How are the risk and returns in large mid and small cap companies లార్జ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీల్లో రిస్క్ రిటర్న్ ఎలా ఉంటాయి
Large cap, mid cap, small cap companies వాటిలో రిస్క్, రిటర్న్స్ ఎలా ఉంటాయో కూడా మనం తెలుసుకుందాం
మ్యూచువల్ ఫండ్స్ భవిష్యత్తులో మంచి రాబడిని సంపాదించడానికి డబ్బును ఆదా చేయడానికి మరియు పెట్టుబడి పెట్టడానికి ఉత్తమ మార్గాల్లో ఒకటి. మార్కెట్ క్యాపిటలైజేషన్, రిస్క్ ఆధారంగా అనేక మ్యూచువల్ ఫండ్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఇందులో లార్జ్-క్యాప్ ఫండ్స్, మిడ్-క్యాప్ ఫండ్స్, బ్లూ చిప్ ఫండ్స్.. ఇలా చాలా రకాలు ఉంటాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏమిటో అర్థం చేసుకుందాం.
కంపెనీ వాటాదారులకు చెందిన అన్ని షేర్ల మార్కెట్ విలువను మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. ఒక షేరు యొక్క ప్రస్తుత మార్కెట్ ధరతో కంపెనీ యొక్క మొత్తం షేర్ల సంఖ్యను గుణించడం ద్వారా మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను లెక్కించగలుగుతాం. కంపెనీ విలువ స్టాక్ మార్కెట్ ద్వారా నిర్ణయించబడుతుంది.
లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీలు అంటే ఏమిటి..? వాటి మధ్య తేడా ఏమిటి?What are large cap, mid cap, small cap companies.. What is the difference between them
SEBI (సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) కంపెనీలను వాటి మార్కెట్ క్యాప్ ప్రకారం వర్గీకరించడానికి 2017లో కొన్ని నిబంధనలను ఏర్పాటు చేసింది.
Large cap funds
కంపెనీలను వర్గీకరించడానికి సెబీ ప్రమాణాలను అభివృద్ధి చేసింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా స్టాక్ మార్కెట్‌లో జాబితా చేయబడిన టాప్ 100 కంపెనీలను లార్జ్ క్యాప్ కంపెనీలుగా వర్గీకరించారు. ఇలాంటి లార్జ్ క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే మ్యూచువల్ ఫండ్‌లను ‘లార్జ్-క్యాప్ ఫండ్స్ ‘ అంటారు.
Mid cap funds
SEBI 2017 సంవత్సరంలో ఒక నియమాన్ని ఏర్పాటు చేసింది, దీని ప్రకారం మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 101 నుంచి 250 వరకు ఉన్న కంపెనీలను మిడ్-క్యాప్ కంపెనీలు అంటారు. ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ దాదాపు రూ.5000 నుంచి రూ.20000 కోట్ల వరకు ఉంటుంది. ఇలాంటి మిడ్-క్యాప్ కంపెనీలను కలిగి ఉన్న మ్యూచువల్ ఫండ్‌లను ‘ మిడ్-క్యాప్ ఫండ్స్ ‘ అంటారు .
Small cap funds
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 251 వ స్థానం నుంచి ర్యాంక్ పొందిన కంపెనీలను స్మాల్ క్యాప్ కంపెనీలు అంటారు. ఈ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.5000 కోట్ల లోపే ఉంది. ఇలాంటి స్మాల్ క్యాప్ స్టాక్‌లను కలిగి ఉండే మ్యూచువల్ ఫండ్‌లను ‘ స్మాల్-క్యాప్ ఫండ్స్ ‘ అంటారు.
how much risk in Large cap companies
లార్జ్ క్యాప్ ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎక్కువగా ఉండవు. అలాగని మరీ తక్కువ ఉండవు. మాగ్జిమమ్ 12-15 శాతం రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇందులో రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది.
- ఇందులో liquidity చూసినట్లయితే… ఇందులో అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అందువల్ల మార్కెట్ ప్రభావం వీటిపై పడదు.
- Volatility చూసినట్లయితే ఇందులో మరీ అంత ఎక్కువగా ఉండదు. అంటే షేర్ ప్రైస్ కదలికల్లో భారీ వ్యత్యాసం ఉండదు. వాలటాలిటీ, రిస్క్ అనేది వేరు వేరు విషయాలు. ఇక్కడ ధరల వాలటాలిటీ పెరగడం, తగ్గడం కొంత మధ్యస్తంగా ఉంటుంది. పెరిగినపుడు మరీ ఎక్కువగా పెరగవు. మార్కెట్ పడినపుడు కూడా తక్కువ కరెక్షన్ జరుగుతుంది. అందుకే ఇక్కడ వాలటాలిటీ తక్కువ.
how much risk in Midcap companies
మనం ఈ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసే అమౌంట్లో 65 శాతం మిడ్ క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయవలిసి ఉంటుంది. మిగిలిన అమౌంట్ లార్జ్ క్యాప్ లో లేదా స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు.
