what are the problems with small Loan Apps  లోన్ యాప్స్‌తో  సమస్యలు ఏమిటి

ఇటీవ‌ల కాలంలో మైక్రో లోన్ యాప్స్‌కి మంచి డిమాండ్ పెరిగింది. చాలా సింపుల్ ప్రాసెస్ కావ‌డం, మొబైల్ నుంచి అంతా చేయగ‌ల‌గ‌డంతో అంద‌రూ వీటినే ఆశ్ర‌యిస్తున్నారు. దీంతో ప్ర‌జ‌ల్లో విప‌రీత‌మైన ఆద‌ర‌ణ పెరిగింది. అయితే అదే స్థాయిలో వీటితో స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయి. చాలా మంది వీటి వ‌ల్ల ఇబ్బందులు ప‌డుతున్నారు. వీటితో వ‌చ్చే స‌మ‌స్య‌లు ఏమిటీ..? వీటిని మ‌నం ఎలా ఎదుర్కోవాలి? ఈ యాప్స్‌ని మ‌నం ఎలా ఉప‌యోగించుకోవాలి అనే విష‌యం ఓ సారి చూద్దాం.

మైక్రో లోన్స్ లేదా స్మాల్ లోన్ యాప్స్ వాళ్ల వ్యాపార వ్యూ|హం చాలా తెలివిగా, కొంచెం మోస పూరితంగా ఉం టుంది. యుక్తవయసులో ఉన్నవారిని, స్థిరమైన ఆదాయం లేనివారిని అంటే middle income group లో ఉన్నవారిని వీళ్లు ఎంచుకుంటారు. ఈ వర్గాల వారి క్రెడిట్ హిస్టరీ కొంచెం బ్యాడ్ గా ఉంటుంది. కాబ‌ట్టి బ్యాంకింగ్ సెక్టార్ లో, నాన్ బ్యాంకింగ్ సెక్టార్ లో ఉన్నవారు ఈ క్రెడిట్ హిస్ట‌రీని చూసి వారికి లోన్స్ ఇవ్వరు. ఇలాంటివారంతా స్మాల్ లోన్ యాప్స్‌కి ఎక్కువ‌గా వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈజీగా పర్సనల్ లోన్స్ లభిస్తాయి.

టైర్ 1 సిటీ నుంచి దాదాపుగా 47 శాతం మంది ఈ లోన్స్ వాడితే, 35 శాతం మంది టైర్ 2 సిటీ నుంచి ఈ యాప్స్ ద్వారా లోన్స్ తీసుకుంటున్నారు. టైర్ 3, టైర్ 4 నుంచి 18 శాతం మంది ఈ యాప్స్ మీద ఆధారపడుతున్నారు. ఇంతమంది ఈ యాప్స్‌ పై ఎందుకు ఆధారపడుతున్నారంటే ఒక స్మార్ట్ ఫోన్ ఉండి, అందులో ఇంటర్ నెట్ బ్యాలెన్స్ ఉంటే సరిపోతుంది క‌నుక‌. మనం ఇటువంటి యాప్స్ ని డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత మనకి కావలిసిన లోన్‌కు సంబంధించి ఆన్ లైన్లో అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. మనం డీటైల్స్ నింపి, డాక్యుమెంట్స్ అప్ లోడ్ చేసిన తర్వాత అప్రూవల్ చాలా తొందరగా వస్తుంది. చాలా తక్కువ సమయంలో మనకి కావలిసిన ఫండ్స్ వస్తాయి. అందువలన చిన్న చిన్న అవ‌స‌రాల‌కు కూడా ఈ యాప్స్ ద్వారా లోన్ తీసుకోవచ్చు కదా అని మనం భావిస్తాం. ఇదే ఈ లోన్ యాప్‌ల‌కు వ్యాపారం.. ఆదాయం.

