సేఫ్టీ, వడ్డీ విషయంలో దీన్ని మించిన స్కీమ్ లేదు! వీపీఎఫ్ గురించి తెలుసుకుందామా! No Scheme Beats VPF in Safety and Returns – Let’s Understand VPF
“ సంపాదిస్తున్న డబ్బు నిజంగా భవిష్యత్తుకు ఉపయోగపడుతుందా?”.. “రిటైర్మెంట్ వచ్చినప్పుడు ఈ పొదుపులు సరిపోతాయా?”. అని ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తుంటారు. అయితే చాలామంది ఉద్యోగులు ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ పీపీఎఫ్ (PPF), బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDs), ఇన్సూరెన్స్ పాలసీలు, మ్యూచువల్ ఫండ్స్ చుట్టూ తిరుగుతుంటారు. ఇవన్నీ తెలిసిన మార్గాలే. భద్రత ఉంది, కొంత వడ్డీ ఉంది, ఒక స్థాయి నమ్మకం ఉంది. కానీ… ఇవన్నీ నిజంగా సంపదను పెంచుతున్నాయా? ద్రవ్యోల్బణాన్ని తట్టుకుంటున్నాయా?…
