what is the importance of financial knowledge ఫైనాన్సియల్ నాలెడ్జ్ అవసరం ఎంత
ఆర్థిక రంగం అనేది చాలా మందికి అర్థం కాని వ్యవహారం. చిన్నప్పటి నుంచి మన స్కూల్ ఎడ్యుకేషన్‌లో గానీ, కాలేజీ చదువులోగానీ, పుస్తకాలలో గానీ, ఇంటిలోగానీ వీటిగురించి ప్రస్తావన చాలా తక్కువే అని చెప్పాలి. మన నిత్య జీవితంలోనే కాకుండా వ్యక్తిగత, వృత్తి జీవితం కూడా ఆర్థిక విషయాలతోనే ముడి పడి ఉంటుంది. ఇక్కడ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన పరిజ్ఞానం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. కానీ ఈ విషయాల్లో అందరికీ పూర్తి స్థాయి అవగాహన ఉండదు. వీటిని ఎక్కడా, ఎవ్వరూ మనకు నేర్పించరు. ఉన్నత చదువులు అభ్యసించి, గొప్ప ఉద్యోగాల్లో ఉన్న వారు కూడా ఆర్థిక విషయాల పట్ల సంబంధం లేన్నట్టే వ్యవహరిస్తారు. దీనికి కారణం ఫైనాన్సియల్ మేటర్స్ అంటేనే అర్థం కాని విషయంగా భ్రమపడి, వాటిపై ఆసక్తి చూపించకపోవడమే.
కేవలం డబ్బు సంపాదించడం ఒక్కటే మన పని అన్నట్టు చాలా మంది బతుకుతుంటారు. ఆ తర్వాత, దానికి ముందు చేయాల్సినవి, దృష్టి పెట్టాల్సినవి, తెలుసుకోవాల్సిన వాటిని విస్మరిస్తుంటారు. ఇదే అతి పెద్ద తప్పు. దీని వల్లే అనేక మంది ఆర్థిక ఒడుదొడుకులకు లోనై ఇబ్బందులు పడుతుంటారు. డబ్బు సంపాదించడమే కాకుండా పొదుపు చేసుకోవడం, జాగ్రత్త చేసుకోవడం, పెట్టుబడిగా మలుచుకోవడం ఇవన్నీ చాలా కీలకం అని గుర్తించిన రోజు ఆర్థిక ఇబ్బందులు ఉండవు.
ఆర్థిక అవగాహన పెంచుకోవడం ఎలా
How to increase financial awareness
అయితే గతాన్ని తవ్వకుని కూర్చోవడం వల్ల ప్రయోజనం లేదు. అప్పడు మనకు ఎవ్వరూ చెప్పలేదు అని నిందిస్తూ కుర్చుంటే ఎప్పటికీ మనం తెలుసుకోలేం. ఫెయిల్యూర్‌గా మిగిలిపోతాం. ఇప్పడు మనం ఆర్థిక చైతన్యం పొందడం చాలా అవసరం. ఆర్థిక విషయాలను గురించి తెలియజేసే వీడియోలు చూడడం, ఆర్టికల్స్ చదవడం, పేపర్లో వాటికి సంబంధించిన వార్తలు తెలుసుకోవడం, నిపుణులతో అప్పుడప్పుడూ మాట్లాడడం, సెమినార్లు, వెబినార్లు ఉంటే వాటికి హాజరవడం, ఫైనాన్సియల్ విషయల గురించిన పుస్తకాలు చదవడం.. ఇలా నాలెడ్జ్ పెంపొందించడం చాలా అవసరం. అప్పడు మనం ఆర్థిక విషయాలపై అవగాహన పొంది మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాం.
ఈ రోజుల్లో మనకు వచ్చే అనేక సమస్యలకు ప్రధాన కారణం డబ్బే. ఈ డబ్బు వల్ల కలిగే అనేక సమస్యలకు ప్రధానం కారణం ఆర్థిక అవగాహన లేకపోవడమే. సరైన ఆర్థిక ప్రణాళిక లేని వ్యక్తులు అనునిత్యం ఇబ్బందులు పడుతుంటారు. ఆ సమస్యలకు పరిష్కరాలు వెతుక్కోలేని వారికి తిప్పలు తప్పవు.