లోన్ యాప్స్ ఎలా మ‌న‌ల్ని ఆక‌ర్షిస్తున్నాయి 

How loan apps attract us

క్రెడిట్ హిస్టరీ కొంచెం బ్యాడ్ గా ఉండే వారు సాధారణంగా ఒక బ్యాంకు కి వెళ్ళి పర్సనల్ లోన్ తీసుకోవాలంటే అంత సులువుగా అయ్యే ప‌ని కాదు. పోనీ ఎంతో ప్ర‌య‌త్నిస్తే 7 నుంచి 15 శాతం మధ్యలో వడ్డీ ఉంటుంది. మైక్రో ఫైనాన్స్ కంపెనీలో మనం లోన్ తీసుకోవాలంటే 22-25 శాతం వరకూ వడ్డీ ఉంటుంది. కానీ ఇటువంటి మొబైల్ యాప్స్ లో రుణం తీసుకుంటే మనకి చార్జ్ చేసే వడ్డీ రేటు సుమారు 60 శాతం నుంచి 100 శాతం వరకూ ఉంటుంది. మనం ఏదైతే లోన్ తీసుకుంటున్నామో లోన్ తో పాటు అంత ఎక్కువ వడ్డీ చెల్లించవలిసి ఉంటుంది. ఈ లోన్ యాప్స్ వాళ్ళు మనకి ఇచ్చిన టెన్యూర్ వారం నుంచి 15 రోజుల‌ మధ్యలో ఉంటుంది.

లోన్ యాప్స్ మ‌న‌ల్ని ట్రాప్ చేస్తున్నాయి

Loan apps are trapping us

* మ‌న దగ్గర స్థిరమైన ఆదాయం లేనపుడు మనకి వాళ్ళే లోన్ ఇస్తామని చెప్తారు. ఎక్కువ అమౌంట్ ఇచ్చి, దానికి తక్కువ సమయంలో తిరిగి చెల్లించాల‌ని చెప్తారు.
* ఇలాంటి స‌మ‌యంలో లోన్ ను త్వ‌ర‌గా చెల్లించేందుకు చాలా ఒత్తిడికి లోనవ్వవలిసి ఉంటుంది.
* అయితే మనం ఎప్పుడైతే లోన్‌ను స‌కాలంలో చెల్లించ‌లేమో ఈ యాప్స్ వాళ్ళు illegal recovery methodను ఫాలో అవుతున్నారు. అంటే మన కాంటాక్ట్ నంబ‌రు ద్వారా మ‌నల్ని బ్లాక్ మెయిల్ చెయ్యడం, టార్చర్ చెయ్యడం వంటివి చేస్తారు. దానిని భ‌రించ‌లేని చాలా మంది ఇటువంటి వాటి వ‌ల్ల‌ చావు అంచుల వరకు వెళుతున్నారు.
* ఇక్కడ వీళ్ళు టెక్నాలజీ వాడుతూ, క‌స్ట‌మ‌ర్స్ ని టార్గెట్ చేస్తూ, వాళ్ల డేటాని ఉప‌యోగించుకుని వేధింపులకు గురి చేస్తున్నారు.
* వీటితో పాటు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ను, ఫొటోల‌ను తీసుకుని , వాటిని మార్ఫ్‌ చేసి మ‌న‌ కాంటాక్ట్ లిస్ట్ అంద‌రికీ మ‌న గురించి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తారు.
* ఇలాంటి త‌ప్పుడు ప‌నుల‌ను అరికట్టడం కోసం మన ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటోంది. కాకపోతే Cash Now.. pay later వంటి టెక్నిక్స్ వాడుతూ స్మాల్ లోన్ యాప్స్ ఇంకా ప్లే స్టోర్‌లో ఉంటున్నాయి.

