ప్రతి పెట్టుబడికీ ఒక లక్ష్యం ఉండాలి. ఇందుకోసం దీర్ఘకాలిక వ్యూహంతో ముందుకెళ్లాలి. ఎంచుకున్న పథకంలో అనుకున్న మొత్తం జమయ్యేదాకా వేచి చూడాలి. చిన్న చిన్న అవసరాల కోసం దీర్ఘకాలిక పెట్టుబడులను వెనక్కి తీసుకోకుండా జాగ్రత్త పడాలి. ఆశించిన మొత్తం సమకూరిన వెంటనే సదరు మ్యూచువల్ ఫండ్ నుంచి మీ పెట్టుబడులను వెనక్కి తీసుకోవాలి. ఇలా చేస్తే కచ్చితంగా మంచి లాభాలు పొందే అవకాశం ఉంటుంది.
మ్యూచువల్ ఫండ్స్‌ని సెలెక్ఠ్ చేసుకునే ముందు మన అవసరాలను తగ్గట్టు, మన ఆలోచనలకు అనుగుణంగా ఉన్న వాటిని ఎంపిక చేసుకుని అటువంటి వాటితో ఒక పోర్ట్‌ఫోలియోని ఏర్పాటు చేసుకోవాలి. అయితే దీనిని డైవర్సిఫైడ్ గా ఉండేటట్టు చూసుకోవాలి
మంచి ఆదాయం పొందేందుకు రకరకాల మార్గాలు ఉన్నాయి. మంచి ఫండ్స్‌లలో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే అదిరిపోయే లాభాలు పొందవచ్చు. అయితే మంచి లాభాలు పొందేందుకు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇందులో మంచి రాబడి ఇచ్చే పథకాలను ఎంచుకుంటే లక్షాధికారి కావచ్చు. ఇందులో స్మాల్ క్యాప్ ఫండ్స్, మిడ్, లార్జ్ క్యాప్, కాంట్రా, ఇండెక్స్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్.. ఇలా చాలా రకాల మ్యూచువల్ ఫండ్లు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ స్టాక్స్ నుంచి రిటర్న్స్ కూడా విభిన్నంగా ఉంటాయి. స్టాక్ మార్కెట్లతో లింక్ అయి ఉంటుంది కాబట్టి రిస్క్ కూడా ఉంటుంది. అయితే దీర్ఘకాలంలో మన పెట్టుబడులపై మాత్రం మంచి రాబడిని ఆశించవచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. కానీ దాదాపు 51 శాతం మంది కేవలం ఒక్క ఏడాదిలోపే తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. మరో 29 శాతం మదుపరులు మాత్రమే తమ పెట్టుబడిని రెండేళ్లకు మించి కొనసాగిస్తున్నారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
మ్యూచువల్ ఫండ్ అంటే కళ్ళు మూసుకొని చేసేది కాదు. ఏది పెడితే అది పిక్ చేస్తే డబ్బులు రావు. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టేముందు అనేక విషయాలను మనం పరిశీలించాలి. సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. ఒకప్పుడు యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ చాలా బాగుండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థతిలేదు. ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్ ని మనం ఐడెంటిఫై చేసేటప్పుడు ఎకనామిక్ సిట్యువేషన్ ను అర్థం చేసుకోవాలి. మనం పెట్టే ప్రతి రూపాయి స్టాక్ మార్కెట్ లోకే వెళ్తుంది. దాదాపుగా 2000 పై పెచ్చు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి . ఈ 2000 మ్యూచువల్ ఫండ్స్ లో మనం ఏది సెలెక్ట్ చేస్తున్నామన్నదే ముఖ్యం. మనం ఎదగాలి అని అంటే మార్కెట్ ఎంత ఇవ్వగలుగుతుందో అంత తీసుకోవాలి. మార్కెట్ యావరేజెస్ ని బీట్ చేయాలి. అది బీట్ చేయాలంటే డెఫినెట్ గా కొంత రీసెర్చ్ వర్క్ చేయాల్సిందే. ఏ సెక్టార్ మీద ఏయే మ్యూచువల్ ఫండ్స్ వెయిటేజెస్ ఇస్తున్నాయన్నది కూడా పరిగణలోకి తీసుకోవాలి.
