- ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ ప్రయోజనాలు.. LIC Jeevan Utsav benefits
హైదరాబాద్ః భారతీయ జీవిత బీమా సంస్థ(LIC) పెట్టుబడిదారుల కోసం ఒక సరికొత్త, ఆకర్షణీయమైన స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్(LIC Jeevan Utsav – Plan 871). ఈ ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే, ఇందులో మీరు ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం ప్రీమియంలు కట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఒకే ఒక్కసారి డబ్బులు డిపాజిట్ చేస్తే చాలు… జీవితాంతం (100 ఏళ్ల వయస్సు వచ్చే వరకు) మీకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది. ఇది పూర్తిగా సింగిల్ ప్రీమియం, నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్ ప్లాన్ (Non-Linked, Non-Participating). అంటే, మీరు పెట్టే పెట్టుబడికి షేర్ మార్కెట్ హెచ్చుతగ్గులతో ఎలాంటి సంబంధం ఉండదు. అలాగే ఎల్ఐసీ లాభ నష్టాలతో సంబంధం లేకుండా, పాలసీ తీసుకునేటప్పుడే మీకు ఎంత ఆదాయం వస్తుందో ముందే గ్యారంటీగా చెప్తారు.
ఈ పాలసీ తీసుకోవడానికి అర్హతలు..
ఈ ప్లాన్ చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ ఉపయోగపడేలా రూపొందించారు. 30 రోజులు నిండిన చిన్న పిల్లల పేరు మీద కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. 65 ఏళ్ల వయస్సు ఉన్న వారు కూడా ఇందులో చేరడానికి అర్హులు.
కనీసం రూ. 5,00,000 (5 లక్షలు) బీమా మొత్తానికి పాలసీ తీసుకోవాలి. గరిష్ఠ పరిమితి లేదు, మీ స్తోమతను బట్టి ఎంతైనా పెంచుకోవచ్చు.
అదనపు ప్రయోజనం: గ్యారంటీడ్ అడిషన్స్ (Guaranteed Additions)
ఈ పాలసీలో మీరు ఎంచుకున్న కాలపరిమితిని (Guaranteed Addition Period) బట్టి ప్రతి సంవత్సరం మీ ఖాతాలో అదనపు డబ్బు జమవుతుంది. ప్రతి రూ. 1,000 బీమా మొత్తానికి ఏటా రూ. 40 చొప్పున గ్యారంటీగా యాడ్ అవుతుంది.\
ఇక్కడ ఆదాయం పొందేందుకు మీకు రెండు అద్భుతమైన ఆప్షన్లు ఉంటాయి. పాలసీ తీసుకునే సమయంలో మీ అవసరాలకు తగ్గట్టుగా ఈ రెండు ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు:
1. రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ (Regular Income Benefit)
ఈ ఆప్షన్ ఎంచుకుంటే, మీ సేవింగ్స్ కాలపరిమితి (7 నుండి 17 సంవత్సరాలు) ముగిసిన తర్వాత… ప్రతి సంవత్సరం మీ Sum Assured లో 10% డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో నేరుగా జమవుతాయి. ఉదాహరణకు, మీరు రూ. 10 లక్షల బీమా మొత్తం ఎంచుకుంటే, ఏటా రూ. 1 లక్ష చొప్పున జీవితాంతం వస్తూనే ఉంటుంది.
2. ఫ్లెక్సీ ఇన్కమ్ బెనిఫిట్ (Flexi Income Benefit)
మీకు ప్రతి సంవత్సరం డబ్బులు వద్దు, అవసరమైనప్పుడే తీసుకుంటాం అనుకుంటే ఈ ఆప్షన్ బెస్ట్. మీకు రావాల్సిన 10% వార్షిక ఆదాయాన్ని ఎల్ఐసీ వద్దే ఉంచేయవచ్చు. అలా ఉంచిన మొత్తంపై ఎల్ఐసీ మీకు 5.5% Compound Interest (వార్షిక చక్రవడ్డీ) చెల్లిస్తుంది. మీకు ఎప్పుడు డబ్బు అవసరమైతే అప్పుడు జమ అయిన మొత్తంలో నుండి 75% వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు.
ఒకవేళ పాలసీదారుడు మరణిస్తే??
పాలసీ నడుస్తున్న సమయంలో పాలసీదారుడు ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మరణిస్తే, నామినీకి పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందుతుంది. పాలసీ మొత్తంతో (Sum Assured) పాటు అప్పటివరకు జమ అయిన Guaranteed Additions కలిపి నామినీకి అందజేస్తారు. అదనపు రక్షణ కోసం ఈ పాలసీతో పాటు Accident Death and Disability Benefit Rider , New Term Assurance Rider లను కూడా జోడించుకోవచ్చు. దీనికోసం కొద్దిగా అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
సులభమైన ఉదాహరణతో అర్థం చేసుకుందాం..
రాజు వయస్సు: 35 సంవత్సరాలు
బీమా మొత్తం (Sum Assured): రూ. 10,000,000 (10 లక్షలు)
ప్రీమియం చెల్లింపు కాలం: 10 సంవత్సరాలు (గ్యారంటీడ్ అడిషన్ పీరియడ్)
సింగిల్ ప్రీమియం (ఒక్కసారి కట్టేది): రూ. 8,08,650
పాలసీ ఎలా పనిచేస్తుందంటే:
35 ఏళ్ల వ్యక్తి కేవలం ఒక్కసారి రూ. 8,08,650 చెల్లించి ఈ పాలసీ తీసుకుంటారు. ఆయనకు 45 ఏళ్లు వచ్చేసరికి 10 ఏళ్ల వెయిటింగ్ పీరియడ్ పూర్తవుతుంది. ఆ తర్వాత 46వ ఏట (పాలసీ 11వ సంవత్సరం) నుండి ప్రతి సంవత్సరం రూ. 1,00,000 (ఒక లక్ష) చొప్పున ఆయనకు 100 ఏళ్ల వయస్సు వచ్చేవరకు జీవితాంతం ఆదాయం వస్తూనే ఉంటుంది.
మధ్యలో 10 ఏళ్ల పాటు ఏటా రూ. 40,000 చొప్పున గ్యారంటీడ్ అడిషన్స్ కూడా తోడవుతాయి. ఒకవేళ పాలసీ మధ్యలో పాలసీదారుడు మరణిస్తే, నామినీకి రూ. 14,22,063 డెత్ బెనిఫిట్ రూపంలో అందుతుంది. ఒకవేళ ఫ్లెక్సీ ఇన్కమ్ ఆప్షన్ ఎంచుకుంటే, ఆ డబ్బుపై 5.5% వడ్డీ కూడా లభిస్తుంది. మంచి రిస్క్ కవరేజ్‌తో పాటు, జీవితాంతం గ్యారంటీగా ఒక స్థిరమైన పెన్షన్ లాంటి ఆదాయం కోరుకునే వారికి ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ (LIC Jeevan Utsav )ఒక చక్కని ఎంపికగా చెప్పవచ్చు.
-స్రవంతి అతికం
ఇన్సూరెన్స్ అడ్వైజర్
9440012834
