UPI చెల్లింపుల సౌలభ్యం – తెలియకుండానే పెరుగుతున్న ఖర్చులు.. UPI Payments and Hidden Spending.. How Convenience Is Changing Personal Finance
ఒకప్పుడు జేబులో నగదు లేకపోతే కొనుగోలు చేయడం కష్టంగా ఉండేది. బ్యాంకుకు వెళ్లి డబ్బు తీసుకోవాలి. చిల్లర కోసం వెతకాలి. సరిపడా నోట్లు లేకపోతే కొనుగోలును వాయిదా వేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. చిన్న టీ స్టాల్ నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు అన్నిచోట్లా UPI చెల్లింపులు అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ ఇండియాలో అత్యంత వేగంగా ఎదిగిన చెల్లింపు విధానాల్లో UPI ఒకటి. కేవలం QR…
