Skip to content
  • Home
  • FEATURE NEWS
  • MARKET
  • FINICAL PLANNING
  • MUTUAL FUNDS
  • INSURANCE
  • MONEY TIPS
  • INVESTMENTS
  • BOOKS

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble FEATURE NEWS
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships FEATURE NEWS
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored? FEATURE NEWS
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment FEATURE NEWS
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions FEATURE NEWS
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too? FEATURE NEWS
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade FEATURE NEWS
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success! FEATURE NEWS
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click! FEATURE NEWS
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit? FEATURE NEWS

రిస్క్ ఉన్నా మంచి రాబ‌డి అందించే పెట్టుబ‌డులు ఏమిటో తెలుసా? High-Risk, High-Return Investment Options

Posted on 21/10/2025 By admin No Comments on రిస్క్ ఉన్నా మంచి రాబ‌డి అందించే పెట్టుబ‌డులు ఏమిటో తెలుసా? High-Risk, High-Return Investment Options

పెట్టుబడి అంటే తప్పనిసరిగా రిస్క్‌ ఉంటుంది. కానీ అన్ని పెట్టుబడులూ ఒకే స్థాయి రిస్క్‌ కలిగి ఉండవు. కొన్నింటిలో లాభం తక్కువైనా, భద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ వర్గం పెట్టుబడులు ఎక్కువగా రిస్క్‌ను క‌లిగి ఉంటాయి. తక్కువ రాబడిని అందిస్తాయి. మ‌రోవైపు బ్యాంకు వ‌డ్డీరేట్లు కూడా త‌గ్గిపోవ‌డంతో పెట్టుబడిదారులు అధిక రాబడి ఇచ్చే మార్గాలవైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఎక్కువ రాబడి వస్తే రిస్క్ కూడా తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రిస్క్ లేకుండా రిటర్న్ ఉండదు అన్న నానుడి పెట్టుబడుల్లో సరిగ్గా సరిపోతుంది. రిస్క్ ఉన్నా.. బలమైన ఫండమెంటల్స్‌ ఉన్న పెట్టుబడులు దీర్ఘకాలంలో మంచి లాభాలకే దారితీస్తాయి. పెట్టుబడిదారులు తమ రిస్క్‌ బేరింగ్‌ కెపాసిటీని అంచనా వేసుకుని ముందుకు వెళ్లడం ఉత్త‌మం.

స్టాక్ మార్కెట్ ..Stock Market

నేరుగా షేర్లలో పెట్టుబడి పెట్టడం వ‌ల్ల రిస్క్ ఎక్కువ‌గా ఉన్నా.. దీర్ఘకాలంలో మంచి లాభాలు వ‌స్తాయి. బలమైన కంపెనీల ఫండమెంటల్స్‌ చూసి, 5–10 ఏళ్ల దృష్టితో పెట్టుబడి పెడితే డివిడెండ్లు, క్యాపిటల్‌ గెయిన్స్‌ రూపంలో మంచి రాబడి దక్కవచ్చు. కానీ తక్షణ మార్పులతో భయపడకుండా ఉండటం ముఖ్యం.

ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు..Equity Mutual Funds

నేరుగా షేర్లను కొనలేని వారికి ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు ఉత్తమ ఎంపిక. ఇక్కడ ప్రొఫెషనల్‌ ఫండ్‌ మేనేజర్లు పెట్టుబడులను నిర్వహిస్తారు. మార్కెట్‌ రిస్క్‌ ఉన్నా, దీర్ఘకాలంలో (7–10 ఏళ్లు) బ్యాంకు వడ్డీల కంటే రెట్టింపు లాభాలు పొందే అవకాశం ఉంది. ఫ్లెక్సీ క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఫండ్లు ఎక్కువ రిస్క్‌తోపాటు ఎక్కువ రాబడిని ఇచ్చే వర్గాల్లో ఉంటాయి.

రియల్‌ ఎస్టేట్ ..Real Estate

ప్రాపర్టీల ధరలు స్థిరంగా పెరుగుతున్న నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులు కూడా రాబడికి మంచి మార్గం. అయితే లిక్విడిటీ తక్కువగా ఉండటంతో వెంటనే డబ్బు కావాలంటే అమ్మడం కష్టం. సరిగ్గా స్థలం, ప్రాజెక్ట్‌ ఎంపిక చేస్తే 5–10 ఏళ్లలో బలమైన లాభాలు సాధ్యమే.

