
Have you opened a new demat? then do like this
స్టాక్ మార్కెట్‌పై మీకు ఉన్న ఆసక్తి, అవగాహన లేదా ఫ్రెండ్స్ అంతా చెప్తుంటే కలిగిన సరదావల్ల మీరూ స్టాక్ మార్కెట్‌లోకి వచ్చారా..? ఒక డీ మ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశారా.? అయితే తొందరపడకండి. జాగ్రత్తగా వ్యవహరించి, నెమ్మదిగా కొన్ని విషయాలను తెలుసుకుని ముందుకు వెళ్లండి.
మనం మొదటిసారి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ముందు మన వ్యక్తిగత, మైండ్ సెట్ బట్టి మనం ఎన్ని సంవత్సరాలు మార్కెట్లో మనీ ఉంచుతాం అనే దాని బట్టి నిర్ణయం తీసుకోవలిసి ఉంటుంది. ఎంత కాలం మనం మార్కెట్లో డబ్బులు ఉంచుతాం, మనం ఎంత వలటాలిటీని భరించలగలుగుతాం అనే ఈ విషయాలు బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చెయ్యవలిసి ఉంటుంది.
మొదట్లో ఎలాంటి స్టాక్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు
మొదటిసారి మనం డీమ్యా ట్ అకౌంట్ ఇన్వెస్ట్ మెంట్ కోసం ఓపెన్ చేస్తే లార్జ్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఎందుకంటే అవి చాలా పెద్ద కంపెనీలు. 1 లేదా 2 సంవత్సరాలు మార్కెట్ డౌన్ ఫాల్‌లో సపోర్ట్ లేకపోయినా ఈ కంపెనీలు సర్వైవ్ అవుతాయి.
-ఉదాహరణకు ఐటీసీ స్టాక్ తీసుకుందాం. ఇది ఫుల్ సేప్టీ స్టాక్. స్టాక్ మూవ్ కాకపోయినా సరే 5 శాతం డివిడెండ్ రూపంలో వస్తుంది. హిస్టారికల్ డేటా చూస్తే గత 10 సంవత్సరాలుగా నిరంతరం ఇస్తునే ఉంది. ఈ పాయింట్ లో స్టాక్స్ కొంటే మనకి 5 శాతం డివిడెండ్ రూపంలో వస్తుంది. స్టాక్ మూవ్ అయినపుడు ఎక్కువకి అమ్ముకోవచ్చు. ఒక వేళ మూవ్ అవ్వకపోతే మనకి 5 శాతం డివిడెండ్ రూపంలో వస్తుంది.
-హీరోహోండా స్టాక్ మనం కొంటే మనకి 5 శాతం డివిడెండ్ వస్తుంది. చార్ట్ ప్రకారం చూసినా చాలా బాగుంది.
-టీసీయస్ అనేది ఇండియాలోనే చాలా పెద్ద ఐటీ కంపెనీ. డివిడెండ్ కూడా చాలా బాగా ఇస్తుంది. ప్రతి 5 లేదా 6 సంవత్సరాలకొకసారి బోనస్ కూడా ఇస్తుంది.
* మనం స్టాక్స్ అన్ని ఒక్క దానిలో పెట్టకూడదు. అలా చేస్తే రిస్క్ అవుతుంది. పోర్ట్ పోలియో డైవర్సిఫికేషన్ ఉండాలి. మనం 1 లేదా 2 స్టాక్స్ కాకుండా 7 నుంచి 10 స్టాక్స్ ని మనం పోర్ట్ పోలియోలో ఉండేలా చూసుకోవాలి.
-Asian paint, Fevicol, Maruthi, Tata power ఇలా ఇండస్ట్రీ లీడర్స్ మాత్రమే ఎంచుకుని ఒకేసారి ఎక్కువ అమౌంట్ కాకుండా ఎస్ఐపీ( సిప్) లో పెడుతుంటే వలాటిలిటీని మనం ఈజీగా ట్రీట్ చేయవచ్చు.
Volatility is a part of the market.
మార్కెట్లో వలాటిలిటీ అనేది ఒక పార్ట్
లార్జ్ క్యాప్ లో తక్కువ వలాటిలిటీ ఉంటుంది. కాబట్టి ప్రతి నెలా కొంచెం కొంచెం అమౌంట్ పెట్టుకుంటే లాంగ్ టర్మ్ లో మనం వెల్త్ ని క్రియేట్ చేయవచ్చు. స్టాక్ మార్కెట్లో 15 నుంచి 20 శాతం అనేది మామూలు విషయం. మనం మార్కెట్ డౌన్ లో ఉన్నప్పుడు బయటకు పోకూడదు.
* పెన్నీ స్టాక్స్, మల్టీ బ్యాగర్ లాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చెయ్యకూడదు. మనకి స్టాక్స్ లో క్వాలిటీ ముఖ్యం గానీ క్వాంటిటీ కాదు. మనం మన పిల్లలకి మనీ ఉంచాలనుకుంటే అది మంచి కంపెనీ మాత్రమే కాకుండా పెద్ద కంపెనీ అయితే సేప్టీ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. లాంగ్ టర్మ్ పాయింట్లో పెద్ద బిజినెస్ మోడల్లో కనుక మనం ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి తెలియని సబ్జెక్ట్ లో మనం ఎంటర్ అయ్యి ఒకరిపై ఆధారపడి డబ్బులంతా పోగొట్టుకునే బదులు మనకి తెలిసిన బిజినెస్ మోడల్ లో ఎంటర్ అయితే మనం సేప్ గా ఉన్నట్టే.
* బ్యాంకుల్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకి 4 నుంచి 5 శాతం వస్తుంది. కానీ మార్కెట్ అంతేకంటేచాలా ఎక్కువే ఇస్తుంది. ఒక వేళ స్టాక్స్ ఎందుకు కొనాలనుకుంటే దాని కంటే బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ చాలా సేఫ్ సైడ్. స్టాక్ మార్కెట్లో హెచ్చు తగ్గులు ఉంటాయి. అదే మ్యూచువల్ ఫండ్స్ లో అయితే రిలాక్స్ గా ఉండవచ్చు. మనకి యావరేజ్ 15 నుంచి 20 శాతం రిటర్న్స్ వచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఉంటే ప్రతి నెలా 5వేలు లేదా రూ.10 వేలు పెట్టుకుంటూ పోతే మనకి లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ ని క్రియేట్ చేయవచ్చు.
స్టాక్స్ కంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ లో మార్కెట్ పడినా ఫండ్ మేనేజర్స్ హ్యాండిల్ చేస్తారు. మన దగ్గర తక్కువ మనీ ఉంటే మనం హ్యాండిల్ చెయ్యలేం. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మనం దాని గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అది చాలా వరకూ కష్టం. అందువలన మ్యూచువల్ ఫండ్స్ లేదా ఈటీఎఫ్ లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. మనం రిస్క్ చూసుకుంటే చాలా తక్కువ రిస్క్ ఈటీఎఫ్. తక్కువ కొద్దిగా రిస్క్ ఉన్నవి మ్యూచువల్ ఫండ్స్. తర్వాత స్టాక్ మార్కెట్. మనం ఎస్ఐపీ పెడితే మార్కెట్ పెరిగినా తగ్గినా లాంగ్ టర్మ్ పాయింట్లో లో పెద్ద తేడా ఏమీ ఉండదు.
మనం ఎన్ని సంవత్సరాలు మార్కెట్ ఉండాలనుకుంటున్నాం. ఎంత రిస్క్ అయిన భరిస్తాం అనుకుంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనకి తెలిసిన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ కంపెనీ లెక్కలు మనకి తెలుస్తాయి. తెలియని కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మనకి దాని గురించి తెలియదు.
Mutual funds and the stock market. which is the best
మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్.. ఏది బెస్ట్
మ్యూచువల్ డిస్టిబ్యూటర్ అయిన వ్యక్తి మ్యూచువల్ ఫండ్స్ గురించి గొప్పగా చెబుతారు. ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఉన్నారో బ్రోకర్స్, ట్రేడర్స్, వీళ్ళందరూ స్టాక్ మార్కెట్ గొప్పదని అంటారు.
అందుకే ముందుగా మనం వీటి గురించి పూర్తిగా ఎనలైజ్ చేసుకోవాలి. మనం మ్యూచవల్ ఫండ్స్ సంస్థలు చెప్పినవి నమ్మకూడదు. అలాగే స్టాక్ మార్కెట్ వాళ్ళు చెప్పినవి కూడా నమ్మవద్దు.
మన ఫ్యూచర్ ని ప్రొటక్ట్ చేసేందుకు, మన పిల్లల భవిష్యత్తును, రిటైర్మెంట్ ను ప్రొటక్ట్ చేసేందుకు ఇన్వెస్ట్ మెంట్ చేస్తాం. అందుకోసం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మనం దీని కోసం కొంత టైమ్ తీసుకుని గత 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ళు ట్రేడింగ్ చేసే వాళ్ళని 10 మందిని తీసుకుని వాళ్ళకి ఈ 10 సంవత్సరాల్లో ట్రేడింగ్ లో వచ్చిన రిటర్న్ ఎంత అని తెలుసుకోవాలి. అందులో 5 మంది తనకి 15 శాతం రిటర్న్స్ వచ్చాయంటే మంచిదే. ఇదే తీరును మ్యూచువల్ ఫండ్స్ లో కూడా అప్లై చెయ్యాలి. ఇందులో కూడా ఈ 10 సంవత్సరాల్లో ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్ వచ్చింది, ఏమైనా లాస్ వచ్చిందా అని తెలుసుకోవాలి. 10 సంవత్సరాలు మనం మ్యూచువల్ ఫండ్స్ లో చూసినట్లయితే 270 ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి. దీంట్లో అన్ని ఫండ్స్ యావరేజ్ రిటర్న్ 16.97 శాతం వచ్చింది.