* వీళ్ళు ముందుగా digital advertising, chat messengers, bulk sms రూపంలో మ‌న‌కు లింక్‌లు పంపిస్తారు. వీటి మీద మ‌నం క్లిక్ చేయ‌గానే వాళ్లు మ‌న‌కి డ‌బ్బులు పంపించి ట్రాప్ చెయ్య‌డం మొద‌లు పెడ‌తారు.
* మనం ఈ ట్రాప్ లో పడిపోవడం కంటే మనల్ని మనం ప్రొటక్ట్ చేసుకుంటూ, వీళ్ల నుంచి జాగ్ర‌త్త‌గా ఉండ‌డం మంచిది.
* ఒక లోన్ యాప్ కి మనం వెళ్ళడానికి ముందు ఏఏ విషయాలు చెక్ చేసుకోవాలి అనే దానిపై ఎక్కువ‌గా శ్ర‌ద్ధ పెట్టాలి.
* Save them india foundation అనే నాన్ గవర్నమెంట్ సంస్థ సైబర్ క్రైమ్ మీద చేసిన‌ రీసెర్చ్ ద్వారా తెలిసిన విష‌య‌మేమిటంటే కోవిడ్ నుంచి ఈ ఆన్ లైన్ పోర్టల్ ద్వారా రుణాలు ఇచ్చే యాప్స్ మీద కంపైంట్స్ పెరుగుతునే ఉన్నాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ 2023 లో రోజుకు దాదాపు 23 కంప్లైంట్స్ వచ్చాయి. అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు రిజిస్టర్ చేసే ధైర్యం సరిపోక పోవడం వల్ల అన్ రిజిస్టర్ కేసుల సంఖ్య ఎక్కువవుతోంది.

లోన్ యాప్స్‌కి, బ్యాంకు లోన్స్ కి తేడా ఏమిటి

What is the difference between loan apps and bank loans?

బ్యాంక్స్, ఫైనాన్షియల్ ఇన్ స్ట్యూట్ లో లోన్ తీసుకోవడానికి, ఇటువంటి మొబైల్ యాప్స్ లో లోన్‌ తీసుకోవడానికి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి.
* లోన్ యాప్ ఉప‌యోగించేట‌ప్పుడు ఆన్ లైన్లోనే అంతా జరిగిపోతుంది. కొన్ని స్టెప్స్ ఫాలో అయి డాక్యుమెంట్స్ ఇస్తే పర్సనల్ లోన్ ఇచ్చేస్తారు. అదే మనం బ్యాంక్స్ లేదా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియ‌ల్ ఆర్గ‌నైజేషన్ లో లోన్ తీసుకోవాలంటే బ్యాంక్ ను సందర్శించి, పేపర్ వర్క్ చేసి కావలిసినవన్నీ ఇస్తేనే ప్రోసెసింగ్ స్టార్ట్ చేస్తారు. మ‌ళ్లీ మ‌ళ్లీ తిర‌గ‌వ‌ల‌సి ఉంటుంది. వెరిఫికేష‌న్ కోసం చాలా వ‌ర్క్ చేయాల్సి ఉంటుంది.
* లోన్ యాప్స్ లో చిన్న చిన్న రుణాలను చేబ‌దులుగా ఇస్తారు. చిన్న అవ‌స‌రాల‌కు స‌రిప‌డా డ‌బ్బులు దొరుకుతాయి. కానీ బ్యాంక్స్ లో ఎక్కువ అమౌంట్ లోన్ గా ఇవ్వడానికి ప్ర‌యత్నిస్తారు.
* లోన్ యాప్ లో 62 శాతం వడ్డీ రేటు ఉంటుంది. అదే బ్యాంక్స్ లో అయితే వడ్డీరేటు 7 నుంచి 15 శాతం మాత్ర‌మే ఉంటుంది.
* రీపేమెంట్ పిరియడ్ లోన్ యాప్ లో చాలా తక్కువ ఉంటుంది. బ్యాంక్స్ లో ఫ్లెక్సిబులిటీతో పాటు ఎక్కువ సమయం తీసుకుని రుణం తిరిగి చెల్లించ‌వ‌చ్చు.
* రికవరీ ప్రాసెస్ అనేది లోన్ యాప్ లో illegal method లో ఉంటుంది. బ్యాంకుల్లో లీగల్ గా ప్రొసీడ్ అవుతారు.
* లోన్ యాప్ లో అప్రూవల్ వెంటనే లభిస్తుంది. డబ్బులు వెంటనే మన అకౌంట్లో ప‌డ‌తాయి. అదే బ్యాంక్స్ లో అయితే అప్రూవల్ చాలా లేట్ గా వస్తుంది. అందుకే ఈ లోన్ యాప్ కి చాలామంది ఎడిక్ట్ అయిపోతారు.
* లోన్ యాప్స్ లో రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంది. అదే బ్యాంక్స్ లో అయితే రిస్క్ ఉండదు. సెక్యూర్ గా ఉంటుంది.