మంచి లాభాలు పొందాలంటే
how to get good profits in mutual funds
కొన్ని మ్యూచువల్ ఫండ్లలో నష్టభయం కాస్త తక్కువగా ఉంటుంది. మరికొన్నింటిలో నష్టభయం కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే వీటిలో రిస్కు, రాబడి రెండూ తక్కువగానే ఉంటాయి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే వీటిలో రిస్క్, రివార్డ్ రెండూ ఎక్కువగానే ఉంటాయి. నష్టభయం ఎక్కువగా ఉన్న చోట, దీర్ఘకాలంలో మంచి లాభాలు వస్తాయి. అందుకే స్వల్ప నష్టభయం ఉన్న పథకాల్లో కనీసం 6 నెలల నుంచి 3 ఏళ్ల వరకూ పెట్టుబడులను కొనసాగించాలి. అదే నష్టభయం ఎక్కువగా ఉన్న పథకాల్లో కనీసం 3 ఏళ్ల నుంచి 5 ఏళ్ల వరకు పెట్టుబడులను కొనసాగించాలి. అప్పుడే మార్కెట్ అస్థిరతలను తట్టుకుని, మంచి లాభాలు పొందేందుకు వీలవుతుంది.మీరు కనీసం మూడేళ్ల పాటు పెట్టుబడులను కొనసాగించాలనుకుంటే.. ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు(ఈఎల్‌ఎస్‌ఎస్) లేదా క్లోజ్డ్ ఎండెడ్ ఫండ్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈఎల్‌ఎస్‌ఎస్‌లకు మూడేళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. క్లోజ్డ్ ఎండెడ్ పథకాలకు సాధారణంగా 3 ఏళ్లు నుంచి 5 ఏళ్ల వరకు లాకిన్ పీరియడ్ ఉంటుంది. తొందరపాటుతో పెట్టుబడులను వెనక్కు తీసుకోకుండా ఇవి అడ్డుకుంటాయి.
Different taxes
మ్యూచువల్ ఫండ్ పథకాలను స్థూలంగా డెట్, ఈక్విటీలుగా వర్గీకరించవచ్చు. వీటిపై వచ్చే లాభాలపై పన్నులు వేర్వేరుగా ఉంటాయి. వాస్తవానికి నిర్ణీత డెట్ ఫండ్ల నుంచి వచ్చిన లాభాలను మీ వ్యక్తిగత ఆదాయంలో భాగంగా కలిపి చూపించి, అందుకు వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లపై వచ్చిన లాభాలను ఒక ఏడాదిలోపు స్వీకరిస్తే ఆ మొత్తంపై 15 శాతం వరకు స్వల్పకాలిక మూలధన రాబడి పన్ను చెల్లించాలి. ఏడాదికి మించి పెట్టుబడులు కొనసాగించినప్పుడు దానిపై వచ్చిన లాభాలను దీర్ఘకాలిక మూలధన రాబడిగా పరిగణిస్తారు. అప్పుడు ఏడాదికి రూ.1,00,000కు మించి వచ్చిన లాభాలపై 10 శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
How To Avoid Exit Load In Mutual Fund
మ్యూచువల్ ఫండ్‌లో ఎగ్జిట్ లోడ్ ఎలా తగ్గించుకోవాలి
కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌లోని పెట్టుబడులను నిర్ణీత వ్యవధి కంటే ముందే ఉపసంహరించుకున్నప్పుడు అమ్మకపు రుసుము(ఎగ్జిట్ లోడ్) చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు కొన్ని మ్యూచువల్ ఫండ్లు పెట్టుబడి పెట్టిన తేదీ నుంచి ఒక ఏడాదిలోపు యూనిట్లను విక్రయిస్తే.. 1 శాతం వరకు రుసుమును వసూలు చేస్తాయి. వాస్తవానికి రిడీమ్ చేసిన యూనిట్ల విలువ ఆధారంగా (ఎగ్జిట్ లోడ్) రుసుము వసూలు చేస్తాయి. ఇలాంటి అనవసర వ్యయాలు జరగకుండా ఉండాలంటే.. లాకిన్ పీరియడ్ ముగిసే వరకైనా పెట్టుబడులను కొనసాగించడం మంచిది.
తొందరపాటు నిర్ణయాలు తగవు
Hasty decisions are not good
చాలా మంది తాము ఇన్వెస్ట్ చేసిన ఫండ్ పనితీరు బాగా లేనప్పుడు పెట్టుబడులు వెనక్కి తీసుకోవాలని అనుకుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు. స్టాక్ మార్కెట్ సూచీలు కుదుటపడ్డాక ఇవి వేగంగా కోలుకుంటాయనే విషయాన్ని గ్రహించాలి. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. దీర్ఘకాలంలో ఫండ్ పనితీరు ఎలా ఉందో పరిశీలించాలి. అదే విభాగంలోని ఇతర మ్యూచువల్ ఫండ్లతో పోల్చి చూసుకోవాలి. ఒక వేళ మీరు పెట్టుబడి పెట్టిన మ్యూచువల్ ఫండ్ పనితీరు ఏ మాత్రం బాగా లేకపోతే అప్పుడు మాత్రమే దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేయాలి. ఒక వేళ ప్రామాణిక సూచీలకు అనుగుణంగానే రాబడిని అందిస్తుంటే మరి కొంత కాలం పెట్టుబడులను కొనసాగించాలి.