Don’t be stressed out
ఒత్తిడికి గురి కాకూడదు..
ఇన్వెస్ట్ మెంట్ అనేది మనకి రిటర్న్స్ ఇచ్చినా ఇవ్వకపోయిన మనకి మెంటల్ టెన్సన్ ఇవ్వకూడదు. మనం మానసిక ఒత్తిడికి లోనవ్వకూడదు. స్టాక్స్ లో మొదటిగా వచ్చినది రిటర్న్స్ కాదు. మానసిక ఒత్తిడి. స్టాక్ ని మనం ఎన్నో విధాలుగా ఎనాలసిస్ చెయవచ్చు. ఫండమెంటల్, టెక్నికల్, చార్ట్ అనౌన్స్, మాక్రో ఎకానమీ, మైక్రో ఎకానమీ వీటిలో మనం ఇన్వెస్ట్ చేసి గొప్పగా ఇన్వెస్ట్ రిటర్న్ చేయగలం అనుకుంటే కొంతమందికి పోజిబుల్ చేయగలం.
* స్టాక్స్ లో పెట్టుబడి పెట్టినపుడు మంత్లీ 2 శాతం, 5 శాతం లాభం వచ్చినపుడు బాగుంటుంది. కొన్ని సార్లు తక్కవ మొత్తంలోనే లాభాలను ఆశపడాలి. స్టాక్ లో పుల్ టైమ్ ఉండి దానిపైనే ఉంటే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి. కానీ ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్ లో పుల్ టైమ్ పెట్టినవారు ఎంతమంది లేరు. ఎవరి వృత్తిలో వారు బిజీగా ఉంటారు. వారికి ఆ పనిలోనే ప్రావీణ్యం ఉంటుంది.
* మ్యూచువల్ ఫండ్స్ లో పెడితే ఖర్చులు ఉంటాయి. వాటిని కనపడకుండా ఫండ్ కంపెనీలు తీసుకుంటాయి. సెబీ రూల్ ప్రకారం ఎక్కువ ఖర్చులు ఫండ్ మేనేజర్‌కి, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌కి ఉంటాయి. ఒక మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ స్కీమ్ లో కనుక అసెట్ అండర్ మేనేజ్ మెంట్ రూ.7వేల కోట్లు క్రాస్ అయితే దానిని మొత్తం ఖర్చుల శాతం 2 శాతం కంటే తక్కువ ఉంటుంది.
* ఎక్కువ రిటర్న్ వచ్చిన ఫండ్స్ మనం తీసుకోవాలి. ప్రతి మ్యూచువల్ ఫండ్ సెర్చ్ చేస్తే అక్కడ హోల్డ్ చేసిన స్టాక్స్ మనకి కనిపిస్తాయి. ఆ స్టాక్‌లన్నింటిలోనూ ఇన్వెస్ట్ చేయడం వల్ల ప్రాఫిట్ ఏవరేజ్ అవుతుంది. రిస్క్ తగ్గుతుంది. కానీ డైరెక్ట్ గా ఈక్విటీలో వచ్చిన రిటర్న్స్ ఎక్కడా రావు. మనం పుల్ టైమ్ ఉంటూ, స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఇక్కడా లాభాలకు కొదవ ఉండదు.
* మార్కెట్ డౌన్‌లో ఉన్నప్పుడు మ్యూచువల్ ఫండ్ నుంచి ఎగ్జిట్ కాకూడదు. మ్యూచువల్ ఫండ్స్ లో కొన్ని రిస్క్ లు ఉండవు. ఇందులో కూడా క్యాపిటలైజేషన్ ఆధారంగా మూడు రకాల ఫండ్లలో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిది.
* మనం స్టాక్స్ పిక్ చేసుకోవడం కూడా లీస్ట్ గా 3 సెక్టార్ ని హోల్డ్ చేసుకోవాలి. ఈ మూడు సెక్టార్ లో మన ఇన్వెస్ట్ మెంట్ ఉండాలి. ప్రతి సెక్టార్ లో మనం 5 స్టాక్స్‌ని హోల్డ్ చెయ్యగలగాలి. మన మొత్తం పోర్ట్ ఫోలియోలో ఏ స్టాక్‌కు 10 శాతం మించి వెయిటేజ్ ఇవ్వకూడదు. ఈ ప్రోసెస్ అంతా చేస్తే మనం కూడా 30 స్టాక్స్ హోల్డ్ చెయ్యవచ్చు. పుల్ టైమర్ ఉంటే ఖచ్చితంగా స్టాక్స్ లో మనం పెట్టుకోవచ్చు.