షార్ట్ టెర్మ్ హోల్డింగ్, లాంగ్ టెర్మ్ హోల్డింగ్ లో ఏది లాభదాయకం Which is profitable in short term holding and long term holding
సాధారణంగా మనమంతా స్టాక్‌మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ట్రేడర్లు, ఇన్వెస్టర్లుగా ఆలోచిస్తూ ఉంటాం. మార్కెట్ కండిషన్ బట్టి, మూమెంట్‌ను ఆధారంగా చేసుకుని ట్రేడింగ్ నిర్ణయాలు తీసుకుంటాం. కొన్ని స్టాక్‌లను ఇంట్రాడే ట్రేడింగ్‌కోసం, మరి కొన్నింటిని షార్ట్ టెర్మ్ కోసం హోల్డ్ చేస్తాం. కానీ మనకు బాగా నమ్మకం ఉన్న, భవిష్యత్తు ఎదుగుదలకు బలమైన అవకాశాలు ఉన్న కంపెనీలను లాంగ్ టర్మ్ కోసం ఎంచుకుని అందులో ఇన్వెస్ట్ చేస్తాం. అయితే ఈ రకంగా ఆ స్టాక్‌లను ఎలా విభజించుకోవాలి.. ఏ ఏ స్టాక్‌లను షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ కోసం ఎంచుకోవాలి అనే విషయాలను తెలుసుకోవాలంటే ముందుగా కొన్ని విషయాలపై అవగాహన తప్పనిసరిగా ఉండాలి.
ఫండమెంటల్ ఎనాలసిస్ ప్రకారం చూస్తే అసలు ఒక స్టాక్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది.. పీఈ ఎందుకు పెరుగుతుందో అనే విషయాలు చాలా కీలకమైనవి.
ఎలాంటి Stocks short term hold చెయ్యాలి ? ఎలాంటి stocks long term hold చెయ్యాలి ?
ఒక ఫండమెంటల్ ఎనలిస్ట్ కొన్ని కంపెనీలని ఎనాలసిస్ చేసి ఇన్వెస్ట్ మెంట్ చేసినపుడు అతనికి ముందే ఒక వ్యూ ఉంటుంది. ఎందుకు ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నానో, ఎంత వరకు హోల్డ్ చెయ్యాలో అనే విషయంలో కొంత ఆలోచించి నిర్ణయానికి వస్తారు. అవన్నీ రీఎనలైజ్ చేసుకుంటూ హోల్డింగ్ పిరియడ్ లో వెళ్తారు.ఈ హోల్డింగ్ పిరియడ్ ని అనేక విషయాల ఆధారంగా కొన్ని కేటగిరీలుగా విభజిస్తారు
Short term
షార్ట్ టర్మ్ అంటే ఒక సంవత్సరంలో స్టాక్స్ ని అమ్మేస్తే దానిని షార్ట్ టర్మ్ అంటాం. మార్కెట్‌లో వచ్చే స్వల్ప ఒడిదొడుకులను అవకాశంగా తీసుకుని, ట్రేడింగ్ చేసి లాభాలను తీసుకోవడం ఇక్కడ ప్రధాన ఉద్దేశం. ఇక్కడ షార్ట్ టెర్మ్‌లో లాభాలు వస్తాయి కానీ రిస్క్ కూడా ఉంటుంది. అయితే ఇలా షార్ట్ టెర్మ్ లో ట్రేడ్ చేసే వారు చాలా రకాలుగా ఉంటారు. అయితే ఇందులో ఉండే ప్రధాన రకాలు ఓ సారి చూద్దాం.
Seasonal business…
సీజనల్ బిజినెస్ అంటే ఏ సీజన్ తగ్గట్టుగా ఆ సీజన్లో ఉన్న స్టాక్స్ లో ఎంటర్ అయి లాభాలను తీసుకోవడం అనేది ఇక్కడ ఇన్వెస్టర్లు చేసే పని.
ఉదాహరణకి సమ్మర్ వస్తుందని అనగా ఆ వాతావరణ మార్పుల వల్ల ప్రజలు ఎక్కువగా వినియోగించే వస్తువులను తయారు చేసే కంపెనీల స్టాక్‌లను కొనడం వంటివి చేస్తారు. అంటే ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, విద్యుత్ కంపెనీలు వంటివన్నీ వేసవిలో లాభపడే రంగాలే. వేసవి రాగానే కొని మళ్ళీ సమ్మర్ అయిపోతుందని అనేలోపు ఎగ్జిట్ అయిపోతారు. అప్పటి ప్రైస్, అప్పటి ధర, పీఈ రేషియో ఇలా దేనికీ సంబంధం లేకుండా ఎక్కువ ధరకి కొన్నామా అనే విషయాలేవీ పట్టించుకోకుండా సీజన్‌కి తగ్గట్టుగా స్టాక్స్ కొనడం వీళ్ల పని. ఎక్కువమంది ఎంటర్ అయ్యే లోపల ఎంటర్ అవ్వడం, ఎక్కువమంది ఎగ్జిట్ అయ్యే లోపల ఎగ్జిట్ అవ్వాలి అనుకోవడం ఇక్కడ ప్రధాన సూత్రం.
