ఆరోగ్య భద్రతకు కొత్త దారి: ‘ఎన్‌పీఎస్ స్వస్థ్య’.. NPS Swasthya.. A New Dimension to Retirement Planning
దేశంలో పెరుగుతున్న వైద్య ఖర్చులు ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా సవాలు చేస్తున్నాయి. ఒకప్పుడు రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే కేవలం పెన్షన్ కోసం పొదుపు చేయడం మాత్రమే. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. వృద్ధాప్యంలో వచ్చే ఆరోగ్య సమస్యలు, ఆసుపత్రి ఖర్చులు, దీర్ఘకాలిక చికిత్సలు.. ఇవన్నీ కలిపి సాధారణ పొదుపులను సైతం ఖాళీ చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే Pension Fund Regulatory and Development Authority ఒక వినూత్న పథకాన్ని ముందుకు తీసుకొచ్చింది. అదే ‘ఎన్‌పీఎస్…