గోల్డ్‌ ETFలు, సిల్వర్‌ ఫండ్లు .. Gold ETFs and Silver Funds

బంగారం, వెండి వంటి విలువైన లోహాల్లో పెట్టుబడి రిస్క్‌ను తగ్గించే మార్గం అయినప్పటికీ.. ధరల ఊగిసలాట ఎక్కువగా ఉంటుంది. ETFల రూపంలో పెట్టుబడి పెడితే భద్రతతో పాటు సులభ లిక్విడిటీ కూడా లభిస్తుంది.

క్రిప్టో కరెన్సీలు ..Cryptocurrencies

నేటి తరానికి ఆకర్షణీయంగా కనిపిస్తున్న క్రిప్టో పెట్టుబడులు చాలా ఎక్కువ రిస్క్‌ కలిగినవే. నియంత్రణలు లేకపోవడం వల్ల ఏ సమయంలోనైనా విలువలు కుప్పకూలే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా చిన్న భాగం (5–10%) మాత్రమే ఇక్కడ పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

రిస్క్ త‌క్కువ‌గా ఉండే ప‌థ‌కాలు.. Low-Risk Investment Options

భద్రత కోరేవారికి PPF, NSC, FD, డెబ్ట్‌ ఫండ్లు వంటి పథకాలు ఉత్తమం. రిస్క్‌ తక్కువగా ఉండి, లాభం స్థిరంగా వస్తుంది. పెట్టుబడిదారులు తమ అవసరాలకు తగ్గట్టుగా మిశ్రమ పెట్టుబడి చేయడం మంచిది .

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (PPF)

సాధారణ ప్రజల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన దీర్ఘకాలిక పెట్టుబడి పథకం ఇది. ప్రభుత్వ హామీతో ఇది వస్తుంది కాబట్టి భద్రత గ్యారంటీ. ప్రస్తుతం 7%కు పైగా వార్షిక వడ్డీ లభిస్తోంది. 15 ఏళ్ల లాక్‌ఇన్‌ ఉన్నా, ట్యాక్స్‌ మినహాయింపు (80C) కారణంగా ఇది ఉత్తమ పెట్టుబడిగా పరిగణించబడుతోంది.

నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికేట్‌ (NSC)

పోస్టాఫీస్‌ ద్వారా అందించే మరో నమ్మదగిన పథకం ఇది. ఐదు సంవత్సరాల వ్యవధి కలిగి ఉంటుంది. రాబడి స్థిరంగా ఉండటమే కాకుండా, ఏటా వడ్డీ కూడా తిరిగి reinvest అవుతుంది. రిస్క్‌ తక్కువగా ఉండటంతో రిటైర్డ్‌ ఉద్యోగులు, సీనియర్‌ సిటిజన్లకు అనుకూలం.

రికరింగ్‌ డిపాజిట్లు (RD)

నెలనెలా చిన్న మొత్తంలో పొదుపు చేసే వారికి ఇది సరైన మార్గం. బ్యాంకులు, పోస్టాఫీసులు రెండింటిలో అందుబాటులో ఉంటుంది. వడ్డీ రేటు స్థిరంగా ఉంటుంది. తక్కువ రిస్క్‌, గ్యారంటీడ్‌ రిటర్న్స్‌తో మోస్తరు రాబడి కోరేవారికి అనువైన ఎంపిక.

డెబ్ట్‌ మ్యూచువల్‌ ఫండ్లు Debt Mutual Funds

ఈ ఫండ్లు ప్రధానంగా ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్‌ డెబ్ట్‌ పేపర్లలో పెట్టుబడి పెడతాయి. ఈక్విటీ ఫండ్లకన్నా రిస్క్‌ తక్కువగా ఉంటుంది. లిక్విడిటీ కూడా ఎక్కువ. షార్ట్‌టర్మ్‌, మల్టీ అసెట్‌, బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లు ఈ వర్గంలోకి వస్తాయి.

బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు (FDs)

అత్యంత సురక్షిత పెట్టుబడులలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. రాబడి పరంగా పెద్ద లాభం లేకపోయినా, ప్రధాన పెట్టుబడి భద్రంగా ఉంటుంది. సీనియర్‌ సిటిజన్లకు అదనపు వడ్డీ కూడా లభిస్తుంది.

పోస్ట్‌ ఆఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ (MIS)

ప్రతినెలా స్థిరమైన ఆదాయం కోరేవారికి ఇది అద్భుతమైన పథకం. పెట్టుబడి చేసిన మొత్తంపై నెలనెలా వడ్డీ అందుతుంది. సీనియర్‌ సిటిజన్లకు వడ్డీ మరింత ఉంటుంది.

