద్రవ్యోల్బణం కంటే తక్కువే. అంటే మీరు డబ్బు దాచుకుంటున్నట్టు అనిపించినా… నిజానికి దాని విలువ క్రమంగా తగ్గిపోతోంది. ఈ సమస్యల‌కు సరళమైన, సురక్షితమైన, శక్తివంతమైన పరిష్కారం VPF.

వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ అంటే…What Is Voluntary Provident Fund (VPF)?
మీరు ఇప్పటికే ఈపీఎఫ్ (EPF) పరిధిలో ఉన్న ఉద్యోగి అయితే, మీ జీతం నుంచి తప్పనిసరిగా కట్ అయ్యే 12 శాతం ఈపీఎఫ్‌కి అదనంగా, మీ ఇష్టపూర్వకంగా మరింత మొత్తాన్ని అదే పీఎఫ్ ఖాతాలో జమ చేయడం. ఇది కొత్త స్కీమ్ కాదు. కొత్త ఖాతా కూడా కాదు. మీకు ఇప్పటికే ఉన్న పీఎఫ్ వ్యవస్థలోనే అదనంగా పొదుపు చేసే అవకాశం. మీ బేసిక్ జీతం + డీఏ (DA)లో 100 శాతం వరకు కూడా మీరు వాలంటరీగా జమ చేయవచ్చు. దీనిపై లభించే వడ్డీ…ఈపీఎఫ్‌కు ఇచ్చే వడ్డీనే. ప్రస్తుతం అది 8.25 శాతం.

8.25 శాతం అంటే ఎందుకు ప్రత్యేకం? Why 8.25% Is a Big Deal
ఈరోజు మార్కెట్లో 8 శాతం వడ్డీ దొరికినా అదృష్టంగా భావించే పరిస్థితి. అందులోనూ పూర్తిగా సురక్షితంగా, ప్రభుత్వ గ్యారెంటీతో వచ్చే వడ్డీ అయితే ఇంకా అరుదు. ఈపీఎఫ్, వీపీఎఫ్ (VPF)రెండింటికీ కేంద్ర ప్రభుత్వ గ్యారెంటీ ఉంటుంది. మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం ఉండదు. షేర్ మార్కెట్ పడిపోయినా… వడ్డీ మాత్రం కచ్చితంగా వస్తుంది. ఇది రిస్క్ తీసుకోలేని ఉద్యోగులకు ఒక పెద్ద వరం.

టాక్స్ విషయంలో అసలైన మ్యాజిక్.. The Real Magic: Tax-Free Returns
వీపీఎఫ్‌(VPF)ను ప్రత్యేకంగా నిలబెట్టే అంశం ఇదే. మీ మొత్తం వార్షిక పీఎఫ్ కాంట్రిబ్యూషన్ (ఈపీఎఫ్ + వీపీఎఫ్ కలిపి) రూ. 2.5 లక్షల లోపు ఉంటే, దానిపై వచ్చే వడ్డీకి ఎలాంటి పన్ను ఉండదు. అంటే… మీరు సంపాదించే 8.25 శాతం వడ్డీ పూర్తిగా మీ జేబులోకే వస్తుంది. ఇది 30 శాతం పన్ను బ్రాకెట్‌లో ఉన్న ఉద్యోగికి ఎంత విలువైనదో అర్థం చేసుకోవాలంటే ఒక పోలిక చూడాలి. బ్యాంక్ ఎఫ్‌డీలో 8.25 శాతం వడ్డీ వచ్చినా, పన్ను కట్టాక చేతికి మిగిలేది సుమారు 5.7 శాతం మాత్రమే. అదే వీపీఎఫ్‌లో అయితే పూర్తి 8.25 శాతం మీకే. అంటే ఇది దాదాపు 12 శాతం బ్యాంక్ ఎఫ్‌డీకి సమానం. ఇంత రాబడిని, ఇంత భద్రతతో, టాక్స్-ఫ్రీగా ఇచ్చే స్కీమ్ ప్రస్తుతం మార్కెట్లో లేదు.

ఎందుకు చాలా మంది VPFని పట్టించుకోరు? Why Is VPF Often Ignored?
వీపీఎఫ్‌ (VPF)గురించి చాలామందికి తెలియదు. తెలిసినా సరైన సమాచారం ఉండదు. బ్యాంకులు దీనిని ప్రొమోట్ చేయవు. ఇన్సూరెన్స్ ఏజెంట్లు చెప్పరు. ఎందుకంటే ఇందులో వారికి కమిషన్ ఉండదు. ఇది పూర్తిగా ఉద్యోగికి మేలు చేసే స్కీమ్. మధ్యవర్తులు లేరు. అందుకే ప్రచారం లేదు. కానీ తెలిసినవాళ్లు మాత్రం దీన్ని అస్సలు మిస్ చేయరు.