ఆర్థిక ప్రణాళిక ఆవశ్యకత
Financial planning is essential
ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ప్రధాన విషయం ఆర్థిక ప్రణాళిక కలిగి ఉండడం. ఆర్థిక ప్రణాళిక అనేది ఒక జీవితాన్ని మలుపు తిప్పే అతి ముఖ్యమైన ప్రక్రియ. దీన్ని పక్కాగా రచించి, ఖచ్చితంగా అమలు చేయగలిగితే ఆర్థిక వైఫల్యాల నుంచి తప్పించుకోవడం పెద్ద కష్టం కాదు. దీని ప్రధాన్యాన్ని వీలైనంత తొందరగా గుర్తించి, త్వరగా మొదలుపెడితే అంత త్వరగా విజయం సాధంచగలుగుతాం. అయితే మనమందరం ఈ విషయంలోనే లయ తప్పుతుంటాం. ఒక ప్రణాళిక పెట్టుకోం. ఒక వేళ పెట్టుకున్నా దాన్ని ఖచ్చితంగా అమలు చేయలేం. ఒక వేళ అమలు చేసినా చివరి దాకా కొనసాగించలేం. అందుకే ఈ సమస్యలు జీవితకాలం వెంటుడుతూనే ఉంటాయి.
* చాలా మంది ఆర్థిక ప్రణాళికలు కలిగి ఉన్నప్పటికీ అవి కలిగించే ప్రయోజనాలు శూన్యమనే చెప్పాలి. ఎందుకంటే డబ్బు కోసం జాగ్రత్తలు తీసుకోవాలనే ఆతృతలో వారంతా సరైనది కాకుండా అస్తవ్యస్తమైన అంశాలతో ఆర్థిక ప్రణాళిక రచించుకుని బొక్కబొర్లా పడుతుంటారు. దీని వల్ల వారి శ్రమంతా నిర్వీర్యమైపోతుంది.
* ఎవరైనా ఆర్థిక నిపుణులను సంప్రదించి, మన అవసరాలు, మన ఆదాయం, ఖర్చులు, భవిష్యత్తు అవసరాలు, రిటైర్మెంట్ ప్లాన్.. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకుని సరైన ప్లానింగ్ ను తయారు చేసుకోవాలి. ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పడు జీవితంలో సక్సెస్ అయి ఆర్థిక స్వేచ్ఛను పొందగలుగుతాం. వీటిలో ఏది మిస్ అయినా ప్రయోజనం ఉండదు.
* మనం కొన్ని సార్లు ఆర్థిక సలహాల కోసం వెతుకులాడుతాం. మన ఫ్రెండ్స్, కొలీగ్స్, బంధువులు ఇలా కొంతమంది తెలిసిన వారిని సందేహాలు అడుగుతాం. వారి నుంచి సలహాలు తీసుకుంటాం. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలసిన విషయం ఏమిటంటే వారి కూడా మనలాంటి వారే. వారికుండే ఆర్థిక పరిజ్ఞానం కూడా సుమారుగా మనకున్నంతే. వారు కూడా మనలాంటి విద్యావ్యవస్థలో చదువుకున్నవారే. మనం వారిని అడిగినప్పడు వారు ఏదో ఒకటి నోటికొచ్చిందీ.. లేదా పూర్తిగా తెలియనిది మనకి చెప్పి విజ్ఞాన ప్రదర్శన చేస్తుంటారు. కానీ వారు చెప్పే విషయాన్ని మనం చాలా సీరియస్‌గా తీసుకుని అమలు చేసేస్తుంటాం. దీని వల్ల మనం పూర్తిగా నష్ట పోతాం.
* అరకొర సమాచారంతో మనం తీసుకునే నిర్ణయాలు నిండా ముంచేస్తాయి. అందుకే అనుభవజ్క్షడైన ఫైనాన్సియల్ ప్లానర్‌ను సంప్రదించడం చాలా మేలు. వారి దగ్గర నుంచే మనం పూర్తి సమాచారం పొందడం సాధ్యమవుతుంది. మన ప్లానింగ్ కూడా ప్రయోజనాన్ని కలిగిస్తుంది.
* ఆర్థిక ప్రణాళిక రచించుకుని, అమలు చేసేందుకు సిద్ధమయ్యాక చాలా మంది ఏదో ఒక కష్టం వచ్చిందని చెప్పి ఆ ప్రణాళికను మధ్యలోనే రద్దు చేసుకుంటుంటారు. `మన సంతోషం కన్నా ఏదీ ఎక్కువ కాదు.. ఇప్పుడు ఈ కష్టం ఒడ్డెక్కడం మనకు చాలా ముఖ్యం` అని తమకు తాము సర్దిచెప్పుకుంటారు. ఇలా చేసి మళ్లీ మొదటికొస్తుంటారు. ఇటువంటి వారు కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే. కొంచెం సంయమనం పాటించినట్టయితే ఆ పొరపాటు జరగదు. ఇక్కడ మనం పూర్తి క్రమశిక్షణతో మెలగాలి. ఆర్థిక ప్రణాళికను క్రమశిక్షణతో అమలు చేసినట్టయితే ఫలితం చేకూరుతుంది.
Leave a Reply