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (SCSS)

రిటైర్డ్‌ ఉద్యోగులకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ పథకం ద్వారా భద్రతతో పాటు 8%కు పైగా వడ్డీ లభిస్తోంది. ప్రభుత్వ హామీ ఉన్నందున పూర్తి నమ్మకం కలిగించే పెట్టుబడి ఇది.

ఐపీఓ .. (Initial Public Offering)

స్టాక్‌ మార్కెట్‌లో కొత్త ఉత్సాహం నింపుతున్న పదం “ఐపీఓ” (Initial Public Offering). ఒక కొత్త కంపెనీ మొదటిసారి తన షేర్లను ప్రజలకు విక్రయించే ప్రక్రియ ఇదే. కొద్ది నెలలుగా ఈ ఐపీఓలపై పెట్టుబడిదారుల్లో గట్టి ఆసక్తి నెలకొంది. మంచి లిస్టింగ్‌ గెయిన్స్‌ వస్తాయనే ఆశతో చిన్నా,పెద్దా పెట్టుబడిదారులు ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నారు. తాజాగా కొందరు ఐపీఓలు లిస్టింగ్‌ రోజునే 40–50% వరకు లాభాలు ఇచ్చాయి. దీంతో పెట్టుబడిదారులు వీటిని “త్వరిత లాభాల” మార్గంగా చూస్తున్నారు. అయితే ప్రతి ఐపీఓ లాభాన్నే ఇస్తుందనే భ్రమలో పడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంపెనీ ఫండమెంటల్స్‌, వాల్యుయేషన్‌, మార్కెట్‌ పరిస్థితులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. బ్యాంకు లేదా బ్రోకరేజ్‌ యాప్‌ల ద్వారా ASBA (Application Supported by Blocked Amount) విధానంలో దరఖాస్తు చేయవచ్చు. డీమాట్‌ అకౌంట్‌ తప్పనిసరి. షేర్‌ అలాట్మెంట్‌ అయితే మాత్రమే డబ్బు డెబిట్‌ అవుతుంది. లేకపోతే తిరిగి రిలీజ్‌ అవుతుంది. ఐపీఓ పెట్టుబడులు రిస్క్‌ లేని మార్గం కావు. కొన్నిసార్లు లిస్టింగ్‌ రోజునే షేర్‌ ధర కిందకు పడిపోవచ్చు. కానీ సుదీర్ఘకాలం నిలబడే కంపెనీలను ఎంచుకుంటే మంచి లాభాలు సాధ్యమే. ఐపీఓల జోష్‌ కొనసాగుతున్నా.. పెట్టుబడిదారులు భావోద్వేగాలకు లోనుకాకుండా, ఆలోచించి అడుగులు వేయాలి. మంచి కంపెనీని ఎంచుకుంటే ఐపీఓ పెట్టుబడి బంగారు బాట అవుతుంది!

డైరెక్ట్‌ ఈక్విటీ .. Direct Equity

మ్యూచువల్‌ ఫండ్‌ల ద్వారా కాకుండా నేరుగా కంపెనీల షేర్లు కొనుగోలు చేయడమే డైరెక్ట్‌ ఈక్విటీ. పెట్టుబడిదారు స్వయంగా కంపెనీలను విశ్లేషించి, ఏ షేర్లలో పెట్టాలో నిర్ణయించుకోవాలి. మధ్య, దీర్ఘకాలంలో అధిక రాబడి సాధ్యమవుతుంది. ఇందులో మార్కెట్‌ ఊగిసలాట ఎక్కువ. సరైన కంపెనీని ఎంచుకోకపోతే నష్టాలు తప్పవు. డైరెక్ట్‌ ఈక్విటీలో విజయం సాధించాలంటే జ్ఞానం, ఓర్పు, పరిశీలన తప్పనిసరి. అని నిపుణులు సూచిస్తున్నారు.

మిడ్‌ క్యాప్‌ ఫండ్లు ..Mid-Cap Funds

మార్కెట్‌లో మిడ్‌ క్యాప్‌ కంపెనీలు అంటే మధ్యస్థాయి వ్యాపారాలు కలిగిన సంస్థలు. పెద్ద కంపెనీల స్థిరత్వం ఉండకపోయినా, వృద్ధి శక్తి ఎక్కువగా ఉంటుంది. పెద్ద కంపెనీలకన్నా ఇవి వేగంగా ఎదుగుతాయి. సరైన సమయంలో పెట్టుబడి పెడితే రెట్టింపు రాబడులు సాధ్యమే. అయితే మార్కెట్‌ కరెక్షన్‌లో ఎక్కువగా ఇవిపడిపోతాయి. ఇన్ఫోసిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లాంటి దిగ్గజాలు కూడా తమ ప్రారంభ దశలో మిడ్‌ క్యాప్‌లే!