VPF ఎలా ప్రారంభించాలి? How to Start VPF Easily
వీపీఎఫ్(VPF) ప్రారంభించడం చాలా సులువు. దీనికోసం మీరు ఎలాంటి కొత్త ఖాతా తెరవాల్సిన అవసరం లేదు. బ్యాంక్‌కి తిరగాల్సిన పనిలేదు. ఆన్‌లైన్ పోర్టల్స్ అవసరం లేదు. మీ కంపెనీలోని హెచ్‌ఆర్ (HR) లేదా పేరోల్ విభాగాన్ని సంప్రదించాలి. మీ జీతం నుంచి ప్రతి నెలా ఎంత మొత్తాన్ని వీపీఎఫ్‌గా కట్ చేయాలనుకుంటున్నారో చెప్పాలి. ఆ మొత్తాన్ని ఆటోమేటిక్‌గా మీ పీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తారు. ఒక్కసారి సెటప్ అయిపోతే… ప్రతి నెలా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉండదు.

రిటైర్మెంట్‌కు బలమైన పునాది.. Building a Powerful Retirement Corpus
వీపీఎఫ్ (VPF)దీర్ఘకాలిక పొదుపు సాధనం. ఇది రోజువారీ అవసరాల కోసం కాదు. భవిష్యత్తు కోసం మాత్ర‌మే. మీరు 25 లేదా 30 ఏళ్ల వయసులో చిన్న మొత్తంతో ప్రారంభించినా, రిటైర్మెంట్ వచ్చేసరికి అది భారీ నిధిగా మారుతుంది. కంపౌండింగ్ శక్తి ఇక్కడే కనిపిస్తుంది. ప్రతి నెలా కొంచెం కొంచెం జమ అయ్యే మొత్తం… సంవత్సరాల పాటు పెరిగి, మీ రిటైర్మెంట్ జీవితానికి గట్టి భరోసా ఇస్తుంది.

లిక్విడిటీ తక్కువే… కానీ అదే ప్లస్.. Low Liquidity – A Blessing in Disguise
వీపీఎఫ్‌(VPF)లో డబ్బు వెంటనే తీసుకునే సౌలభ్యం బ్యాంక్ ఎఫ్‌డీలకంటే తక్కువ. ఇది నిజమే. కానీ దీన్ని లోపంగా కాకుండా, ఒక ప్లస్ పాయింట్‌గా చూడాలి. ఎందుకంటే ఇది మీ డబ్బును అనవసర ఖర్చుల నుంచి కాపాడుతుంది. చిన్న చిన్న అవసరాలకు దీన్ని వాడకుండా అడ్డుకుంటుంది. ఇది నిజంగా అవసరమైన సమయం — రిటైర్మెంట్ కోసం ఉద్దేశించబడింది.

తప్పకుండా VPFను పరిగణనలోకి తీసుకోవాలి? Who Should Definitely Opt for VPF
స్థిరమైన జీతం ఉన్న ఉద్యోగులు. 30 శాతం పన్ను బ్రాకెట్‌లో ఉన్నవారు. రిస్క్ తీసుకోవడం ఇష్టపడని వారు. రిటైర్మెంట్‌ను భద్రంగా ప్లాన్ చేయాలనుకునేవారు. వీళ్లందరికీ వీపీఎఫ్(VPF) ఒక అద్భుతమైన ఆప్షన్.

చివరగా గుర్తుంచుకోవాల్సిన విషయం.. The Bottom Line
వీపీఎఫ్(VPF) హై రిటర్న్స్ స్కీమ్ కాదు. ఇది లాటరీ కాదు. ఇది త్వరగా ధనవంతుల్ని చేసే మార్గం కాదు. కానీ… ఇది నిశ్చితమైనది.సురక్షితమైనది. పన్ను భారం లేనిది. భవిష్యత్తుకు గట్టి పునాది వేసేది. ఉద్యోగులు అస్సలు మిస్ చేయకూడని అరుదైన అవకాశం ఇది. ఏదేమైనా ఈరోజు మీరు తీసుకునే చిన్న నిర్ణయం…రేపు మీ రిటైర్మెంట్ జీవితాన్ని మార్చగలదు.

69
FEATURE NEWS Tags:Building a Powerful Retirement Corpus, How to Start VPF Easily, Low Liquidity – A Blessing in Disguise, The Bottom Line, The Hidden Problem with Traditional Savings, The Real Magic: Tax-Free Returns, What Is Voluntary Provident Fund (VPF)?, Who Should Definitely Opt for VPF, Why 8.25% Is a Big Deal, Why Is VPF Often Ignored?

Post navigation

Previous Post: బ్యాంకుల మిస్‌సెల్లింగ్‌కు బ్రేక్‌.. RBI Puts the Brakes on Bank Mis-selling
Next Post: వ్యక్తిగత రుణం Vs క్రెడిట్ కార్డు లోన్‌.. ఈ రెండింటిలో ఏది మంచిది? Personal Loan vs Credit Card Loan .. Which One Is Better?