Systematic Investment Plans (SIP)
క్రమబద్ధమైన పెట్టుబడి ప్రణాళికలు
మ్యూచువల్ ఫండ్స్ అనగానే మనకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ (SIP) గుర్తొస్తాయి. ఒక క్రమపద్ధతిలో మదుపు చేస్తూ.. దీర్ఘకాలంలో మంచి కార్పస్ పొందాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ . సిప్ విధానంలో మనకు నచ్చినంత, వీలైనంత సొమ్మును మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. మనకు అవసరమైనప్పుడు విత్‌డ్రా కూడా చేసుకోవచ్చు. అందుకే చాలా మంది SIP విధానాన్ని ఎంచుకుంటారు. ఇందులో ఫ్రీడమ్ సిప్ వల్ల అనేక ప్రయోజనాలు పొందొచ్చు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ముందుగా ఒక నిర్దిష్ట కాలవ్యవధిని ఫిక్స్ చేసుకోవాలి. ఉదాహరణకు 8 ఏళ్లు/10 ఏళ్లు/ 12 ఏళ్లు /15 ఏళ్లు.. ఇలా ఒక నిర్దిష్ట కాలవ్యవధిని ఎంచుకోవాలి. ఈ సమయంలో మీరు ఒక పద్ధతి ప్రకారం, నిర్దిష్ట మొత్తాలను మదుపు చేస్తూ ఉండాలి. మీరు అనుకున్న టెన్యూర్ పూర్తి అయిన తరువాత మీకు పెద్ద మొత్తంలో డబ్బులు వస్తాయి. ఇదే SIP విధానం. ఇక్కడ గుర్తించుకోవాల్సిన అంశం ఏమిటంటే.. SIP చేస్తున్నంత కాలం మీరు కట్టిన డబ్బులు సోర్స్ ప్లాన్‌లో ఉంటాయి. సిప్ టెన్యూర్ పూర్తి అయ్యి.. SWP ప్రారంభం అయిన తరువాత.. ఆ డబ్బులు మీరు కోరుకున్న టార్గెట్ ప్లాన్‌లో జమ అవుతాయి. అయితే సోర్స్, టార్గెట్ స్కీములు రెండూ ఒక్కటే అయ్యుండడానికి వీలుపడదు.
– మ్యూచువల్ ఫండ్ టెన్యూర్ పూర్తైన తరువాత మీరు ఒకేసారి లప్సమ్ అమౌంట్‌ను తీసుకోకుండా.. మ్యూచువల్ ఫండ్ డబ్బులను అలాగే ఉంచుతారు. అయితే మీ అవసరాలకు అనుగుణంగా నెలవారీగా నిర్దిష్ట మొత్తాన్ని విత్‌డ్రా చేసుకుంటారు. దీనినే సిస్టమాటిక్ విత్‌డ్రావల్ ప్లాన్ అంటారు. మిగిలిన డబ్బులను ఒక టార్గెట్ స్కీమ్‌లో మరలా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ డబ్బుపై మరలా రాబడి వస్తుంది. అంటే మీ డబ్బులే తిరిగి మీకు డబ్బులను సృష్టిస్తూ ఉంటాయన్నమాట.
ఉదాహరణకు మీరు 8 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ.10,000 పెట్టుబడి పెట్టారని అనుకుందాం. ఈ టెన్యూర్ అయిన తరువాత, మీరు నెలవారీగా రూ.10,000 చొప్పున SWP చేసుకోవచ్చు. ఒక వేళ మీ సిప్ టెన్యూర్‌ను 10 ఏళ్ల వరకు పొడిగిస్తే.. మీ నెలవారీ SWP మొత్తం రూ. 15,000కు పెరుగుతుంది. ఇదే ఫార్ములాను 30 ఏళ్ల వరకు కొనసాగిస్తే మీకు ప్రతి నెలా రూ.1.20 లక్షలు వరకు అందుతుంది. వాస్తవానికి ఇక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్ పనిచేసింది. అందుకే కాల వ్యవధి పెరుగిన కొద్దీ మీ ఆదాయం పెరుగుతూ వస్తుంది.