Price impacts…
Raw material, finish goods products ధరల వల్ల కంపెనీల స్టాక్ ప్రైస్ ఇంపాక్ట్ కావచ్చు. కమొడిటీస్, ఎనర్జీస్ లింక్డ్ సెక్టార్స్, ఇండస్ట్రీ లు వీటి వల్ల ఎక్కువ ప్రభావితం అవుతాయి. స్టీల్ సెక్టార్ అయితే ఇరన్ వల్ల, కాపర్ ఇండస్ట్రీస్ అయితే కాపర్ వల్ల… ఇలాంటి వాటి ప్రైస్ ఫాల్ అవుతున్నప్పుడు ఆ ఇండస్ట్రీలో ఉన్న స్టాక్స్ ల మార్జిన్ పెరగవచ్చు.
finish goods
ఫినిష్ ప్రొడక్ట్స్..
ఈ ప్రోడక్ట్స్ ప్రైస్ పెరిగితే ఈ కంపెనీ మార్జిన్స్ కూడా పెరుగుతాయి. ఈ మధ్యన స్టీల్ ఇండస్ట్రీస్ ఫినిష్ ప్రొడక్ట్స్ మీద ప్రైస్ పెంచడంతో ఆ స్టాక్స్ పెరుగుతున్నాయి. ఇలాంటి ఇంపాక్ట్ స్టార్ట్ అవ్వకముందే ఎంటర్ అవ్వడం, ఆ ఇంపాక్ట్ వల్ల మేజర్ అప్రిసియేట్ కి వచ్చింది అన్నప్పుడు ఎగ్జిట్ అవ్వడం. ఇలాంటి స్ట్రాటజీస్ లో మనం చాలా ఖచ్చితంగా ఉండాలి. ఈ పాయింట్ ని బేస్ చేసుకున్నవాళ్ళు మార్కెట్ కి, సెక్టార్ కి చాలా దగ్గరగా ఉండాలి.
New Emerging Sectors…
కొన్ని కంపెనీ షేర్ల ధరలు అనూహ్యంగా ఒక్కసారిగా పెరిగిపోతాయి. ఫండమెంటల్స్, టెక్నికల్ ఎనాలసిస్ ఇలా దేనికీ సంబంధం లేకుండా పెరిగే కంపెనీలను గుర్తించడం కూడా ఒక కళ. ఇవన్నీ ట్రెండ్ ఆధారంగా, న్యూస్ బేస్డ్, సిట్యువేషన్ బేస్డ్ కదిలే స్టాక్‌లు.
రీసెంట్ గా కరోనా వల్ల క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్స్ కి డిమాండ్ పెరిగి ఆ ప్రోడక్ట్స్ లో స్కేలబులిటీ ఉందని చెప్పి మార్కెట్ ఈ స్టాక్స్ కి పాజిటివ్ రేటింగ్ ఇచ్చేసింది.
అప్పటి వరకు తక్కువ రేటులో ఉన్న సెక్టార్ కి డిమాండ్ పెరగడం వల్ల ఆ సెక్టార్ లో ఉన్న స్టాక్స్ కి అప్రీషియేషన్ వచ్చేస్తుంది. చాలామంది ఇన్వెస్టర్స్ ఇలాంటి స్టాక్స్ ని క్యాప్చర్ చేసుకుని ఉంటారు. ఆ కంపెనీ నుంచి న్యూ డెవలప్ మెంట్ ఏమీ రాదు అనుకున్నప్పుడు ఆ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయిపోవడం మంచిది.
మాక్రో ఎకానమీలో ఒక చేంజ్ వల్ల ఏ సెక్టార్ ఇంపాక్ట్ అవుతుంది ? ఏ సెక్టార్ ఎమర్జ్ అవుతుందో తెలుసుకుని ఆ సెక్టార్ లో ఉన్న ఒక కంపెనీ మీద ఇన్వెస్ట్ చేసుకుని అది ఒన్ టైమ్ ఈవెంట్ అయినపుడు ఎక్కువ బై రేటింగ్ ఒక్క స్టాక్ లో వచ్చినపుడు మనం ఎగ్జిట్ అయిపోవడం మంచిది.