Related Posts

  • బడ్జెట్లో రూ. 12.21 లక్షల కోట్లు కేటాయింపు.. పరుగులు పెట్టనున్న భారత ఆర్థిక వ్యవస్థ ..₹12.21 Trillion Allocation in Budget: Indian Economy Set to Accelerate FEATURE NEWS
  • రూపాయి పతనం మధ్య కేంద్రం ధైర్యం.. ఆర్థిక మూలాలు బలంగా ఉన్నాయన్న కేంద్ర మంత్రి.. Amid Rupee Fall, Centre Remains Confident | Minister Says Economic Fundamentals Are Strong FEATURE NEWS
  • స్టార్టప్ ప్రయాణం ఎలా ప్రారంభించాలి? స్టార్టప్‌లు ఎందుకు విఫలమవుతాయి? అసలు కారణాలు ఇవే! How to Start a Successful Startup in India | Real Reasons Why Startups Fail FEATURE NEWS
  • అందుబాటులోకి స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వాట్సాప్ సేవ‌లు.. State Bank of India WhatsApp Services Now Available to Customers FEATURE NEWS
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks FEATURE NEWS
  • గోల్డ్‌ బాండ్స్‌పై బంపర్‌ రిటర్న్స్… ₹1 లక్ష పెట్టుబడికి ₹4.41 లక్షలు! Bumper Returns on Gold Bonds… ₹1 Lakh Investment Grows to ₹4.41 Lakh! FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • SIP vs Lumpsum.. మీకు ఏది సెట్ అవుతుందో ఇప్పుడే తేల్చుకోండి! SIP vs Lumpsum.. Choose What Truly Fits You!
  • ఫోన్‌పే, గూగుల్‌పే ట్రాన్సాక్షన్లు… మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా? Do PhonePe & Google Pay Transactions Affect Your Credit Score?
  • పదేళ్లలో రూ.కోటి… కల కాదు, కచ్చితమైన ప్రణాళికతో సాధ్యమే! ₹1 Crore in 10 Years… Not a Dream, but a Disciplined Plan!
  • మ్యూచువల్‌ ఫండ్లలో కొత్త దిశ… మదుపరులకు మరింత స్పష్టత.. A New Direction for Mutual Funds… More Clarity for Investors
  • సిప్‌లో నష్టాలా? ఆందోళన వద్దు! SIP Losses? Don’t Panic!
  • డిజిటల్ దిశగా ఎల్‌ఐసీ అడుగు… ‘మైఎల్‌ఐసీ’ యాప్ ఆవిష్కరణ.. LIC Takes a Big Digital Leap… ‘MyLIC’ App Launched
  • హోమ్ లోన్‌లో చిన్న త‌ప్పిదం… లక్షల్లో నష్టం! జాగ్రత్త గాలేకపోతే రూ.3 లక్షల వర‌కు లాస్.. A Small Decision in Home Loan… Loss in Lakhs! One Mistake Can Cost You ₹3 Lakh
  • పీఎఫ్ ఖాతాలో చిన్న పొరపాటు… పెద్ద నష్టం! పెన్షన్‌కే ముప్పు.. A Small PF Error… Big Loss! Pension at Risk
  • రోజుకు రూ.411తో కోటీశ్వరుడు కావొచ్చు… పీపీఎఫ్ ‘5+5’ మంత్రం! Become a Crorepati with ₹411 a Day… The PPF ‘5+5’ Formula!
  • గిఫ్ట్‌గా ఇచ్చినా… టాక్స్ తప్పదా? ఆస్తుల బదిలీలపై కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి! Gifting Assets or Selling Them… What Do the New Tax Rules Say?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Direct Equity Drawbacks Eligibility Criteria Equity Mutual Funds How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Which Option Suits Whom? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • ఆరోగ్య బీమా తీసుకునే ముందు ఇవి తప్పనిసరిగా తెలుసుకోండి! Things You Must Know Before Buying Health Insurance! INSURANCE
  • క్రెడిట్ కార్డు లేదా..? ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు ట్రై చేయండి.. get Credit Card with Fixed Deposit FEATURE NEWS
  • మ‌రింత ప‌త‌న‌మైన రూపాయి విలువ ..Rupee Value Declines Further NEWS
  • 2025లో అత్యుత్తమ 3 విలువ ఫండ్లు | వాల్యూ రీసెర్చ్‌ ర్యాంకింగ్స్‌ ప్రకారం Top 3 Best Value Funds of 2025 | As per Value Research Rankings FEATURE NEWS
  • ఇంట్రాడే ట్రేడింగ్ అంటే what is intraday trading MARKET
  • ఒక్క సంతకం… జీవితాంతం భారం? గ్యారెంటర్‌గా మారే ముందు వాస్త‌వాలు తెలుసుకోండి! One Signature… A Lifetime Burden? The Hard Truths Before Becoming a Guarantor FEATURE NEWS
  • ఈ వెబ్‌సైట్లను మిస్ అవ్వొద్దు what are the important websites for stock market news FEATURE NEWS
  • ఈటీఎఫ్ vs ఇండెక్స్ ఫండ్స్ vs స్టాక్స్… ఏది బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్? ETF vs Index Funds vs Stocks… Which is the Best Investment? INVESTMENTS

Copyright © 2026.

Powered by PressBook News Dark theme