స్మాల్‌ క్యాప్‌ ఫండ్లు .. Small-Cap Funds

స్మాల్‌ క్యాప్‌ కంపెనీలు అంటే చిన్న మార్కెట్‌ విలువ ఉన్న సంస్థలు. ఇవి భవిష్యత్తులో ఎదుగుతాయనే ఆశతో పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతారు. సరైన కంపెనీ అయితే లాభాలు 3 నుంచి 4 రెట్లు పెరుగవచ్చు. ఇందులో అనూహ్యంగా నష్టాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ. స్మాల్‌ క్యాప్‌ ఫండ్లు అనేవి యువ ఇన్వెస్టర్లకు ఎక్కువ అనుకూలం. దీర్ఘకాల దృష్టితో (5–10 ఏళ్లు) పెట్టుబడి పెడితే రిస్క్‌ సమతుల్యం అవుతుంది. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్లు దీర్ఘకాలానికి మంచి రాబడులు ఇస్తాయి. కానీ ఇవి అధిక రిస్క్‌ వర్గం. పెట్టుబడిదారులు ఆర్థిక సలహాదారుల సూచనతోనే ముందుకు వెళ్లడం ఉత్త‌మం.

 

369
FEATURE NEWS Tags:(FDs), (Initial Public Offering), (MIS), (NSC), (PPF), (RD), (SCSS), Cryptocurrencies, Debt Mutual Funds, Direct Equity, Equity Mutual Funds, Gold ETFs and Silver Funds, Low-Risk Investment Options, Mid-Cap Funds, Real Estate, Small-Cap Funds, Stock Market

Post navigation

Previous Post: వారెన్ బఫెట్.. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడి సూచనలు | దీర్ఘకాలిక సంపద రహస్యాలు Mutual Funds Investing Tips from Warren Buffett | Long-Term Wealth Secrets | Mutual Funds 2025
Next Post: క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుకోవ‌డ ఎలా? How to Increase Your Credit Card Limit

Related Posts

  • జోరుగా వెండి విక్రయాలు.. ! వారంలోనే 100 టన్నుల అమ్మ‌కం! Massive Silver Sell-Off: 100 Tonnes Sold in Just One Week! FEATURE NEWS
  • ఆటో పే సౌకర్యం… సౌలభ్యమేనా? లేక అప్రమత్తత అవసరమా? Auto Pay Facility: Convenience or a Call for Caution? FEATURE NEWS
  • సుర‌క్షిత‌మైన‌వి పోస్టాఫీస్ సేవింగ్స్‌ post office saving schemes are safe FEATURE NEWS
  • దిగొచ్చిన వెండి, ప‌సిడి ధ‌ర‌లు.. ! ఇది ఒక తాత్కాలిక ‘హెల్తీ కరెక్షన్’ మాత్రమేనా? Falling Silver and Gold Prices: Is This Just a Temporary ‘Healthy Correction’? FEATURE NEWS
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions FEATURE NEWS
  • దుబాయ్‌లో బంగారంపై భారీ రాయితీలు..! Gold Discounts in Dubai Amid Transport Disruptions FEATURE NEWS

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Most Viewed Posts

  • జీరో టు వ‌న్ బుక్ స‌మ‌రీ తెలుగు ZERO TO ONE book summery telugu
  • బ్యాంకుల్లో మోసపోవ‌ద్దు.. జాగ్ర‌త్త‌ Be careful in Banks
  • బ్యాంకు అకౌంట్‌లో డ‌బ్బులేస్తున్నారా deposit and withdraw limit in bank account
  • dhanammoolam.com
  • చిట్ ఫండ్‌, Mutual Fund SIP లో ఏది అధిక లాభ‌దాయకం Chit Funds vs Mutual Fund SIP.. Which is the Better Investment Option
  • పర్సనల్ లోన్ తీసుకోవాల‌నుకుంటున్నారా అయితే ఈ విషయాలు తెలుసుకోండి! Thinking of Taking a Personal Loan.. Here’s What You Should Know
  • RBI రేటు తగ్గించినప్పటికీ మీ EMI అలాగే ఉందా.. Even After RBI Rate Cut, Is Your EMI Still the Same
  • మేజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్ స‌మ‌రీ తెలుగు the magic of thinking big book summery telugu
  • New Changes Effective From 1st June 2024 జూన్ 1 నుంచి అమ‌లు కానున్న కొత్త నిబంధ‌న‌లు ఇవే
  • దీపావళి 2025: టాప్ 15 స్టాక్ ఐడియాస్ .. Diwali 2025: Top 15 Stock Ideas