కరోనా స్టార్ట్ అవుతున్నప్పుడు కరోనా టెస్టింగ్ కిట్లు, కరోనా రోగులు, డాక్డర్లకు అవసరమయ్యే పరికరాలు, మందులకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. దీంతో ఈ వస్తువులను తయారు చేసే కంపెనీలకూ విపరీతంగా లాభాలు రావడం ప్రారంభమయ్యాయి. అయితే ఈ విషయాన్నిముందుగానే పసిగట్టి ఎవరైతే ఈ కంపెనీల స్టాక్‌లలో ఇన్వెస్ట్ చేస్తారో వారే నిజమైన అనలిస్ట్‌లు. అన్నింటి కంటే ముఖ్యంగా కరోనా ఇంపాక్ట్ తగ్గడం వల్ల కిట్స్ ఉపయోగం కూడా తగ్గింది. ఆల్రెడీ ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చాయి కాబట్టి మనం ఈ స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అయిపోవడం లాభదాయకం. ఈ సీజన్ ముగిసాక్, ఇంకా ఈ స్టాక్‌లలో పెరుగుదల ఉండదు అని గుర్తించ గలిగి ఎగ్జిట్ అవగలిగిన వారు మంచి ప్రాఫిట్ తీసుకోగలుగుతారు.
LONGTERM INVESTMENT
కొన్నిస్టాక్‌లను మనం దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకుంటాం. అలాంటి కంపెనీలు ఎక్కువగా నిత్యావసరాలకు సంబంధించినవై ఉంటాయి. కన్జూమర్స్ ఉన్నంత కాలం ఈ కంపెనీలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మనం దీర్ఘకాలంలో లాభాలను పొందవచ్చు.
ఐటీసీ, టాటా కన్జుమర్ ఈ సిగ్మెంట్స్ కి సంబంధించినవే. మనలాంటి హై గ్రోత్ కంట్రీలో వీటి భవిష్యత్తుకు మంచి అవకాశం ఉంది.
గ్రోత్ అంటే లోవర్ నుంచి మిడిల్ క్లాస్ కి, మిడిల్ క్లాస్ నుంచి హయ్యర్ క్లాస్ కి ఫ్యామిలీస్ గ్రో అవుతూ ఉంటాయి. ఆ గ్రోత్ వల్ల కన్జమ్సన్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ కన్జమ్సన్ లో మాగ్జిమమ్ పోర్షన్‌ని కన్సిస్టెంట్ గా క్యాప్చర్ చేసుకుంటూ రెవెన్యూస్, మార్జిన్స్ పెంచుకుంటూ కొన్ని కంపెనీలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అలాంటి గ్రోత్ వచ్చే కంపెనీస్ లో బిజినెస్ బాగా జరుగుతూ, ఎర్నింగ్స్, స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటాయి. ఇలాంటి వాటిలో ప్రత్యేకించి ఎగ్జిట్ స్ట్రాటజీ ఏమీ ఉండదు. మనకి కావలిసిన రిటర్న్స్ వచ్చినపుడు ఎగ్జిట్ అయిపోవడం లేక ఇంతకంటే మంచి అవకాశం ఉంటే ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి అక్కడికి వెళ్ళడం లాంటివి చేస్తూ ఉండాలి. ఫర్ ఫెక్ట్ ఎగ్జిట్ స్ట్రాటజీ అనేది ఇన్వెస్ట్ మెంట్ లో ఏమీ ఉండదు. మన కాన్ఫిడెన్స్ బట్టి, మార్కెట్ కండిషన్ బట్టి మారుతూ ఉంటుంది.
సాధారణంగా స్టాక్ మార్కెట్‌లో దీర్ఘకాలంలో ఇన్వెస్ట్ చేసే వారు లాభాలు పొందుతారు. కానీ ఇది పూర్తి పరిజ్ఞానం, రిస్క్, ఓపికతో కూడుకున్న వ్యవహారం. అందరూ అంత పక్కాగా టైమింగ్ చేసుకోలేరు. ఇది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారంతా దీర్ఘకాలంలో లాభాల కోసం మ్యూచువల్ ఫండ్స్‌ని ఎంచుకోవడం ఉత్తమ నిర్ణయం అవుతుంది. ఇందులో కూడా సరాసరిగా 12 నుంచి 18 శాతం వరకూ రిటర్న్ పొందవచ్చు. అయితే మ్యూచువల్ ఫండ్స్‌లో ఏవిధంగా ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి ప్లానింగ్ ఉండాలి అనేది తెలుసుకుందాం.
How to enter and exit mutual funds?
మ్యూచువల్ ఫండ్స్ లో ఎంటర్, ఎగ్జిట్ ఎలా.?