- Returns ఇందులో లార్జ్ క్యాప్ కంపెనీల్లో కంటే రిటర్న్స్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇందులో మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా ఎక్కువగానే ఉంటుంది.
- Liquidity చూసినట్లయితే ఇందులో అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు. కాబట్టి లిక్విడిటీ కూడా బాగానే ఉంటుంది.
- Volatility చూసినట్లయితే మిడ్ క్యాప్ కంపెనీల్లో లార్జ్ క్యాప్ కంపెనీల కంటే ఎక్కువగానే ఉంటుంది.
how much risk in Small cap companies
ప్రస్తుతం మంచి డిమాండ్ ఉన్న సెక్షన్ ఇదే. పైన చెప్పిన లార్జ్, మిడ్ క్యాప్ కంపెనీల తర్వాత మిగిలిన లిస్టెడ్ చిన్న చిన్న కంపెనీలు అన్నీస్మాల్ క్యాప్‌లోకి వస్తాయి. చాలామంది స్మాల్ క్యాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే ఇవి ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి. మనం బాగా స్టడీ చేసి ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి వెల్త్ క్రియేట్ చేసే అవకాశం స్మాల్ క్యాప్ కంపెనీల్లో ఎక్కువ ఉంటుంది.
స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ లో మనం పెట్టే అమౌంట్ లో 65 శాతం స్మాల్ క్యాప్ ఫండ్స్ లో పెట్టాలి. మిగిలిన 35 శాతం లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.
- Returns… ఇందులో మనం బాగా స్టడీ చేసి ఇన్వెస్ట్ చేసినట్లయితే రిటర్న్స్ ఎక్కువుగా వస్తాయి. అలాగే రిస్క్ కూడా ఎక్కువుగా ఉంటుంది. మార్కెట్ పడినపుడు నిఫ్టీ లాంటి ఇండెక్స్ 20 లేదా30శాతం పడినట్లయితే స్మాల్ క్యాప్ కంపెనీస్ 50, 60శాతం పడే అవకాశం ఉంటుంది.
- Liquidity చూసినట్లయితే ఇందులో అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు కూడా తక్కువుగాఉంటారు. కాబట్టి లిక్విడిటీ తక్కువగా ఉంటుంది.
- Volatility చూసినట్లయితే నిఫ్టీ 20శాతం వాలటాలిటీ పెరిగితే స్మాల్ క్యాప్ ఫండ్స్ 40, 50 శాతం పెరగవచ్చు. వాలటాలిటీ ఇందులో ఎక్కువగా ఉంటుంది.
అందువలన నిఫ్టీలో లిస్ట్ అయిన కంపెనీలు 7500 ఉన్నప్పటికి నిఫ్టీ 500 ఇండెక్స్ తీసుకున్నట్లయితే ఇది టోటల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో 96 శాతం రిప్రజంట్ చేస్తుంది.
లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీస్ గత 17 సంవత్సరాల్లో ఇచ్చిన రిటర్న్స్ ఇలా
The returns given by large, mid and small cap companies in the last 17 years are as follows
లార్జ్ క్యాప్ ఇండెక్స్ చూసినట్టయితే..
2005 ఏప్రిల్ 5 న మనం లార్జ్ క్యాప్ లో రూ.1లక్ష ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇప్పుడు అది రూ.9 లక్షల 90వేలు అయ్యింది. అదే మనం sip లో మనం రూ.10వేలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు అది రూ.66 లక్షల 59వేలు అయ్యింది.
మిడ్ క్యాప్ ఇండెక్స్ చూసినట్లయితే..
మనం 2005 సంవత్సరంలో మిడ్ క్యాప్ ఇండెక్స్ లో మనం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అది రూ.12 లక్షలు అయ్యి ఉండేది. ఇవి లార్జ్ క్యాప్ కంటే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చింది.
అదే sip లో మనం రూ.10 వేలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు రూ.87 లక్షలు రిటర్న్స్ వచ్చేది.
స్మాల్ క్యాప్ ఇండెక్స్ చూసినట్లయితే ..
మనం 2005 సంవత్సరంలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో మనం రూ.1లక్ష ఇన్వెస్ట్ చేస్తే దాని రిటర్న్స్ రూ.1లక్ష పైనే ఉన్నాయి. ఇది లార్జ్ క్యాప్ కంటే ఎక్కువ, మిడ్ క్యాప్ కంటే తక్కువ వచ్చి ఉంది.
అదే sip లో మనం రూ.10 వేలు ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు రూ.68 లక్షలు రిటర్న్స్ వచ్చేది.
Leave a Reply