Recent Posts

  • మేలో బ్యాంకులకు వరుస సెలవులు… ముందస్తు ప్రణాళికే మేలు! Bank Holidays in May: Plan Ahead to Avoid Last-Minute Trouble
  • అప్పు ఇస్తున్నారా… ముందే ఆలోచించండి! డబ్బుతో పాటు సంబంధాలూ రక్షించుకోవాలి.. Lending Money? Think First! Protect Your Money and Relationships
  • గోల్డ్ లోన్… వరమా? భారమా? Gold Loan.. A Quick Lifeline or a Financial Burden if Ignored?
  • రూ.1కే బంగారం… డిజిటల్ యుగంలో పసిడికి కొత్త రూపం! Gold for ₹1.. A New Digital Avatar of Precious Investment
  • ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ… డిజిటల్ లావాదేవీలకు కొత్త దారి! UPI Without Internet.. A New Path for Digital Transactions
  • క్రెడిట్ కార్డులతో ఖర్చులేనా? ఆదాయం స‌మ‌కూరే మార్గాలు లేవా? Credit Cards.. Only for Spending? Aren’t There Ways to Earn Too?
  • అక్షయ తృతీయ జోరు… పసిడి వ్యాపారంలో రికార్డు లావాదేవీలు! Akshaya Tritiya Rush: Record Turnover in Gold Trade
  • లోన్ రిజెక్షన్ నుంచి అప్రూవల్ దాకా… ! విజయం సాధించే మార్గం ఇదే! From Loan Rejection to Approval…! Here’s the Path to Success!
  • BHIM యాప్‌లో స‌రికొత్త‌ ఫీచర్..! ఒక్క క్లిక్‌తో ఫ్రీగా సీబిల్ స్కోర్ ను చెక్ చేసుకోవ‌చ్చు! BHIM App Introduces New Feature.. Check Your CIBIL Score for Free in One Click!
  • డెబిట్ కార్డ్ EMIలు… సౌకర్యమా? లేక భార‌మా? Debit Card EMIs.. Convenience or Hidden Credit?
  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Tags

(Diversification) (Final Word) (MIS) (NSC) (PPF) (RD) (SCSS) .Precautions to Take 000 Benefits Benefits for Consumers Convenience Drawbacks Eligibility Criteria Equity Mutual Funds Expert Advice Future Outlook How Much Loan Can You Get? How to Choose the Right Policy? how To get financial freedom Importance of Credit Score In Conclusion Interest Rate Investor Enthusiasm Key Benefits Key Highlights Mutual Funds New Limits Precautions Precautions Investors Should Take Precautions to Be Taken Public Feedback Invited Recommendations for Investors Save First Security square off Stock Market The Road Ahead Tips for Investors What Are the Interest Rates? What Is a Silver ETF? What Lies Ahead? What Should Investors Do? Why Is It Necessary? Why These Restrictions?

financial awareness is our primary motto. we are working here to educate people about all financial products and better planning.

Classic widget (Pages)

  • ABOUT US
  • Contact Us
  • dhanammoolam.com
  • Disclaimer
  • HOME
  • Privacy Policy

Widget (Calendar)

April 2026
S M T W T F S
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
« Mar    
  • పిల్ల‌లకైతే ఇలా పొదుపు చేయండి how to save money for children FINICAL PLANNING
  • వేచి చూసే వారిదే `స్టాక్ మార్కెట్‌` FEATURE NEWS
  • బంగారంపై హాల్ మార్క్ త‌ప్ప‌నిస‌రి NEWS
  • స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు సాధ్య‌మే.. FEATURE NEWS
  • సేవింగ్స్ అకౌంట్‌లో దాగి ఉన్న అవకాశాలు… కేవలం డబ్బు దాచుకోవడానికే కాదు! Hidden Benefits of a Savings Account… More Than Just Saving Money! Uncategorized
  • స్టాక్ మార్కెట్ లాభాల‌పై ఇన్కం ట్యాక్స్ ఉంటుందా..? FEATURE NEWS
  • గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌..LIC Housing Finance cuts home loan interest rates FEATURE NEWS
  • ఆర్థిక ప్రణాళికలో మహిళల కొత్త అడుగులు.. New Steps in Women’s Financial Planning FINICAL PLANNING

Copyright © 2026.

Powered by PressBook News Dark theme