ఫ్యూచర్లో మార్కెట్ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడూ తగ్గుతుంది అని చెప్పడం చాలా కష్టం. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మన దేశంలో రెండు రకాలుగా ఉంటారు. ఒకరు మార్కెట్ ని టైమింగ్ చేస్తూ కూర్చుంటారు. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందా అప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుని తీసేద్దామా అని. ఇంకొంతమంది ఇవేవీ పట్టించుకోకుండా మార్కెట్ లో టైమ్ గడుపుతూ ఉంటారు. మార్కెట్ హై లో ఉన్నప్పుడు మనం విత్ డ్రా అయ్యామనుకుందాం. మళ్ళీ మార్కెట్ 10 శాతం డౌన్ అయితే మనం ఎంటర్ అవ్వాలనుకుంటాం. కానీ అలాంటి డౌన్ ను మనం సరిగ్గా గుర్తించలేం. ఒక వేళ 10 శాతం డౌన్ అయినా ఇంకా తగ్గుతుందేమోనని ఎదురుచూస్తూ ఉంటాం. ఈ లోగా మార్కెట్ మళ్లీ రివర్స్ బ్యాక్ అవుతుంది. కాబట్టి మనం ఆ అవకాశాన్ని కోల్పోతాం.
* మార్కెట్ లో టైమింగ్ కోసం చూడకూడదు. రెగ్యులర్ గా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళాలి. అప్ అండ్ డౌన్ లేకుండా స్ట్రైట్ గా ఉంటే మార్కెట్ రిటర్న్ ఇవ్వడం లేదని అర్థం.
* లాంగ్ టర్మ్ లో గ్రోత్ ఉంటుంది. కానీ కరెక్షన్స్ తో కూడిన గ్రోత్ వస్తుంది. ఈ కరెక్షన్స్ లో అప్ అయినా నేను ఎగ్జిట్ అవుతాను, డౌన్ అయినపుడు నేను ఎంటర్ అవుతాను అన్నవారికి రిటర్న్ రాదు.
* మ్యూచువల్ ఫండ్స్ లో ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది. దానికి మనం ఇన్వెస్ట్ చేస్తున్న పర్ పజ్ తెలుసుకోవాలి. మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నామో క్లారిటీ ఉండాలి. దానిని బట్టి ఎగ్జిట్ పాయింట్ డిసైడ్ అవుతుంది.
* మనం ఒక లక్ష్యం పెట్టుకోవాలి. లక్ష్యం పరంగా సెటిల్ చేసుకోవాలి. మనకి ఏ ఇంటర్వెల్స్ లో అమౌంట్ రిక్వైర్ మెంట్ ఉంటుందో మనం గోల్ సెట్ చేసుకోవాలి.
మనం ఎడ్యుకేషన్ కోసం ప్లాన్ చేసుకుంటే జీరో నుంచి గ్రాడ్యుయేషన్ కి మధ్యలో 17 నుంచి 18 సంవత్సరాలు టైమ్ పడుతుంది. ఈ మధ్యలో ప్రజెంట్ వాల్యూ ఎంత అవుతుంది ప్యూచర్ వాల్యూ ఎంతవుతుందో తెలుసుకోవాలి. ఈ 17 సంవత్సరాల్లో ఎడ్యుకేషన్ ఖర్చు ఎంత అవ్వవచ్చు దానికి ఎంత రిక్వైర్ మెంట్ అవుతుంది దానికి మనం ఎంత ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. ఇందులో మార్కెట్ ని చూడాల్సిన అవసరం లేదు.
There are two types of investors in mutual funds
మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు రెండు రకాలు
1. లమ్ సమ్ ఇన్వెస్ట్ మెంట్ LUMSUM INVESTMENT
2.సిస్టమేటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్( సిప్) SIP
* ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు పూర్తిగా మార్కెట్ ని చూడవలిసిన అవసరం లేదు. ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు మార్కెట్ డౌన్ అవుతున్నప్పుడు కూడా నెంబర్ ఆఫ్ యూనిట్ పర్ చేజ్ చేసుకోవచ్చు. దీని వల్ల మంచి రిటర్న్స్ వస్తాయి.
* ఒక వేళ మార్కెట్ లో లమ్ సమ్ ఇన్వెస్ట్ మెంట్ చేయాలనుకున్నవాళ్ళు డైరక్ట్ గా లమ్ సమ్ లో కాకుండా సిస్టమేటిక్ ట్రాన్సఫర్ ప్లాన్ లో చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
* మ్యూచువల్ ఫండ్ లో మనం రూ.500 తో కూడా ఇన్వెస్ట్ మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఎక్కువ అమౌంట్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయాలన్న చెయ్యవచ్చు. మనకి అర్జంట్ రిక్వైర్ మెంట్ కోసం కూడా డబ్బులు తీసుకోవచ్చు.
* మ్యూచువల్ ఫండ్స్ లో ఫ్లెక్సిబులిటీ ఉంటుంది. పూర్తి పారదర్శకతతో ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇన్వెస్ఠ్‌మెంట్ కి రక్షణ కూడా ఉంటుంది.
Leave a Reply