ఆన్‌లైన్ చెల్లింపులా.. కాస్త జాగ్రత్త.. రుసుముల మోత తప్పదు! Online Payments? Stay Alert… Hidden Charges Can Hit Hard!
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ (Online Payments) ఎంత వేగంగా విస్తరిస్తోందో, అదే స్థాయిలో వినియోగదారులను మోసం చేసే పద్ధతులు కూడా పెరుగుతున్నాయి. ఒకప్పుడు బ్యాంకు క్యూల్లో నిలబడి బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు మొబైల్ ఫోన్‌లో ఒక్క క్లిక్‌తోనే విద్యుత్ బిల్లు నుంచి షాపింగ్ వరకు అన్నీ పూర్తవుతున్నాయి. యూపీఐ, మొబైల్ వాలెట్లు, ఫిన్‌టెక్ యాప్‌లు, ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు ప్రజల జీవితంలో విడదీయరాని భాగంగా మారాయి. గ్రామాల్లో కూరగాయల దుకాణం దగ్గర నుంచి…
