గోల్డ్ బాండ్స్ లాభాల వర్షం.. కానీ ఆందోళన కలిగిస్తున్న పన్ను నిబంధనలు!! Gold Bonds Rain Profits.. But Tax Rules Raise Concerns!!
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం కాదు.. భద్రత. తరతరాలుగా “పసిడి”ని సంపదకు ప్రతీకగా భావించే మన దేశంలో, బంగారం పెట్టుబడులపై ఆకర్షణ ఎప్పటికీ తగ్గదు. కాలం మారుతున్నకొద్దీ బంగారం కొనుగోలు రూపాలు మారాయి. ఒకప్పుడు ఇంట్లో బిస్కెట్లు, నాణేలు, నగల రూపంలో నిల్వ చేసుకునే వారు.. ఇప్పుడు డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్‌లు, సార్వభౌమ పసిడి బాండ్లు (ఎస్‌జీబీలు) వంటి ఆధునిక పెట్టుబడి మార్గాలవైపు అడుగులు వేస్తున్నారు. ఈ మార్పులో అత్యంత విజయవంతమైన పెట్టుబడి సాధనంగా…