How to stay safe from loan apps

* ముందుగా లోన్ తీసుకోవాలనుకున్నపుడు ఆ కంపెనీకి ఫిజికల్ అడ్రస్ ఉందా లేదా అని వెబ్ సైట్లో చెక్ చేసుకోవాలి.
* మనం తీసుకున్న‌ లోన్ యాప్ ఆర్బీఐ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది ఆర్బీఐ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలి.
*మనం ఒక ప్రోడక్ట్ తీసుకునేముందు దానిని ఇది వర‌కే ఉపయోగించిన వాళ్లు త‌మ అనుభవాలను మ‌న‌కు షేర్ చేస్తారు. వాటిని మ‌నం ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలి. ఇక్క‌డ ఆన్ లైన్ రివ్యూ రేటింగ్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది.
* ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసేట‌ప్పుడు పర్సనల్ డేటా అడిగి, మ‌న మొబైల్ గేలరీకి, మన కాంటాక్ట్స్ కి యాక్సిస్ చేస్తున్నారు. అవసరం లేకుండా మన డేటాను అడుగుతున్నారంటే అప్పుడే మనం చాలా అప్రమత్తంగా ఉండాలి.
* మనం ఏదైతే వెబ్ సైట్ లో లోన్‌ తీసుకుని పర్సనల్ డేటాను ఎంటర్ చేస్తున్నామో అది సెక్యూర్డ్ కాదా, అవునా అని చెక్ చేసుకోవాలి.
* బ్యాంక్ లోన్స్ లో ఎక్కువ డాక్యుమెంటేషన్, ఎక్కువ సమయం పడుతుందంటే మైక్రో ఫైనాన్స్ ఇన్ స్టిట్యూషన్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ వ‌ద్ద‌కు వెళ్ళి లోన్స్ తీసుకోవచ్చు. అక్కడ వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా ఉండొచ్చు. కానీ అక్క‌డ‌ ఆర్బీఐ రెగ్యులేషన్ ఉంటుంది. కాబట్టి సేప్టీ పరంగా, రిస్క్ పరంగా చూసుకుంటే చాలా మంచిది.
* మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆ సంస్థలో కొన్ని పాలసీలు ఉంటాయి. ఇలాంటి వాటిలో లోన్స్ తీసుకుంటే ఆ డిడక్షన్ మన శాలరీలో కట్ అవుతుంది.
*క్రెడిట్ యూనియన్ అండ్ కోపరేటివ్స్‌.. కొంతమంది కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్, కోపరేటివ్ సొసైటీని నిర్మించుకుని, వాళ్ల‌లో వాళ్ల‌కి లోన్స్‌ ఇస్తుంటారు. వాటిని మ‌నం ఉప‌యోగించుకోవ‌చ్చు.
* గవర్నమెంట్ కూడా కొన్ని ప్రత్యేక సంద‌ర్భంలో లోన్స్ ఇస్తుంటుంది. ప్రధానమంత్రి ముద్ర యోజన అంటే చిన్న బిజినెస్ స్టార్ట్ చేసేవారికి గవర్నమెంట్ లోన్ ఇస్తుంది. ఇలా చాలా రకాల సంక్షేమ పథకాలను ప్ర‌భుత్వం అందిస్తుంది. ఈ రూపంలో కూడా మనం లోన్స్ తీసుకోవ‌చ్చు.

Author photo
Publication date:
Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *